Followers

మార్చి 31లోగా కొత్త జిల్లాలు

ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ..
వచ్చే మార్చి 31లోగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటు 
13 నుంచి 25కు పెరగనున్న జిల్లాలు
పార్లమెంటు నియోజకవర్గ పరిధి హద్దులుగా  కొత్త  జిల్లాల ఏర్పాటు



(స్టేట్ బ్యూరో అమరావతి, పెన్ పవర్ )


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. రాష్ట్రంలో ఏర్పాటు చేయదలిచిన కొత్త జిల్లాలకు సంబంధించి అధ్యయన కమిటీ ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. కొత్త జిల్లాల ఏర్పాటులో పార్లమెంటు నియోజకవర్గాన్ని సరిహద్దులుగా తీసుకుంటారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు పెరగనున్నాయి. రాష్ట్రమంత్రివర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్.. రెండు గంటలపాటు కొనసాగింది. అజెండాలోని 22 అంశాలపై చర్చించింది.



కేబినెట్ చర్చించిన అంశాలు


25 జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వివిధ అంశాలపై చర్చ


జిల్లాల పునర్నిర్మాణం అధ్యయనంపై కమిటీ ఏర్పాటు


వైఎస్‌ఆర్‌ చేయూత పథకం అమలు


బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు ఆర్థికసాయం


మనబడి, నాడు-నేడులో సవరించిన మార్గదర్శకాలపై చర్చ 
 


పాఠశాల విద్యాశాఖలో పోస్టుల భర్తీకి ఆమోదంపై చర్చ
 


ఆంధ్రప్రదేశ్ పునరుత్పాదక ఇంధన ఎగుమతి విధానం, 2020 ను రూపొందించడంపై చర్చ
 


పెట్టుబడిదారులు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ప్రోత్సహించడం, అభివృద్ధి ,ప్రోత్సహించడంపై చర్చ
 


రాష్ట్రం వెలుపలకు ఇంధన ఎగుమతి చేయడం, రాష్ట్ర డిస్కామ్‌ల ద్వారా విద్యుత్ సేకరణపై చర్చ 
 


ఆంధ్రప్రదేశ్ స్టేట్ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్ (APRSDMPCL) ఏర్పాటుపై చర్చ
 


గతంలో జలవనరులశాఖ ఇచ్చిన ఆదేశాలను ఆమోదంపై చర్చించిన మంత్రి వర్గం 
 


40 వేల కోట్ల మూల ధన పెట్టుబడితో ప్రత్యేక సంస్ధను ఏర్పాటు చేయడంపై చర్చించిన మంత్రి వర్గం 
 


కడపజిల్లాల గండికోట రిజర్వాయర్ ప్రాజెక్ట్ పరిధిలోని రైతులకు పరిహారం అందించడంపై చర్చ
 


కదప జిల్లాకు కొండపురం గ్రామానికి చెందిన ప్రాజెక్ట్ బాధిత కుటుంబాలకు .145.94 కోట్లు చెల్లింపుపై చర్చ 
 


ఎపిఐఐసి లిమిటెడ్‌కు 2,000 కోట్లకు తాజా టర్మ్ లోన్ తీసుకోవడానికి అనుమతిపై చర్చ 
 


నెల్లూరు జిల్లాలోని దగదర్తి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధి పై మంత్రి వర్గంలో చర్చ
 


డిజైన్, బిల్డ్, ఫైనాన్స్ పై పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ద్వారా అభివృద్ది చేసే అంశంపై చర్చ , 
 


కర్నూలు జిల్లా ప్యాపిలి లో 5 కోట్లతో గొర్రెల కాపరుల శిక్షణా కేంద్రం ఏర్పాటుపై చర్చ
 


కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలం కొమ్మెమర్రి గ్రామంలో వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుపై చర్చ
 


9.55 కోట్ల తో ఈఏడాది నుంచి కళాశాల ఏర్పాటు చేసేందుకు మంత్రి వర్గం చర్చ



ఆపరేషన్ ముస్కాన్ తో బాల బాలికలకు మహర్దశ


ఆపరేషన్ ముస్కాన్ తో బాల బాలికలకు మహర్దశ



పెన్ పవర్, కందుకూరు


ఆర్ సి ఇన్ ఛార్జి: బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వీధి బాలల సంరక్షణకు జిల్లా పోలీసు శాఖ ఆదేశాలమేరకు  ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని కందుకూరు సీ ఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై కొత్తపల్లి.అంకమ్మ  చేపట్టారు.కందుకూరు వ్యవసాయ మార్కెట్ పక్కన నివాసము ఉంటున్న సంచార జాతులు పిల్లలు చదువుకోకుండా,దినసరి వేతనంకు వెళుతున్న వారిని ఈరోజు ముస్కాన్ ఆపరేషన్ లో గుర్తించారు. ఈ సందర్భంగా కందుకూరు ఎస్సై కొత్తపల్లి అంకమ్మ మాట్లాడుతూ 14 సంవత్సరాలు లోబడి విద్యకు దూరంగా ఉంటున్న బాల బాలికలను గుర్తించడం ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమని,  పేదరికం కారణంగా వివిధ కర్మాగారాలు, వర్తక, వాణిజ్య కేంద్రాల్లో పని చేస్తున్న బాల కార్మికులు, రోడ్ల మీద భిక్షాటన చేసే బాలలను గుర్తించి వారందరినీ ప్రభుత్వపరంగా, వారికి విద్యాబుద్ధులు నేర్పుతామన్నారు. ప్రతి ఒక్క బాల బాలిక చదువుకోవాలన్నదే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమన్నారు.అనంతరం వారికి మాస్కులు బిస్కెట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్సై  అంకమ్మ తో పాటు పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆర్డినెన్స్లు  ఉపసంహరించుకోవాలి కెవివి ప్రసాద్


కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన ఆర్డినెన్స్లు  ఉపసంహరించుకోవాలి కెవివి ప్రసాద్


ప్రకాశం జిల్లా, పెన్ పవర్


కేంద్రప్రభుత్భం ఇటీవల తెచ్చిన ప్రజా వ్యతిరేక ఆర్డినెన్స్లు ఉపసంహరించుకోవాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రైతుసంగం ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ అన్నారు.మండలంలోని రాజుపాలెం, సోమేపల్లి, గాంధీనగర్,శ్రీనివాస నగర గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా తో ఇబ్బందులు పడుతున్న పేదలకు 6 నెలల పాటు 50 కేజీల బియ్యం గోధుమలు ఇవ్వాలన్నారు.ఉపాధి హామీపనులను 100 నుండి 200 రోజులకు పెంచాలి అన్నారు.కౌలురైతులకు,రైతులకు గ్రామీణ ప్రజలకు 10 వేల పెక్షన్ అందించాలి అన్నారు.రుణ భారంతో నలిగి పోతున్న రైతులకు అన్ని రకాల రుణమాపిలు చేయాలని ఆయన అన్నారు.ఈకార్యక్రమంలో నియోజకవర్గా కార్యదర్శిడి శ్రీనివాస్,మండల కార్యదర్శి బాణాల రామయ్య,నాగేశ్వరవు,లింగయ్య, మరికొందరు నాయకులు,రైతులు తదితరులు  పాల్గొన్నారు.


బాలల సంరక్షణ కోసం ఆపరేషన్ ముస్కాన్


బాలల సంరక్షణ కోసం ఆపరేషన్ ముస్కాన్


         


  పెన్ పవర్, కందుకూరు ఆర్ సి ఇన్ ఛార్జి


 


 బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, వీధి బాలల సంరక్షణకు జిల్లా పోలీసు శాఖ ఆదేశాలమేరకు  ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని  టౌన్ పోలీస్ స్టేషన్ సి ఐ  విజయ్ కుమార్  ప్రారంభించారు .  ఆపరేషన్ ముస్కాన్ పై మహిళా  పోలీసులు తో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ  సందర్భంగా సీ ఐ విజయ్ కుమార్  మాట్లాడుతూ మున్సిపల్, గ్రామ పంచాయతీ, విద్య, ఐసీడీఎస్, కార్మిక శాఖాధికారులతో కలిసి ఆపరేషన్ ముస్కాన్‌ను విజయవంతం చేయాలని అన్నారు. 14 సంవత్సరాలు లోబడి విద్యకు దూరంగా ఉంటున్న బాల బాలికలను గుర్తించడం ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమని,  పేదరికం కారణంగా వివిధ కర్మాగారాలు, వర్తక, వాణిజ్య కేంద్రాల్లో పని చేస్తున్న బాల కార్మికులు, రోడ్ల మీద భిక్షాటన చేసే బాలలను గుర్తించి వారందరినీ ప్రభుత్వపరంగా, ఎన్జీఓలు నిర్వహిస్తున్న చైల్డ్ హోమ్‌లలో చేర్పించి వారికి విద్యాబుద్ధులు నేర్పుతామన్నారు. ప్రతి ఒక్క బాల, బాలిక చదువుకోవాలన్నదే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన ఉద్దేశమన్నారు.


ఉలవపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతిరోజు 15 మందికి కోవిడ్ 19 టెస్ట్లులు 


ఉలవపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రతిరోజు 15 మందికి కోవిడ్ 19 టెస్ట్లులు 


 పెన్ పవర్ ఉలవపాడు 


మండల కేంద్రమైన ఉలవపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో సూపర్నెంట్ డాక్టర్ శోభారాణి ఆధ్వర్యంలో రోజువారీగా ప్రతిరోజు 15 మందికి  డెంటల్ డాక్టర్ సురేష్ డాక్టర్ ప్రసాద్ కరోనా టెస్ట్ లు  నిర్వహిస్తారు అలాగే  ఉలవపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎం దేవ కుమార్ ఆధ్వర్యంలో అనాధ పిల్లలకి హోటల్లో పనిచేసే పిల్లలకి బెగ్గర్స్ అయిన వాళ్లకి ప్రతిరోజు డాక్టర్ సతీష్ పిల్లల డాక్టర్  సతీష్ బాబు ర్యాపిడ్ టెస్ట్లు నిర్వహిస్తారు ఈ రోజు చిన్న పిల్లలకు ముగ్గురు కు రాపిడ్ టెస్టులు నిర్వహిస్తే ముగ్గురికి నెగిటివ్ వచ్చిందని డాక్టర్ తెలియజేశారు కావున  ఎవరైనా కరోనా టెస్ట్ చేయించుకోవాలి అనుకుంటే ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించుకోవలని తెలిపారు. 


కరోనా బృతిని చెల్లించాలంటూ హమాలీల ధర్నా


కరోనా బృతిని చెల్లించాలంటూ హమాలీల ధర్నా


            సామర్లకోట, పెన్ పవర్    


 


కరోనా లాక్ డైన్ ప్రారంభం నుంచి నేటి వరకు ఐ ఏం ఎల్ కార్మికులు మంగళవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిఐటియు మండల ప్రధాన కార్యదర్శి టి నాగమణి,ఉపాధ్యక్షులు బాలం  శ్రీనివాసులు విచ్చేసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా కరోనా కారణంగా హమాలీ కార్మికులు అంతా ఉపాధి కోల్పోయినందున ఆ నెలలకు సంబంధించిన నెలకు రూ. 10 వేలు చొప్పున బృతిని చెల్లించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.ప్రభుత్వం చేసిన రూ. 5 వేలు సహాయాన్ని   మొత్తం  రికవరీ చేయాలని చేస్తున్న వైఖరిని వారు ఖడించారు.దానిని ఉచిత సహయంగానే పరిగణించాలని అన్నారు.నూతన మద్యం పాలసీ వలన హమాలీలు జీవన భృతి కోల్పోతున్న oదున వారిని ప్రభుత్వం నాల్గవ  తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ ధర్నా లో హమాలీల సంఘo అధ్యక్షక కార్యదర్శులు నాళం సత్యనారాయణ, విశ్వనాదుల అప్పలరాజు, నాయకులు బి.ఆదినారాయణ,పి ఏడుకొండలు, వి గోవిందు, బి.భాస్కరరావు, బి.శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. 


రెవిన్యూ రికార్డుల సవరణకు ఈ పంట నమోదు దోహదం వ్యవసాయశాఖ జెడి ప్రసాద్


రెవిన్యూ రికార్డుల సవరణకు ఈ పంట నమోదు దోహదం వ్యవసాయశాఖ జెడి ప్రసాద్


సామర్లకోట,  పెన్ పవర్


రైతులు వారి రెవిన్యూ రికార్డులను సరి చేసుకునేందుకు ఈ పంట నమోదు కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని దానిలో పాల్గొని రైతులు ఈ సేవలను వినియోగించుకోవాలని వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు కెఎస్ వి ప్రసాద్ అన్నారు.సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామములో మంగళవారం మండల వ్యవసాయధికారి ఐ సత్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పంట నమోదు కార్యక్రమాన్ని జెడి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూములకు సంభందించిన రైతు వివరాలు అన్నిటిని విఆర్వో నమోదు చేయనుండగా పంట వివరాలను వ్యవసాయ సహాయకులు నమోదు చేస్తారు అన్నారు.తద్వారా రెవిన్యూ రికార్డులు సరిచేసుకునే అవకాశం ఉంది అన్నారు.ఈ విధానం ద్వారా రైతులకు పంట భీమా ,ఇన్ పుట్ సబ్సిడీ ,పంటల కొనుగోలు ,వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు,ఇతర పథకాలు రైతులు పొందే అవకాశం ఉందన్నారు.అలాగే కౌలు రైతులు సిసిఆర్సీ కార్డులను పొందేందుకు అవకాశం ఉంటుంది అన్నారు.దానికి రైతులు అంతా వారి పంట పొలాల వివరాలను ఈ పంట నమోదు చేసుకోవాలన్నారు.ఇంకా పలు అంశాలపై ఆయన రైతులకు అవగహన కల్పించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో ఇంకా డిడిఎ మాధవరావు, ఎడిఎ పద్మాశ్రీ, ఎంఎఎ సత్య, వ్యవసాయ శాఖ సహయాధికారులు , వి ఆర్వోలు , రైతులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...