కోవిడ్19 ముస్కాన్ వాహనాన్నిప్రారంభించిన.డిఎస్పీ
పెద్దాపురం,పెన్ పవర్ :
కరోనా విపత్కర పరిస్థితుల్లో వీధిబాలలు, అనాధలను గుర్తించి వారికి సంజెరక్షణ కల్పించాలనే సదుద్దేశంతో ముస్కాన్ కోవిడ్-19 వాహనాన్ని ప్రారంభించడం జరిగిందని పెద్దాపురం డిఎస్పీ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం పెద్దాపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి వారి కార్యాలయంలో డిఎస్పీ పాత్రికేయులతో మాట్లాడుతూ అపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 వాహనం ద్వారా ఎటువంటి ఆధారం లేని వీధిబాలలు, అనాథలను గుర్తించి వారికి సంరక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. పోలీసు,కార్మికశాఖ,స్త్రీ,శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో ఈ ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19 వాహనం డివిజన్ లో రోజుకొక సర్కిల్ లో తిరుగుతుందని తెలిపారు. ఈ వాహనం ద్వారా గుర్తించిన పిల్లలకు కోవిడ్ పరీక్ష నిర్వహించిన అనంతరం రెస్క్యూ హౌస్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎవరైనా బాలకార్మికులను గుర్తించి మాకు సమాచారం అందిస్తే వెంటనే వారికి సంరక్షణ కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ అవసరమైతే తప్ప ఇంటినుండి బయటకు రకుండాఉండలని కరోనా వైరస్ బారి నుండి తమను తాము రక్షించుకోవాలని డిఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ జయకుమార్, లేబర్ ఇన్స్పెక్టర్ కె.రఘుపతి, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.