Followers

కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు..  ఇంటికే ఉచితంగా కరోనా కిట్..



కరోనా కట్టడిలో జగన్ సర్కార్ దూకుడు.. 
ఇంటికే ఉచితంగా కరోనా కిట్..


    హోం క్వారంటైన్ లో ఉన్నవారికి కిట్ల పంపిణీ
    కిట్ లో మందులు,శానిటైజర్, ఆక్సీమీటర్, మాస్కులు
    కరోనా లక్షణాలు ఎక్కువగా ఉంటే ఆసుపత్రికి తరలింపు


కరోనాపై పోరులో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఉచితంగా కరోనా కిట్లు అందించేందుకు రంగం సిద్ధం చేసింది. కోవిడ్ పేషంట్లు ఇంట్లోనే ఉండి ట్రీట్‌మెంట్ తీసుకునేందుకు ఈ కిట్ ఎంతగానో ఉపయోగపడనుంది. మొదట్లో హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితులకు ఎలాంటి లక్షణాలు లేకపోయినా.. ఆ తర్వాత రెండు, మూడు రోజుల వ్యవధిలో జ్వరం, దగ్గు వంటి లక్షణాలు బయటపడుతున్నాయి. అందుకే వారికి అవసరమయ్యే వాటిని ప్రభుత్వం ఈ కిట్ ద్వారా అందిస్తోంది. ఇప్పటికే దేశంలోనే రికార్డుస్థాయిలో కరోనా శాంపిల్ టెస్టులు చేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ప్రతీ జిల్లాకు కోటి రూపాయల నిధులు మంజూరు చేసి.. కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. అలాగే కరోనా నిర్ధారణ టెస్టింగ్ కోసం ప్రతీ జిల్లాకు నాలుగు బస్సుల చొప్పున ఏర్పాటు చేసింది. కరోనా రోగులకు హోం క్వారంటైన్ పూర్తయ్యే వరకు సరిపోయే మందులను ఈ కిట్ల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ఇందులో మాస్కులు, శానిటైజర్లు, యాంటి బయాటిక్స్, విటమిన్ టాబ్లెట్లతో పాటు ఆక్సిజన్ లెవెల్‌ను చూసుకునేందుకు పల్స్ ఆక్సీమీటర్ లాంటివి ఉంటాయి.


మాడుగుల ఆస్పత్రిలో కరోనా కలకలం





మాడుగుల ఆస్పత్రిలో కరోనా కలకలం


స్టాఫ్ నర్సుకు  కరోనా పాజిటివ్.

 

విధులకు విశాఖ నుంచి రాకపోకలు.


మంగళవారం రాత్రి నైట్ డ్యూటీ చేసిన స్టాఫ్ నర్స్.

వి మాడుగుల _పెన్ పవర్.




 




మాడుగుల సామాజిక ఆరోగ్య కేంద్రంలో కరోనా కలకలం మొదలైంది.  ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న మహిళకు కరోనా  పాజిటివ్ రావడంతో  గ్రామం ఉలిక్కిపడింది. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందినా  ఇంతవరకు ఒక్క కరోనా కేసు మండలం లోకి  చేరలేదు.  కానీ సి హెచ్ సి లో స్టాఫ్ నర్స్ గా విధులు నిర్వహిస్తున్న మహిళ విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తుంది. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి నైట్ డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగి వెళ్ళిన ఆమెకు అనారోగ్యం తలెత్తడంతో వైద్యం కోసం ఆస్పత్రిలో చేరింది. కోవిడ్  19 లక్షణాలు కనిపించడంతో వైద్యులు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. శుక్రవారం ఉదయం ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు చెప్పడంతో  ఈ విషయం  మాడుగుల ఆసుపత్రికి చేరింది దీంతో ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది రోగులు కలకలం చెందారు. అప్రమత్తమైన వైద్యాధికారి  ఆస్పత్రి పరిసరాలు శానిటైజెషన్  చేయించారు. స్టాఫ్ నర్స్ తో విధులు నిర్వహించిన  సిబ్బంది  కాంటాక్ట్ అయిన వారిని హోం క్వారంటైన్ కు పంపారు.  స్టాఫ్ నర్స్  మూడు రోజుల క్రితం వరకు  ఆస్పత్రికి  రాకపోకలు సాగిస్తుంది.ఈమె వద్ద  వైద్యం చేయించుకున్న వారు ఎవరు  అన్నా దిశలో  ఆరా తీస్తున్నారు.గ్రామంలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు అధికారులు విశాఖపట్నం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు.  కోవిడ్19  డైరెక్టర్ అధికారికంగా  ప్రకటించాల్సి ఉంది.




నాటు బళ్ళు కార్మికులకు ఇక్కట్లు


నాటు బళ్ళు కార్మికులకు ఇక్కట్లు


 

అనకాపల్లి

 

అనకాపల్లి పట్నంలో పూడిమడక రోడ్లో నాటు బళ్ళు కార్మికులతో శాసనమండలి సభ్యులు  బుద్ధ నాగ జగదీశ్వరరావు సమావేశంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుక పాలసీ పేరుతో నాటు బండిలో ఇసుక రవాణా చేసే కార్మికులు 14 నెలలుగా పనులు లేక ఇసుక రవాణా సౌకర్యం ప్రభుత్వం అడ్డుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు పశువులకు దాణా కూడా పెట్టలేక పోతున్నావ్ అని కుటుంబ పోషణ కూడా కష్టంగా ఉందని కార్మికులు వాపోయారు . ప్రభుత్వం ఇసుక పాలసీ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాటు బళ్ళు తో గృహ నిర్మాణం చేసుకునేవారికి ఉచితంగా సరఫరా ఉంటుందని ప్రకటన చేసినప్పటికీ అధికార యంత్రాంగం రెవిన్యూ సిబ్బంది పోలీస్ అధికారులు అడ్డుకోవడం జరుగుతుందనారు. ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా అధికారులకు ఆదేశాలు లేకపోవడంవల్ల మేము ఏమీ చేయలేమని సమాధానాలు చెబుతున్నారని వై సి సి శాసనసభ్యులు చోడవరం ప్రాంతంలో ఇసుక రీచ్ ను ప్రారంభించారని అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా అనుమతులు ఇచ్చి కార్మికులకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని నాగ జగదీష్ తెలిపారు రెవిన్యూ డివిజనల్ అధికారి శాసన మండల సభ్యులు మాట్లాడారని సోమవారం లోపు సమాధానం చెబుతామని హామీ ఇచ్చారని  తెలిపారు. అనుమతులు ఇవ్వకపోతే అనకాపల్లి ప్రాంతం తో పాటు మూలపేట తుమ్మపాల ఇతర ప్రాంతాల నాటు బళ్ళు కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మల్ల సురేంద్ర, ఆళ్ల రామచంద్రరావు, అండిబోయినశేష, బొడ్డేడ మురళి , కొయిలాడ గణేష్, నాటు బళ్ళు కార్మికులు కర్రీ దుర్గ అప్పారావు ,బొడ్డేడ రామకృష్ణ, బొడ్డేడ వెంకటేష్ ,పూడి నూకరాజు, మల్ల పూర్ణచందర్రావు, లంక అప్పారావు ,కొణతాల అప్పారావు తుమ్మపాల ప్రాంతం నుండి కొణతాల అప్పారావు పాల్గొన్నారు.


అంబేద్కర్ రాజ గృహంపై దాడి చేసిన దోషులను వెంటనే శిక్షించాలి


అంబేద్కర్ రాజ గృహంపై దాడి చేసిన దోషులను వెంటనే శిక్షించాలి


 


జగ్గంపేట 


 


జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముందుగా పూలమాలతో ఆయనను సత్కరించి దళిత ప్రజ చైతన్యం అధ్యక్షులు వల్లూరి సత్యనంధం అధ్యక్షతన అక్కడ నిరసన తెలియజేసారు ఈ సందర్భంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్రప్రధాన కార్యదర్శి పులి ప్రసాద్ మాట్లాడుతూ ఇటీవల ముంబైలో ని దాదార్ లో అంబేద్కర్ రాజగృహ పై దాడి చేసిన వ్యక్తులను వెంటనే శిక్షించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త పిట్టానాగమణి మాట్లాడుతూ  ప్రపంచ మేధావి  అయినటువంటి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజ గృహంపై వారు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ప్రపంచానికి వెలుగు చూపిన మహానుభావుడు ఆయన మన దేశానికి మహత్తరమైన ఇటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి మహానుభావుడు ఆయన ఆ ఇంటిలో ఎన్నో విలువైన పుస్తకాలు ఉన్నవి వాటిని ఎంతోమంది వెళ్లి ప్రతిరోజు చదువుకుంటున్నారు అటువంటి గొప్ప రాజగృహం పై ఇటువంటి దాడులు చేయడం చాలా దురదృష్టకరం అని అన్నారు ఆయన ఒక కులానికి కాదు అన్ని కులాలకు సంబంధించినటువంటి మహనీయుడు ఆయన రాసిన టువంటి గ్రంథాలను ఎప్పటికీ కూడా అనేకమంది చదువుతూ తెలియని విషయాలు   తెలుసుకుంటున్నారుఅని అన్నారు. ఎం ఆర్ పీ ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ డి వెంటకరమణ మాట్లాడుతు ఎవరైతే దాడి చేశారు వారిని సిబిఐ ఎంక్వైరీ చేసి వారిని కఠినముగా శిక్షించాలి అని శిక్ష పడే అంతవరకూ మా దళిత సంఘాలు పోరాడుతూనే ఉంటాయని అన్నారు  బుంగ సతీష్ కుమార్ మాట్లాడుతు వారు క్షమించరాని  పనిచేశారని అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు పూల మొక్కలను గాని ధ్వంసం చేసి నారు వీరు ఎనకాల ఎవరో ఉండి ఇదంతా చేయించారని వారిని కూడా పట్టుకుని  శిక్ష విధించాలని అన్నారు .ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లుగా నే చూస్తూ ఉన్నారు కానీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ఇప్పటికైనా దళితులపై జరిగిన ఇటువంటి దాడులను ఖండిస్తూ ఈ ప్రభుత్వాలు వారికి కఠిన శిక్షలు విధించాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ఎం డేవిడ్ రాజు చిట్టితల్లి విష్ణ జోషఫ్ పి రవికుమార్ అప్పారావు ఐ రాజ్ కుమార్ దితరులు పాల్గొన్నారు


రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని


 



రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని


 


 


    ప్రత్యామ్నాయ విద్యుత్ గా సౌరశక్తి


    ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థకు రేవా ప్రాజెక్టు నుంచి విద్యుత్


    నిర్మాణం జరుపుకుంటున్న మరికొన్ని ప్రాజెక్టులు



మధ్యప్రదేశ్‌లోని రేవాలోని అల్ట్రా మెగా సోలార్ ప్లాంట్‌ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సౌర విద్యుత్ ప్లాంట్ రేవా అల్ట్రా మెగా సోలార్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. 22 డిసెంబర్ 2017 న మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రాజెక్టుకు పునాది వేసింది. ప్రాజెక్టు ప్రారంభం సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు.. ఆసియాలో అతిపెద్ద అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్ట్ అని అన్నారు. ఇది కేవలం రాష్ట్రానికి మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి పరిశుభ్రమైన వాతావరణానికి పునాది అని అన్నారు. రేవాలో ఏర్పాటు చేసిన పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ప్రాజెక్టును 1590 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైడ్ సోలార్ ప్లాంట్లలో ఒకటి. ఈ సౌర విద్యుత్ ప్లాంట్‌లో మొత్తం మూడు యూనిట్లు ఉన్నాయి. ప్రతి యూనిట్ 250 మెగా వాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తోంది. ఈ ప్రాజెక్టు నుండి వచ్చే విద్యుత్తులో 76 శాతం రాష్ట్ర విద్యుత్ నిర్వహణ సంస్థకు, 24% ఢిల్లీమెట్రోకు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ , ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మంత్రులు, ఎంపిలు, సహా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కనెక్ట్ అయ్యారు. అంతకుముందు శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం సమీక్ష సమావేశాన్ని నిర్వహించి అధికారులకు అవసరమైన సూచనలు ఇచ్చారు.


ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి


ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలి


చింతపల్లి ,  పెన్ పవర్


పాడేరు డివిజన్ పరిధిలోని అన్ని ఏజెన్సీ మండల కేంద్రాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు. ఏజెన్సీ మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు, చిన్న పిల్లలకు ఆధార్ నమోదు కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని గిరిజనులు వాపోతున్నారు. చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో సుమారు 70 కి.మీ. దూరంలో ఉన్న నర్సీపట్నం ఆధార్ సెంటర్ కి వెళ్ళవలసి వస్తుందని, అక్కడ ఆధార్ సెంటర్ ఖాళీ లేకపోతే మరుసటి రోజు వెళ్లడమో లేకుంటే నర్సీపట్నం నకు మరికొంత దూరంలోనున్న రోలుగుంట మండల కేంద్రానికి వెళ్ళడమో చేయవలసి వస్తుందని ఆయా మండలాల గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ తమ మండలాల పరిధిలో ఉన్న ఆధార్ సెంటర్ లకు వెళ్లడానికే అనేక ఇబ్బందులు ఎదుర్కొనే వారమని,ఇప్పుడు సొంత మండలాల్లో ఆధార్ సెంటర్లు లేకపోవడంతో ఆర్థికభారం,శ్రమ అయినప్పటికీ నర్సీపట్నం లేదా రోలుగుంట ఆధార్ సెంటర్ కి వెళ్లక తప్పలేదంటున్నారు. వ్యవసాయ, కూలి పనులు మానుకొని వెళ్ళవలసి వస్తుందని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఏజెన్సీ మండలాల్లో ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని గిరిజనులు కోరుతున్నారు


బోచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో   రోజువారీ కూలీలకు మాస్కులు పంపిణీ


బోచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో  
రోజువారీ కూలీలకు మాస్కులు పంపిణీ


 


 పూర్ణా మార్కెట్, పెన్ పవర్.


దక్షిణ నియోజకవర్గం 35వ వార్డులో తెలుగుదేశం కార్పొరేటర్ అభ్యర్థి బోచ్చ రామిరెడ్డి ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు,  ఈ సందర్భంగా  బోచ్చా రామి రెడ్డి మాట్లాడుతూ వార్డులో కరోనా వ్యాప్తి ఎక్కువ అవుతుండడం వలన, రోజు వారి కూలీలుగా పనిచేస్తున్న వారికి, మాస్కూలూ పంచి,  సోషల్ డిస్టెన్స్ పాటించాలని, మాస్కూలు తప్పకుండా వాడాలని తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమములో మున్నం బాలాజీ, నాయన నాగభూషణం, నాయన వెంకట్రావు, అలుపన శ్రీనివాస్ రెడ్డి, బోచ్చ శంకర్  తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...