Followers

నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడులు జరిపిన పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను .


నాటుసారా విక్రయ కేంద్రాలపై దాడులు జరిపిన పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను .


పోలవరం పెన్ పవర్



పోలవరం మండలం ఎల్ ఎన్ డి పేట గ్రామంలో గురువారం రాత్రి 8 గంటల  సమయంలో నాటుసారా విక్రయ కేంద్రాలపై పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీనివాస్ సిబ్బందితో దాడులు జరిపారు. ఈ దాడుల్లో నాటుసారా విక్రయిస్తున్న ఆసుబోయిన యేసు అనే వ్యక్తిని అరెస్టు చేసి ఆరు లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను తెలిపారు. నాటు సారా తయారీ, అక్రమ రవాణా, అమ్మకాలు జరిగితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే పోలీసువారికి సమాచారం ఇవ్వాలని ఎస్ ఐ ఆర్ శ్రీను కోరారు. ఈ దాడుల్లో పోలవరం ఎస్ ఐ ఆర్ శ్రీను, స్టేషన్ సిబ్బంది మోహన్ రావు, దుర్గాప్రసాద్ , బాలాజీ తదితరులు పాల్గొన్నారు. 


పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు  పట్టణ పోలీసులు



పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు 


పట్టణ పోలీసులు



పెన్ పవర్ పశ్చిమ గోదావరి బ్యూరో


పాలకొల్లు పట్టణంలో భారీ స్థాయిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన పాలకొల్లు పట్టణ పోలీసులు, గంజాయి నీ సరఫరాను చేస్తున్న మూలాలను కనుగొనీ ముగ్గురు ముద్దాయిలను అరెస్టు చేసిన పాలకొల్లు పోలీసులకు జిల్లా ఎస్పీ కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ మరియు పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్  పాలకొల్లు పట్టణ పోలీసు వారిని అభినందించారు


పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పి  కె ఎన్ నారాయణ్ ఐపీఎస్ మరియు పశ్చిమగోదావరి జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పి  కరీముల్లా షరీఫ్  యొక్క ఆదేశాలపై పాలకొల్లు టౌన్ పోలీస్ స్టేషన్ అధికారులు, పాలకొల్లులో భారీ స్దాయిలో 435 కేజీ లు గంజాయి, డస్టర్ కారు ను స్వాధీనము చేసుకున్నరు పశ్చిమ గోదావరి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ కె.ఎన్.నారాయణ్, ఐ.పి.యస్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అదనపు ఎస్పీ  కరీముల్లా షరీఫ్ వారి ఆదేశాల ప్రకారం. ఈమధ్య భారీ స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్  వర్క్ ను చేపడుతున్న  పోలీస్ లకు నిన్న రాత్రి నరసాపురం సబ్ డివిసన్ లో పాలకొల్లు టౌన్ శివారులోని స్వప్నబార్ దగ్గర పోలీస్ లు నిర్వహించిన  ఆకస్మిక వాహన తనిఖీలో విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుండి డస్టర్   కార్ లో తరలిస్తున్న  సుమారు 435 కె.జి ల గంజాయిని,   ఆ కార్ పోలీస్ లకు చిక్కకుండా బైక్ పై ఎస్కార్ట్ చేసుకుంటూ వస్తున్న మరో ఇద్దరు వ్యక్తులను పోలీస్ లు పట్టుకోవడం జరిగింది, ఈరైడ్ లో 21,75,000/- విలువ కలిగిన గంజాయి, ఒక డస్టర్  కార్, రెండు బైక్ లు, రెండు సెల్ ఫోన్ లు, పోలీస్ లు స్వాధీనం చేసుకుని ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది అని నరసాపురం డి.ఎస్.పి నాగేశ్వరరావు  ప్రెస్ మీట్ లో  వివరాలు వెల్లడించారు. ఆ ముగ్గురు ఇచ్చిన సమాచారం మేరకు గంజాయిని అమ్ముతున్న మిగిలిన ముద్దాయిల కోసం పోలీస్ లు గాలింపుచర్యలు చేపట్టారు.  ఈ రైడ్ లో పాల్గొన్న పాలకొల్లు టౌన్ సి.ఐ. సిహెచ్. ఆంజనేయులు , ఎస్ఐ అయిన ఎఫ్. రహమాన్, జె.వి. ఎన్ ప్రసాద్ , మరియు వారి సిబ్బందిని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పి . . యస్. ఈ.బి  అదనపు ఎస్పీ  సిబ్బందిని అభినందించారు.


చాగల్లు మండలంలో మంత్రి తానేటి వనిత రోడ్ శంఖుస్థాపన


చాగల్లు మండలంలో మంత్రి తానేటి వనిత రోడ్ శంఖుస్థాపన



తాళ్ళపూడి,  పెన్ పవర్:



చాగల్లు మండలంలో మార్టేరు టూ ప్రక్కిలంక రహదారి అని పిలువబడే రోడ్ కు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత శంఖుస్థాపన శుక్రవారం చేశారు. ఈ రోడ్ కు దాదాపు 24 కోట్ల   రూపాయల సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు మంజూరు కావడం జరిగింది అని తెలిపారు. ఈ రోడ్ ఇచ్చిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి, ఫండ్స్ తీసుకొచ్చిన సెంట్రల్ మినిస్టర్   కృష్ణ దాస్ కి,  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి, వనిత ధన్యవాదాలు తెలిపారు. ఈ రోడ్ చాలా పాడైపోయింది అని, ఈ రోడ్ మీద నుంచి నడవడానికి పాదచారులు, వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.  నేను ఎక్కువగా ఈ రోడ్ మీద నుండే ప్రయాణం చేస్తుంటానని, ప్రయాణికులు ఇబ్బందులు చూస్తూ ఉంటానని వనిత చెప్పారు.రైతులు వ్యవసాయo కొరకు దమ్ముకు ఉపయోగించే ట్రాక్టర్ వీల్స్  ఈ రోడ్ గుండా తీసుకెళ్లితే దాని వలన రోడ్ పాడవుతుంది అని, ఇది గవర్నమెంట్ ది అనుకోవడం సరికాదని, గవర్నమెంట్ అంటే మనమేనని, మనం కట్టిన పన్నులు అభివృద్ధి కార్యక్రమాలుకు ఖర్చుచేస్తారని, ఈ రోడ్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత మనమందరికి ఉందని తెలిపారు. కరోన విజృoబిస్తున్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని, లేకపోతే మనం మాట్లాడేటప్పుడు తుంపరలు ఎదుటి వ్యక్తులు మీద పడతాయని, ఎవరికి ఏ ఇన్ఫెక్షన్ ఉందో తెలియదు, దీని వలన ఎదుటివారి కి అటాక్ అవ్వొచ్చని తెలిపారు. అందరూ కరోన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.


తిరుగుడుమెట్ట కంటోన్మెంట్ జోన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు


తిరుగుడుమెట్ట కంటోన్మెంట్ జోన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు



తాళ్ళపూడి, జూలై 10, పెన్ పవర్:



తాళ్ళపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామంలో హైదరాబాద్ నుండి స్వగృహానికి వచ్చిన వ్యక్తికి కరోన పోసిటివ్ రావడంతో ఆ ఏరియాలో కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ జోన్లో డాక్టర్ సుష్మా చౌదరి మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశామని తెలిపారు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలు ఉన్నప్పుడు వారికి వైద్య పరీక్షలు జరుపుతామని,వారికి కావల్సిన మందులు ఇస్తామని, వైద్యం చేస్తామని తెలిపారు.  ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న ఈ మెడికల్ క్యాంపులో మందులు ఇచ్చి వైద్యం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


శాకంబరీ దేవి గా దర్శనం ఇచ్చిన గద్దె లో అమ్మవారు.


శాకంబరీ దేవి గా దర్శనం ఇచ్చిన గద్దె లో అమ్మవారు.



గోకవరం పెన్ పవర్.


గోకవరం మెయిన్ రోడ్ లో ఉన్న శ్రీ వీరభద్రుని గద్దె వద్ద ఉన్న కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు అమ్మవారు శాకంబరీ దేవి గా దర్శనమిచ్చారు. ఆషాడమాసంలో ప్రతి సంవత్సరం అమ్మవారిని పండిన కూరగాయలు మరియు పళ్ళ రకాలతో పళ్ళతో అమ్మవారిని అలంకరించడం వలన పంటలు బాగా పండి ప్రజల సుఖ సంతోషాలతో ఉంటారనే  భక్తుల ప్రగాఢ నమ్మకం అని అర్చకులు కుమార్ శర్మ అన్నారు. ఆర్యవైశ్య మహిళా సంఘ సభ్యులు గ్రామస్తులు ఇచ్చిన కూరగాయలతో అమ్మవారిని అలంకరించ గా తెల్లవారుజాము నుండే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. అదేవిధంగా రాజమండ్రి దేవి చౌక్ అలంకారం లో ఉన్నటువంటి స్థానిక దేవిచౌక్ కూడా అర్చకులు జగన్నాథశర్మ మరియు శ్రీనివాస్ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారిని రకరకాల కాయగూరలు తోనే డ్రై ఫ్రూట్స్ మరియు పలు రకాల తో అలంకరించ గా కనకదుర్గ అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు అందించారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో భక్తులు మాస్కులు ధరించి ఒకరికొకరు దూరంగా అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.


ఘనంగాలూయిస్ జాకస్ మండర్ డాగురే 169 వర్ధంతి. 


ఘనంగాలూయిస్ జాకస్ మండర్ డాగురే 169 వర్ధంతి. 


గోకవరం పెన్ పవర్


మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో శుక్రవారం  ఫోటోగ్రపీ పితామహుడు లూయిస్ జాకస్ మండర్ డాగురే  169 వ వర్థంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గోకవరం ఫోటో&వీడియో గ్రాఫర్స్ యూనియన్ వారు  ఆయన ఫోటోకి పూలమాల వేసి ఘనంగానివా ళి అర్పించారు.  అనంతరం గోకవరం మండల గౌరవధ్యక్షలు గంధం బుజ్జి మాట్లాడుతూ  మా ఫోటోగ్రాఫర్స్ అంత బ్రతుకుతున్నాము అంటే డాగురే గారు కారణం అని ఆయన మా ఆరాధ్యదైవం  ఆయనను మరువలేము అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గౌరవధ్యక్షురలు బాలు ,బుజ్జి ,గౌరవ సలహాదారులు తోలేటి ప్రసాద్ ,ప్రెసిడెంట్ కొండలరావు, సెక్రెటరీ సతీష్ ,జాయింట్ సెక్రటరీ శాంతిబాబు,స్టూడియో రాజ్,రాంబాబు,సతీష్ మరియు మండల ఫోటోగ్రాఫర్స్ అందరు పాల్గొన్నారు.


లూయిస్ డాగురే కి ఘన నివాళి 


లూయిస్ డాగురే కి ఘన నివాళి 



        పరవాడ పెన్ పవర్



పరవాడ మండలం: ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల  ఆరాధ్యుడు ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ స్వర్గీయ లూయిస్ డాగురేకి పరవాడ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల ప్రతినిధులు స్థానిక పైడిమాంబ ఆలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఘనంగా నివాళులర్పించారు. ముందుగా లూయిస్ డాగురే చిత్రపటానికి సంఘం నూతన అధ్యక్షులు సిహెచ్. గోపి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లూయిస్ మరణించి 169 సంవత్సరాలు అవుతున్నా నేటికీ ప్రపంచ ఫోటోగ్రాఫర్ల గుండెల్లో సజీవంగా జీవించి ఉన్నారన్నారు. ఫోటోగ్రాఫర్లకు గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అంటే అది లూయిస్ గొప్పతనం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండలం ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ల ప్రతినిధులు గోపి, పి భాష ,శ్రీను ,వెంకీ ,మని, ఇతర సభ్యులు తదితరులు, పాల్గొన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...