Followers

నిజానికి కారు బోల్తా పడలేదు... వికాస్ దూబే 'ఎన్‌కౌంటర్'‌పై అఖిలేశ్ యాదవ్ కామెంట్!


నిజానికి కారు బోల్తా పడలేదు
వికాస్ దూబే 'ఎన్‌కౌంటర్'‌పై అఖిలేశ్ యాదవ్ కామెంట్!



    దూబే ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా 
    అందుకే ఈ చర్యలు తీసుకున్నారు: అఖిలేశ్
    దూబేకు సహకరించిన వారి సంగతేంటి?: ప్రియాంకా గాంధీ
    చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా: ఒమర్ అబ్దుల్లా


గ్యాంగ్‌స్టర్‌ వికాస్‌ దూబేను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చిన విషయం తెలిసిందే. అతడిని ప్రత్యేక వాహనంలో కాన్పూర్‌కు తరలిస్తుండగా అది బోల్తా పడడంతో వికాస్‌ పారిపోయేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తూ అనుమానాలు వ్యక్తం చేశారు. అతడికి బీజేపీ నేతలతో ఉన్న సంబంధాలు బయటపడతాయన్న ఉద్దేశంతోనే ఎన్‌కౌంటర్ చేశారంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


నిజానికి కారు బోల్తా పడలేదని.. అతడి ద్వారా రహస్యాలు బయటపడితే ప్రభుత్వం బోల్తా పడే అవకాశం ఉండడంతో అలా జరగకుండా చర్యలు తీసుకున్నారని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్ చురకలంటించారు. అసలు ఆ గ్యాంగ్‌స్టర్‌ను పోలీసులే పట్టుకున్నారా? అతడే లొంగిపోయాడా? అన్న విషయం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నేరస్తుడు చచ్చిపోయాడు సరే.. మరి అతడు చేసిన నేరాలు, అందుకు సహకరించిన వారి సంగతేంటి? అంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నిలదీశారు. కాగా, దీనిపై జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. 'చనిపోయిన వ్యక్తి ఎలాంటి కథలు చెప్పలేడు కదా' అని ట్వీట్ చేశారు. అందుకే, బతికి ఉన్నవారు ఈ విషయంపై కథలు చెబుతున్నారనేలా ఈ వ్యాఖ్య చేశారు. 


 


నిర్మల సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ 


నిర్మల సీతారామన్‌తో మంత్రి బుగ్గన భేటీ 



 కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తో ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్బంగా రాష్ట్రానికి రావలసిన పెండింగ్ నిధులు సహా పలు కీలక విషయాలపై చర్చించారు. పెండింగ్ నిధులను వీలైనంత త్వరగా విడుదల చెయ్యాలని నిర్మలా సీతారామన్ ను కోరినట్టు తెలుస్తోంది. అనంతరం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డితోను మంత్రి బుగ్గన భేటీ అయ్యారు. అలాగే పెండింగ్ నిధుల విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ అధికారులను బుగ్గన రాజేంద్రనాథ్‌ కలవనున్నట్టు సమాచారం. బుగ్గన వెంట ఏపీ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ్‌ కల్లం, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా ఉన్నారు.  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అనంతరం బుగ్గన రాజేంద్రనాథ్‌ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్బంగా పీడీఎస్, జీఎస్టీ పోలవరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు, విభజన చట్టంలోని అభివృద్ధి పథకాలకు నిధులు, అలాగే పెండింగ్ బకాయిల విడుదల చేయాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి చేయూతగా అదనంగా నిధులు  ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. అభివృద్ధికి సంబంధించిన ప్రతి అంశంపై ముఖ్యమంత్రి ఇచ్చిన వివరణలు కేంద్రానికి ఇచ్చినట్టు తెలిపారు. 3,500 కోట్ల రూపాయల రీయంబర్స్‌మెంట్‌‌ చేయాల్సి ఉందని. పోలవరానికి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను రీయంబర్స్‌మెంట్‌ చెయ్యాలని కోరినట్టు తెలిపారు. కోవిడ్ కారణంగా నిధుల విడుదలలో కొంత ఆలస్యం ఉందని అన్నారు.. కేంద్రం నుంచి జీఎస్టీ బకాయిలు 3500 కోట్లు రావాల్సి ఉందని బుగ్గన తెలిపారు.


మోతుగూడెంలో గంజాయి పట్టివేత



మోతుగూడెంలో గంజాయి పట్టివేత

 

....చింతూరు

 

 

ఈరోజు  సాయంత్రం 5 గంటల ప్రాంతంలో లోమోతుగూడెం ఎస్ఐ గారు సిబ్బంది సుకుమారుడు బ్రిడ్జి దగ్గర వాహనాలు తనిఖీ చేయుచుండగా డొంకరాయి వైపు నుండి లక్కవరం వైపు పోవు AP 05TB 6460 ఆటో ఆపి తనిఖీ చేయగా ఆటో లో ముగ్గురు వ్యక్తులు 60 కేజిల గంజాయి ఉన్నట్లు వారి పేర్లు అడగ్గా 1,కుర్ర రవి చింతూరుచికెన్ షాపు 2,వినోద్ కుమార్ చింతూరు ఆటో డ్రైవరు, మరియు నందిగాం సురేంద్ర  చింతూరు మోటార్ సైకిల్ మెకానిక్ అని ఈ గంజాయిని ఒరిస్సా పప్పు లూరు నుండి భద్రాచలంలో అమ్ముటకు తీసుకొని వెళుతున్నట్లు చెప్పినట్లు వారి వద్ద ఉన్న 60 కేజీల గంజాయిని రెండు సెల్ఫోన్లు ఆటో స్వాధీనపరచుకొని వారి ముగ్గురు నీ అరెస్ట్ చేసి రంపచోడవరం కోర్టుకు హాజరు పరుస్తామని ఎస్సై  తెలిపారు.


ఆలమూరులో వ్యాపార సమయాలు కుదిస్తూ అధికారులు, వ్యాపారస్తులు నిర్ణయం


 



ఆలమూరులో వ్యాపార సమయాలు కుదిస్తూ అధికారులు, వ్యాపారస్తులు నిర్ణయం

 

 

పెన్ పవర్, ఆలమూరు

 

 -ఉదయం ఆరు గంటలు నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వ్యాపారాలు నిర్వహణ.

 

--తదుపరి ఆదేశాలు వచ్చే వరకు పూర్తిగా మార్కెట్ బంద్.

 

--సంత రోజుల్లో మాంసాహారం బంద్.

 

                     ప్రశాంతతకు నిలయమైన మండల కేంద్రమైన ఆలమూరులో గత వారం రోజులుగా కరోనా పాజిటీవ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్న నేపధ్యంలో ఆలమూరు ఎంపిడిఓ జేఏ జాన్సీ, ఎస్సై ఎస్ శివప్రసాద్, మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్, తహశీల్దార్ జవ్వాది వెంకటేశ్వరి ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో  శుక్రవారం వివిధ రకాల వ్యాపారులు, వారి సంఘ సభ్యులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు వ్యాపారసంఘాల వారు కలిసి ఏకాభిప్రాయంతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆలమూరు గ్రామంలో  కరోనా విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రస్తుతం ఉన్న వ్యాపార సమయాన్ని కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 11వ తేదీ (శనివారం) నుండి తదుపరి ఉత్తర్వులు నిర్ణయించే వరకు ప్రతీ రోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు వ్యాపారాలు నిర్వహించాలని వ్యాపార సంఘాల వారు అందరూ సంయుక్తంగా నిర్ణయించుకుని అధికారులకు వెల్లడించారు.మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తరువాత పూర్తిగా వ్యాపారాలు మూసి వేయాలని అధికారులు కోరారు. సంత నిర్వహించే రోజున మాంసాహారం, చేపలు, సంత పూర్తిగా మూసివేయాలని ఎంపిడిఒ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కే సంజీవ్ రెడ్డి తో పాటు వివిధ వర్తక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.


ప్రత్యేక పరిపాలనాధికారి. ఎక్కడ వుంటారో..!  ఎలావుంటారో..!


ప్రత్యేక పరిపాలనాదికారి. ఎక్కడ వుంటారో..?  ఎలావుంటారో..?


జీకే వీధిలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఉత్సాహం


 గూడెం కోత్త వీధి,  పెన్‌ పవర్‌


విశాఖ ఏజెన్సీ. విశాఖ జిల్లా గూడెం కోత్త వీధిమండలంలోని. విదులు నిర్వహించడానికి  అధికారులు క్యూ కడుతున్నారు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకపోవడంతో అధికార పార్టీకీ చెందిన మండల  స్థాయి నాయకులు చక్రం తిప్పుతున్నారని విమర్శులు గుప్పుమంటున్నాయి.  ఎన్నడూ లేని విధంగా మండలంలో   ఎం. డి. ఒ. తహశీల్దార్‌. ఇద్దరు గతనెల  30వ తేదీన పదవి విరమణ చేసిన విషయం తెలిసిందే. పాడేరు ఎమ్యేల్యే, అరుకు ఎంపీల పేర్లు వినియోగించుకుంటున్న నాయకులు చుట్టూ అధికారులు. క్యూ కడుతున్నారనే విమర్శలు  వినిపిస్తున్నాయి. నిధులు పుష్కలంగా ఉండటంతో అటు ఎం. డి. ఒ. పోస్ట్లు. ఖాళీగా వుండడంతో ఆక్కడ పోస్టింగ్‌ కు మంచి గిరాకీ పెరిగినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.  ఒక్క అధికారికి కొంతమంది అధికారపార్టీ నాయకులు లోకల్‌ గా ఉన్న మరి కొంతమంది ప్రముఖులు పలుకుబడి వినియోగించుకుని, సుమారు రెండు నుండి ఐదు లక్షలు చెల్లించి. ఎండీఓ పొస్టు ను సంపాదించుకుంటున్నట్లు ప్రజా సంఘాలు బహిరంగంగానే ఆరోపణలు చేస్తున్నారు..? ఇప్పటికే గూడెం కోత్త వీధి మండలం లో బాతురూముల  నిర్మాణాల లో ల క్షలాది రూపాయలు అవినీతి జరిగిందని, దినిపై సమాగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రజా సంఘాలు డిమాండ్లు చేస్తూన్నాయి. అయినా సంబంధిత జిల్లా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు. వ్యవహరిస్తున్నరన్నధి     జగమెరిగిన సత్యం... ప్రతి పంచాయితీ సర్పంచ్‌ పాలన  ముగిసిన తరువాత. ప్రభుత్వం ప్రతి పంచాయితీకి. ప్రత్యేక పరిపాలనాధికారిని నియమించిన విషయం తెలిసిందే. ఇటువంటి కొంత మంది అధికారులు విధులకు రాకుండా... పంచాయతీ కార్యదర్శులతో కుమ్మక్కు అయ్యి, జీతాలు తీసుకుంటూ సొంతపనులు చేసుకుంటున్న విషయం బహిరంగ. రహస్యమే. మండలం లో మేజర్‌ పంచాయతీ అయిన గూడెం కోత్త వీధి ప్రత్యేక పరిపాలనాదికారి. ఎక్కడ వుంటారో..?  ఎలావుంటారో..? ఎవ్వరికీ తెలియని మిలియన్‌ డాలర్ల ప్రశ్న..!. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి స్పందించి ఎంతమేరకు ఈ నిధులు వినియోగిస్తున్నారనే విషయం పై సమగ్ర దర్యాప్తు చేయాల ని మండల ప్రజలు కోరుతున్నారు..


నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందించిన జనసైనికులు


కరోనా లాక్ డవున్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందించిన జనసైనికులు



          పరవాడ పెన్ పవర్



పరవాడ మండలం : కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు,వికలాంగులకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.గొరుపూటి శ్రీను, రాజేశ్వరి క్లాత్ అండ్ రెడీమేడ్ యజమాని మురుగన్ ల ఆర్థిక సహకారంతో సమకూర్చిన నిత్యవసర సరుకులను సుమారు 50 మంది నిరుపేదలకు ఐదు కేజీల నాణ్యమైన బియ్యం, తొమ్మిది రకాల కూరగాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మోటూరి సన్యాసినాయుడు , 79 వ వార్డు జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి కింతాడ ఈశ్వరరావు , చుక్కా నాగు, టిడిపి మాజీ కోఆప్షన్ నంబర్ గణపర్తి ఈశ్వరరావు, గుదె సంజీవ్, కరెడ్ల అభిరాం, కరెడ్ల లక్ష్మణ్, ఒడిసెల రాము, ఒడిసెల రాజు సన్నాఫ్ సూరిబాబు, మోటూరు హరి, తాడి గుఱ్ఱం నాయుడు, కరెడ్ల బ్రహ్మానందం, బీసీ కాలనీ చిరంజీవి, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.


అంబేద్కర్ గృహంపై దాడి చేస్తే శిక్షేది


అంబేద్కర్ గృహంపై దాడి చేస్తే శిక్షేది


అనకాపల్లి


నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  రాజా గృహంపై దాడి చేసిన వాళ్ళను కఠినంగా శిక్షించాలని దళిత నాయకులు మామిడి నూకరాజు పేర్కొన్నారు. పాకిస్తాన్ దేశం వాలు భారతదేశం పై యుద్ధాలు చేస్తూ ఉంటే వాళ్లను భారతదేశ ప్రభుత్వం భారత ప్రజలు కూడా ముక్తకంఠంతో ఎదుర్కోవడం జరుగుతుంది కానీ భారత దేశానికి దశ దిశ పాలనాపరమైన రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజగృహ పై దాడి చేస్తే ఇంతవరకు ఎటువంటి ప్రతిస్పందన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గాని భారత ప్రధానికి గాని ఎటువంటి చలనం లేదు ఇటువంటి సంఘటనలకు పాల్గొన్న వారిపై భారత రాజ్యాంగం పొందుపర్చినటువంటి చట్టాలను ఉపయోగించి వాళ్లను నడిరోడ్డుపై ప్రత్యక్షంగా ఉరితీయాలని దళిత కులాల సంక్షేమ సేవా సంఘం తరఫున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సామాజిక హక్కుల వేదిక నాయకులు లక్ష్మణ్ , ప్రముఖ న్యాయవాది శాఖ మంత్రి సాయి వెంకట లక్ష్మణరావు, దళిత బహుజన సేవా సంఘ కొల్లి సత్య రావు తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...