Followers

రూ.4కోట్లతో గంధవరంలో విత్తన శుద్ధి కర్మాగారం


రూ.4కోట్లతో గంధవరంలో విత్తన శుద్ధి కర్మాగారం



శంకు స్థాపన చేసి న విజయ్ సాయి రెడ్డి.


      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
ప్రభుత్వం వ్యవసాయ మార్కెటింగ్ రంగానికి ఎంతో ప్రధాన్యత ఇస్తుందని రాజ్యసభ సభ్యుడు విజయ్ సాయ్ రెడ్డి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కొరసాల కన్నబాబు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీ నివాసరావులు అన్నారు. గురువారం చోడవరం పట్టణానికి తొలిసారిగా విచ్చేసిన వైఎస్ఆర్సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయ సాయిరెడ్డి మరియు మంత్రులు కురసాల కన్నబాబు అవంతి శ్రీనివాస్  అనకాపల్లి పార్లమెంటు సభ్యులు బి.వి సత్యవతి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ లను స్వయంభు విగ్నేశ్వర స్వామి వారి ఆలయం వద్ద శాసనసభ్యులు  కరణం ధర్మశ్రీ  స్వాగతం పలికారు.. స్వామివారిని దర్శించుకున్న తర్వాత స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద వైఎస్ఆర్సిపి జెండా ఆవిష్కరణ కార్యక్రమం సాయి రెడ్డి  ద్వారా నిర్వహించారు. అనంతరం విజయసాయి రెడ్డి కన్నబాబు అవంతి శ్రీనివాస్ శాసనసభ్యులు ఘనంగా సత్కరించారు. తరువాత గందవరం గ్రామంలో రూ.4 కోట్లరూపాయల వ్యయంతో నిర్మించనున్న విత్తన శుద్ధి కర్మాగార భవనానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.తర్వాత చోడవరం.  రైతు బజార్ ను మరియు మార్కెట్ యార్డ్ ను సందర్శించిన తర్వాత సహకార చక్కెర కర్మాగారాన్ని మంత్రులు కురసాల కన్నబాబు అవంతి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ సందర్శించారు. తదనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలని ప్రజలు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం లో సుగర్స్ ఎండి నాయుడు వైసిపి నాయకులు పాల్గొన్నారు


వేగవంతంగా పోలవరం ప్రాజెక్ట్ పనులు



పోలవరం ప్రాజెక్ట్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి


 ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్


పోలవరం పెన్ పవర్


కరొనా విపత్తు సమయంలో కూడా పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరిపించడం గొప్ప విషయమని ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవి రెడ్డి శ్రీనాథ్ అన్నారు బుధవారం పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు వచ్చిన ఆయన కు పోలవరం ప్రాజెక్టు ఎస్ ఈ నాగిరెడ్డి సి ఈ  సుధాకర్ బాబు లు పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈ ప్రాంతం నుండి పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఛానల్ పనులను ఆయన పరిశీలించారు ఈ నాగిరెడ్డి వారికి జరుగుతున్న పనుల వివరాలను తెలిపారు అనంతరం పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కం రాక్ ఫీల్ రాక్ ఫీల్ డ్యాం ఎగువ దిగువ కాపర్ డ్యాం లను   శ్రీనాథ్ పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా విపత్తు సమయంలో కార్మికులు తమ రాష్ట్రాలకు వెళ్లి పోయిన కార్మికులు పనులు చేయించడం సామాన్యమైన విషయం కాదని 22 మీటర్ల వరకు ఉండే స్పిల్ వే పనులను 52 మీటర్ల వరకు త్వరితగతిన నిర్మాణం చేయడం చూస్తే మెగా కంపెనీ గుత్తేదారులు ఇంజనీర్లు పోలవరం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నట్లు భావిస్తున్నానని ప్రశంసించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి మీడియాకు పూర్తిస్థాయిలో సమాచారం ఇస్తే రాష్ట్ర ప్రజలకు పోలవరం పనులు ప్రభుత్వం ఎంత ఉందో అర్థమవుతుందన్నారు. అధికారులు ఇప్పటి వరకు మీడియాకు సమాచారం ఇవ్వకపోవడం తగదన్నారు. జాతీయ రాష్ట్ర మీడియా ముందుగా పోలవరం ప్రాజెక్టు ఆహ్వానించి వాస్తవ పరిస్థితులను వివరిస్తే ఈ విషయంలో మీడియా పూర్తిస్థాయిలో ప్రజలకు సమాచారం ఇస్తుందన్నారు జర్నలిస్టు అక్రిడేషన్ ఇళ్ల స్థలాలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జర్నలిస్టులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని సూచించినట్లు తెలిపారు వైయస్ జయంతి రోజున ఆయన కన్న కలలను నిజం చేసే పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి రావడం ఆనందంగా ఉందన్నారు.


పోలవరంకు ఆర్టీసీ  బస్ సర్వీస్ ప్రారంభం



పోలవరంకు ఆర్టీసీ  బస్ సర్వీస్ ప్రారంభం


పోలవరం పెన్ పవర్


పోలవరం టు రాజమండ్రి, పోలవరం టూ నిడదవోలు ఆర్టీసీ బస్సు సర్వీసులు గురువారం మొదలయ్యాయి. లాక్ డౌన్ కారణంగా 61 రోజుల విరామం అనంతరం రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు తాళ్లపూడి, పోలవరంలో  కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంత తాళ్లపూడి మీదుగా పోలవరం వచ్చే అన్ని డిపోల ఆర్టీసీ బస్సులను సుమారు 40 రోజుల క్రితం ఆయా డిపోలు నిలిపివేశారు. అయితే పోలవరం, తాళ్లపూడి లో  ఉన్న కంటోన్మెంట్ జోన్లు అధికారులు తీసివేయడం తో కొవ్వూరు, నిడదవోలు డిపో బస్సులు గురువారం పోలవరం చేరుకున్నాయి. పోలవరం బస్టాండ్ వద్ద ఆర్టీసీ సిబ్బంది ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు. బస్సు సీట్లను ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయడం, బస్సు ఎక్కేవారికి ధర్మల్ స్కానింగ్ చేయడం , బస్సు సిటింగ్ సరిపడే 32 మందిని  మాత్రమే ఎక్కించడం, బస్సు ప్రయాణికుల ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, వివరాలను తీసుకోవడం, మాస్కు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ బస్సు ప్యాసింజర్ లకు సురక్షితమైన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. డిపో మేనేజర్ ఆదేశాల ప్రకారం పై నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలవరం బస్ స్టాండ్ లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది రఫీఉల్లా , కరీం , టి ఆర్ రాజు, ఎస్ కృష్ణ, ఎన్ ఎస్ నారాయణ లు ఉన్నారు. 


తాళ్ళపూడి మండలంలో మరో కరోన పోసిటివ్


తాళ్ళపూడి మండలంలో మరో కరోన పోసిటివ్


తాళ్ళపూడి, పెన్ పవర్:


తాళ్ళపూడి మండలానికి చెందిన తిరుగుడు మెట్ట గ్రామంలో మరో కరోన పోసిటివ్ కేసు వచ్చిందని మలకపల్లి పి.హెచ్.సి. వైద్య అధికారిణి సుష్మా చౌదరి వెల్లడించారు. కరోన పోసిటివ్ కలిగిన వ్యక్తి హైదరాబాద్ లో వుంటూ రెండు రోజుల క్రితం తన స్వగ్రామం తిరుగుడుమెట్ట గ్రామానికి వచ్చిన వ్యక్తికి కరోన టెస్టులు చేయగా ఆ టెస్టుల్లో కరోన పోసిటివ్ అనితేలింది  అని చెప్పారు. ఎం.ఆర్.ఒ. ఎం.నరసింహమూర్తి ఆదేశాలు మేరకు ఆ ఏ రియా అంతా పంచాయతీ సెక్రెటరీ  పారిశుద్ధ్య కార్మికులుతో బ్లీచింగ్ చల్లించి, శానిటై జ్ చేయించారు.  కంటోన్మెంట్ జోన్ ఏర్పాటు చేశారు. కర్రలతో ఆ ఏరియా తడికలు కట్టారు. బయట వారు లోపలికి, లోపలివారు బయటకు వెల్లకుండా  యస్.ఐ. జి.సతీష్ తమ సిబ్బందితో బారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డాక్టర్ సుష్మా చౌదరి కంటోన్మెంట్ జోన్లో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఎం.ఆర్.ఒ. ఎం.నరసింహమూర్తి తాళ్ళపూడి మండలంలో మొత్తం 4 కరోన పోసిటివ్ కేసులు నమోదయ్యాయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.


ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు


ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు


తాళ్ళపూడి, పెన్ పవర్:



తాళ్ళపూడిలో బుధవారం నాడు దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా  తాళ్ళపూడి లక్ష్మీదేవి ఆలయ ప్రాంగణంలో ఉన్న  వై.యస్. రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి తాళ్ళపూడి వైయస్సార్సీపీ నాయకులు అందరూ పూల మాలలు వేసి, నివాళులు అర్పించారు. రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు గుర్తుకు తెచ్చుకోవడం, జోహార్లు రాజశేఖర్ రెడ్డి అని నినాదాలు తెలిపారు. ఆయన పాలనలో ఆంద్రప్రదేశ్  ఒక స్వర్ణయుగం అని తాళ్ళపూడి  వైయస్సార్సీపీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ సీనియర్ బి.సి. నాయకులు నక్కా చిట్టిబాబు, వైయస్సార్సీపీ నాయకులు సిరిపురపు మదన్ మోహన్ రెడ్డి, మండల యువజన విభాగం అధ్యక్షులు ఒంబోలు పోసిబాబు, వైయస్సార్సీపీ నాయకులు బండ్రెడ్డి వెంకటేశ్వరరావు, సిద్దంశెట్టి కృష్ణ, బండారు నాగేశ్వరరావు, గూడా విజయ రాజు, మైగాపుల ఆంజనేయులు, బండ్రెడ్డి సత్యనారాయణ, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


సారా అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్


 


సారా అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

 

 

సారా అక్రమ రవాణా కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తెలిపారు

 

జగ్గంపేట మండలం లోని మామిడాడ గ్రామానికి చెందిన దెయ్యాల వీర రాఘవులు(20),  సారాతో , అదేవిధంగా జగ్గంపేట మండలంలోని ఇర్రిపాక గ్రామానికి చెందిన పప్పల లోవరాజు( 20 )  సారాతో ఈ ఇద్దరు వ్యక్తులు వేరువేరు మార్గాల ద్వారా సారాను అక్రమంగా తరలిస్తున్న ట్లు జగ్గంపేట పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తమ సిబ్బందితో  తనిఖీ చేయగా సార అక్రమ రవాణా లో పట్టుబడ్డ వీరిద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి ఒక్కొక్కరి వద్ద 20 లీటర్ల చొప్పున 40 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చడం జరిగిందని ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వీరికి పెద్దాపురం మెజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు.

అభివృద్ధి పనులను సమీక్షించిన అధికారులు




అభివృద్ధి పనులను సమీక్షించిన అధికారులు

 

పెన్ పవర్, ఆత్రేయపురం

 

మండలం లో వివిధ ఇంజనీరింగ్ శాఖల ద్వారా జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశపు మందిరంలో ఎంపీడీఓ నాతి బుజ్జి సంబంధిత శాఖల అధికారులతో కలిసి గ్రామ సచివాలయ సిబ్బందితో సమీక్షించారు.‌ పేదలందరికీ ఇళ్లు పధకం లో గుర్తించిన లబ్ధిదారులకు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా సర్వీసు కోడ్ జనరేట్ వేయాలని కొత్తపేట హౌసింగ్ డిఈ శ్రీనివాస్ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ లకు తెలిపారు. అలాగే ఆత్రేయపురం మండలంలో మంజూరు అయిన వ్యక్తిగత మరుగుదొడ్లకి సంబంధించి అర్హులైన వారి పేమెంట్ కొరకు ఆన్లైన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆర్ డబ్ల్యు ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లకు సూచించారు. మండలం లో జరుగుతున్న సచివాలయ భవనాల నిర్మాణం, నాడు నేడు పనులు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం, వెల్ నెస్ నిర్మాణంలో అంచనాల కనుగుణంగా నాణ్యతతో పనులు చేయాలని మండల ఇంజనీరింగ్ అధికారి వీరభద్రరావు తెలిపారు. ఈ సమావేశంలో హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్,  ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, డిజిటల్ అసిస్టెంట్ లు, హౌసింగ్ కంప్యూటర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు



Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...