జి.మాడుగుల/విశాఖపట్నం, బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
మృతి చెందిన ఆవు మాంసం తిని అస్వస్థతకు గురైన ఆదివాసీలు.
70మంది గిరిజనులకు వైద్యం అందిస్తున్న వైద్య లు.
గిరిజనులను పరామర్శించిన ఎమ్మెల్యే బాగ్యలక్షిమి
మృతి చెందిన పశువు మాంసం తిని ఆదివాసీ గిరిజనులు అస్వస్థతకు గురై న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కి వెలితే విశాఖ మన్యంలో జి.మాడుగుల మండలం శివారు గడుతూరు పంచాయతీ మగతపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు 60 నుండి 70 మంది ఆదివాసీ గిరిజనులు ఈనెల7వ తేదీన కలుషిత ఆహారం(వ్యాధితో చనిపోయిన పశువు మాంసం) తినటం వలన అస్వస్థతకు గురవ్వటం జరిగింది. భాదిత కుటుంభాలను బుదవారం జి.మాడుగుల పి.హెచ్.సీ. ఆసుపత్రికి తరలించి మెరుగైన వైధ్యాన్ని అందిస్తున్నారు.ఏడుగురు వ్యక్తులకు వాంతులు విరోచనాలు కావటం పరిస్ధితి కొంత విషమంగా ఉండటంతో జి.మాడుగుల నుండి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించటం జరిగింది. విషయం తెలుసుకున్న పాడేరు శాసనసభ్యురాలు శ్రీమతి.కె.భాగ్యలక్ష్మి,మెడికల్ కౌన్సిల్ సభ్యులు నర్శింగరావు అరకు పార్లమెంట్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా.సురేష్ కుమార్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి భాదితులను పరామర్శించారు... వారికి మెరుగైన వైధ్య సదుపాయాలు అందించటంతో పాటుగా పోషకాలతో కూడిన ఆహారం అందించాలని రక్షిత మరిగించిన మంచినీటిని భాదితులకు అందించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. భాదితుల ఆరోగ్యపరిస్ధితి మెరుగుగా ఉందని ఏ ఒక్కరికి ప్రాణాపాయం లేదని వైధ్యాదికారులు శాసనసభ్యురాలు దృష్టికి తీసుకురావటం జరిగింది.