Followers

విశాఖ సాల్వేoట్ లో జరిగిన ప్రమాద స్థలాన్ని  పరిశీలించిన విజయసాయిరెడ్డి


విశాఖ సాల్వేoట్ లో జరిగిన ప్రమాద స్థలాన్ని 
పరిశీలించిన విజయసాయిరెడ్డి


            పరవాడ,  పెన్ పవర్
 పరవాడ జె.ఎన్. పీ. సి ఫార్మసీటీ లోసోమవారం విశాఖ సాల్వెంట్ కంపెని లో జరిగిన అగ్నిప్రమాద స్థలాన్ని సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్న వై.ఎస్.ఆర్.సి.పి జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు వేణుంబాక విజయ్ సాయి రెడ్డి, అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు  భీశెట్టి వెంకట సత్యవతమ్మ, విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎం.వి.వి సత్యనారాయణ, పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్, అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్ నాద్, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి, పోలీస్ కమిషనర్ ఆర్.కె మీనా, పెందుర్తి నియోజకవర్గ ఇంచార్జ్ అన్నంరెడ్డి అజయ్ రాజ్, రాష్ట్ర సీఈసీ పైల శ్రీనివాసరావు, పరవాడ జెడ్  పి టి సీ  అభ్యర్థి పి.ఎస్ రాజు, పరవాడ తహశీల్దార్ పి. వి. ఎల్.న్ గంగాధర్, ప్రభుత్వ అధికారులు, పెందుర్తి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పైల జూనియర్ అప్పలనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రామునాయుడు,మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు అప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ,  నదియా, గొర్లి గోపి, పెదిశెట్టి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.


గూడెం కోత్త వీధికి అర్ టి సి బస్సు నడపాలి 


గూడెం కోత్త వీధికి అర్ టి సి బస్సు నడపాలి 


గూడెం కోత్త వీధి పెన్ పవర్


కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలించిప్పంట్టి నుంచి విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతా ప్రయాణికులకు అర్ టి సి. సేవలు అందుబాటులో కిరాలేదు. ఈ ప్రభావం గూడెం కోత్త వీధి మండలం లో పూర్తి గా వుంది. ముఖ్యంగా అర్ టి సి బస్సులో ప్రయాణం చేయాలంటే టిక్కెట్ అన్ లైన్ లో బుక్ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. టిక్కెట్ ఏవిధంగా బుక్ చేసుకోవాలో గిరిజన ప్రాంతాలకుతెలియదు. అర్ టి సి బస్సులు తిరగడం లేదు. రోజూకి ఒక్క బస్సు మాత్రమే వచ్చిన అది మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు వస్తున్నా పోలీసు బలగాలను తరలించడానికి మాత్రమే వినియోగపడుతున్నాయని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గూడెం కోత్త వీధి మండలం నుండి నిత్యం పాడేరు నర్సీపట్నం ప్రాంతాలు కి రాకపోకలు సాగించే ప్రయాణికులు ఎక్కువ అదె విధంగా మైదానం ప్రాంతాలు నుండి విదులు నిర్వహించడానికి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చే ఉద్యోగల సంఖ్య ఎక్కువ. దిక్కు తొచని పరిస్థితిలలో ప్రయాణికులు. ఉద్యోగులు ప్రయివేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. గిరిజన ప్రాంతా ప్రజలు ఇబ్బందులను అర్ టి సి ఉన్న తాధికారులు. ప్రజాప్రతినిధులు స్పందించి నర్సిపట్న. పాడేరు అర్ టి సి డిపోలు నుండి కనీసం మండల కేంద్రం వరకు అయిన బస్సులు నడపడానికి చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కొరుతున్నారు.


పంచాయతీ కార్యాలయాలకు కొత్త రంగులు


పంచాయతీ కార్యాలయాలకు కొత్త రంగులు


గూడెం కోత్త వీధి పెన్ పవర్


విశాఖ ఏజెన్సీ గూడెం కోత్త వీధి పంచాయతీ కార్యాలయాలకు కొత్త రంగులుతో సిద్ధ మవుతున్నాయి. ఇప్పటికై ప్రభుత్వం పంచాయతీ కార్యాలయాలకు రంగులు మార్చాలని ఆదేశాలు ఇవ్వడంతో పంచాయతీ కార్యాలయాలు కొత్తగా కానిపిస్తున్నాయి. ఇప్పటికై మండలంలోని పలు పంచాయతీలలో కొత్త రంగులతో పంచాయతీ కార్యాలయంలుదర్సనంమిస్తున్నాయి. తాజాగా గూడెం కోత్త వీధి పంచాయతీ కార్యాలయంనికి కొత్త రంగులు వేయడంతో కార్యాలయం కొత్తగా కనిపిస్తుంది త్వరలోనే అన్ని పంచాయతీ కార్యాలయాలు కొత్త రంగులతో కనిపించడంజరుగుతున్నాయి.


సచివాలయం నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీశాఖ


సచివాలయం నిర్మాణాన్ని అడ్డుకున్న అటవీశాఖ


గూడెం కోత్త వీధి పెన్ పవర్



విశాఖ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అభివృద్ధి కొసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాది రూపాయలు నిధులు మంజూరు చేస్తున్న అటవీశాఖ మొకాళ్ళ తొఅడ్డుకొవడం వలన ముందుకు సాగడం లేదు. అటవీశాఖ అధికారులు అభ్యంతరాలు వలన గిరిజన ప్రాంతా అభివృద్ధి ఎక్కుడ వేసిన గొంగళి అక్కడే అనేసామెతలా మిగిలిపోయిందని గిరిజన ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసమాస్య పైపెన్ పవర్ విలేఖరి సేకరించిన వివరాలు ఈవిధంగా వున్నాయి ముఖ్యంగా గూడెం కోత్త వీధి మండలంలో ఎక్కువ శాతం రిజర్వ్ ఫారెస్ట్ భూమి ఎక్కువ. రెవెన్యూ భూమి శాతం తక్కువగా వుంది. దీని ఫలితంగా ప్రభుత్వంలు భవనాలు నిర్మాణంలు కొరకు నిధులు విడుదల చేస్తున్న పనులు ముందుకు సాగడం లేదు గాత ఏడాది రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహణ చేపటిన గ్రామ సచివాలయం భవన నిర్మాణం నాకు అటవీశాఖ అధికారులుఅడ్డుతాగిలారు. గూడెం కోత్త వీధి మండలంలోని గూడెం కోత్త వీధి పంచాయతీ గ్రామ సచివాలయం భవన నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం 40లక్షలునిధులుమంజూరుచేసిందనిగ్రామస్తులుతెలిపారు. ఈగ్రామ సచివాలయం భవనం నిర్మాణం కొరకు స్థానిక రెవెన్యూ ది కాదాని అటవీశాఖ చెందింది అని అడ్డుపడడంతో పనులు నిలిపివేశారు. సచివాలయం నిర్మాణం కేటాయించిన‌‌‌ స్థలంనాకు ముందుగా భాగం లో ప్రార్థన మందిరం నిర్మించుకున్నరని. దీనికి అడ్డుపెట్టని అటవీశాఖ అధికారులు. ప్రభుత్వం భవనాలు నిర్మాణంలు కి ఎందుకు అడ్డు తగులుతున్నరని గిరిజన ప్రాంతం అబివృది చేందకుండా అటవీశాఖ అదికారులు అడ్డుపడడంగల అభ్యంతరం ఏమీటని గిరిజన ప్రాంత ప్రజా ప్రతినిదులు ప్రశ్నిస్తున్నారు. విశాఖ జిల్లాకు చివరి వున్న అభివృద్ధికి ఆమడ దూరంలో వున్న గూడెం కోత్త వీధి మండలం ఫైఅరుకుపార్లమేంటు సభ్యురాలు జీ. మాధవి. పాడేరు శాసనసభ్యురాలు శ్రిమతి భాగ్యలక్ష్మి గార్లు ప్రద్యీక శ్రద్ధ వహించి మండలంలో అటవీశాఖ. రెవెన్యూ శాఖ. భూములు శాతం ఎంత వుందిని అంశం పై సర్వే జరిపించి అటవీశాఖ అభ్యంతరాలు వలన అర్థాంతరంగా నిలిచిపోయిన భవనాలు నిర్మాణంలకు ఎటువంటి అడ్డంకులే కుండా పూర్తికావడానికి చర్యలు తీసుకోవాలని గూడెం కోత్త వీధి మండలం ప్రజలు కొరుతున్నారు.


విశాఖ సాల్వేoట్ ప్రమాదానికి కారణం అయిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి


విశాఖ సాల్వేoట్ ప్రమాదానికి కారణం అయిన యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి
         


 పరవాడ పెన్ పవర్



పరవాడ:జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ పర్యవేక్షణ సవస్థ రామ్ కి నడుపుతున్న విశాఖ సాల్వేoట్ కంపెనీలో సోమవారం రాత్రి 10.30 ని జరిగిన భారీ అగ్నిప్రమాదం కేవలం యాజమాన్య నిర్లక్ష్యం వలనే జరిగింది అని ఫార్మాసిటీ స్టాఫ్&వర్కర్ల యూనియన్ గౌరవ అధ్యక్షుడు గనిశెట్టి సత్యాన్నారాయణ ఆరోపించారు. కంపెనీ యాజమాన్యం పై పోలీసు కేసుపెట్టి అరెస్ట్ చేయాలి అని లంకెలపాలెం లో కార్మికులతో కలిసి నిరసన రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా గనిశెట్టి మాట్లాడుతూ సాయినార్ ఫార్మా గ్యాస్ లీక్ లో ఇద్దరి మృతి చెందిన ఘటన మరవక ముందే విశాఖ సాల్వేoట్ ప్రమాదం ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది అని కార్మికుల ప్రాణాలకు ఫార్మాలో భద్రత లేదు అని మరోసారి రుజువు అయ్యింది అన్నారు.ఫార్మాసిటీ ని అభివృద్ధి చేయు సవస్థ గా ఉన్న రామ్ కి ఫార్మా కంపెనీలలో భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా చూడటంలో విఫలమైంది అని ఆరోపించారు.ఫార్మా లో జరుగుతున్న ప్రమాదాల నివారణా బాధ్యత రామ్ కి దే అని కానీ రామ్ కి ఆ భాద్యతలో విఫలం అయింది అని అన్నారు.విశాఖ సాల్వేoట్ లో జరిగిన ప్రమాదం ఫార్మాలో ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో కన్నా పెద్ద అగ్నిప్రమాదం అని అన్నారు.సకాలంలో అగ్నిమాపక దళాలు ప్రమాద స్థలానికి చేరుకుని ప్రమాదాన్ని అరికట్ట గలిగారు కానీ లేకపోతే ఈ కంపెనీలో జరిగిన భారీ పేలుళ్లకు ఇతర కంపెనీలకు వ్యాపిస్తే జరిగే పరిస్థితులు ఊహిస్తే ఒళ్ళు జలదరిస్తోంది అని ఆవేద వ్యక్తం చేశారు.పోలీసు శాఖ ప్రమాదం జరిగినప్పుడు కార్మికుల రక్షణకోసం వారిని పరామర్శించడానికి వచ్చే మమ్మని కానీ ఇతర పార్టీ  నాయకులను అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకు వెళుతున్నారు కానీ ప్రమాదాలకు కారణం అవుతున్న కంపెనీ యజమాన్యాలకు వారి అడుగులకు మడుగులెత్తుతున్నారు అని ఆరోపించారు.విశాఖ సాల్వేoట్ లో నిల్వ ఉన్న కెమికల్ వ్యర్దాలలో రియాక్షన్ జరిగి ప్రమాద రహిత వాయువులు(గ్యాస్)రాకుండా ఉండటానికి అందులో కొన్నిరకాల ద్రావణాలను కలుపుతారు అని ఆ ప్రమాద నివారణా ద్రావకాల యొక్క పరిమాణం తగ్గటం వలన రసాయనాల ట్యాoక్ లో ఏర్పడిన అధిక ఉష్నోగ్రత తో ఈ అగ్నిప్రమాదం జరిగింది అని అధికారులు సూచన ప్రాయంగా తెలియ చేశారు అని గనిశెట్టి అన్నారు.
వ్యర్ధ ట్యాకుల్లో ఏర్పడుతున్న అధిక ఉష్నోగ్రతల వలన పొగలు వస్తున్న విషయం కంపెనీ యాజమాన్యానికి తెలిసినా కూడా ఎటువంటి నివారణా చర్యలు తీసుకోకుండా ఇంత పెద్ద ప్రమాదానికి కారణం అయిన యాజమాన్యం పై క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి అని సత్యన్నారాయణ డిమాండ్ చేశారు.ఫార్మా కంపెనీలలో పనిచేసే కార్మికులు తమ ప్రాణాలను గుప్పెటలో పెట్టుకుని పని చేయవలసి వతుంది అని విచారం వ్యక్తం చేశారు.వీరే కాకుండా నిర్వాసిత గ్రామాలలోని ప్రజలు కూడా వరుస ప్రమాధాలతో భయ బ్రాoతులు అవుతున్నారు అని విశాఖ సాల్వేoట్ ప్రమాదం లో ఏర్పడిన విస్ఫోటన శబ్ధాల వలన తాడి,తాణాo,పరవాడ గ్రామాల్లోన్ని ప్రజలు రోడ్ల మీదకు పరుగులు తీశారు అంటే ప్రమాద తీవ్రత అంత ఎక్కువ ఉంది అని అన్నారు.ఈ ప్రమాదంలో మృతునికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలి అని అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలతో పాటు 30 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు కె.వెంకటరావు,పి.చిరంజీవి,ఎమ్.సంతోష్,అది తదితరులు పాల్గొన్నారు. 


ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ 


ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా పాజిటివ్ 


రాయవరం, పెన్ పవర్


 రాయవరం  మండలంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో  ఒకే కుటుంబంలో ముగ్గురికి కరోనా రావడం మరింత కలకలం గా మారింది. వివరాల్లోకి వెళితే బిక్కవోలు మండలం కొమరిపాలెంలోని  ఓ రైస్ మిల్ యాజమాన్యంకు  ఇటీవల కరోనా సోకింది. దీంతో అందులో పని చేసే సిబ్బందికి కరోనా పరీక్షలు జరిపారు. రాయవరం లో ఒకే కుటుంబ సభ్యులు ముగ్గురికి, వీ సావరంలో మరో ఇద్దరికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో వీరందరినీ బొమ్మూరు క్వరంటైన్ కేంద్రానికి తరలించారు.


కలెక్టర్ మురళీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన

కలెక్టర్ మురళీధర్ రెడ్డి సుడిగాలి పర్యటన


పెద్దాపురం, పెన్ పవర్:


 కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి తెలిపారు. బుధవారం పెద్దాపురం లూథరన్ హైస్కూలు ఆవరణలో ఏర్పాటు చేసిన కోవిడ్-19 పరీక్ష శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్షకు వచ్చిన వారితో కలెక్టర్ మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉండేందుకు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, తరుచూ చేతులను సానిటైజర్, సబ్బుతో శుభ్రపరుచుకోవాలని చెప్పారు. అవసరాల మేరకు మాత్రమే ప్రజలు బయటకు రావలే తప్ప మిగతా సమయాల్లో ఇంట్లోనే ఉండాలని అన్నారు. పట్టణంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా 144 సెక్షన్ అమలులో ఉందని, ఉదయం 6 నుండి 11 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి వుంటాయని తెలిపారు. కరోనా పరీక్షలు చేయించుకున్న వారిలో నెగిటివ్ వచ్చిన కూడా వారు బయటకు రాకూడదని, వారికి తిరిగి పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ పరంగా రెవెన్యూ, వైద్య, పోలీసు,మున్సిపాలిటీ, తదితర శాఖలు నిత్యమూ కరోనా కేసులపై సేవలందిస్తున్నారని ప్రజలందరూ విజ్ఞతతో అధికారులకు సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. అత్యంత ప్రమాదకరమైన కరోనా కేసులు తప్ప మిగిలిన పాజిటివ్ కేసులు హోమ్ క్వారంటైన్ లొనే ఉండి ఆరోగ్యం పరిరక్షించుకోవలసి ఉంటుందని తెలిపారు. ప్రతీ వ్యక్తి వ్యక్తిగత భద్రత కలిగి ఉండాలని ప్రభుత్వ సూచనలు తప్పకుండా పాటించాలని తెలిపారు.
        ఈ కార్యక్రమానికి ముందు పట్టణంలో కరోనా కేసులు నమోదుకాబడిన కంటెయిన్మెంట్ జోన్లను కలెక్టర్ తన వాహనం నుంచి పరిశీలించారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట ఆర్డీవో ఎస్.మల్లిబాబు, మున్సిపల్ కమిషనర్  జి.శేఖర్, డిఎస్పీ ఏ.శ్రీనివాసరావు, సిఐ జయకుమార్, ఎస్సై బాలాజీ తహశీల్దార్ బి.శ్రీదేవి,ఆర్. ఐ. రాఘవ ఎంపీడీవో రమణా రెడ్డి ఈవోపీఆర్డీ కారక హిమమహేశ్వరి, టిపిఎస్ ఉమామహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...