క్వారంటైన్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి. ముత్తంశెట్టి శ్రీనివాస రావు .
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
నగరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం మహిళా ఇంజనీరింగ్ కళాశాల వసతి గృహంలో నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్ ను ఆదివారం మధ్యాహ్న భోజన సమయంలో మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
సెంటర్ లో సౌకర్యాలపై వారి అభిప్రాయాన్ని, అడిగి తెలుసుకున్నారు. భోజన నాణ్యతపై, ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ విమానాల లో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులను పరీక్ష చేసిన అనంతరం నెగిటివ్ వచ్చినవారిని ఐ సి ఎం ఆర్ మార్గదర్శకాల మేరకు 14 రోజులపాటు తప్పనిసరిగా క్వారంటైన్ లో ఉంచుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని సదుపాయాలను కల్పించి, పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్టు తెలిపారు. క్వారంటైన్ కేంద్రాలలో ఆహారాన్ని పరిశీలించడం జరిగిందని,భోజనం చాలా బాగుందని అన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఏపీలో అధికంగా టెస్ట్ లు చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా 64 క్వారంటైన్ కేంద్రాలు లలో మెరుగైన వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ నాలుగు నెలలు లో 16000 మంది క్వారంటైన్ కేంద్రాలు నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో క్వారంటైన్ సెంటర్లను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ, రెవిన్యూ, పోలీసు, జీవీఎంసీ సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు ప్రస్తుతం జిల్లాలో 2186 మంది క్వారంటైన్ సెంటర్లలో ఉన్నారని తెలిపారు. నగరంలో కంటోన్మెంట్ జోన్ల కట్టడి పై సమీక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు తప్పనిసరి అయితే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని, ఒకవేళ వచ్చినా భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ను ధరించాలని, శానిటైజర్ లను వినియోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల రెడ్డి, ఆర్ డి ఓ పి. కిషోర్, వైద్య ఆరోగ్యశాఖ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ దేవి మాధవి, క్వారంటైన్ సెంటర్ డాక్టర్ శబ్నం, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.