Followers

కండక్టర్లను సర్వీసులకు పంపే ఆలోచన యాజమాన్యం నిర్మించుకోవాలి.


కండక్టర్లను సర్వీసులకు పంపే ఆలోచన యాజమాన్యం నిర్మించుకోవాలి.


గోకవరం పెన్ పవర్.


covid-19 కారణంగా బస్సులతో పాటు కండక్టర్ల సర్వీసులకు పంపి ఆలోచనలు యాజమాన్యం విరమించుకోవాలని స్థానిక ఆర్టీసీ డిపో కార్మికులు మంగళవారం గోకవరం డిపో మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక నాయకులు మాట్లాడుతూ covid 19 కారణంగా ఆర్టీసీ లో పనిచేస్తున్న సిబ్బంది కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని నాయకులు తెలిపారు. ఆర్టీసీ కార్మికులు కనీసం ఇన్సూరెన్స్ కల్పించలేదని, ఆర్టీసిలో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా కరోనా బారిన పడితే వారి కుటుంబం రోడ్డు పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని కాబట్టి ఈ పరిస్థితుల్లో రోజురోజుకీ జిల్లా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కరోనామరింత బలపడుతుందని కాబట్టి ఈ సమయంలో యాజమాన్యం ఉద్యోగులకు భద్రత కల్పించాలని వారు కోరారు. కాబట్టి అధికారులు బస్సులతో పాటు కండక్టర్ సర్వీసులకు పంపే ఆలోచన విరమించుకోవాలని వారు డిపో మేనేజర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో గోకవరం ఆర్టీసీ డిపో కార్మికులు నాయకులు పాల్గొన్నారు.


గజ్జరం నుండి గోపవరం వెళ్లే  రహదారి గోతుల మయం. 


గజ్జరం నుండి గోపవరం వెళ్లే  రహదారి గోతుల మయం. 



తాళ్ళపూడి,  పెన్ పవర్


మండలంలో గజ్జరం నుండి గోపవరం వెళ్లే  రహదారి గోతుల మయం. వర్షం వచ్చిందంటే ఆ దారిలో ప్రయాణం బహు కష్టం. రోడ్డు మొత్తం బురద మయం. ద్విచక్ర వాహనాలతో ప్రయాణం సర్కస్ పీట్ ను తలపిస్తుంది. బురదలో వాహనాలు జారిపోతూ ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పలుమార్లు ఈ ప్రాంతం వాళ్ళు ధర్నాలు, నిరసనలు చేపట్టిన సంబంధిత అధికారులు ఏదో మొక్కుబడి చర్యలతో సరిపెట్టేస్తున్నారు. శాశ్వత పరిష్కారానికి ఎవ్వరు తగిన చర్యలు తీసుకోవడం లేదు. గతంలో కొవ్వూరు మాజీ శాసన సభ్యులు టి.వి.రామారావు ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని ధర్నా నిర్వహించారు. అదే విధంగా గజ్జరం నుండి రాగోలపల్లి వెళ్ళే రహదారి సైతం గతుకుల మయం గా మారింది. వర్షం నీటితో రోడ్డు పై గోతులు నిండిపోయి ద్విచక్ర వాహన దారులకు చుక్కలు కనబడుతున్నాయి. ఈ దారి గుండా ప్రయాణం చేయడానికి. గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయుడు, ప్రయాణికులు వర్షాకాలంలో ఇక్కడ జారీ  పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. రాగోలపల్లి, తుపాకుల గూడెం, పోచవరం గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన తాళ్లపూడి రావాలంటే ఇదే దారి. అలాగే గ్రామంలో పనిచేసే టీచర్లు, పంచాయితీ అధికారులు, సొసైటీ బ్యాంకు సిబ్బంది, ఇతర శాఖల అధికారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


దాతల సహకారం.. చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం..


దాతల సహకారం..


చిన్నారి వైద్యానికి ఆర్థిక సాయం..


మండపేట,పెన్ పవర్ 


మండపేట: గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి వైద్యానికి దాతలు ముందుకు వచ్చి ఆర్ధిక సహకారం అందించారు.  మండలం లోని ఏడిద గ్రామానికి చెందిన వైకాపా నేత పలివెల సుధాకర్ చిన్నారిని ఆదుకోవాలని తలచారు. గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారి బాధను నలుగురికీ తెలియ జేశారు. దీంతో పలువురు మనసున్న మారాజులు ముందుకు వచ్చారు. సేకరించిన నిధులు మొత్తం 45000 బాధిత కుటుంబానికి అందజేసి వారి ఉదారతను చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే  మండలం లోని ఏడిద కు చెందిన లంక రాణా అనే ఐదు నెలల పాప గుండె కు చిల్లు పడడంతో శస్త్రచికిత్స అవసరమైంది. ఆరోగ్యశ్రీ పథకం కింద విజయవాడలో శస్త్ర చికిత్స చేసేందుకు ఇప్పటికే ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ చర్యలు తీసుకున్నారు. త్వరలో శస్త్రచికిత్స చేస్తామని ఆసుపత్రి వర్గాలు తెలిపినట్లు తండ్రి రాణా తెలిపారు. కాగా ముందుగా వైద్య పరీక్షలు, ఇతర వసతుల కోసం రూ 50,000 వరకు ఖర్చు అవుతుండడంతో నిరుపేదలైన రాణ కు దాతలు సాయం అందించారు. వైకాపా నేత పలివెల సుధాకర్ ఆధ్వర్యంలో సోమవారం సి ఐ యు టీవీ ఛానల్ వారు రూ 25,000, గ్రామంలోని బాబు జగ్జీవన్ రామ్ యూత్, ఉద్యోగులు రూ 20,000 ఆర్థిక సహాయం అందజేశారు. పాప త్వరలో సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సిద్ధాంతపు అహరోను, ఉండ్రాజవరపు చిన్నా, చాపల సతీష్, పైడిమళ్ల సుబ్బారావు, ఖండవల్లి సైమాన్, పైడిమళ్ల రాజు,సృజన్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.


కరోనా కలకలం మండపేట టౌన్ లో ఐదు తాపేశ్వరంలో మూడు కరోనా పాజిటివ్ కేసులు


కరోనా కలకలం
మండపేట టౌన్ లో ఐదు
తాపేశ్వరంలో మూడు
కరోనా పాజిటివ్ కేసులు


వర్షం తో పారిశుద్ధ్య పనులకు ఆటంకం
అప్రమత్తంగా ఉండాలని అధికారులు  విజ్ఞప్తి...


పరీక్షలు అరకొరగా చేస్తున్నా మండపేట పట్టణంలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. పాజిటివ్ కాంటాక్ట్ పరీక్షలు నిలిచిపోగా ఇటీవల మండపేట టౌన్ పరిధిలో చేసిన వేర్వేరు వ్యక్తులు ఐదు గురికి పాజిటివ్ రిపోర్ట్ లు సోమవారం వచ్చాయి. అధికారులు దృవీకరించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండపేట మండలం తాపేశ్వరంలోని శివాలయం వీధి లో నివసిస్తున్న రూరల్ పోలిస్ స్టేషన్ కానిస్టేబుల్ కు పాజిటివ్ రాగా అతని కుటుంబ సబ్యులకు పరీక్షలు చేశారు. దీంతో అతని భార్య, కుమార్తె, హైదరాబాద్ నుండి వచ్చిన బావమరిది కి పాజిటివ్ గా తేలింది. దీంతో రూరల్ లో సోమవారం మూడు కేసులు నమోదు అయ్యాయి. 
ఇక టౌన్ కు సంబంధించిన 6 వ వార్డు ఆంద్రా బ్యాంకు వీధి లో ప్రముఖ రాజకీయ నాయకుడి కోడలుకు గతం లో పాజిటివ్ రాగా ఇప్పుడు ఆ ప్రముఖుడి తో బాటు ఆయన కుమార్తె కు పాజిటివ్ రిపోర్ట్ లు వచ్చాయి. బురుగుంట చెర్వు ఏరియా లోని బాల భవన్ పక్క వీధి లో ఓ వ్యక్తి కి పాజిటివ్ వచ్చింది. 18 వ వార్డు పరిధిలోని ఓం జ్యులరీస్ వెనుక బుక్కా వారి వీధి లో మరొక పాజిటివ్ నమోదు అయ్యింది.
27 వ వార్డు పరిధిలోని పార్థసారథి నగర్లో ఓ వ్యక్తి కి పాజిటివ్ తేలింది. కొన్ని చోట్ల ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టగా మరి కొన్ని చోట్ల వర్షం వల్ల పారిశుద్ధ్యపనులకు ఆటంకం ఏర్పడింది.  ఈ సందర్భంగా కమిషనర్ త్రిపర్ణ రామ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేసారు. 


కృష్ణుని పాలెం లో కూరగాయల పంపిణీ.


కృష్ణుని పాలెం లో కూరగాయల పంపిణీ.


గోకవరం పెన్ పవర్.


కరోనా వైరస్ నేపథ్యంలో మండలంలోని కృష్ణుని పాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఏడు పల్లెలకు మాజీ సర్పంచ్ కన్నబాబు ఉచితంగా కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కూరగాయల్లో ఒక్కొక్కరికి కేజీ ఉల్లిపాయలు, కేజీ దొండకాయలు, కేజీ వంకాయలు, కేజీ బెండకాయలు, అర కేజీ పచ్చిమిర్చి, కేజీ గోరుచిక్కుడు, బొబ్బర్లు, దోస కాయలు పలు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.  ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ జెడ్పిటిసి అభ్యర్థి అరుణ కన్నబాబు, టిడిపి నాయకులు మండిగ గంగాధర్, సిద్ధ చంటిబాబు మండిగ. బాలాజీ, జి. పోసి బాబు, తదితర నాయకులు పాల్గొన్నారు


గ్లౌసులు ధరించని పలువురు వ్యాపారులకు హెచ్చరికలు 


గ్లౌసులు ధరించని పలువురు వ్యాపారులకు హెచ్చరికలు 


కొత్తపేట, పెన్ పవర్ 
 
  కొత్తపేట మండలంలో సొమవరం నుండి లాక్ డౌన్ లో  పలు మార్పులు చేసిన నేపధ్యంలో కొత్తపేట ఎస్.ఐ కె.రమేష్  కొత్తపేట లో గల  వ్యాపార సంస్థలను ఆకస్మికంగా సందర్శించారు .ప్రతీ షాపును సందర్శించగా పలువురు  వ్యాపారాలు  నిర్వహిస్తూ వారు చేతులకు గ్లౌజులు ధరించకపోవడంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.గ్లౌజులు ధరించిన తరువాతే వ్యాపారాలు కొనసాగించాలని వారిని ఆదేశించారు.కొన్ని షాపులలొ  సామాజిక దూరం పాటించేలా  సర్కిల్స్ వేయకపోవడంతో వారిని కూడా సర్కిల్స్ వేసిన తరువాత వ్యాపారాలు నిర్వహించాలని హెచ్చిరించారు. మాస్కులు ధరించకుండా ఎవరైనా కొనుగోలు చేయడానికి వస్తే వారికి అమ్మకాలు జరపవద్దని వ్యాపారులకు సూచించారు.ఉదయం 11 గంటలకు విధిగా ప్రతీ వ్యాపారం కూడా మూసివేయాలని చెప్పారు. ఎస్.ఐ తో పాటు ఏ.ఎస్.ఐ మూర్తి పాల్గొన్నారు.


పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ  కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ 


పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ  కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ 


పెన్ పవర్ పశ్చిమ గోదావరి బ్యూరో



 పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ ను పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ అద్దె భవనంలో ఉండడాన్ని గమనించి సదరు పోలీస్స్టేషన్ కేటాయించిన స్థల పరిశీలన చేసినారు అనంతరం పాలకొల్లు రూరల్ పోలీస్ స్టేషన్ తనిఖీ చేసి  సదరు పోలీస్స్టేషన్ ఎస్ఐ  కరోనా వైరస్ వలన ఎస్సై  క్వారాం టెన్  లో ఉన్న సందర్భంగా ఎస్ఐ  యొక్క ఆరోగ్య పరిస్థితుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు సదరు పోలీస్స్టేషన్లో పని చేస్తున్న సిబ్బంది యొక్క సాధక  బాధల లను గురించి  అడిగి తెలుసుకున్నారు సదరు పోలీస్స్టేషన్లో పెద్ద వయసు కలిగిన అధికారుల యొక్క యోగక్షేమాలను గురించి విచారించి వారికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తాను అని ఎస్పి  హామీ ఇచ్చినట్టు, ఎస్సై  సెలవులో ఉన్న కారణంగా సదరు పోలీస్స్టేషన్లో విధినిర్వహణలో సిబ్బంది ఎస్పి  తెలియపరస్తే తగిన సూచనలు సలహాలు ఇస్తాను అని వారికి హామీ ఇచ్చారు. ఈ తనిఖీలు ఎస్పీ తో పాటుగా పాలకొల్లు టౌన్ సిఐ ఆంజనేయులు  రూరల్ సిఐ వెంకటేశ్వరరావు  పెనుగొండ  సునీల్ కుమార్ మరియు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...