Followers

ఏలేశ్వరం లో భారీ వర్షం



ఏలేశ్వరం లో భారీ వర్షం

 

జలదిగ్బంధంలో మార్కండేయ పురం.

 

 

ఏలేశ్వరం: ఏలేశ్వరం మండలంలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని రమణయ్య పేట గ్రామానికి చెందిన మార్కండేయ పురం జలదిగ్బంధంలో చిక్కుకుంది. సుమారు 64.2 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యింది. ఏలేశ్వరం  పట్టణంలో వీధులన్నీ జలమయమయ్యాయి. మురుగు కాలువల సైతం రోడ్లపై ప్రవహించాయి. మండలంలో పలు గ్రామాల్లో పంటపొలాలు చెరువులను తలపించాయి. అయితే తమ్ముడు ఏలేరు రిజర్వాయర్ నిర్వాసితులకు సుమారు 30 ఏళ్ళ క్రితం రమణయ్య పేట వద్ద ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చింది. అయితే అప్పటి నుంచి అనేక ఇబ్బందులు పడుతున్న వీరు కనీస వసతుల కోసం ప్రభుత్వ అధికారులకు మరి పెట్టుకుంటున్న ఇప్పటికే ఫలితం లేకపోయిందన్నారు. మురుగు నీరు పోవడానికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో కొద్దిపాటి వర్షం కురిస్తే మొత్తం వీధులన్నీ బురదమయం అవుతున్నాయి. అయితే తే.గీ గురువారం కురిసిన భారీ వర్షానికి పంట పొలాల్లో వర్షపు నీరు ఇళ్ళ పై పడింది. మోకాళ్లలో వీటిలో మునిగిన తమ ఊరు ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. వర్షపు నీటితో పాటు తేళ్ళూ, జెర్రెలు, విష సర్పాలు తమ ఇళ్లల్లోకి చొరబడి ఉన్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మార్కండేయ పురాన్ని ముంపు నుంచి కాపాడాలని కోరుతున్నారు.


పెరుగుతున్న గోదావరి నీటిమట్టం


పెరుగుతున్న గోదావరి నీటిమట్టం


పోలవరం, పెన్ పవర్


పోలవరం లో గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం నాటికి గోదావరి నీటిమట్టం 16.547 మీటర్లుగా నమోదయింది. ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు శబరి, ఇంద్రావతి,ఇతర కొండవాగుల నీరు గోదావరిలో కలుస్తుండడంతో వలన గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. 2 లక్షల క్యూసెక్కుల వరద జలాలను సముద్రంలోకి విడిచిపెట్టినట్లు సిడబ్ల్యుసిఅధికారులు తెలిపారు. గురువారం పట్టిసీమ వద్ద గోదావరి నీటిమట్టం మరింత పెరగడంతో ఇసుక  తిన్నెలు పూర్తిగా మునిగిపోయాయి.


వర్షపు నీటితో వీధులు జలమయం


 


వర్షపు నీటితో వీధులు జలమయం


తాళ్ళపూడి, పెన్ పవర్: 


బుధవారం రాత్రి కురిసిన వర్షాలకు తాళ్ళపూడి మండల ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అన్నీ జల మయమయ్యాయి. కొన్నిచోట్ల ప్రజల రాకపోకలు ఇబ్బంది అయ్యాయి. రవాణా మార్గాలు, రహదారులు, వీధులు వర్షపు నీటితో నిండి పోయాయి. వర్షం నీరు కొన్ని ఇండ్లలోనికి ప్రవేశించినది. ఇప్పుడిప్పుడే కొన్ని పొలాలలో వారి నాట్లు వేస్తున్నారు. ఆ చేలు అన్నీ జలమయమయ్యాయి. దీనివల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిళ్ళుతుందని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో డ్రైనేజీలు కొన్నిచోట్ల లేక వర్షపు నీరు, మురుగు నీరు, వెళ్లే దారిలేక గ్రామాలు జలమయమవుతున్నాయి. మండలంలోని పంచాయతీలు శ్రద్ధ తీసుకొని డ్రైనేజీలు వేర్పాటు చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.


రెడ్ జోన్ లో చేస్తున్న సేవలు ప్రశంస నీయం


రెడ్ జోన్ లో చేస్తున్న సేవలు ప్రశంస నీయం


జగ్గంపేట,  పెన్ పవర్ : 


జగ్గంపేట శ్రీరామ్ నగర్  లో రెడ్ జోన్ చేసిన ప్రాంతంలో   మహిళా  కానిస్టేబుల్, ఆశా వర్కర్లు , ఏ ఎన్ ఎం లు, గ్రామ వాలంటీర్  దగ్గరుండి ఆ ఏరియాలో ఏటువంటి అవసరం ఉన్నా చేరువలో ఉండి సేవలందిస్తు న్నారు. ప్రతిరోజు ఇంటింటికి వెళ్లి   క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు . వీరు సేవల ను  పలువురు ప్రశంసిస్తున్నారు.


బీచ్ లో మొక్కలు నాటిన విజయ్ సాయిరెడ్డి.



బీచ్ లో మొక్కలు నాటిన విజయ్ సాయిరెడ్డి.


     విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


  బీచ్ రోడ్డులో వైఎంసీఏ ఎదురుగా గల బీచ్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమం  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ  కార్యదర్శి విజయ సాయిరెడ్డి
మరియు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస రావు. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజ్ శ్రీనివాసరావు  కలెక్టర్ వినయ్ చంద్  జీవీఎంసి కమిషనర్ సృజన నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాసరావు, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు పలువురు పొల్గొని.. మొక్కలను నాటారు. ఈ కార్యక్రమం లో సముద్రం కోత ను నివారించే మొక్కలను సన్ రే వారి సౌజన్యంతో  బీచ్ లో నాటారు.


100 రోజులుగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ


100 రోజులుగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ


 పూర్ణా మార్కెట్,పెన్ పవర్



రూపాకులవిశాలాక్షి చారిటబుల్ ట్రస్ట్ , శ్రీ  గాయత్రి వెల్ఫేర్ కల్చరల్  యూత్ అకాడమీ ,భారతీయ జనతా పార్టీ వైద్య విభాగము కలిసి నిర్వహించిన నిత్యావసర సరుకుల పంపిణీ  100 వ రోజు ప్రకృతి చికిత్సాలయం మహారాణి పేట ఆవరణలో  జరిగిన , ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ రూపాకుల రవికుమార్  ముందుగా పేదలకు నిత్యావసర సరుకుల  బియ్యం, పప్పు, నూనె, గోధుమ పిండి,మొదలగునవి 100 మంది మహిళలకు పంపిణీ చేశారు.వారు ప్రసంగిస్తూ  గత 100 రోజులుగా పేదల కోసము ట్రస్ట్ చేస్తున్న సేవలను,ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు.ప్రధాని మోడీ పిలుపు మేరకు  లాక్ డౌన్  ముగిసే వరకు సహాయ కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు. కరోనా కు వ్యాక్సిన్ లేదని,సామాజిక దూరం పాటిస్తూ  ఫేస్ మాస్క్  ధరించాలి అని, జ్వరము, దగ్గు, జలుబు, తలనొప్పి ఉన్నచో డాక్టర్స్ ని కలవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  డా.శిష్ట్లా, శ్రీలక్ష్మి , డా. వై.లక్ష్మణ్ రావు, గౌతమ్,గేధల శ్రీహరి,రమణమ్మ , కొండమ్మ, శివ రామ్ మరియు అధిక సంఖ్యలో లబ్దిదారులు  పాల్గొన్నారు .


జర్నలిస్టుల హక్కులను పరిరక్షించండి


జర్నలిస్టుల హక్కులను పరిరక్షించండి



కేంద్రం రద్దు చేసిన చట్టాలపై పునఃసమీక్ష నిర్వహించాలి


విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


జర్నలిస్టుల హక్కుల  పరిరక్షణ కు కేంద్రం సానుకూలంగా స్పందించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి..వైజాగ్ జర్నలిస్టు లు  కోరారు,,, దేశ వ్యాప్తంగా గురువారం జాతీయ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల దినోత్సవం నిర్వహించింది... జాతీయ కార్యవర్గం పిలుపుమేరకు ఇక్కడ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీదేవి ని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,, నగర అధ్యక్షులు పి నారాయణ తో కలిసి  మాట్లాడుతూ జర్నలిస్ట్ ల కు సంబంధించి తాజాగా  కేంద్రం 4 చట్టాలను రద్దు చేసిందన్నారు,,,దీనితో , రద్దు చేసిన చట్టాలు స్థానంలో 4 ప్రొసీజర్ కోడ్ లు  ప్రవేశపెట్టిందన్నారు.. అయితే వీటివల్ల  జర్నలిస్ట్ లకు,,. కార్మిక చట్టాలుకు  తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.. దీంతోపాటు కరోనా  నేపథ్యంలో మీడియా రంగం పూర్తిగా దెబ్బతింది అన్నారు. దీని వల్ల ఎంతో మంది జర్నలిస్టులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు.. ఇప్పటికే అనేక మీడియా    యాజమాన్యాలు సిబ్బందిని తగ్గించడం జరుగుతుందని.. ,, వేతనాల్లో కోత విధిస్తున్నారని,,, సగం రోజులే పని  హక్కుల కల్పిస్తున్నారని వీరు  ఆవేదన వ్యక్తం చేశారు,, దీనివల్ల జర్నలిస్టుల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది అన్నారు,,, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు  పట్ల సానుకూలంగా స్పందించాలని వీరు విజ్ఞప్తి చేశారు,,, ఈ కార్యక్రమంలో సమాఖ్య  ప్రతినిధులు  ఇరోతి ఈశ్వర్ రావు.. కే.. మురళి కృష్ణ.. కృష్ణ వేణి.. రాజశేఖర్.శ్రీనివాస్ గణేష్ . బొప్పన రమేష్.. నగేష్ తదితరులు పాల్గొన్నారు   ,,


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...