Followers

జర్నలిస్టుల హక్కులను పరిరక్షించండి


జర్నలిస్టుల హక్కులను పరిరక్షించండి



కేంద్రం రద్దు చేసిన చట్టాలపై పునఃసమీక్ష నిర్వహించాలి


విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


జర్నలిస్టుల హక్కుల  పరిరక్షణ కు కేంద్రం సానుకూలంగా స్పందించాలని జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి..వైజాగ్ జర్నలిస్టు లు  కోరారు,,, దేశ వ్యాప్తంగా గురువారం జాతీయ జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల దినోత్సవం నిర్వహించింది... జాతీయ కార్యవర్గం పిలుపుమేరకు ఇక్కడ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీదేవి ని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రం సమర్పించడం జరిగింది.. ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు,, నగర అధ్యక్షులు పి నారాయణ తో కలిసి  మాట్లాడుతూ జర్నలిస్ట్ ల కు సంబంధించి తాజాగా  కేంద్రం 4 చట్టాలను రద్దు చేసిందన్నారు,,,దీనితో , రద్దు చేసిన చట్టాలు స్థానంలో 4 ప్రొసీజర్ కోడ్ లు  ప్రవేశపెట్టిందన్నారు.. అయితే వీటివల్ల  జర్నలిస్ట్ లకు,,. కార్మిక చట్టాలుకు  తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందన్నారు.. దీంతోపాటు కరోనా  నేపథ్యంలో మీడియా రంగం పూర్తిగా దెబ్బతింది అన్నారు. దీని వల్ల ఎంతో మంది జర్నలిస్టులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు.. ఇప్పటికే అనేక మీడియా    యాజమాన్యాలు సిబ్బందిని తగ్గించడం జరుగుతుందని.. ,, వేతనాల్లో కోత విధిస్తున్నారని,,, సగం రోజులే పని  హక్కుల కల్పిస్తున్నారని వీరు  ఆవేదన వ్యక్తం చేశారు,, దీనివల్ల జర్నలిస్టుల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే ప్రమాదం ఉంది అన్నారు,,, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సమస్యలు  పట్ల సానుకూలంగా స్పందించాలని వీరు విజ్ఞప్తి చేశారు,,, ఈ కార్యక్రమంలో సమాఖ్య  ప్రతినిధులు  ఇరోతి ఈశ్వర్ రావు.. కే.. మురళి కృష్ణ.. కృష్ణ వేణి.. రాజశేఖర్.శ్రీనివాస్ గణేష్ . బొప్పన రమేష్.. నగేష్ తదితరులు పాల్గొన్నారు   ,,


మృతి చెందిన ఆవు మాంసం తిని అస్వస్థతకు గురైన ఆదివాసీలు.


 


జి.మాడుగుల/విశాఖపట్నం, బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


 


 



మృతి చెందిన ఆవు మాంసం తిని అస్వస్థతకు గురైన ఆదివాసీలు.



70మంది గిరిజనులకు వైద్యం అందిస్తున్న వైద్య లు.



గిరిజనులను పరామర్శించిన ఎమ్మెల్యే బాగ్యలక్షిమి
       


మృతి చెందిన పశువు మాంసం తిని ఆదివాసీ గిరిజనులు అస్వస్థతకు గురై న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లో కి వెలితే విశాఖ మన్యంలో జి.మాడుగుల మండలం శివారు గడుతూరు పంచాయతీ మగతపాలెం గ్రామంలో నివాసం ఉంటున్న సుమారు 60 నుండి 70 మంది ఆదివాసీ గిరిజనులు ఈనెల7వ తేదీన  కలుషిత ఆహారం(వ్యాధితో చనిపోయిన పశువు మాంసం) తినటం వలన అస్వస్థతకు గురవ్వటం జరిగింది. భాదిత కుటుంభాలను బుదవారం జి.మాడుగుల పి.హెచ్.సీ. ఆసుపత్రికి తరలించి మెరుగైన వైధ్యాన్ని అందిస్తున్నారు.ఏడుగురు వ్యక్తులకు వాంతులు విరోచనాలు కావటం పరిస్ధితి కొంత విషమంగా ఉండటంతో జి.మాడుగుల నుండి పాడేరు జిల్లా ఆసుపత్రికి తరలించటం జరిగింది. విషయం తెలుసుకున్న పాడేరు శాసనసభ్యురాలు శ్రీమతి.కె.భాగ్యలక్ష్మి,మెడికల్ కౌన్సిల్ సభ్యులు నర్శింగరావు అరకు పార్లమెంట్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా.సురేష్ కుమార్ జిల్లా ఆసుపత్రిని సందర్శించి భాదితులను పరామర్శించారు... వారికి మెరుగైన వైధ్య సదుపాయాలు అందించటంతో పాటుగా పోషకాలతో కూడిన ఆహారం అందించాలని రక్షిత మరిగించిన మంచినీటిని భాదితులకు అందించాలని సంబందిత అధికారులను ఆదేశించారు. భాదితుల ఆరోగ్యపరిస్ధితి మెరుగుగా ఉందని ఏ ఒక్కరికి ప్రాణాపాయం లేదని వైధ్యాదికారులు శాసనసభ్యురాలు దృష్టికి తీసుకురావటం జరిగింది.


జయహో  స్వర్గీయ వై.ఎస్ .రాజశేఖరరెడ్డి


 




జయహో  స్వర్గీయ వై.ఎస్ .రాజశేఖరరెడ్డి


 

రైతుబాందవుడు,జలయజ్ఞ ప్రదాత,108,104ల సృష్టికర్త మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా॥యెడుగూరి సందంటి రాజశేఖరరెడ్డి 71వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా ఎమ్మేల్యే గొల్ల బాబురరావు పాల్లొన్నారు. స్తానిక పంచాయితీ వద్దగల వైఎస్సార్ విగ్రహానికి ఎమ్మేల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అదేవిదంగా డా॥బి.ఆర్ .అంభేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం బర్త్ డే కేకును కట్ చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రైతుల పట్ల చిత్తసుద్ది కలిగి ఉచిత విద్యుత్ ,రైతు ఋణమాఫీ చేసి రైతుల గూండెల్లో చిరస్తాయిగా నిలిచిన వ్యక్తి రాజశేఖరరెడ్డి అని అన్నారు,రైతుబాందవుడు కాబట్టి ఆయన పుట్టిన రోజును జగన్ మోహన్ రెడ్డి రైతు దినోత్సవంగా ప్రకటించడం హర్షదాయకమని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెటు యార్డు వైస్ చైర్మెను గుటూరి శ్రీను,మాజీ జెడ్పీఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు,మండలపార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు,టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా,దళిత నాయకులు లంక సూరిబాబు,పెదపాటి మేఘరంజన్ ,కాథా రామకృష్ణ,డక్కుమళ్ళ నానాజి,వేమగిరి లక్ష్మణ్ ,దోమాడ సుందరం,అంబటి సీతారాం తదితరులు పాల్గొన్నారు.


 

 




 


అనకాపల్లి లో మరో కోవిడ్ కేర్ సెంటర్







అనకాపల్లి లో మరో కోవిడ్ కేర్ సెంటర్
-- పార్లమెంట్ పరిశీలకులు రత్నాకర్

 

అనకాపల్లి , పెన్ పవర్

 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ కేర్ సెంటర్ లు పెరిగాయని పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి మండలం లో రేపాక గ్రామంలో పాలిటెక్నిక్ కళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే అమర్ సూచనల మేరకు 300 పడకల ఏర్పాటు చేసి  దానికి తగిన వైద్య సిబ్బంది కిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తుండగా కోవిడ్ కేర్ సెంటర్ ను కూడా ఈ రోజు నుంచే ఉపయోగించినునట్లు తెలిపారు. వ్యాధి సీరియస్ అయితే విశాఖపట్నం తరలించడం జరుగుతుందన్నారు. వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ సామాజిక దూరం వంటి జాగ్రత్తలను తప్పక పాటించాలన్నారు.


 

 




 




 


విశాఖ సెంట్రల్ జైల్ కు ఎల్జి పాలిమర్స్ నిందితులు


విశాఖ సెంట్రల్ జైల్ కు ఎల్జి పాలిమర్స్ నిందితులు



గ్యాస్ లీక్ ఘటనలో ఎండి  జియాంగ్ తో 12 మంది అరెస్టు



  జూలై 22 వరకు రిమాండ్  విధించిన జిల్లామెజిస్ట్రేట్


       విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది నిందితులకు ఈనెల 22 తేదీ వరకు రిమాండ్ విధించారు. బుధవారం  నిందితులను జూమ్ యాప్  ద్వారా మేజిస్ట్రేట్ ముందు  పోలీసులు హాజరుపరచగా  నిందితులకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం 12 మంది నిందితులను  విశాఖ కేంద్ర కారాగారానికి  తరలించారు. ఎల్జి పాలిమర్స్ లో మే 7న   స్టెరైన్  గ్యాస్ లీక్ జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో జనం ఏంటి లెటర్ కు బలయ్యారు. సంఘటనపై విచారణ జరపాలని ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. సంఘటనపై హైపర్ కమిటీ రిపోర్టును 2 రోజుల క్రితం ప్రభుత్వానికి సమర్పించింది. రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. విశాఖ పర్యావరణ ఇంజనీర్లు పి. ప్రసాదరావు  ఆర్. లక్ష్మీనారాయణ లను సస్పెండ్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. విశాఖ డిప్యూటీ చీఫ్ ఇంచార్జ్ ఆప్  పొల్యూషన్ జేబీఎస్ రాజును సస్పెండ్ చేస్తూ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ దాడి చేసింది. ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ కి ప్రధాన కారణమైన 12 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. ఎల్జి పాలిమర్స్ సీఈవో మేనేజింగ్ డైరెక్టర్ సుంకే జియాంగ్   టెక్నీషియన్ డైరెక్టర్ డి ఎస్ కిమ్  మరో పది మంది ఉద్యోగులను అరెస్టు చేసి  రిమాండ్కు తరలించామని  నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా తెలిపారు. ఫ్యాక్టరీ పై ప్రభుత్వం  కఠినంగా చర్యలు చేపడుతుందని స్పష్టమవుతుంది.


రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి శంఖుస్థాపన


రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి శంఖుస్థాపన


      పాయకరావుపేట,పెన్ పవర్ 

 

     స్తానిక ఎంపిడిఒ కార్యలయ ఆవరణంలో 21.80లక్షల రూపాయలతో రైతుభరోసా కేంద్రం నూతనభవన నిర్మాణానికీ బుదవారం ఎమ్మేల్యే గొల్ల బాబురావు భూమి పూజనిర్వహించి శంఖుస్థాపన చేసారు.ఈ కార్యక్రమంలో మార్కెటు యార్డు వైస్ చైర్మెను గుటూరి శ్రీను, మాజీ జెడ్పిఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు,మండలాధ్యక్షులు దనిశెట్టి బాబురావు,టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా,దళితనాయకులు లంక సూరిబాబు,పెదపాటిమేఘరంజన్ ,ఎంపిడిఒ సాంబశివరావు,ఎమ్మార్వో అంభేడ్కర్ , ఈఓపిఆర్ డి వెంకటనారాయణ,హౌసింగు ఏఈ సామ్యూల్ రాజు,వ్యవసాయ అదికారి సౌజన్య,ఎఇఒ నాగమణి తదితరులు పాల్గొన్నారు. 

మామిడి నూకరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కు నివాళి

మామిడి నూకరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కు నివాళి

 

అనకాపల్లి

 

దళిత నాయకులు మామిడి నూకరాజు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షుడు మామిడి నూకరాజు  మాట్లాడుతూ ఆయన 2004 లో  గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశారనారు. సామాన్యుడు కార్పొరేట్ ఆస్పటల్ వైపు చూడాలంటే భయం ఫుటేది కానీ ఆయన పెట్టిన ఆరోగ్య శ్రీ వలన పేదవాడి ఆరోగ్యానికి భరోసా దొరికిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కొలి సత్యరావు, ఆర్ సంతోష్ కుమార్, కొణతాల శ్రీనివాసరావు ,కట్టమూరి బాబీ ,కట్టమూరి మంగరాజు తదితరులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...