పోలవరంకు ఆర్టీసీ బస్ సర్వీస్ ప్రారంభం
పోలవరం పెన్ పవర్
పోలవరం టు రాజమండ్రి, పోలవరం టూ నిడదవోలు ఆర్టీసీ బస్సు సర్వీసులు గురువారం మొదలయ్యాయి. లాక్ డౌన్ కారణంగా 61 రోజుల విరామం అనంతరం రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు తాళ్లపూడి, పోలవరంలో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంత తాళ్లపూడి మీదుగా పోలవరం వచ్చే అన్ని డిపోల ఆర్టీసీ బస్సులను సుమారు 40 రోజుల క్రితం ఆయా డిపోలు నిలిపివేశారు. అయితే పోలవరం, తాళ్లపూడి లో ఉన్న కంటోన్మెంట్ జోన్లు అధికారులు తీసివేయడం తో కొవ్వూరు, నిడదవోలు డిపో బస్సులు గురువారం పోలవరం చేరుకున్నాయి. పోలవరం బస్టాండ్ వద్ద ఆర్టీసీ సిబ్బంది ఐదుగురు విధులు నిర్వహిస్తున్నారు. బస్సు సీట్లను ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయడం, బస్సు ఎక్కేవారికి ధర్మల్ స్కానింగ్ చేయడం , బస్సు సిటింగ్ సరిపడే 32 మందిని మాత్రమే ఎక్కించడం, బస్సు ప్రయాణికుల ఆధార్ కార్డు నెంబరు, ఫోన్ నెంబరు, వివరాలను తీసుకోవడం, మాస్కు వాడటం వంటి జాగ్రత్తలు తీసుకుంటూ బస్సు ప్యాసింజర్ లకు సురక్షితమైన ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు. డిపో మేనేజర్ ఆదేశాల ప్రకారం పై నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలవరం బస్ స్టాండ్ లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ సిబ్బంది రఫీఉల్లా , కరీం , టి ఆర్ రాజు, ఎస్ కృష్ణ, ఎన్ ఎస్ నారాయణ లు ఉన్నారు.