Followers

ఆశా వర్కర్ల ఏఎన్ఎంలకు సరుకులు అందజేత


 


ఆశా వర్కర్ల ఏఎన్ఎంలకు సరుకులు అందజేత


అనకాపల్లి , పెన్ పవర్


దివంగతనేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి  71వ జయంతోత్సవాలలో భాగంగా జీవీఎంసీ 80వ వార్డ్ పరిధిలో ఉన్నా ఆశ వర్కర్లకు, ఏ.ఎన్.ఎమ్ లకు, ఆర్.పి లకు వైస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్  చేతుల మీదుగా 80వ వార్డ్ వైస్సార్సీపీ నాయకులు కొణతాల భాస్కరరావు,వైస్సార్సీపీ 80వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని  నీలిమల ఆధ్వర్యంలో సరుకులు పంపిణీ చేశారు. బియ్యం, కిరాణా సరుకులు,కాయకూరలను అందజేశారు.ఈ సందర్బంగా రత్నాకర్  మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ముందుండే భాస్కర్,నీలిమలు ఈ కరోనా విపత్తు సమయంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న ఆర్.పి లను, ఏ.ఎన్.ఎమ్ లను,ఆశ వర్కర్లను గుర్తించి వారికి తనవంతు సేవ చేయటం అభినందించదగ్గ విషయమన్నారు.ఈ సందర్బంగా అక్కడికి వచ్చిన ఆర్.పి లు తమకు గత 13 సంవత్సరాలనుంచి జీతభత్యాలు లేవని ఆర్థికంగా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని సమస్యను ఇంతవరకు ఎంతో మంది నాయకులకు తెలియజేసిన మా సమస్యను పరిష్కరించలేదని రత్నాకర్ దృష్టికి తీసుకురాగా అక్కడికక్కడే సంబంధిత అధికారులతో మాట్లాడారు. త్వరితగతిన సమస్య పరిస్కారమయ్యేలా చేస్తానని ఆర్.పి లకు  తెలిపారు.ఆర్.పి లు రత్నాకర్ గారి సేవానిరతిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో కాండ్రేగుల శ్రీరామ్,విల్లూరి శేఖర్,విల్లూరి సంతోష్,సూరిశెట్టి గిరి, కొణతాల చందు,పెంటకోట సునీల్, బి.వరకుమార్ తదితరులు పాల్గొన్నారు.


గోకవరం నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక


 


గోకవరం నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక


గోకవరం పెన్ పవర్.


గోకవరం మండల నాయీబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక గురువారం జరిగింది. గోకవరంలో జరిగిన సంఘం సమావేశంలో సభ్యులు నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం గౌరవాధ్యక్షులుగా సానాపల్లి బాపిరాజు, సూదికొండ కుమార్, వల్లూరి నాగేశ్వరరావు, గండ్రెడ్డి నాని, సేనాపల్లి బాబులు, మల్లువలస సుబ్బారావు, అధ్యక్షునిగా సునయిల నాగేశ్వరరావు, ఉపాధ్యక్షునిగా మల్లువలస రామరాజు, సెక్రటరీగా మల్లువలస రాంబాబు, జాయింట్‌ సెక్రటరీగా వల్లూరి ప్రసాద్, కోశాధికారిగా గండ్రెడ్డి సుబ్రహ్మణ్యం, జాయింట్‌ కోశాధికారిగా కొండపల్లి వీరబ్రహ్మం, సభ్యులుగా పలువురిని ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం సభ్యులు మాట్లాడుతూ సంఘం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా సంఘం నూతన కార్యవర్గం సభ్యులను వైఎస్సార్‌ సీపీ ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి వరసాల ప్రసాద్, నాయకులు దాసరి రమేష్, కర్రి సూరారెడ్డి, సుంకర వెంకటరమణలు అభినందించారు.


భయం గుపెట్లో కొత్తపేట వాసులు


భయం గుపెట్లో కొత్తపేట వాసులు


కొత్తపేట, పెన్ పవర్ 


 కొత్తపేట లో గత 3 రోజుల క్రితం 2 పాజిటివ్ కేసులు నమోదయిన విషయం తెలిసిందే. వారి యొక్క  కాంటాక్ట్స్ లో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో 3 గురికి పాజిటీవ్ నిర్ధారణ అయినట్లు తెలిసింది. అలాగే మండల పరిధిలోని కండ్రిగ గ్రామానికి చెందిన 1 వ్యక్తికి కరోనా పాజిటీవ్ అని తెలిసింది.అధికారులు ఇంకా  అధికారికంగా ప్రకటించవలసి ఉంది.వీరిని బట్టి ఇంకా కొత్తపేట లో  పదుల సంఖ్యలో కేసులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తపేట వాసుల్లో భయాందోళనలు ఎక్కువయ్యాయి.


బాల్య వివాహాలపై అవగాహన సదస్సు


 


 


బాల్య వివాహాలపై అవగాహన సదస్సు



--బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు.


 


వీ.ఆర్.పురం,  పెన్ పవర్ 



వీ.ఆర్.పురం మండలం రేఖపల్లి గ్రామం ఏ. ఎస్.డీ.ఎస్ ప్రాంగణంలో గురువారం బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు అద్వర్యం బాల్యవివాహల గురించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా బాలల హక్కుల కమిషన్ సభ్యులు వీ.గాంధీ బాబు మాట్లాడుతూ గ్రామల్లో పనిచేయుచున్న వాలేంట్రీలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు గ్రామల్లో జరుగుతున్న బాల్యవివాహలపై శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు సమాచారా నివేదిక సమర్పించాలని ఆయన అన్నారు. వీ.ఆర్.పురం మండలం ఐ.సి.డీ.ఎస్ ప్రాజెక్ట్ అధికారి వై.పద్మావతి మాట్లాడుతూ శిసు మరణాలు, పిల్లలకు పోషకాహారం, గురించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని. గర్భిణి స్త్రీలకు మెరుగైన ఆహారం అందిచాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్.పి డి.ఓ శ్రీనివాస్ రావు, వీ.ఆర్.పురం ఎస్.ఐ వెంకట్, రెవెన్యూశాఖ, సూపరు వైజర్లు, సెక్రెటరులు తదితరులు పాల్గొన్నారు.


పిన్న వయసులో "బాట్" రూపొందించిన తొలి బాలిక జోషిత నీలం


పిన్న వయసులో "బాట్" రూపొందించిన తొలి బాలిక జోషిత నీలం


గండేపల్లి పెన్ పవర్!


 


గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో టెక్నికల్ హబ్ సి.ఈ.ఓ బాబ్జి నీలం కుమార్తె జోషిత నీలం.  ప్రపంచంలోనే రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ద్వారా బాట్ రూపొందించిన పిన్న వయసు (13సంవత్సరాలు) తొలి బాలికగా గుర్తింపు సాధించినట్లు బాబ్జి తెలియజేసారు. సామర్లకోట మండలం ఉండూరు లో గల లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ నందు 9వ తరగతి చదువుచున్న జోషిత ఆటోమేషన్ ఎనీవేర్ యూనివర్సిటీ నుండి ఇ -లెర్నింగ్  ద్వారా రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ లో ఆడ్వాన్సుడ్ సెటిఫికేషన్ పూర్తిచేసినట్లు వివరించారు. లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ డా. సుగుణారెడ్డి మాట్లాడుతూ లాక్ డౌన్ సమయంలో అడ్వాన్సు సర్టిఫికేషన్ కోర్స్ చేయడమే కాకుండా చక్కటి ప్రతిభతో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందడం అభినందనీయం అని,ప్రతి ఒక్కరూ జోషితను ఆదర్శంగా తీసుకొని లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకొంటూ ఉన్నత స్థాయి గుర్తింపు సాధించాలని కోరారు. రాష్ట్ర స్థాయి చదరంగం క్రీడాకారిణి అయిన జోషితకు ఆదిత్య విద్యాసంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి,డైరెక్టర్ డా. ఎన్. సుగుణారెడ్డి,డా. ఎమ్. శ్రీనివాసరెడ్డి,లక్ష్య ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్ డా. సాత్యకీ బెనర్జీ,లు అభినందించారు.


చిట్టిబాబుకు తోట రాంజీ పరామర్శ 


చిట్టిబాబుకు తోట రాంజీ పరామర్శ 


గండేపల్లి పెన్ పవర్


 మాజీ పార్లమెంట్ సభ్యులు తోట నరసింహం కుమారుడు తోట రాంజీ పరామర్షించరు, గండేపల్లి మండలం జెడ్ రాగంపేట గ్రామంలో  ఇటీవలే  స్వర్గస్తులైన తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు కందుల కొండయ్య దొర ఇంటికి వచ్చి పరామర్చించి కొండయ్య దొర సోదరుడైన చిట్టిబాబుని  జరిగిన సంఘటన  గురించి అడిగి తెలుసుకున్నారు వారి కుటుంబానికి ప్రాగడ సానుభూతి తెలియపరిచారు తోట రాంజీ వెంట ఐ వి రాంబాబు మట్టా బాపిరాజు తధితరులు వున్నారు.


 పాస్టర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండాలి 


 పాస్టర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండాలి 


రాయవరం పెన్ పవర్


ఈరోజు మండల కేంద్రం రాయవరం లో తమలపూడి గంగాధర్ రెడ్డి ఆఫీస్ నందు మంతెన అచ్యుత రామరాజు, గంగాధర్ రెడ్డి, బొడ్డు శ్రీను సమక్షంలో రాయవరం మండలం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్.డా. పలివెల ప్రసాద్ తన కమిటీ సభ్యులతో సహా మండల పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు: రెవ.కొమ్ము సోమశేఖర్, బక్కి సత్య దాస్, తాతపూడి నతానియేలు సమక్షంలో రెండు కమిటీలు ఒకటిగా చేసియున్నారు ప్రసాద్, సోమశేఖర్ మాట్లాడుతూ  రాయవరం మండలం లో ఉన్న పాస్టర్లు అందరూ ఐక్యమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు ఇక్కడ నుండి రాయవరం మండలం లో పాస్టర్స్ ఫెలోషిప్ ఒకటే ఉంటుందని నిర్ధారించారు ఈ కార్యక్రమంలో ఐ. ప్రభుదాస్, బక్కీ ప్రాన్సిస్, వైరాల పోతాను బాబు, విలియం కేరి తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...