Followers
వేoకటాపురం గ్రామంలో ప్రతి ఇంటికి శానిటైజర్ బాటిల్స్ పంపిణీ
మిస్టర్ లోన్లీ సినిమా పోస్టర్ ఆవిష్కరించిన ఎంపీ ఎం వి వి సత్యనారాయణ.
అంతరించిపోతున్న అడ్డాకుల చెట్లు
మా మోర ఆలకించండి సారూ..
ఎస్. ఐ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన
ఎస్. ఐ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన
ఐ.పోలవరం మండలం
కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఎదుర్లంక చెక్ పోస్ట్ వద్ద ఎస్.ఐ.రాము అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్న వారితో ఫ్లకార్డులు చేతపట్టించారు.ప్రజలు మాస్కులు తప్పకుండా ధరించాలి,సామాజికదూరం పాటించాలంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసారు.
పద్మనాభం 21 వ వర్ధంతి కాంగ్రెస్ ఘన నివాళులు.
పద్మనాభం 21 వ వర్ధంతి కాంగ్రెస్ ఘన నివాళులు.
రాజోలు, పెన్ పవర్
రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ప్రజా నాయకుడు స్వర్గీయ శ్రీ పంతం పద్మనాభం గారి 21 వ వర్ధంతి సందర్భముగా రాజోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.ఆయన జిల్లాకే కాక రాష్ట్రానికి కులమతాలతో సంబంధం లేకుండా ఆయన ఎన్నో సేవలు చేశారని మెట్ట ప్రాంతంలో పంతం వారు కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు రుద్రరాజు గోపాలకృష్ణ రాజు లక్కవరంలో జరిగిన కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమములో కూనపు రెడ్డి కృష్ణ ,అల్లూరి మధు రాజు, చిలకపాటి శ్రీధర్ , అప్పన శ్రీ రామకృష్ణ, గెడ్డం వెంకటేశ్వరరావు,పెచ్చెట్టి పండు, అప్పారి శ్రీను, పెచ్చెట్టి శివశంకర్ తిరుమల గవర్రాజు, వలవల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ర్యాలి... గ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చెయ్యాలి
ర్యాలి... గ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చెయ్యాలి
పెన్ పవర్, ఆత్రేయపురం
మండలం రాష్ట్రంలో కొత్తగా జూనియర్ కళాశాలలు ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నందున కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం ర్యాలి గ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఆత్రేయపురం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసునూరి వెంకటరాజు( గబ్దర్ సింగ్) డిమాండ్ చేశారు. ఆదివారం ర్యాలి గ్రామ టిడిపి అధ్యక్షులు మెర్ల నాగేశ్వరరావు స్వగృహం వద్డ ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.వెయ్యి మంది విద్యార్థులు కలిగిన ర్యాలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోనే కళాశాల నిర్వహణకు గతంలోనే అధికారులు నివేదికలు సిద్దం చేశారని తెలిపారు.ఆత్రేయపురం మండలంలో 10వేలు జనాభా కలిగిన అతి పెద్ద గ్రామం ర్యాలిలోని విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టకొని జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.మండలంలో పూర్తి స్థాయిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక పోవడంతో అధిక ఫీజులు చెల్లించి ప్రయివేటు కళాశాలలో చదవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.మండలంలో జూనియర్ కళాశాల అందుబాటులో లేకపోవడంతో 10తరగతి తరువాత ఆడపిల్లలు చదువులు ఆపేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. పలు గ్రామాలకు కూడలిగా ఉన్న ర్యాలి గ్రామంలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని తెలుగు దేశం పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి చిటికెన సత్యనారాయణ ,మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు పాలింగి రవిచంద్ర,నాయకులు గార్లపాటి గోపాలకృష్ణ, ముత్యాల బాబ్జి,ముళ్ళపూడి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...