Followers

ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి వేడుకలు


ఘనంగా వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి వేడుకలు


           పరవాడ, పెన్ పవర్

 

పరవాడ మండలం:దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 జయంతి సందర్భంగా పరవాడ సంతబయలు వద్ద రాజశేఖరరెడ్డి  విగ్రహానికి పులమాలలు వేసి నివాళులు అర్పించిన పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆధీప్ రాజ్.అనంతరం

వృద్దులకు,పేదలకు పండ్లు పంపిణీ చేసారు.అనంతరం పలు కార్యక్రమాలు నిర్వహించారు మైలాన్ ఫార్మా కంపెనీ వారు ఇచ్చిన డంపింగ్ ఆటో ని ప్రారంభించి,ఎస్.సి వీధి లో  డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహనిర్మాణానికి శంకుస్థాపన చేసిన  అదీప్ రాజ్.ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు, వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చుక్క రాము నాయుడు,పెందుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ,వైస్ చైర్మన్ జూనియర్ అప్పలనాయుడు,జడ్పీటీసీ అభ్యర్థి పీ.ఎస్ రాజు,మండల పార్టీ అధ్యక్షులు సిరిపురపు అప్పలనాయుడు,రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి గెడ్డం ఉమ, పెందుర్తి బూత్ కమిటీ ఇంచార్జ్ వెన్నెల సన్యాసిరవు,చెల్లా కనకారావు,మద్ది శ్రీను,బొద్దపు చిన్నారావు, కోన రామారావు,పెదిశెట్టి శేఖర్, బోండా కనకారావు,వెన్నెల అప్పారావు,గొర్ల గోపి,బురద రాజు,తాతాజీ,కూండ్రపు సీతారామయ్య,మడక సూరిబాబు, గణేష్,నదియా, వై.సి.పీ నాయకులు బండారు రామారావు, పైల అప్పారావు (టి.వి), పైల అప్పలనాయుడు, పైల నరేష్, తదితరులు పాల్గొన్నారు.

 రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా  రైతు దినోత్సవ వేడుకలు 



 రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా  రైతు దినోత్సవ వేడుకలు 


 

           పరవాడ, పెన్ పవర్ 

 

పరవాడ మండలం:మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 71 వ జయంతి సందర్భంగా మండలం లోని రైతు భరోసా కేంద్రాల్లో రైతు దినోత్సవ వేడుకలగా ఘనంగా నిర్వహించిన అధికారులు.మండల కెద్రం లోని రైతు భరోసా కేద్రంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించి రైతు లను ఘనంగా సన్మానించి సత్కకరించారు.    అనంతరం ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు వైఎస్సార్ రైతు భరోసా-పి.ఎమ్ కిసాన్,వైఎస్సార్ ఉచిత పంట భీమా,రైతు ల వద్దకే రాయితీ విత్తనాల పంపిణీ,వైఎస్సార్ పొలంబడి,0 వడ్డీకే పంట రుణాలు,ఉచిత బోర్ లు,ఉచిత విద్యుత్,వైఎస్సార్ పశునష్ట పరిహారం,ఇలా రైతు లకు అందిచే సదుపాయాలను వివరించారు.సేంద్రియ వ్యవసాయం మరియు విత్తన శుద్ధి గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి టి.శ్రీదేవి,మండల వ్యవసాయ శాఖ అధికారిణి చంద్రావతి,పశుసంవర్దక శాఖ ఎడి డాక్టర్ రామకృష్ణ కీర్తి,వైసిపి రాష్ట్ర సీఈసీ సభ్యులు పయిల శ్రీనివాసరావు,జిల్లా పార్టీ కార్యదర్శి చుక్క రామునాయుడు,మండల పార్టీ అధ్యక్షుడు సిరిపురపు అప్పలనాయుడు,పెందుర్తి మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జూనియర్ అప్పలనాయుడు,బండారు రామారావు,కోన రామారావు,రైతులు పాల్గొన్నారు.



ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు



పెన్ పవర్ (ముమ్మిడివరం)

దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి 71 వ జయంతి సందర్భంగా ముమ్మడి వరం సమైక్యాంధ్ర శిబిరం వద్ద గల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కేక్ కటింగ్ చేసిన ముమ్మడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్


ఆకుల వీర రాఘవ రావు దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం 


ఆకుల వీర రాఘవ రావు దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం 


పెన్ పవర్ ఆత్రేయపురం 


 


వాడపల్లి లోవేంచేసియున్న కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో దర్శనార్థం వచ్చిన భక్తులు తూర్పు గోదావరి జిల్లా  రాజమండ్రి వాస్తువులు అయినటువంటి ఆకుల వీర రాఘవ రావు శ్రీమతి కనకదుర్గ దంపతులు  వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం ఇచ్చినారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు కార్యనిర్వాహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు అర్చకులు చిత్రపటాన్ని ఇచ్చి ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు


ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు


ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు


 


పెన్ పవర్  అయినవిల్లి  


 


వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని  ముక్తేశ్వరం సెంటర్లలో  పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు, విలస గ్రామంలో బొంతు రాజేంద్రప్రసాద్, పులిదిండి ప్రభాకర్ ఆధ్వర్యంలో లేపర్స్ హాస్పటల్ రోగులకు బ్రెడ్,పళ్ళు అందచేశారు కార్యక్రమంలో మట్టపర్తి శ్రీనివాస్,గుత్తుల నాగబాబు,నంబూరి శ్రీ రామ చంద్రమూర్తి,రెడ్డి ప్రసాద్,నక్కా చంద్ర మోహన్,ముత్తబత్తుల సహాదేవ్, కడలి సుబ్రహ్మణ్యం, వార లక్ష్మీ నరసింహ రామ్,గన్నవరపు చంద్ర రావు,బడుగు దుర్గాదేవి,కాగిత రమేష్,తదినతరులు పాల్గొన్నారు


ఏలేశ్వరం జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ అజీం జానీ హఠాన్మరణం.



ఏలేశ్వరం జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ అజీం జానీ హఠాన్మరణం

 

ఏలేశ్వరం

 

స్థానిక జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ అజీమ్ జానీ(70) బుధవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. స్థానిక దిబ్బల పాలెంలో నివాసముంటున్న ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృదుస్వభావి అజీం జానీ హఠాన్మరణం పట్ల గ్రామ పెద్దలు, ముస్లిం పెద్దలు, యువకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పట్టణంలో పలువురు నాయకులు, ముస్లింలు తరలివచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వెలుబుచ్చారు.


వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రైతు దినోత్సవ వేడుక


 


పెన్ పవర్, ఆత్రేయపురం


  కొత్తపేట సబ్ డివిజన్ ఆత్రేయపురం లో అన్ని గ్రామాల్లో  రైతు భరోసా కేంద్రాల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుసంధానమైన శాఖల ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్నికి పూలమాలలు వేసి రైతు భరోసా కేంద్రం సాంగ్ను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లో  బి. మద్దల ఎంపీడీవో నాతి బుజ్జి అంకంపాలెం గ్రామం లో వై ఎస్ ఆర్ సి పి ముఖ్య అతిథులు రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వీటితో పాటుగా ద్వారా అనుబంధ సంస్థ అయిన పొలం పిలుస్తుంది పసువు విజ్ఞాన బడి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ క్రమంలో కనుమూరు శ్రీనివాసరాజు పొట్ల సూర్యనారాయణ రాజు తూము సుబ్రహ్మణ్యం చెరుకూరి రామకృష్ణ రాజు బాబురావు కరుటూరి సత్యనారాయణ కరుటూరి బ్రహ్మాజీ రాజారత్నం పుల్లయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...