పోలవరం పెన్ పవర్
పోలవరం మండలం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద వైసిపి పోలవరం మండలం అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ సోమవారం వైసిపి మండల నాయకులు, డాక్టర్ జి వి జి కే సుధాకర్ లతో కలిసి 104 అంబులెన్స్ ను ప్రారంభించారు. అనంతరం బుగ్గా మురళీకృష్ణ మాట్లాడుతూ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు వైద్యం అందాలనే ఉద్దేశంతో 108, 104 ప్రారంభించడంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి 108, 104 సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని అన్నారు. అంతటి విలువైన 108, 104 అంబులెన్స్ లను గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో షెడ్ లకే పరిమితం చేసింది అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటం లో ప్రజాదరణ పొందిన 108, 104 అంబులెన్స్ లను రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి పునః ప్రారంభించడంతో పోలవరం మండలంలోని ప్రజలకు 104 అధునాతన టెక్నాలజీతో అంబులెన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. బాలింతల డెలివరీ, యాక్సిడెంట్ మొదలగు అనారోగ్య సమస్యలు ఉన్నవారు 104 అంబులెన్స్ కు కాల్ చేసి 104 సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి పోలవరం మండలం అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ, డాక్టర్ జి వి జి కే సుధాకర్, ఏలూరు పార్లమెంటరీ జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి పాదం రాజబాబు, వైసిపి మండల నాయకులు అల్లు జగన్మోహన్, జి అనిల్ కుమార్, ఆకుల సత్యనారాయణ, సూరి చంద్రం తదితరులు పాల్గొన్నారు.