Followers

ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ గా పిట్టా నాగమణి


ఐ హెచ్ ఆర్ సి జిల్లా వైస్ చైర్మన్ గా పిట్టా నాగమణి



అన్నవరం  అంతర్ జాతీయా హ్యోమన్ రైట్స్ (ఐ హెచ్ ఆర్ సి) తూర్పుగోదావరి జిల్లా వైస్ చైర్మన్ గా శ్రీమతి పిట్టా నాగమణి ని జిల్లా చైర్మన్ పఠాన్ అహ్మద్ వలీఖాన్ అధ్వర్యంలో జగ్గంపేట యూటియఫ్ భవనంలో జరిగిన సమావేషంలో ప్రకటించినారు అనంతరం పఠాన్ అహ్మద్ వలీఖాన్ మాట్లాడుతు అంతర్ జాతీయా హ్యోమన్ రైట్స్ మహిళలపై జరిగే అత్యచారలు అరికటేందుకు కృషిచేస్తుంది ఈ కమిటిలో ప్రజలకు స్వతహగా సేవచేసెటువంటి వారి ని తిసుకుంటుంన్నారు మండల స్దాయి నియోజకవర్గ కమిటి లు కూడాఏర్పటు చేయాడం జరిగుతుందిఅని అన్నారు. పిట్టా నాగమణి మాట్లాడుతు ఖాన్ గారు నామీద పెట్టినటువంటి బాధ్యతను నేను సక్రమంగా నేరవర్తిస్థానని మహిళల పట్ల ఎక్కడ అన్యాయంజరిగిన ముందు ఉండి వారికి సహకరిస్తానని నాకు వైస్ చైర్మన్ బాధ్యతను ఇచ్చిన ఖాన్ గారికి నాకృతఙ్ఞతలు చేలియా చేస్తున్నాను అని అన్నారు.


ఘనంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు జన్మదిన వేడుకలు



 


ఘనంగా ఎమ్మెల్యే కన్నబాబు రాజు జన్మదిన వేడుకలు


 



         మునగపాక, పెన్ పవర్



మునగపాక:యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే యు.వి రమణ మూర్తి రాజు(కన్నబాబు రాజు)జన్మదిన వేడుకలను మండల వైసీపీ నాయకులు కాడ్రేగుల నూకరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.పార్టీ కార్యాలయంలో స్థానిక వైసీపీ నాయకులు మరియు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యే రమణ మూర్తి రాజు కి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు.


ప్రభుత్వ భూములను పరిశీలించిన ఆర్డీవో లక్ష్మీప్రసన్న...

 


ప్రభుత్వ భూములను పరిశీలించిన ఆర్డీవో లక్ష్మీప్రసన్న...


అవసరమైతే కొనుగోలు చేయండి ఆర్డిఓ



పోలవరం పెన్ పవర్


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఆగస్టు 15 వరకు వాయిదా పడటంతో పూర్తిస్థాయిలో లేఅవుట్లు సిద్ధం కానీ   పోలవరం మండలం గూటాల గ్రామంలో  నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి అవసరమైన భూములను జంగారెడ్డిగూడెం ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న శుక్రవారం పరిశీలించారు. గుటాల పంచాయతీ పరిధిలో ఇళ్ల స్థలాలు అర్హులైన 163 మంది లబ్ధిదారులకు గాను గూటాల గ్రామం కోండ్రు వీధి పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన లే అవుట్ లలో 68  మంది లబ్ధిదారులకు మాత్రమే రావడంతో మిగతా  95 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న  గుటాల ,కొత్త పట్టిసీమ గ్రామాలలో ఉన్న డి ఫామ్ పట్టా భూములు, పోరంబోకు భూములు, ప్రభుత్వ భూములను పరిశీలించారు. కొండ ప్రాంతంలో గల భూములు, చెరువు భూములు ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించవచ్చని ప్రజలకు అనువుగా ఉండే భూములు ప్రభుత్వ నిబంధనల మేరకు అవసరమైన రెండు ఎకరాల భూమిని కొనుగోలు చేసి అయినా లేఅవుట్లు ఏర్పాటు చేయాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. ప్రభుత్వం పంపిణీ చేసే నాటికి పూర్తి స్థాయిలో లేఅవుట్లు పూర్తి చేయాలని ఆర్ డి ఓ అన్నారు. ఆర్డీవో వెంట పోలవరం ఎమ్మార్వో ఎండి నజీముల్లా షా , ఆర్ఐ కాజా రమేష్, వీఆర్వో ప్రసాద్, స్సర్వేరియర్ హరికృష్ణ, సుంకర అంజిబాబు, సుంకర కొండబాబు, డి హరి రామ కృష్ణ, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 


ఘనంగా  ఎంప్లాయీస్ యూనియన్ 69 వ అవిర్భవ దినోత్సవ వేడుకలు


ఘనంగా  ఎంప్లాయీస్ యూనియన్ 69 వ అవిర్భవ దినోత్సవ వేడుకలు
 
గోకవరం పెన్ పవర్.


గోకవరం ఆర్టీసి డిపో నందు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం వద్ద ఎంప్లాయిస్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కార్మికులు  సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కార్మికులు ఆధ్వర్యంలో  ఆవిర్భావ కేకును కట్ చేసి  కార్మికులు పంచిపెట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 1952 సంవత్సరములో జూలై 11వ తేదీన ఎంప్లాయిస్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంస్థగా రాష్ట్రంలో ఆవిర్భవించినది. అప్పటినుండి  కార్మికుల ఎన్నో సంక్షేమ లు, ఉద్యోగ భద్రత కల్పించడంలో కీలక పాత్ర వహించి ప్రభుత్వ ఉద్యోగు లతో సమాన వేతనాలు ఇప్పించి కార్మికులందరూ అందరిలో వెలుగులు నింపిందని కొనియాడారు. ఈ సందర్భంగా  ఎంప్లాయిస్ యూనియన్ గోకవరం డిపో కార్యదర్శి పైడి మల్ల లక్ష్మణరావు మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ లో కార్మికుల పక్షాన పోరాడుతూ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో ఎప్పుడూ ముందుండే యూనియన్ అని తెలిపారు .ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మికులు పాలపర్తి నారాయణరావు, మంగరాతి నాగేశ్వరరావు అక్కి రెడ్డి కృష్ణ, దేవుడు శ్రీను ప్రగడ ప్రసాద్ మహిళా ఉద్యోగులు గ్యారేజ్ కార్మికులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.


గీతం ఆస్పత్రిలో సినీ స్టెప్పులేసిన  కరోనా రోగులు.


గీతం ఆస్పత్రిలో సినీ స్టెప్పులేసిన  కరోనా రోగులు.
కోవిడ్_19 ఆస్పత్రిలో కొరవడిన  అధికార్లపర్యవేక్షణ.
ఆందోళన చెందుతున్న  కొత్త రోగులు.


      బ్యూరో ఛీప్ విశాఖపట్నం, పెన్ పవర్ 


నగరంలోని గీతం కోవిడ్ 19 ఆస్పత్రిలో పలువురు కరోనా పాజిటివ్ రోగులు సినీ స్టెప్పులేసి సందడి చేశారు. మాయలోడు చిత్రంలోని చినుకు చినుకు  అనే పాటకు  చిందులేశారు. పెద్ద జాలరి పేట కు చెందిన పలువురుకి కరోనా పాజిటివ్ నమోదు కావడంతో వారిని గీతం కోవిడ్19 ఆస్పత్రి నైన్త్ బ్లాక్ లో  వైద్యం అందిస్తున్నారు. శనివారం వారు  చినుకు చినుకు అనే పాటకు స్టెప్పులేసి చిందులేశారు. సినిమా  రికార్డు వేసుకొని బహిరంగంగా  డాన్స్ లు  చేస్తున్న అధికారుల్లో చలనం లేదు. ఆస్పత్రిలో పర్యవేక్షణ కనిపించడం లేదు. రోగులు విచ్చలవిడిగా  చిందులేసే పరిస్థితి విమర్శలు వినిపిస్తున్నాయి.కోవిడ్ 19 ఆస్పత్రుల్లో   నిబంధనలు  కట్టుదిట్టంగా అమలు జరుగుతున్నాయని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఆస్పత్రుల్లో  అధికారుల పర్యవేక్షణ ఏ మేరకు అన్నది  గీతంలో రుజువైంది. పెద్ద జాలరి పేట కు చెందిన సుమారు ఎనిమిది మంది కరోనా పాజిటివ్  రోగులు  చిందులు వేయడంతో ఆసుపత్రిలో ఉన్న మిగిలిన రోగులు ఆందోళనకు గురయ్యారు. ప్రశాంతమైన వాతావరణంలో  ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ  వైరస్ తగ్గేవరకు క్రమశిక్షణతో ఉన్న రోగులు   పేద జాలరి పేట రోగుల  నిర్లక్ష్యానికి ఆందోళన చెందుతున్నారు. రోగుల చిందులాట వీడియో వైరల్ అయ్యి విస్మయం కలిగిస్తుంది.


భవనంపై నుంచి దూకి ఆటోడ్రైవర్ ఆత్మహత్య.


భవనంపై నుంచి దూకి ఆటోడ్రైవర్ ఆత్మహత్య.



ఆరిలోవ/ విశాఖపట్నం,  పెన్ పవర్



ఆరిలోవ శ్రీకాంత్ నగర్ శనివారం ఉదయం  భవనం పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే  శ్రీకాంత్ నగర్ లో నివాసముంటున్న  భూతల శ్రీను మహేష్ 48 అనే ఆటో డ్రైవర్ నాలుగు అంతస్తుల  భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనాలాక్ డౌన్ కారణంగా  ఆటో సర్వీసులు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు. దీనికితోడు ఆటో  ఈ ఎం  ఐలు  కట్టడానికి ఇబ్బందులు పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో కుటుంబ పోషణ ఆటో ఈ ఎం ఐ సమస్య ఎదుర్కోలేక భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై ఆరిలోవ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఎమ్మెల్యే కన్న బాబు రాజు ను కలిసి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తాతాజీ


ఎమ్మెల్యే కన్న బాబు రాజు ను కలిసి 
జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన తాతాజీ


          మునగపాక పెన్ పవర్


మునగపాక:యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే,టిటిడి మెంబర్ అయిన యు.వి రమణ మూర్తి రాజు(కన్న బాబు రాజు) 68 వ పుట్టినరోజు సందర్భంగా వెంకటాపురం గ్రామ వైసీపీ నాయకులు సుందరపు తాతాజీ కన్నబాబు రాజు ని కలిసి పుష్ప గుచ్ఛం ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...