Followers

అనకాపల్లి లో మరో కోవిడ్ కేర్ సెంటర్







అనకాపల్లి లో మరో కోవిడ్ కేర్ సెంటర్
-- పార్లమెంట్ పరిశీలకులు రత్నాకర్

 

అనకాపల్లి , పెన్ పవర్

 

రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కోవిడ్ కేర్ సెంటర్ లు పెరిగాయని పార్లమెంటు పరిశీలకులు దాడి రత్నాకర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి మండలం లో రేపాక గ్రామంలో పాలిటెక్నిక్ కళాశాలలో కోవిడ్ కేర్ సెంటర్ర్ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే అమర్ సూచనల మేరకు 300 పడకల ఏర్పాటు చేసి  దానికి తగిన వైద్య సిబ్బంది కిట్లను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహిస్తుండగా కోవిడ్ కేర్ సెంటర్ ను కూడా ఈ రోజు నుంచే ఉపయోగించినునట్లు తెలిపారు. వ్యాధి సీరియస్ అయితే విశాఖపట్నం తరలించడం జరుగుతుందన్నారు. వ్యాధి విస్తృతంగా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ సామాజిక దూరం వంటి జాగ్రత్తలను తప్పక పాటించాలన్నారు.


 

 




 




 


విశాఖ సెంట్రల్ జైల్ కు ఎల్జి పాలిమర్స్ నిందితులు


విశాఖ సెంట్రల్ జైల్ కు ఎల్జి పాలిమర్స్ నిందితులు



గ్యాస్ లీక్ ఘటనలో ఎండి  జియాంగ్ తో 12 మంది అరెస్టు



  జూలై 22 వరకు రిమాండ్  విధించిన జిల్లామెజిస్ట్రేట్


       విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)



విశాఖ ఎల్జి పాలిమర్స్ ఘటనలో అరెస్టు చేసిన 12 మంది నిందితులకు ఈనెల 22 తేదీ వరకు రిమాండ్ విధించారు. బుధవారం  నిందితులను జూమ్ యాప్  ద్వారా మేజిస్ట్రేట్ ముందు  పోలీసులు హాజరుపరచగా  నిందితులకు మేజిస్ట్రేట్ రిమాండ్ విధించారు. అనంతరం 12 మంది నిందితులను  విశాఖ కేంద్ర కారాగారానికి  తరలించారు. ఎల్జి పాలిమర్స్ లో మే 7న   స్టెరైన్  గ్యాస్ లీక్ జరిగింది. ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా పెద్ద సంఖ్యలో జనం ఏంటి లెటర్ కు బలయ్యారు. సంఘటనపై విచారణ జరపాలని ప్రభుత్వం హైపర్ కమిటీని నియమించింది. సంఘటనపై హైపర్ కమిటీ రిపోర్టును 2 రోజుల క్రితం ప్రభుత్వానికి సమర్పించింది. రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. విశాఖ పర్యావరణ ఇంజనీర్లు పి. ప్రసాదరావు  ఆర్. లక్ష్మీనారాయణ లను సస్పెండ్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. విశాఖ డిప్యూటీ చీఫ్ ఇంచార్జ్ ఆప్  పొల్యూషన్ జేబీఎస్ రాజును సస్పెండ్ చేస్తూ ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ దాడి చేసింది. ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ కి ప్రధాన కారణమైన 12 మంది ఉద్యోగులను అరెస్టు చేశారు. ఎల్జి పాలిమర్స్ సీఈవో మేనేజింగ్ డైరెక్టర్ సుంకే జియాంగ్   టెక్నీషియన్ డైరెక్టర్ డి ఎస్ కిమ్  మరో పది మంది ఉద్యోగులను అరెస్టు చేసి  రిమాండ్కు తరలించామని  నగర పోలీస్ కమిషనర్ ఆర్కె మీనా తెలిపారు. ఫ్యాక్టరీ పై ప్రభుత్వం  కఠినంగా చర్యలు చేపడుతుందని స్పష్టమవుతుంది.


రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి శంఖుస్థాపన


రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి శంఖుస్థాపన


      పాయకరావుపేట,పెన్ పవర్ 

 

     స్తానిక ఎంపిడిఒ కార్యలయ ఆవరణంలో 21.80లక్షల రూపాయలతో రైతుభరోసా కేంద్రం నూతనభవన నిర్మాణానికీ బుదవారం ఎమ్మేల్యే గొల్ల బాబురావు భూమి పూజనిర్వహించి శంఖుస్థాపన చేసారు.ఈ కార్యక్రమంలో మార్కెటు యార్డు వైస్ చైర్మెను గుటూరి శ్రీను, మాజీ జెడ్పిఫ్లోర్ లీడర్ చిక్కాల రామారావు,మండలాధ్యక్షులు దనిశెట్టి బాబురావు,టౌన్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా,దళితనాయకులు లంక సూరిబాబు,పెదపాటిమేఘరంజన్ ,ఎంపిడిఒ సాంబశివరావు,ఎమ్మార్వో అంభేడ్కర్ , ఈఓపిఆర్ డి వెంకటనారాయణ,హౌసింగు ఏఈ సామ్యూల్ రాజు,వ్యవసాయ అదికారి సౌజన్య,ఎఇఒ నాగమణి తదితరులు పాల్గొన్నారు. 

మామిడి నూకరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కు నివాళి

మామిడి నూకరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ కు నివాళి

 

అనకాపల్లి

 

దళిత నాయకులు మామిడి నూకరాజు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 71వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి పట్టణ ఎస్సి సెల్ అధ్యక్షుడు మామిడి నూకరాజు  మాట్లాడుతూ ఆయన 2004 లో  గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేశారనారు. సామాన్యుడు కార్పొరేట్ ఆస్పటల్ వైపు చూడాలంటే భయం ఫుటేది కానీ ఆయన పెట్టిన ఆరోగ్య శ్రీ వలన పేదవాడి ఆరోగ్యానికి భరోసా దొరికిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కొలి సత్యరావు, ఆర్ సంతోష్ కుమార్, కొణతాల శ్రీనివాసరావు ,కట్టమూరి బాబీ ,కట్టమూరి మంగరాజు తదితరులు పాల్గొన్నారు.


ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి వేడుకలు


ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి వేడుకలు


           పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 జయంతి సందర్భంగా పరవాడ సంతబయలు వద్ద రాజశేఖరరెడ్డి  విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆధీప్ రాజ్.అనంతరం

వృద్దులకు,పేదలకు పండ్లు పంపిణీ చేసారు.అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించారు మైలాన్ ఫార్మా కంపెనీ వారు ఇచ్చిన డంపింగ్ ఆటో ని ప్రారంభించి,ఎస్.సి వీధి లో  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహనిర్మాణానికి శంకుస్థాపన చేసిన  అదీప్ రాజ్.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ,వైస్ చైర్మన్ జూనియర్ అప్పలనాయుడు,జడ్పీటీసీ అభ్యర్థి పీ.ఎస్ రాజు,మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు అప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ, పెందుర్తి బూత్ కమిటీ ఇంచార్జ్ వెన్నెల సన్యాసిరవు,చెల్లా కనకారావు,మద్ది శ్రీను,బొద్దపు చిన్నారావు, కోన రామారావు,పెదిశెట్టి శేఖర్, బోండా కనకారావు,వెన్నెల అప్పారావు,గొర్ల గోపి,బురద రాజు,తాతాజీ,కూండ్రపు సీతారామయ్య,మడక సూరిబాబు, గణేష్,నదియా, వై.సి.పీ నాయకులు బండారు రామారావు, పైల అప్పారావు (టి.వి), పైల అప్పలనాయుడు, పైల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

 రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా  రైతు దినోత్సవ వేడుకలు 



 రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా  రైతు దినోత్సవ వేడుకలు 


 

           పరవాడ, పెన్ పవర్ 

 

పరవాడ మండలం:మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి సందర్భంగా మండలం లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతు దినోత్సవ వేడుకలగా ఘనంగా నిర్వహించిన అధికారులు.మండల కెద్రం లోని రైతు భరోసా కేద్రంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించి రైతు లను ఘనంగా సన్మానించి సత్కకరించారు.    అనంతరం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వైఎస్సార్ రైతు భరోసా-పి.ఎమ్ కిసాన్,వైఎస్సార్ ఉచిత పంట భీమా,రైతు ల వద్దకే రాయితీ విత్తనాల పంపిణీ,వైఎస్సార్ పొలంబడి,0 వడ్డీకే పంట రుణాలు,ఉచిత బోర్ లు,ఉచిత విద్యుత్,వైఎస్సార్ పశునష్ట పరిహారం,ఇలా రైతు లకు అందిచే సదుపాయాలను వివరించారు.సేంద్రియ వ్యవసాయం మరియు విత్తన శుద్ధి గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి టి.శ్రీదేవి,మండల వ్యవసాయ శాఖ అధికారిణి చంద్రావతి,పశుసంవర్దక శాఖ ఎడి డాక్టర్ రామకృష్ణ కీర్తి,వైసిపి రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,జిల్లా పార్టీ కార్యదర్శి చుక్క రామునాయుడు,మండల పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,పెందుర్తి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జూనియర్ అప్పలనాయుడు,బండారు రామారావు,కోన రామారావు,రైతులు పాల్గొన్నారు.



ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు



పెన్ పవర్ (ముమ్మిడివరం)

దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి 71 వ జయంతి సందర్భంగా ముమ్మడి వరం సమైక్యాంధ్ర శిబిరం వద్ద గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేసిన ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...