Followers
పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ
గుంపులుగా ఉండవద్దు -- ఎస్సై శివప్రసాద్.
ప్రతీ ఒక్కరు సామాజిక దూరం పాటించాలి
కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశం
కిర్లంపూడి,పెన్ పవర్
కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో విలేకర్ల సమావేశంలో కిర్లంపూడి ఎస్సై అప్పల రాజు మాట్లాడుతూ కరోణ ఉదృతంగా వ్యాప్తి చెందడంతో ప్రతి
ఒక్కరూ జాగ్రత్త వహించాలని ప్రతి ఒక్కరు మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని ఆయన కోరారు గుంపులు గుంపులుగా జనాలు చేరడం మాస్కు ధరించకుండా బయట కనిపిస్తే పెనాల్టీ విధిస్తామని ఆయన అన్నారు.
ప్రతి వారం జగ్గంపేటలో శానిటేషన్ పిచికారి
పాలకుర్తి సురేష్ ఆధ్వర్యంలో
ప్రతి వారం జగ్గంపేటలో శానిటేషన్ పిచికారి
జగ్గంపేట,పెన్ పవర్
జగ్గంపేట చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ పాలకుర్తి సురేష్ ఆధ్వర్యంలో కోవిడ్ 19 వ్యాప్తిని అరికట్టేందుకు తన వంతు ప్రయత్నంగా ప్రతి వారం వ్యక్తిగత నిధులతో జగ్గంపేట లోని మెయిన్ రోడ్, షాపింగ్ కాంప్లెక్స్ లో, సర్వీస్ రోడ్డు, ఆర్టీసీ కాంప్లెక్స్ వివిధ ముఖ్యమైన కార్యాలయాల వద్ద సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేయిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు సోమవారం ఉదయం పాలకుర్తి సురేష్ పర్యవేక్షణలో స్ప్రేయింగ్ మిషన్ ద్వారా శానిటేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న క రోనా మహమ్మారి బారిని కాపాడుకునేందుకు మన పరిసరాల పరిశుభ్రత కొరకు ఈ శానిటేషన్ ప్రతివారం నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని వ్యాపార దుకాణాలు నిర్వహించేవారు, పనిచేసేవారు, కొనుగోలుదారులు ప్రతి ఒక్కరు కూడా విధిగా మాస్కులు ధరించి, చేతులు శానిటైజర్ తో శుభ్రపరచుకోవాలని కోరారు. ఈ శానిటేషన్ పక్రియ కొన్ని నెలల పాటు కొనసాగించడం జరుగుతుందన్నారు.
శీతల గిడ్డంగులు నిర్మాణం చేపట్టాలి
శీతల గిడ్డంగులు నిర్మాణం చేపట్టాలి.
..... కాపు యువజన సంఘం అధ్యక్షులు మంగరాతి చందు.
గోకవరం పెన్ పవర్.
గోకవరం మండలంలో శీతల గిడ్డంగుల నిర్మాణం కోసం కాపు యువజన సంఘం అధ్యక్షుడు మంగరాతి చందు ఆధ్వర్యంలో సంబంధిత అధికారులకు సోమవారం వినతి పత్రం అందజేశారు. అనంతరం చందు మాట్లాడుతూ గోకవరం మండలం ప్రధానంగా వ్యవసాయాధారిత ప్రాంతమని ఈ మండలంలో ఉన్నటువంటి జనాభాలో అధిక శాతం వ్యవసాయ దారులు ఉన్నారని ఈ ప్రాంతంలో ప్రధానంగా పండించే వ్యవసాయ ఉత్పత్తులు వరి ,మొక్క జొన్నలు, అపరాలు, జీడిమామిడి పిక్కలు, మొదలగునవి . ఇటు వంటి వ్యవసాయ ఉత్పత్తులను అననుకూల వాతావరణ పరిస్థితుల నుండి రక్షించుకొనుటకు మరియు రైతుకు గిట్టుబాటు ధర వచ్చే వరకు పంట ఉత్పత్తిని నిల్వ చేయుటకు, తగిన ఏర్పాట్లు లేని కారణం చేత , ఒక్కొక్కసారి కష్టపడి పండించిన పంట అంతా వర్షానికి తడిసి పోవడం మరియు పంటను తక్కువ ధరకు అమ్ముకోవడం వంటి కారణాల చేత రైతులు ఆర్థిక నష్టాలు పొందడమే కాకుండా ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఇటువంటి దుర్భర పరిస్థితి నుండి దేశానికి అన్నం పెట్టే రైతన్నను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని కావున సంబంధిత ప్రభుత్వ అధికారులు ముందుకు వచ్చి రైతులు కష్టపడి పండించిన పంటను నిల్వ చేసుకునేందుకు అవసరమైన శీతల గిడ్డంగుల నిర్మాణం పనులు గోకవరంలో ప్రారంభించాలని సంబంధిత అధికారులు గోకవరం మండల డిప్యూటీ తహసీల్దార్ దివ్యభారతి కు, మండల అభివృద్ధి అధికారిిిికె. కిషోర్ కుమార్ కు, మండల వ్యవసాయ అధికారి కు,గోకవరం గ్రామపంచాయతీ కార్యదర్శి టి. శ్రీనివాస రావు కు కాపు యువజన సంఘం సభ్యులు వినతిపత్రాన్ని అందజేశారు .ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోట సాయిబాబు కార్యదర్శి దోసపాటి సుబ్బారావు కోశాధికారి డాక్టర్ బాబు ఉప కోశాధికారి ఆచంట బాబురావు సంఘ సభ్యులు మైపాల పాండు మింది నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం
125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాం ఏర్పాటు...
పెన్ పవర్ ముమ్మిడివరం
విజయవాడ స్వరాజ్ మైదానంలో 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నందుకు కృతజ్ఞతగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి మరియు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్న దళిత సంఘ నాయకులు.
గుట్కా ప్యాకెట్లు స్వాధీనం ఓ వ్యక్తి అరెస్టు
గుట్కాలను స్వాధీన
వ్యక్తి పై కేసు నమోదు
తాళ్ళపూడి, పెన్ పవర్:
ఆదివారం తాళ్లపూడి గ్రామంలో గుట్కాలు, ఖైనీలు అమ్ము వ్యక్తుల ఇల్లు, షాపులు రైడ్ చేశామని యస్.ఐ. జి.సతీష్ తెలిపారు. వారికి రాబడిన సమాచారం మేరకు ఉప్పాల శ్రీనివాసు ఇంటి వద్ద తమ సిబ్బందితో రైడ్ చేయగా ప్రభుత్వంచే నిషేధించబడిన, 1957 ప్యాకెట్లు ఖైని మరియు గుట్కాలను స్వాధీన పరుచుకొని, సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గుట్కాలను, ఖైనీలను అమ్మవద్దని తెలిపారు. దీనివలన ప్రజల ఆరోగ్యo చెడిపోతుందని తెలిపారు.అమ్మిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...