Followers

1200 లీటర్ల  బెల్లపు ఊట ధ్వంసం   కేసు నమోదు



1200 లీటర్ల  బెల్లపు ఊట ధ్వంసం

  ‌     ‌ 

  కేసు నమోదు

 

                .                                     

జగ్గంపేట, జూలై 14( పెన్ పవర్ ప్రతినిధి):పెద్దాపురం  స్పెషల్  ఎన్ ఫోర్స్ మెంట్  బ్యూరో టీమ్ లు   జగ్గంపేట   మండల పరిధిలో  దాడులు నిర్వహించి  గోవిందపురం  గ్రామ పరిధిలో   సారాయి కాపు నకు నిల్వ ఉంచిన   1200 లీటర్ల పులసిన బెల్లపు ఊటను    కనుగొని ధ్వంసం చేసి కేసు నమోదు చేయటం జరిగిందని పెద్దాపురం ఎక్సైజ్ సీఐ ఎం. రామకృష్ణ తెలిపారు ఈ  దాడుల్లో పెద్దాపురం  ఎక్సైజ్ ఎస్సైలు జె.విజయకుమార్., కె.తాతారెడ్డి   తదితర సిబ్బంది పాల్గొన్నా రు.


రైతులకు ఈ క్రాఫ్ట్ విధానంపై అవగాహన సదస్సు




రైతులకు ఈ క్రాఫ్ట్ విధానంపై అవగాహన సదస్సు

 

గోకవరం పెన్ పవర్

 

మండల కేంద్రమైన గోకవరం గ్రామ సచివాలయంలో రైతులకు అగ్రికల్చర్ అధికారి పి. పద్మలత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.ఏ.పి.సీఎం. జగన్మోహన్ రెడ్డి  రైతుల కోసం ఈ క్రాఫ్ విధానాన్ని ప్రవేశపెట్టారని రైతులు ముఖ్యంగా ఈ క్రాఫ్ నమోదు చేయించుకోవలని ఆమె తెలిపారు. అదేవిధంగాఈ క్రాఫ్ బుక్ చేయించుకొని యడల రైతులుకు జరిగే నష్టాన్ని వివరించారు. ఈ క్రాఫ్ పై రైతులకు పూర్తి అవగాహన కల్పించారు ఈ గ్రాఫ్ బుక్ చేసుకోవడం వల్ల  కలిగే ప్రయోజనాలు గురించి ఆమె తెలియజేశారు.ఈ క్రాఫ్ బుక్ చెయ్యడం కోసం అధికారులే రైతులు వేసే పంట పొలాలకు వచ్చి నమోదు చేస్తారు అని చెప్పడం జరిగింది అంతే కాకుండా కౌలు రైతులందరు తప్పనిసరిగా CCRC  కౌలు కార్డులు తీసుకోవాలని వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు గురించి వాటిని రైతులు ఎలా ఉపయోగించుకోవలో రైతుభరోసా కేంద్రాలలో ఏ ఏ ఉత్పత్తులు దొరుకుతాయో రైతులకు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారి పి.పద్మాలత , voa సురేఖ మరియు వైసీపీ టౌన్ కన్వీనర్ చింతల అనిల్ మరియు గ్రామ రైతు సోదరులు పాల్గొన్నారు.



వరద ఉదృత ప్రవాహం కేశవరం గండి ప్రమాదకరం



వరద ఉదృత ప్రవాహం కేశవరం గండి ప్రమాదకరం

 

మండపేట, పెన్ పవర్

 

మండపేట మండలం కేశవరం గ్రామం లోని గనిపోతురాజు చెర్వు ఉప్పొంగి ప్రవహిస్తోంది. నీటి వేగంలోనే ద్విచక్ర వాహనాలు రాక పోకలు సాగిస్తూన్నాయి. ప్రతి ఏటా వర్షం సీజన్ లో ఈ చెర్వు లో ఎగువ మెట్ట ప్రాంతాల్లో కురిసిన వర్షం నీరు వస్తూ ఉంటుంది. సుమారు 115 ఎకరాల విస్తీర్ణంలో ఈ గనిపోతురాజు చెర్వు ఉంది. సాధారణ సమయాల్లో నీరు తక్కువగా ఉంటుంది. ఎండాకాలం లో ఎండి పోతుంది. ఇక వర్షాలు కురిస్తే పొంగి ప్రవహిస్తోంది. కేశవరం బొమ్మూరు ప్రధాన రహదారి పై ఈ చెర్వు నుండి వెళ్లే వరద నీరు కోసం కాజ్ వే ఉంది. దీన్ని స్థానికులు చెర్వు గండి అంటారు. ఈ గండి నుండి పై ఉన్న పంట పొలాల్లో నుండి ధవళేశ్వరం సామర్లకోట ప్రధాన కాల్వలోకి ఈ నీరు వెళ్తాయి. కాగా గత ఏడాది కంటే ఎక్కువగా ఈ సారి ప్రవాహం వస్తుంది. కాగా మోటర్ సైకిళ్ళు సగం పైగా మునిగి పోతున్నాయి. చాలా వాహనాలు సైలెన్సర్ లో నీరు చేరి మరమ్మతులకు గురి అవుతున్నాయి. అలాగే మహిళలతో కలిసి వెళ్లే వారు అక్కడ జారీ పడుతున్నారు. ఇక కొందరు యువకులు ప్రమాదం అని తెలిసినా అక్కడే సెల్ఫీ లు,వీడియో లు తీసుకుంటున్నారు.


ఏలేశ్వరంలో 9 రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్


ఏలేశ్వరంలో 9 రోజులపాటు సంపూర్ణ లాక్ డౌన్

 

 ఏలేశ్వరం, పెన్ పవర్

 

పట్టణ పరిధిలో  కరోనా పాజిటివ్  కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో 16 తేదీ గురువారం నుండి 24వ తేదీ శుక్రవారం వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ విధించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జి కృష్ణ మోహన్ ప్రకటించారు . కరోనా మహమ్మారితో పట్టణంలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, 21 మంది కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. పట్టణంలో మంగళవారం ఒక్క రోజే 5 కరోనా కేసులు నమోదయ్యాయి. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తొమ్మిది రోజుల పాటు కఠినంగా లాక్ డౌన్ అమలుచేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గత 15 రోజులుగా ఉదయం 6 నుండి11 గంటల వరకు మాత్రమే సడలింపు కొనసాగుతుండగా, ఉన్నత  అధికారుల ఆదేశాల మేరకు గురువారం నుండి 24వ తేదీ వరకు పూర్తి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ఎస్ ఐ కె సుధాకర్ మంగళవారం తెలిపారు. ఈ ఎనిమిది రోజుల పాటు  ఎవరైనా ఇంటి నుండి బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 

 



ఏలేరు రిజర్వాయర్లలో చేపల వేట పై నిషేధం



ఏలేరు రిజర్వాయర్లలో చేపల వేట పై నిషేధం

 

ఏలేశ్వరం, పెన్ పవర్

 

ఏలేరు రిజర్వాయర్ లో చేపల వేటను నిషేధించినట్లు మత్స్య శాఖ అధికారులు తెలిపారు. వర్షాకాలంలో జూన్, జూలై ,ఆగస్టు మూడు నెలలపాటు చేపలు గుడ్లు పెట్టే దశ అయినందున మత్స్య సంపద భారీగా పెరిగే అవకాశం ఉంటుందని ఈ కారణంగానే ప్రతి ఏటా వర్షాకాలంలో మూడు నెలల పాటు చేపల వేట నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మత్స్యకారులకు హెచ్చరించారు.


400మందికి కోవిడ్19 టెస్టులు





400మందికి కోవిడ్19 టెస్టులు

 

 

  పెద్దాపురం, పెన్ పవర్

 

ఈ రోజు ఉదయం బుధవారం 8 గంటలకు పెద్దాపురం పట్టణం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్లో 400 మందికి కోవిడ్ 19 టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ టెస్టులు ఇప్పుడు వరకు పెద్దాపురం పట్టణంలో కరోన పోసిటీవ్ వచ్చిన సభ్యులు కాంటాక్ట్ అయిన వాళ్ళ అందరికి టెస్టులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా పెద్దాపురం పట్టణంలో ఎవరికైనా కరోన వైరస్ లక్షణాలు ఉన్నాయి అని అనుమానంతో ఉంటే వాళ్ళు కూడాఈ రోజు ఉదయం 8 గంటలనుంచి  ఆధార్ కార్డ్ తీసుకువస్తే టెస్టు ఛైయడం జరుగుతుంది అని ఏరియా ఆసుపత్రి డాక్టర్ ఎన్.సుదీప్తి, మున్సిపల్ కమిషనర్ జి.శేఖర్ ఓ ప్రకటన లో తెలిపారు.


 

 




 

 

 


గంజాయి అక్రమ రవాణా



గంజాయి అక్రమ రవాణా

 

 ఐదుగురు  అరెస్ట్

 

రెండు ఆటోలు సీజ్.

 

చింతపల్లి , పెన్ పవర్ 

 

మన్యప్రాంతం నుంచి మైధాన ప్రాంతానికి ఆటోలలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని చింతపల్లి పోలీసులు పట్టుకున్నారు.స్థానిక సీఐ టీ.శ్రీను సోమవారం సాయంత్రం అందించిన వివరాల ప్రకారం ముందస్తు సమాచారం మేరకు యస్ఐ మహమ్మద్ ఆలీ షరీఫ్ ఆధ్వర్యంలో సోమవారం ఉధయం మండల కేంద్రాన్ని ఆనుకొని ఉన్న అంతర్ల గ్రామం వద్ద తన సిబ్బందితో వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అటుగా వస్తున్న రెండు ఆటోలను క్షుణ్ణంగా తనిఖీ చేయగా ఆటోలలో గంజాయి ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. గంజాయితో పాటు ఆటోలలో వున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని గంజాయితో సహా రెండు ఆటోలను స్వాధీనం చేసుకొని సీజ్ చేయడం  జరిగిందన్నారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి సుమారు 90 కి.లో లుగా ఉందన్నారు. దీని విలువ సుమారు రూ.1 లక్షా 80 వేల వరకు ఉంటుందన్నారు.అక్రమంగా  గంజాయిని తరలిస్తున్న  ఐదుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నామన్నారు. వీరంతా జీకేవీధి మండలం దామనాపల్లి పంచాయతీ మాడెం గ్రామానికి చెందిన వారని సీ ఐ శ్రీను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక యస్ఐ మహమ్మద్ ఆలీ షరీఫ్, సిబ్బంది పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...