పోలవరం నిర్వాసితుల సమావేశం రసాభాస
- నిర్వాసితుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లాలి
పెన్ పవర్ కూనవరం.
పోలవరం నిర్వాసితుల అఖిలపక్ష సమావేశాన్ని కూనవరం జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం నాడు నిర్వహించారు. ఈ సమావేశానికి కె ఎస్ ఎస్ ప్రసాద్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైయస్సార్ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆవుల మరియదాసు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ముంపు మండలాలలో పర్యటించినప్పుడు 1,15,000 రూపాయలు నష్ట పరిహారం తీసుకున్న వారికి ఐదు లక్షలు, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఆరు లక్షల ముప్పై ఐదు వేలును మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని ఆనాడు ప్రకటించడం జరిగిందని తెలిపారు. పోలవరం ముంపుకు గురవుతున్న ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడంలో ప్రప్రధమంగా మా పార్టీ తరఫున డి సి సి చైర్మన్ అనంత బాబు, ఎమ్మెల్యే ధనలక్ష్మి ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి సమస్యను పరిష్కరిస్తామని సూచించారు. అనంతరం టిడిపి సీనియర్ నాయకుడు ఎడవల్లి భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రాజెక్టు వలన సర్వం కోల్పోతున్నారు కనుక నివసించడానికి ఐదు సెంట్ల భూమి, 15 లక్షల రూపాయలు ఆర్ అండ్ ఆర్, వ్యవసాయం చేసుకోవడానికి అనుకూలంగా ఉండే భూమి ఇవ్వాలని కానీ ప్రభుత్వం రెండున్నర సెంట్లు ఇంటి స్థలం మాత్రమే ఇస్తే ఏం సరిపోతుందని సర్వం కోల్పోతున్నారు కనుక ఎంత ఇచ్చినా తక్కువేనని అన్నారు. గత ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు నిర్వాసితులు గుర్తుకు రాలేదా అని వైసిపి నాయకులు నిలదీయడంతో సభ అంతా గందరగోళంగా తయారైంది. అనంతరం వైసీపీ నాయకులు సమావేశం నుండి నిష్క్రమించారు. అనంతరం బిజెపి సీనియర్ నాయకులు నోముల రామారావు, సిపిఐ డివిజన్ కార్యదర్శి మండా దుర్గాప్రసాద్, సిపిఐ మాజీ ఎంపీటీసీ కొమరం పెంటయ్య మాట్లాడుతూ ప్రాజెక్ట్ కోసం సర్వం త్యాగం చేస్తున్నాను కనుకపార్టీలకతీతంగా మనయొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లడం లో ప్రతి ఒక్కరూ కృతనిశ్చయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాలం సీతారామయ్య, దీకొండ రమణ, కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ శ్రీమంతుల వెంకటరమణ, మేకల నాగేశ్వరరావు, దీకొండ గంగాధర్,