Followers

బీజేపీ నేత మెడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో పి.పి.ఇ.కిట్ల పంపిణీ.



బీజేపీ నేత మెడపాటి రవీంద్ర ఆధ్వర్యంలో పి.పి.ఇ.కిట్ల పంపిణీ.

 

పూర్ణా మార్కెట్, పెన్ పవర్.

 

భారత జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో ప్రభుత్వ టీబి హాస్పిటల్ లో వైద్యులకు పి. పి.ఇ.కిట్లను అందజేసారు. ఈ కార్యక్రమానికి బి జె పి. విశాఖ జిల్లా అధ్యక్షులు  మెడపాటి రవీంద్ర  అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో యువ మోర్చా నేషనల్ సెక్రెటరీ సురేంద్రమోహన్ , అశోక్ కుమార్, నాగరాజు  జిల్లా యువ మోర్చా నాయకులు  తదితరులు పాల్గొన్నారు.


కెమిస్ట్ మల్లేష్‌ను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి





కెమిస్ట్ మల్లేష్‌ను పరామర్శించిన ఎంపీ విజయసాయి రెడ్డి

 

ఎంవీవీ సత్యనారాయణ లోకల్ ఎమ్మెల్యే లు మరియు పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా

 

 పూర్ణా మార్కెట్, పెన్ పవర్

 

పరవాడ ఫార్మా సిటీ కోస్టల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆరిలోవ హెల్త్‌సిటీలోని పినాకిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కెమిస్ట్ మల్లేష్‌ను ఎంపీలు విజయసాయి రెడ్డి, ఎంవీవీ సత్యనారాయణలు పరామర్శించారు. బుధవారం ఉదయం నేరుగా విజయవాడ నుంచి విశాఖ చేరుకున్న ఎంపీలు పినాకిల్ ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న మల్లేష్‌ను పరామర్శించి, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మల్లేష్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు అదీప్ రాజ్, తిప్పల నాగిరెడ్డి, గుడివాడ అమరనాథ్‌, నేతలు కేకే రాజు, వంశీకృష్ణ యాదవ్, పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు


 

 




 


సారా పులుపు ద్వాంసం చేసిన పోలీసులు


సారా పులుపు ద్వాంసం చేసిన పోలీసులు


  పాయకరావుపేట,పెన్ పవర్ 

 

 మండల గోపాలపట్నం గ్రామ శివారులో పోలీసులు దాడులు జరిపి సారా తయారీకి ఉపయోగించే ఎనిమిదివందల లీటర్ల పులుపును, తయారీ సామాగ్రిని ద్వంసంచేసినట్లు ఎసై .విభీషణరావు తెలిపారు.ఈ దాడుల్లో గ్రామ మహిళా పోలీసు,గ్రామ వాలంటర్లు,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

 

 

కాపుల ఐక్యతతో హక్కుల సాధన


కాపుల ఐక్యతతో హక్కుల సాధన

ఉత్తరాంధ్ర కాపునాడు అధ్యక్షుడు రవీంద్రనాధ్ ఠాగూర్

గాజువాక, పెన్ పవర్


ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యపడుతుంది అని ఇటీవల ఉత్తరాంధ్ర కాపునాడు అధ్యక్షుడిగా నియమితులైన పులపా రవీంద్రనాధ్ ఠాగూర్ అన్నారు.గాజువాక 67,68 వార్డుల కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గాజువాక హైస్కూల్ రోడ్డులో రవీంద్రనాధ్ కు అభినందన సత్కార కార్యక్రమం బుధవారం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి ప్రభుత్వాలు ప్రోత్సాహం అందించాలని కోరారు.కాపు కార్పొరేషన్ ద్వారా రుణాల మంజూరు,నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.కాపు నేస్తం ద్వారా లభిదారులకు చేయూతనిచ్చిన ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో కాపు సంఘం నాయకులు గుంటూరు శంకరరావు,ఈటి శ్యామలరావు,సూర్యనారాయణ,గోపి,ధర్మారావు,నాగేశ్వరరావు,వెంకటరావు,అప్పారావు,విజయ్ తదితరులు పాల్గొన్నారు


బోటు బోల్తా మత్యకాఠుడు గల్లంతు


బోటు బోల్తా,మత్యకాఠుడు గల్లంతు


  పాయకరావుపేట,పెన్ పవర్ 

 

మండల పెంటకోట గ్రామం,చినవాడపేట కుచెందిన మత్యకారుడు మేరుగు జగన్నాదం (39) ప్రమాదం సాత్తు  బుదవారం సముద్రంలో గల్లంతయ్యాడు.ఈమేరకు  జరిగిన ప్రమాద సంఘటనపై ఎసై .విభీషణరావు అందించిన వివరాల ప్రకారం ఉదయం తెల్లవారుజామున గ్రామానికి చెందిన ఆరుగురు మత్యకారులు  బోటుపై సముద్రంలో వేటకు బయలుదేరిన కొద్ది సేపటికే బోటు బోల్తా పడింది.ఐదుగురు వ్యక్తులు మాత్రం ఈతకొట్టుకుంటూ ప్రమాదం నుంచిబయటపడి ఒడ్డుకుచేరుకొన్నారు.మేరుగు జగన్నాదం అనే వ్యక్తి మాత్రం సముద్రంలో గల్లంతు అయినట్లు ఇచ్చిన రిపోర్టుమేరకు.గల్లంతయిన వ్యక్తి ఆచూకి కోసం పోలీసులు , మెరైన్ పోలీసు రెండుటీములుగా గాలింపు చర్యలు చేపట్టామని,ఆచూకి తెలిసిన వెంటనే వివరాలను తెలియజేస్తామని ఎసై .విభీషణరావు తెలిపారు.

లొంగిపోయిన మావోయిస్టు



ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు ఎదుట లొంగిపోయిన మావోయిస్టు సహకారి కేశవరావు.

 

 చింతపల్లి జూలై15  పెన్ పవర్

 

 మృతి చెందిన సిపిఐ మావోయిస్టు జాంబ్రి కుమారుడు గెమ్మెలి కేశవరావు చింతపల్లి ఏఎస్పి విద్యాసాగర్ నాయుడు సమక్షంలో లొంగి పోయాడు.ఈ సందర్భంగాఏ ఎస్ పి మాట్లాడుతూ గూడెంకొత్తవీధి మండలం మెట్టగూడ, వీరవరం పరిసర ప్రాంతాలలో మావోయిస్టుల కార్యకలాపాలలో సహాయ సహకారాలు అందించడంలో చురుకుగా పాల్గొనేవాడన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ అభివృద్ధి పథకాలకు ఆకర్షితుడై లొంగిపోయాడని ఆయన తెలిపారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు రూరల్ పోలీస్  చేపడుతున్న కమ్యూనిటీ పోలీసింగ్ పనులతో కేశవరావు ఆకర్షితుడయ్యాడన్నారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో ప్రశాంత జీవనం సాగించాలని సూచించడం జరిగిందన్నారు. ఇప్పటి నుండి అసాంఘిక కార్యక్రమాలకు పాలుపడనని తెలిపాడని ఆయన తెలిపారు. మావోయిస్టుల హింసను విడనాడి లొంగి పోయినట్లయితే దాని కనుగుణంగా రావలసిన ఇతర ఆర్థిక పరమైన ప్రయోజనాలను, ప్రభుత్వసంక్షేమ పతకాలు ప్రభుత్వము నుండి అందేటట్టు చూస్తామని ఆయన భరోసా యిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు సహకరిస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గూడెంకొత్తవీధి సిఐ మురళీధర్ పాల్గున్నారు.


సామర్లకోటలో 7 పాజిటివ్  కేసులు  నమోదు 


సామర్లకోట  లో  బుధవారం  కొత్త  గా  7 పాజిటివ్  కేసులు  నమోదు 


 

సామర్లకోట, పెన్ పవర్

 

అయినాయి మండలం పరిధిలో 2 వేట్లపాలెం పాజిటివ్  కేసు లు నమోదు  కావడం తో అప్రమత్తం అయిన  అధికారులు, నిన్న 6 వార్డులో పాజిటివ్  కేసు తో  మరణించిన ఆమె యొక్క చిన్న  కుమారుడు కూడా  కరోనా తో  మరణించడం  జరిగింది కరోనా పాజిటివ్  కేసు వచ్చిన సత్యనారాయణ పురం  వృద్ధురాలిని  ఖ్వారంటైన్  కు  తీసుకెళ్ళు దృశ్యాలు  విసువల్  లో చూడవచ్చు కాగా వరుసగా పాజిటివ్ కేసులు నమోదు నేపథ్యంలో సామర్లకోట  పట్టణాన్ని సంపూర్ణ లాక్డౌన్ గా ప్రకటించే యోచనలో జిల్లా అధికారులు, స్థానిక అధికారులు సమాలోచనలో  ఉన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...