తాళ్ళపూడి, పెన్ పవర్:
బుధవారం నాడు భారీ వర్షం కురిచిన కారణంగా పంట పొలాల్లో వర్షపునీరు పొలాలను ముంచింది. వరి వూడ్పులు ఈ మధ్యనే జరిగాయని, దీనివలన చిన్న వరి నాట్లు ఈ వర్షపు నీరుతో మునిగిపోవుట వలన వరినాట్లు పాడవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాళ్ళపూడి మండల గ్రామాలు అయిన తాళ్ళపూడి, వేగేశ్వరపురం, బయ్యారం, బల్లిపాడు, తిరుగుడుమెట్టలలో బుధవారం కురిసిన వర్షానికి పంట పొలాలు నీట మునిగాయని తాళ్ళపూడి మండల అగ్రికల్చర్ అధికారి జి.మోహనరావు తెలిపారు. ఆయన తమ సిబ్బందితో నీట మునిగిన పొలాలను పర్యవేక్షించారు. రైతులకు జరిగిన నష్టం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. తాళ్ళపూడి మండలంలో ఎ.ఒ. జి.మోహనరావు విధి నిర్వహణ సక్రమంగా అమలు చేస్తున్నారు అని రైతులు అంటున్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎ.ఎ. లు ఆనంద్, ఈశ్వర్, శ్యామ్ పాల్గొన్నారు