Followers

స్పీకర్ తమ్మినేని వెళ్లిపోయిన తర్వాత,  రెండు వర్గాలుగా చీలి కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు


స్పీకర్ తమ్మినేని వెళ్లిపోయిన తర్వాత, 
రెండు వర్గాలుగా చీలి కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు


    శ్రీకాకుళంలో రైతు భరోసా కేంద్రానికి స్పీకర్ శంకుస్థాపన
    చొక్కాలు చిరిగిపోయేలా కొట్టుకున్న వైసీపీ కార్యకర్తలు
    నాయకులు సర్దిచెప్పడంతో సద్దుమణిగిన ఘర్షణ


శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ కార్యకర్తలు రెండు వర్గాలుగా చీలి ముష్టి యుద్ధానికి దిగారు. ఓ వీధి పోరాటాన్ని తలపించేలా కొట్టుకున్నారు. ఇదంతా స్పీకర్ తమ్మినేని సీతారాం ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్లిన అనంతరం జరిగింది. స్పీకర్ తమ్మినేని సీతారాం జిల్లాలోని ఆమదాలవలస మండలం దన్ననపేటలో రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆయన వెళ్లాడో, లేదో స్థానిక వైసీపీ కార్యకర్తల్లో వైషమ్యాలు బట్టబయలయ్యాయి. పోలీసులు ఉన్నా గానీ లెక్కచేయకుండా చొక్కాలు చిరిగిపోయేలా పరస్పరం దాడులు చేసుకున్నారు.   నాయకులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.


ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆయుధాలను పరీక్షించిన డీజీపీ గౌతమ్ సవాంగ్


ఏపీఎస్పీ 6వ బెటాలియన్ లో ఆయుధాలను పరీక్షించిన డీజీపీ గౌతమ్ సవాంగ్


    కమాండో దుస్తుల్లో ఏపీ డీజీపీ
    షార్ట్ వెపన్స్ ను పరిశీలించిన వైనం
    ఫైరింగ్ రేంజ్ లో నైపుణ్యాన్ని పరీక్షించుకున్న సవాంగ్


ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్ కు చెందని ఫైరింగ్ రేంజ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా గౌతమ్ సవాంగ్ కమాండో దుస్తుల్లో కొత్తగా కనిపించారు. ప్రత్యేక బలగాలకు అందించే అత్యాధునిక షార్ట్ వెపన్స్ ను ఆయన పరీక్షించారు. ఓ అత్యాధునిక తుపాకీని లక్ష్యానికి ఎక్కుపెట్టి పలు రౌండ్లు కాల్చారు. అంతేకాదు, ఎడమ చేత్తో పిస్టల్ పట్టుకుని తన నైపుణ్యాన్ని పరీక్షించుకున్నారు


వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో ఠాకూర్లపై  మండిపడుతున్న బ్రాహ్మణులు


వికాస్‌దూబే ఎన్‌కౌంటర్‌తో ఠాకూర్లపై 
మండిపడుతున్న బ్రాహ్మణులు



ఉత్తరప్రదేశ్‌లో కుల రాజకీయం అన్ని రాజకీయపక్షాలకు అచ్చొచ్చిన అంశం! కుల రాజకీయ ప్రయోగాలు సదా విజయం సాధిస్తూనే ఉంటాయక్కడ! గత పాతికేళ్లుగా అక్కడ సాగుతున్నవి అవే! ఇప్పుడు వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌తో మరోసారి కులాల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది..


 మొదట్నుంచి అక్కడ ఠాకూర్లకు, బ్రాహ్మణులకు పడదు.. అసలు ఠాకూర్‌ సామాజికవర్గమైన యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చొబెట్టినప్పుడే చాలా మంది బ్రాహ్మణులు ముఖం మార్చుకున్నారు.. ఇప్పుడు వికాస్‌ దూబే ఎన్‌కౌంటర్‌తో బ్రాహ్మణ సామాజికవర్గం యోగిపై కారాలు మిరియాలు నూరుతోంది.. ఎన్‌కౌంటర్‌ చేసింది వికాస్‌దూబే అనే గ్యాంగ్‌స్టర్‌ను కాదని, బ్రాహ్మణ గౌరవ ప్రతిష్టలను అని సోషల్‌ మీడియాలో యూపీ బ్రాహ్మణ వర్గాలు మొత్తుకుంటున్నాయి. బ్రాహ్మణ సామాజికవర్గానికి అమితంగా ప్రేమించే, గౌరవించే పులిలాంటి వ్యక్తిగా వికాస్‌ దూబేను కీర్తిస్తున్నాయి. అక్కడితో ఆగకుండా పరుశురాముడి ప్రతినిధి అంటూ ప్రస్తావిస్తున్నాయి.


గుడ్‌ న్యూస్‌: కరోనా చికిత్సకు మరో ఔషధం


గుడ్‌ న్యూస్‌: కరోనా చికిత్సకు మరో ఔషధం


అనుమతించిన డీసీజీఐ


దిల్లీ:


 కరోనా చికిత్సలో వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) మరో ఔషధానికి అనుమతులిచ్చింది. చర్మ వ్యాధి అయిన సొరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే ‘ఇటోలీజుమ్యాజ్‌’ ఇంజెక్షన్‌ను ‘పరిమితం చేసిన అత్యవసర వినియోగం’ కింద వాడేందుకు అంగీకరించింది. మోతాదు నుంచి తీవ్ర స్థాయి లక్షణాలతో బాధపడుతున్న కొవిడ్‌ రోగులకు దీన్ని ఇవ్వొచ్చని తెలిపింది. 


కరోనా చికిత్సలో ఉన్న పరిమితులను దృష్టిలో ఉంచుకొని ఇటోలీజుమ్యాజ్‌కు డీసీజీఐ డాక్టర్‌ వి.జి.సొమానీ అనుమతిలిచ్చినట్లు అధికారులు తెలిపారు. భారత్‌కు చెందిన బయోకాన్‌ సంస్థ దీన్ని తయారు చేస్తోంది. కొవిడ్‌పై పోరాడే యాంటీబాడీల ఉత్పత్తిలో కీలకంగా పనిచేసే సైటోకిన్ల విడుదలలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రోగులపై చేసిన ప్రయోగాల్లో సంతృప్తికర ఫలితాలు వచ్చిన తర్వాతే దీనికి అనుమతులిచ్చినట్లు డీసీజీఐ అధికారులు తెలిపారు. ఎయిమ్స్‌కు చెందిన పలువురు వైద్య నిపుణులు ఈ ప్రయోగాల్ని పర్యవేక్షించినట్లు వెల్లడించారు. అనేక సంవత్సరాలుగా దీన్ని సోరియాసిస్‌ చికిత్సలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. అయితే, దీన్ని తీసుకోవడానికి బాధితులు రాతపూర్వకంగా అంగీకారం తెలపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా సోకిన వారిలో ‘ఇటోలీజుమ్యాబ్‌’ ప్రభావవంతంగా పనిచేస్తోందని ముంబయిలోని నాయిర్‌ ఆస్పత్రి మే నెలలోనే ప్రకటించింది. ఇద్దరు రోగులకు దీన్ని అందించగా వెంటిలేటర్‌ దశ నుంచి సాధారణ స్థితికి చేరుకున్నట్లు వెల్లడించింది. బృహత్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌(బీఎంసీ)లోని ఆస్పత్రుల్లో ప్రయోగ పూర్వకంగా వాడేందుకు ‘ఇటోలిజుమ్యాబ్‌’ను ఉచితంగా ఇస్తామని ఆ సంస్థ బయోకాన్‌ ఛైర్‌పర్సన్‌ కిరణ్‌ మజుందార్‌ షా అప్పట్లో ప్రకటించారు. ముందు రోగుల కాలేయం, కిడ్నీల పనితీరును పరీక్షించిన తర్వాతే ఈ మందు ఇస్తారు. కొందరు రోగులకు ఒకడోసు సరిపోతుండగా.. మరికొందరికి మూడు డోసుల దాకా ఇవ్వాల్సి వస్తోందని అప్పట్లో నాయిర్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కరోనా చికిత్సలో రెమిడెసివిర్‌, ఫవిపిరవిర్‌ వంటి ఔషధాలు ప్రభావవంతంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. వీటిని పలు కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. అలాగే కరోనా సోకకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యుల పర్యవేక్షణలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను సైతం వాడొచ్చని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) ప్రకటించిన విషయం తెలిసిందే


ఘనంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్  69 వ ఆవిర్భావదినోత్సవం


ఘనంగా ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ 

69 వ ఆవిర్భావదినోత్సవం

 

పెన్ పవర్ మార్కాపురం టౌన్

 

            మార్కాపురం డిపో వద్ద ఎంప్లాయిస్ యూనియన్ 69వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిపో కార్యదర్శి సిహెచ్ జనార్ధనరావు పతాక ఆవిష్కరణ చేసినారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిపో కార్యనిర్వాహక అధ్యక్షులు సోమయాజుల శాస్త్రి మాట్లాడుతూ ఆర్టీసీలో కార్మికుల కోసం నిత్యం పోరాడే యూనియన్ గా మరియు ప్రభుత్వంలో విలీనం అనంతరం

 సంస్థ అభివృద్ధి కోసం పోరాడుతూ కోవిడ్ -19 కోసం యూనియన్ సభ్యులు కూడా తమ వంతు సేవ చేస్తూ ఉన్నారు.

 సంస్థ అభివృద్ధి కోసంపోరాడుతూ, గుర్తింపు సంఘంగా కొనసాగుతున్న యూనియన్ ఆర్టీసీ నుండి పిటీడీ గా మారిన తర్వాత కూడా అమరావతి ఉద్యోగ సంఘాల జేఏసీ తో కలిసి ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళుతున్న ది. ఈ కార్యక్రమంలో సిసిఎస్ డెలిగేట్ దయా సాగర్, నాని, డిపో అధ్యక్షులు బి వెంకటేశ్వర్లు, రహమత్, తాడి శ్రీను, లాబాను, మండ్ల. కాశయ్య, మహిళా ఉద్యోగులు వరలక్ష్మి, జరీనా బేగం, గ్యారేజి అధ్యక్ష కార్యదర్శులు ఇక్బాల్ భాష, ఫ్రాన్సిస్ లతో పాటుగా అత్యధిక మంది పాల్గొన్నారు.

మన్నేటికోట లో 30 మందికి కరోనా టెస్టులు 


మన్నేటికోట లో 30 మందికి కరోనా టెస్టులు 


ఉలవపాడు, పెన్ పవర్

 

మండల పరిధిలోని మన్నేటికోట గ్రామపంచాయతీ కార్యాలయం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో డాక్టర్ కే శ్రీనివాసరావు మరియు సిబ్బందితో కలిసి మన్నేటికోట గ్రామం లో 28 మందికి ఆత్మకూరు గ్రామానికి చెందిన ఇద్దరికీ  కరోనా టెస్ట్ లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అల్తాఫ్ ఏఎన్ఎంలు పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


సౌందర్యంతోపాటు  సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి!



సౌందర్యంతోపాటు 

సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి!

 

- పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై మరింతగా దృష్టిపెట్టాలి

 

-భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలి

 

-నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం (అర్కిటెక్చర్) కూడా ఒకటి

 

-స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలి

 

-ఐఐఏ జాతీయ సదస్సులో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

 

(న్యూఢిల్లీ నుంచి పెన్ పవర్ ప్రత్యేక ప్రతినిధి)

 

పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై భారతదేశ నిర్మాణరంగ నిపుణులు (ఆర్కిటెక్ట్ లు) మరింత దృష్టిపెట్టాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. భవన నిర్మాణరంగంలో సౌందర్యంతోపాటు సౌకర్యాన్ని సమ్మిళితం చేసి ప్రజల జీవితాలను మరింత ఆనందమయంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దేందుకు తమవంతుగా కృషిచేయాలన్నారు.

 

శనివారం భారతీయ నిర్మాణరంగ నిపుణుల సంస్థ జాతీయ సదస్సు (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ నాట్‌కాన్ 2020 - ట్రాన్సెండ్) ను ప్రారంభించిన అనంతరం ఆన్‌లైన్ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు. ‘నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం కూడా ఒకటి. సింధు నాగరికత, తర్వాతి కాలంలో కోణార్క్ దేవాలయం మొదలుకుని.. ఆధునిక నిర్మాణాల వరకు భారతీయ నిర్మాణ విజ్ఞానంలో స్థానిక శిల్పుల నైపుణ్యత, వినియోగించిన సామాగ్రి, సాంకేతిక విజ్ఞానం పాత్ర చాలా ప్రత్యేకం. ఈ కట్టడాలే మన నిర్మాణరంగ కౌశలానికి నిదర్శనం’ అని పేర్కొన్నారు. నిర్మాణరంగంలో ఆత్మనిర్భరతను సాధించే క్రమంలో.. మన ప్రాచీన, సంప్రదాయ కట్టడాల వారసత్వ నిర్మాణశైలిలోని గొప్పదనాన్ని అవగతం చేసుకుని, పర్యావరణహితాన్ని మదిలో ఉంచుకుని ప్రజల అవసరాలకు సరిపోయే విధంగా నిర్మాణాలు చేపట్టడంపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టుల విషయంలో పునరుత్పాదక శక్తి వినియోగించడాన్ని కూడా ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు.

 

కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘స్మార్ట్ సిటీస్’, ‘అందరికీ ఇళ్లు’ వంటి కార్యక్రమాలను ప్రశంసిస్తూ.. ఈ పథకాల అమల్లో భాగంగా.. ఆయా ప్రాంతాల్లోని సంస్కృతి, సంప్రదాయాలకు తగిన గౌరవం ఇవ్వాలన్నారు. ఇందుకోసం స్థానిక కళాకారులు, శిల్పుల భాగస్వామ్యంతో ముందుకెళ్లాలన్నారు. ఆయా ప్రాంతాల్లో చేపట్టే ఇతర ప్రాజెక్టుల విషయంలోనూ స్థానికుల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. వారి అవసరాలకు తగ్గట్లుగా ప్రాజెక్టులను పూర్తిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

 

‘పట్టణాల్లో వర్షాకాలం వస్తే రోడ్లపై, కాలనీల్లో నీరు నిలిచిపోతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రభావవంతమైన డ్రైనేజీ వ్యవస్థ ద్వారా ఈ సమస్యలకు సరైన పరిష్కారాన్ని సూచించేందుకు ప్రయత్నించాలి’ అని ఉపరాష్ట్రపతి వారికి సూచించారు. 

 

కరోనా మహమ్మారి కారణంగా ప్రజారోగ్యం, వారి జీవన విధానంతోపాటుగా.. నిర్మాణరంగం కూడా ప్రభావితమైందన్నారు. కరోనా తదనంతర పరిస్థితులు, సమస్యల పరిష్కారానికి వినూత్నమైన ఆవిష్కరణలకోసం చర్చించి మంచి ఫలితాలు సాధించేందుకు ఈ జాతీయ సదస్సు వేదిక కావాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...