ఫ్రెండ్లీ పోలీస్
స్వార్థం లేని పోలీస్ మానవత్వం తెలిసిన పోలీస్ , న్యాయం ధర్మం తెలిసిన పోలీస్, పోలీస్ అంటే ఇలాగే ఉండాలని నిరూపించిన గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు.
ప్రపంచ దేశాల్ని గడగడా లాడిస్తున్న కరోనా వైరస్ నిర్ములన కొరకు గిద్దలూరు లో ఇటీవల కాలంలో జరుగుతున్న లాక్ డౌన్లో గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు సమర్థవంతంగా తన విధులు నిర్వహించారు.
తమ కుటుంబాలను మరియు ప్రాణాలు సైతం పక్కన పెట్టి రాత్రింబవళ్లు కరోనా వైరస్ పై పోరాటం చేసి ఇప్పటి వరకు గిద్దలూరు లోని ప్రజలు వైరస్ భారీ పడకుండా పోలీస్ వ్యవస్థ నుంచి ప్రధాన పాత్ర పోషించారు.
గిద్దలూరు లోని ప్రజలు కరోనా వ్యాధి భారిన పడకుండా ప్రజలకు అవగాహన తీసుకొని వచ్చారు.
గిద్దలూరు లో ప్రజల మన్ననలు పొందిన గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు
సమస్యల కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ప్రజలకు వెంటనే చిరునవ్వుతో ప్రేమతో స్వాగతం పలికి వారి సమస్యలను సానుకూలంగా శాంతియుతంగా పరిష్కారం చేయడం లో దిట్ట అని నిరూపించుకున్నారు. గిద్దలూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రావు కు
సలాం, పోలీస్ సలాం
అంటూ గిద్దలూరు ప్రజలు జీవితాంతం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు, ఈ విధంగా ఇటువంటి వ్యక్తి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేయడం పోలీసులకే కాకుండా ప్రజలకు కూడా చాలా ఆనందంగా ఉందని వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు