Followers

సింహాచలం దేవస్థానం వద్ద అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు నిరసన


సింహాచలం  దేవస్థానంలో సంచలన నిర్ణయం
140 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు
ఆర్థిక భారం వల్లే  తొలగించా మంటున్న దేవస్థానం.
కరోనా సమయంలోతొలగించడంపై ఉద్యోగుల నిరసన
            
            విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



సింహాచలం దేవస్థానం సంచలన నిర్ణయం  తీసుకుంది. దేవస్థానంలో పనిచేస్తున్న సెక్యూరిటీ  కాంట్రాక్ట్  అవుట్సోర్సింగ్  ఉద్యోగులను మూకుమ్మడిగా తొలగించింది. 140 మంది అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్  సెక్యూరిటీ సిబ్బందిని  విధుల నుంచి తొలగిస్తున్నట్లు  దేవస్థానం ప్రకటించింది. కరోనా లాక్డౌన్ కారణంగా  ఆలయానికి వచ్చే ఆదాయం గణనీయంగా పడిపోవడంతో  ఈ చర్యలు  తీసుకున్నట్లు దేవస్థానం పేర్కొంటుంది. దేవస్థానం పరిధిలో  నాలుగు కోట్ల వరకు ఆదాయం వచ్చేది ప్రస్తుతం ఈ ఆదాయం 20 లక్షల రూపాయలకు  పడిపోవడంతో  ఆలయ నిర్వహణ భారంగా మారిపోయింది. ఈ కష్టకాలంలో  ఆలయంలో ఖర్చులు తగ్గించుకోవాలని  దేవస్థానం నిర్ణయించుకుంది  ఈ నేపథ్యంలో  సెక్యూరిటీ   కాంట్రాక్ట్  అవుట్సోర్సింగ్  ఉద్యోగులను  తొలగించాలని భావించింది.  140 మంది కార్మికులు తొలగించడం వల్ల  దేవస్థానానికి  ఊరట కలుగుతుందని భావించారు. సెక్యూరిటీ  కాంట్రాక్ట్  అవుట్సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించడంతో  సిబ్బంది ఆందోళన సిద్ధమవుతున్నారు. కరోనా కష్టకాలంలో లో తమని తొలగిస్తే రోడ్డున పడతామని కార్మికులు ఆన్ విచారం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి కోసం నిరసనలకు పిలుపునిస్తున్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేవస్థానం మాజీ  ట్రస్ట్  సభ్యులు పాసర్ల ప్రసాద్  మాట్లాడుతూ హిందూ దేవాలయాల నుంచి 20 శాతం కార్పస్ ఫండ్ వసూలు చేస్తున్న  ప్రభుత్వం ఈ అవుట్ సోర్సింగ్  ఉద్యోగులను ఆదుకోవాలని ఆయన కోరారు.


 

 

గిరిజన సంఘం ఆద్వర్యంలో ఆందోళన


మైదాన ప్రాంత గిరిజనులు సాగులో ఉన్న

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

 

గిరిజన సంఘం ఆద్వర్యంలో ఆందోళన

 

విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్) 

 

మైదాన ప్రాంత గిరిజనులు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ప్రజాసంఘాలు అద్వర్యంలో గిరిజనులు పెద్ద సంఖ్యలో మంగళవారం చీడికాడ మండలం తహశీల్దార్ కార్యాలయం ఎదుట , ఆందోళన చేసారు అనంతరం గిరిజన సంఘం నాన్షేడ్యూల్డ్ ఏరియా జిల్లా కార్యదర్శి ఇ ,నరసింహమూర్తి సిఐటియు మండల కార్యదర్శి రొంగలిదేముడునాయుడు వ్వవసాయకార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి. వెంకన్న మాట్లాడుతూ తరతరాలుగా గిరిజనులు అటవీ భూముల్లో జిడిమామిడి తోటలు వెసుకోని దాని ద్వారా వచ్చే ఆదాయం తో ఉపాది పోందుతున్నారన్నరు. విటికి పట్టాలు ఇవ్వాలని ఇప్పటికే సంభందిచిన అదికారులు ధరఖాస్తులు పెట్టు కోవటం తో అధికారులు సంభందించిన జాబితా లు తయారు చేయడం జరిగిందని తెలిపారు. అయితే పారెస్టు ఆధికారులు మాత్రం గిరిజనులు పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని తెలిపారు. గిరిజనులు సాగులో ఉన్నది అటవీ రెవెన్యూ భూమిలుగా ఆధికారులు తెల్చ వలసి ఉందన్నారు. గస్టు తొమ్మిదో తేదీన ఆదివాసుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఏజెన్సీ 11 మండలాల్లో 21.144 ఎకరాల్లో 13.172 మంది ఆదివాసులకు  అటవీ హక్కుల చట్టం ప్రకారం ఫారెస్ట్ భూములు సాగు చేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని 

వీరితోపాటు  నాన్ షెడ్యూల్ ఏరియా మండలాలు అయిన  దేవరాపల్లి చీడికాడ వి ,మాడుగుల రావికమతం రోలుగుంట గోలుగోండ నాతవరం కోటవురట్ల  మండలాల్లో వేలాది ఎకరాల్లో అటవీ భూములు సాగు చేస్తున్నట్లు 112  గ్రామాల కుచెందిన ధరఖాస్తులు పెట్టుకోవడం జరిగిందని  అన్నారు వీటిని అయా మండలాలుకు చెందిన తహశీల్దార్లు  సాగు దార్లును గుర్తించడం జరిగిందని  గతంలో అటవీ భూములపట్టాలు పంపిణీ షేడ్యూల్డ్ ఏరియా కు పరిమితం చేస్తె  నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో ని గిరిజనులు నష్ట పోవడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికే  నాన్ షేడ్యూల్డ్ ఏరియా లోని గిరిజనులు ను షేడ్యూల్డ్ ఏరియాలో ని చేర్చకపోవటం వలన 1/70  లాంటి భు బదాలయింపు చట్టం వర్థించక పోవడం వలన గిరిజనులు భూములు అన్యా క్రాంతం అవ్వడం జరిగిందని ప్రస్తుతం నాన్ షేడ్యూల్డ్ ఏరియాలో ని గిరిజనులు అందరూ అటవీ భూములు పై ఆధారపడి జీవిస్తున్నారని ఈ సారి అయిన నాన్ షేడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనులు కు హక్కుపత్రాలు మంజూరు చేయాలని కోరారు ఈకార్యక్రమంలో   జి సూర్యనారాయణ ,ఇ ఆప్పారావు రాము దాసు శ్రీ ను ,తో పాటు వందలాది మంది గిరిజనులు పల్గోన్నారు .

ప్రమాదానికి బాద్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాలి



ప్రమాదానికి బాద్యులు అయిన వారిని కఠినంగా శిక్షించాలి

 

       జనసేన శివసెంకర్

 

             పరవాడ పెన్ పవర్

 

రామ్ కి ఫార్మాసిటీ లో విశాఖ సాల్వెంట్ కంపెనీ లో రాత్రి 10:30 కు  జరిగిన ప్రమాద విషయం తెలుసుకుని జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిన శివశంకర్ మరియు రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య  కంపెనీని ప్రమాద స్థలాన్ని పర్యటించారు.శివశంకర్ మాట్లాడుతూ గతంలో ఈ ఫార్మా కంపెనీలన్నీ సేఫ్టీ ఆడిట్ చేయించాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గతంలో తాడి గ్రామం పర్యటించినప్పుడు డిమాండ్ చేశారని అన్నారు.ఫార్మా కంపెనీలు అన్నీ పీసీబీ యెక్క మెజర్స్ ఫాలో అవ్వాలని తరచూ ఈ ఫార్మాసిటీ కంపెనీ లో ప్రమాదాలు జరుగుతున్నాయని అయినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కార్మికుల ప్రణాల పట్ల జాగ్రత్తలు తీసుకోవడం లేదని అలాగే ప్రమాదానికి బాధ్యులైన కంపెనీ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని, నష్టపోయిన కార్మికులకు నష్టపరిహారం చెల్లించాలని,చనిపోయిన కార్మికులకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.నిర్వాసిత గ్రామాలు అయిన చుట్టుపక్కల గ్రామాలను ఇచ్చిన మాట ప్రకారం తరలించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన సీనియర్ నాయకులు మోటూరు సన్యాసినాయుడు.దుళ్ళ రామునాయుడు .79 వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి  కిoతాడ ఈశ్వరరావు . జనసేన పార్టీ నాయకులు,పిల్ల  శివ కృష్ణ,బోద్దపు శ్రీనివాసరావు,సర్వసిద్ధి సన్యాసిరాజు, దాసర త్రినాథ్,జన సైనికులు పాల్గొన్నారు.


కోటి పరిహారం ప్రకటించాలి 


 





కోటి పరిహారం ప్రకటించాలి 

 

అనకాపల్లి, పెన్ పవర్

 

పరవాడ ఫార్మాసిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో చనిపోయిన కాండ్రేగుల శ్రీనివాసరావు  అతని కుటుంబానికి నష్టపరిహారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయలు ప్రకటించి మానవత్వాన్ని చాటుకోవాలని శ్రీ  నూకాంబిక అమ్మవారి దేవస్థానం మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొణతాల వెంకటరావు విజ్ఞప్తి చేశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు స్వస్థలం అనకాపల్లి సంతోషిమాత కోవెల ప్రాంతంలో నివాసం ఉండేవారని ప్రస్తుతం బట్ల పూడి గ్రామంలో తన తల్లి ఇద్దరు కుమార్తెలతో నివాసం ఉంటున్నారనారు. ఎల్జి పాలిమర్స్ వెంకటపాలెం లో జరిగిన విధంగానే పరవాడ ఫార్మాసిటీలో విశాఖ సాల్వెంట్స్ కంపెనీలో సీనియర్ కెమిస్ట్రీ గా పనిచేస్తున్నారని కంపెనీ యొక్క నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిన కారణంగా అతను చనిపోయాడు అని కంపెనీ యాజమాన్యం ఎటువంటి సేఫ్టీ పద్ధతులు పాటించకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయనారు. ఇటీవల జరిగిన ఎల్జి పాలిమర్స్ మరియు ఇతర ప్రాంతాల్లో ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు గా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయకపోవడం వారి దగ్గర నుండి మామూలు తీసుకొని చూసి చూడనట్లు వ్యవహరించడం వల్లే ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఇకనైనా బాధ్యతగా అన్ని కంపెనీలు ప్రతి నెలా తనిఖీలు చేసి నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చనిపోయిన వ్యక్తి కుటుంబానికి ఎటువంటి ఆధారం లేదని అతని పైనే ఆధారపడి తల్లిని ఇద్దరు కుమార్తెలు పోషించుకుంటూ ఉన్నాడని 2 సంవత్సరాల క్రితం అతని భార్య కూడా చనిపోయిందని అటువంటి కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారంతో పాటు కంపెనీ నుండి కూడా నష్టపరిహారం ఇస్తూ వారి కుటుంబానికి ఆధారం చూపించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

 

 




 


ఫార్మా ప్రమాద స్థలాన్నిపరిశీలనకి వెళ్లిన బండారు అరెస్ట్


ఫార్మా ప్రమాద స్థలాన్నిపరిశీలనకి వెళ్లిన బండారు అరెస్ట్


           పరవాడ, పెన్ పవర్

 

 జవహర్ లాల్ నెహ్రు ఫార్మాసిటీ (రామ్ కి ఫార్మాసిటీ)లో సోమవారం రాత్రి విశాఖ సాల్వేoట్ లో జరిగిన ప్రమాదాని పరిశీలించండానికి వెళ్లిన మండల తెలుగుదేశం నాయకులతో కలిసి మాజీ మంత్రి,ఎమ్మెల్యే అయిన బండారు సత్యన్నారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేసి విశాఖపట్నం హార్బర్ పోలీస్ స్టేషన్లో ఉంచారు.అరెస్ట్ కు ముందు బండారు సత్యన్నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం పై అఖిలపక్షం సభ్యులతో కమిటీ వేసి విచారణ చేయించాలి అని ముఖ్యమంత్రి ని డిమాండ్ చేశారు.ఫార్మా సిటీ నిర్వాసిత గ్రామాల్లోని ప్రజలు ప్రాణాలు గుప్పెటలో పెట్టుకుని బ్రతుకుతున్నారు అని అన్నారు.తామంతా అగ్ని గుండం పై కుచున్నట్లు ఉంది అని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని బిక్కు బిక్కుబిక్కుమంటూ తాడి,తాణాo,పరవాడ ప్రజలు బ్రతుకుతున్నాము అని అన్నారు.ప్రభుత్వం ఇప్పటికి అయినా ఈ ప్రమాదాల నివారణకు అఖిలపక్ష సభ్యులతో కూడిన కమిటీ వేసి ఫార్మా యాజమాన్యాల తో చర్చలు జరిగేలా చూడాలి అని డిమాండ్ చేశారు.మృతులకు,క్షతగాత్రులకు న్యాయం చేయాలని కోరారు.ప్రమాదానికి కారణం అయిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు.బండారు తో మాజీ జెడ్పిటిసి పయిల జగన్నాధ రావు,అట్టా సన్యాసి అప్పారావు, కన్నూరి రమణ,బుగిడి గోవింద్,పరదేసి నాయుడు వున్నారు.

 

 

దుండగులు ఎంతవారైన శిక్షించాలి


 



దుండగులు ఎంతవారైన శిక్షించాలి.

 

పూర్ణా మార్కెట్,పెన్ పవర్.

 

బిజెపి ఎస్సి మోర్చ ఆధ్వర్యములో బాగంగా బాబా సాహెబ్ డా. బి ఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ నీవాస పరిసర ప్రాంతాల్లో దుండగులు చేసినటువంటి పనిని మేము కండిస్తున్నాం ఇది యావత్ ఎస్సీ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది. దుష్టులను ఎంతవారైన  సరే శిక్షించాలి.5.6.7 వార్డుల లో నివాళులు అర్పించిన పిదప పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో సి.ఐ కి మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా ఎస్సి మొర్చా అధ్యక్షులు చోక్కాకూల రాంబాబు అధ్వరములో జరిగింది. ఈ కార్య్రమానికి సిటీ కార్యదర్శి   డీ.శ్రీనివాస్ రావు, వై అప్పారావు, మహిళ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


ఫార్మా పరిశ్రమల ప్రమాదాల వెనుక కుట్ర కోణం


 



ఫార్మా పరిశ్రమల ప్రమాదాల వెనుక కుట్ర కోణం

 

చంద్రబాబు పాత్రపై అనుమానాలు విశాఖ  ఇమేజ్ దెబ్బతీసేందుకే కుట్రలు ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్

 

 పూర్ణా మార్కెట్ ,పెన్ పవర్.

 

 విశాఖపట్నంలో వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై తమకు అనుమానాలున్నాయని  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి,  అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ తెలిపారు. 

 పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ  విశాఖ ఇమేజ్ను దెబ్బతీసేందుకు కుట్రలు పాల్పడుతున్నట్టు భావిస్తున్నామన్నారు.  ఇలాంటి కుట్రలు కుతంత్రాలు ఒక చంద్రబాబునాయుడు మాత్రమే చేయగలరని,  దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని  తాను వ్యక్తిగతంగా కోరుతున్నానని  చెప్పారు. జరుగుతున్న ఘటనలు,  ప్రతిపక్షాల తీరు  చూసి ఈ అనుమానాలు  వ్యక్తమవుతున్నాయి అన్నారు. భోపాల్ గ్యాస్ ప్రమాద బాధితులకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో డబ్బులు అందలేదని, కానీ ఎల్జి పాలిమర్స్ బాధితులకు  పూర్తిస్థాయిలో ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.  విశాఖను జగన్ పరిపాలన రాజధానిగా  చేయాలన్న ప్రతిపాదనలకు అడ్డుకట్ట వేయడానికి ఇవన్నీ చేస్తున్నారా అనే  అనుమానం కలుగుతోందన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్  మాటలు చూస్తుంటే, ఒకే రకమైన ప్రమాదాలు జరగడం పట్ల  అనుమానాలు బలపడుతున్నాయి అన్నారు.  గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎన్టీఆర్ మరణానికి కారణమయ్యారని,  రాజధాని అమరావతి భూముల విషయంలోనూ ఎన్నో కుట్రలకు పాల్పడ్డారని  అన్నారు.  ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమంలోనూ రైలు ను  తగలబెట్టడం నికి కారణం అయ్యారని ఇప్పుడు అమరావతిలో ఆయన పెట్టుబడులు ఆస్తులు కాపాడుకోవడానికి  విశాఖ ఏమైనా   పర్వాలేదు అన్నట్టు వ్యవహరిస్తున్నారని  ధ్వజమెత్తారు.  విశాఖ లో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రచారం చేసి లబ్ది పొందాలని చంద్రబాబు చూస్తున్నారని ధ్వజ మెత్తారు.  గోదావరి పుష్కరాలు లో ఎంతో మంది చనిపోతే కుంభమేళాలో చనిపోవడం లేదా అని చంద్రబాబు ప్రశ్నించారు అని,ఇప్పుడు ఎక్కడ ప్రమాదాలు జరుగుతాయి శవాల మీద రాజకీయాలు చేయాలని ఎదురుచూస్తున్నారని  విమర్శించారు.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని,  ఎప్పుడైనా దానికి కారణమైన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని ప్రశ్నించారు. ఎల్జి పాలిమర్స్ సంఘటనలో  నిందితుల  విదేశీ వారైనా  మంత్రి జగన్మోహన్ రెడ్డి బాధితుల పక్షాన నిలబడి ఘటనకు బాధ్యులైన వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని  అన్నారు. ఈ ప్రభుత్వాన్ని అభినందించే  స్థితిలో చంద్రబాబు లేరని పేర్కొన్నారు.జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని,  ప్రభుత్వంలో ప్రజలందరూ  మేలు పొందుతున్నారని పేర్కొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...