Followers
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఈ నెల 20 నుండి ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు, వార్డుకో హెల్త్ క్లినిక్
ఈ నెల 20 నుండి ఫీవర్ క్లినిక్స్ ఏర్పాటు, వార్డుకో హెల్త్ క్లినిక్
విమ్స్ లో మరిన్ని పడకలు ఏర్పాటు చేయాలి
డివిజన్ స్థాయిలో సమావేశం ఏర్పాటు చేయాలి
అధికార్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
వర్షపు నీటిలో వెంకన్నఆలయ ప్రాంగణం
వర్షపు నీటితో వెంకన్నఆలయ ప్రాంగణం
ఆత్రేయపురం ,పెన్ పవర్
వాడపల్లి కోనసీమ తిరుమల తిరుపతి దేవస్థానంలో కొలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి ఆలయ ముఖమండపం నీరు భారీగా చేరినది తక్షణమే రాత్రి కి రాత్రి ఆలయ సిబ్బంది తో వర్షపు నీరు ను బయటికి తోడిచ్చి చక్కదిద్దారు బయట ఉన్న హుండీ లో ఉన్న నగదు తడిసి పాడినది అధికారులు ఆమోదంతో ఈరోజు బుధవారం ఆలయ చైర్మన్ ధర్మకర్త మండలి గ్రామస్తులు లు లో రెండు హుండీ లను లెక్కించగా 1,98,904 రూపాయలు వచ్చిందని గుడి చైర్మన్ కార్యనిర్వహణాధికారి ప్రకటించారు
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయాలి
స్వచ్ఛభారత్ మరుగుదొడ్ల పై విచారణ జరపాలి
బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ
పెన్ పవర్ కూనవరం.
పోలవరం నిర్వాసితుల సమస్యలపై మండలంలో నిర్మించిన స్వచ్ఛ భారత్ మరుగుదొడ్ల నిర్మాణాల అవకతవకలపై విచారణ జరపాలని బుధవారం నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నోముల రామారావు, పాయం వెంకయ్య ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మండల తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసిత గ్రామ ప్రజలు సర్వం త్యాగం చేస్తున్నారు కనుక నష్టపరిహారం,పునరావాసం,భూమికి భూమి ఇంతవరకు ఇవ్వలేదని తెలిపారు. మండలంలో బొజ్జరాయి గూడెం ఒక్క గ్రామానికే పునరావాసం కల్పిస్తున్నారు కావున ప్రభుత్వం మండలంలోని మిగతా 40 నిర్వాసిత గ్రామాలకు కూడా న్యాయం చేయాలని కోరారు. మండలంలోని 52 గ్రామాలలో కేంద్ర ప్రభుత్వం ద్వారా నిర్మిస్తున్న 5,500 ఇళ్లకు గాను సుమారు 14 కోట్ల రూపాయల మంజూరైన నిధులలో సుమారు ఐదు కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని బిజెపి పార్టీ నిజనిర్ధారణలో తేలిందని అన్నారు. అయ్యవారిగూడెం, బురద గూడెం, పాలగూడెం, బోదునూరు,గోమ్ముగూడెం గ్రామాలలో అసంపూర్తిగా మిగిలిపోయాయని మరుగుదొడ్ల పై విచారణ జరపాలని జిల్లా అధికారులకు నివేదిక సమర్పించాలని మండల తాసిల్దార్ ఏ వి ఎల్ నారాయణకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో చిట్టురి వెంకటస్వామి, నోముల సత్యనారాయణ, గుండారపు శ్రీనివాస్ రావు, బి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
మండపేట లో రికార్డు స్థాయిలో కేసుల నమోదు..
మండపేట లో రికార్డు స్థాయిలో కేసుల నమోదు..
ఎమ్మెల్యే గన్ మెన్ తో సహా కార్ డ్రైవర్ కు పాజిటివ్ ..
ఒక్క రోజే 28 మందికి కరోనా ..
మండపేట, పెన్ పవర్
మండపేట: మండపేట లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గతంలో లేని విధంగా బుధవారం ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు వెలువడిన పరీక్షల ఫలితాల్లో పట్టణంలో మొత్తం 28 మందికి కోవిడ్-19 వైరస్ సోకినట్టు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఈ నెల 10 న సేకరించిన అనుమానితుల రక్త నమూనాల ఫలితాల్లో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గన్ మెన్ తో పాటు ఆయన కారు డ్రైవర్ కు పాజిటివ్ అని అధికారులు వెల్లడించారు. 28 మందిలో 14 మంది మహిళలు కరోనా బారిన పడ్డారు. వార్డుల వారీగా వచ్చిన బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి. 2 వ వార్డులో ఇద్దరు వ్యక్తులకు సచివాలయం 1 లో పని చేసే వలంటీర్ కు రాగా 8 వ వార్డులో ఇద్దరి మహిళలు వైరస్ సోకింది. 9 వ వార్డులో ఒక వ్యక్తికి అలాగే మరో మహిళకు పాజిటివ్ వచ్చింది. 10 వ వార్డు లో ఒకరికి 22 వ వార్డులో మహిళ తో పాటు ఒక వ్యక్తి పాజిటివ్ నిర్ధారణ అయింది. 23 లో ఒక మహిళకు అలాగే 25 వ వార్డులో ఒక వ్యక్తి మహమ్మారి సోకింది. 27 లో ఇద్దరు వ్యక్తులకు కరోనా అని తేలింది. 28 వ వార్డులో 5 గురికి వైరస్ ప్రభావం చూపగా అందులో ముగ్గురు మహిళలు ఉన్నారు. దీంతో పాటు 30 వ వార్డు సంఘం కాలనీలో ఒక మహిళ తో పాటు మరొక వ్యక్తికి పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. గొల్ల పుంత కాలనీలో ఇద్దరు మహిళలు వైరస్ బారిన పడ్డారు. కాగా ఇదిలా ఉంటే మున్సిపల్ కార్యాలయంలో బుధవారం జరిపిన కోవిడ్ - 19 ర్యాపిడ్ టెస్ట్ రిపోర్టు లో కృష్ణా టాకీస్ సమీపంలో ఉన్న పాన్ షాప్ నిర్వాహకుడి కి పాజిటివ్ గా నిర్ధారణ అయిందని అధికారులు తెలిపారు. అలాగే మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి కూడా ఈ ర్యాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు. ఇందులో 35 మంది సిబ్బందికి పరీక్షలు జరపగా వారందరికీ నెగిటివ్ రిపోర్ట్ లు వచ్చాయి. దీంతో మున్సిపల్ అధికారులు , సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని మండపేట లో మొత్తం కేసుల సంఖ్య 70 కి చేరింది. ఇందులో ఒక మహమ్మారి బారిన పడి మృతి చెందిన విషయం విధితమే.
ముద్రగడ తిరిగి ఉద్యమ బాటలోకి రావాలి
ముద్రగడ తిరిగి ఉద్యమ బాటలోకి రావాలి
రావులపాలెం, పెన్ పవర్
కాపు జాతి ప్రయోజనాల కోసం తమతో కలిసి పోరాటం చేసిన ముద్రగడ పద్మనాభం తిరిగి ఉద్యమ సారథ్యం వహించాలని కాపు జెఎసి నాయకులు ఆకుల రామకృష్ణ కోరారు.ఉద్యమం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేసారు.బుధవారం రావులపాలెం మండలం గోపాలపురం లోని తన స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 1992-93 సమయంలో ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో తామంతా కాపులకు రిజర్వేషన్ కోసం లాఠీ దెబ్బలు తిని, రక్తాలు చిందించామన్నారు. అప్పట్లో ముద్రగడ పద్మనాభం తమను పరామర్శించి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాపులకు బాసటగా నిలుస్తూ ఉద్యమ బాట పట్టారన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధుల కేటాయింపు జరిగిందని ఉద్యమం ఫలితంగా కాపులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు ఒక బాట ఏర్పడిందని ఈ సమయంలో ముద్రగడ ఉద్యమం వీడుతున్నట్లు నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదని దీనిపై జేఏసీ సభ్యులంతా ఆయనతో చర్చించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆయనపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆయన ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించుకుని కాపు జాతి ప్రయోజనాలను కాపాడేందుకు తిరిగి ఉద్యమ బాటలోకి రావాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాపు నాయకులు సాధనాల శ్రీనివాస్, నందం వీర వెంకట సత్యనారాయణ, ఆకుల భీమేశ్వరరావు, సాధనాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
భారీ వర్షాలతో గట్టుకు గండి..ఆందోళనలో గ్రామస్తులు
భారీ వర్షాలతో గట్టుకు గండి..ఆందోళనలో గ్రామస్తులు
మామిడికుదురు,పెన్ పవర్
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు మామిడికుదురు మండలం కరవాకలో గట్టుకు గండి పడింది. వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఇళ్ల చుట్టూ ఉన్న ఇసుక కొట్టుకుపోయి ఇళ్ళు ఎక్కడ కూలి పోతాయోనని స్థానిక మత్స్యకారులు భయాందోళనగకు గురవుతున్నారు. కాగా ఇప్పటివరకు ఈ విషయంపై అధికారులు ఏ విధంగానూ స్పందించ పోవడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...