జర్నలిస్టుల హక్కులను పరిరక్షించండి
కేంద్రం రద్దు చేసిన చట్టాలపై పునఃసమీక్ష నిర్వహించాలి
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కు కేంద్రం సానుకూలంగా స్పందించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి..వైజాగ్ జర్నలిస్టు లు కోరారు,,, దేశ వ్యాప్తంగా గురువారం జాతీయ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల దినోత్సవం నిర్వహించింది... జాతీయ కార్యవర్గం పిలుపుమేరకు ఇక్కడ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీదేవి ని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,, నగర అధ్యక్షులు పి నారాయణ తో కలిసి మాట్లాడుతూ జర్నలిస్ట్ ల కు సంబంధించి తాజాగా కేంద్రం 4 చట్టాలను రద్దు చేసిందన్నారు,,,దీనితో , రద్దు చేసిన చట్టాలు స్థానంలో 4 ప్రొసీజర్ కోడ్ లు ప్రవేశపెట్టిందన్నారు.. అయితే వీటివల్ల జర్నలిస్ట్ లకు,,. కార్మిక చట్టాలుకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.. దీంతోపాటు కరోనా నేపథ్యంలో మీడియా రంగం పూర్తిగా దెబ్బతింది అన్నారు. దీని వల్ల ఎంతో మంది జర్నలిస్టులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు.. ఇప్పటికే అనేక మీడియా యాజమాన్యాలు సిబ్బందిని తగ్గించడం జరుగుతుందని.. ,, వేతనాల్లో కోత విధిస్తున్నారని,,, సగం రోజులే పని హక్కుల కల్పిస్తున్నారని వీరు ఆవేదన వ్యక్తం చేశారు,, దీనివల్ల జర్నలిస్టుల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది అన్నారు,,, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు పట్ల సానుకూలంగా స్పందించాలని వీరు విజ్ఞప్తి చేశారు,,, ఈ కార్యక్రమంలో సమాఖ్య ప్రతినిధులు ఇరోతి ఈశ్వర్ రావు.. కే.. మురళి కృష్ణ.. కృష్ణ వేణి.. రాజశేఖర్.శ్రీనివాస్ గణేష్ . బొప్పన రమేష్.. నగేష్ తదితరులు పాల్గొన్నారు ,,