Followers

ఆకుల వీర రాఘవ రావు దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం 


ఆకుల వీర రాఘవ రావు దంపతులు వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం 


పెన్ పవర్ ఆత్రేయపురం 


 


వాడపల్లి లోవేంచేసియున్న కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో దర్శనార్థం వచ్చిన భక్తులు తూర్పు గోదావరి జిల్లా  రాజమండ్రి వాస్తువులు అయినటువంటి ఆకుల వీర రాఘవ రావు శ్రీమతి కనకదుర్గ దంపతులు  వెంకన్న అన్నప్రసాదం ట్రస్టుకు 25000 విరాళం ఇచ్చినారు వీరిని దేవస్థానం చైర్మన్ రమేష్ రాజు ధర్మకర్త మండలి సభ్యులు కార్యనిర్వాహణాధికారి ముదునూరి సత్యనారాయణ రాజు అర్చకులు చిత్రపటాన్ని ఇచ్చి ఆ దంపతులకు కృతజ్ఞతలు తెలియజేశారు


ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు


ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు


 


పెన్ పవర్  అయినవిల్లి  


 


వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని  ముక్తేశ్వరం సెంటర్లలో  పూలమాల వేసి నివాళులు అర్పించిన నాయకులు, విలస గ్రామంలో బొంతు రాజేంద్రప్రసాద్, పులిదిండి ప్రభాకర్ ఆధ్వర్యంలో లేపర్స్ హాస్పటల్ రోగులకు బ్రెడ్,పళ్ళు అందచేశారు కార్యక్రమంలో మట్టపర్తి శ్రీనివాస్,గుత్తుల నాగబాబు,నంబూరి శ్రీ రామ చంద్రమూర్తి,రెడ్డి ప్రసాద్,నక్కా చంద్ర మోహన్,ముత్తబత్తుల సహాదేవ్, కడలి సుబ్రహ్మణ్యం, వార లక్ష్మీ నరసింహ రామ్,గన్నవరపు చంద్ర రావు,బడుగు దుర్గాదేవి,కాగిత రమేష్,తదినతరులు పాల్గొన్నారు


ఏలేశ్వరం జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ అజీం జానీ హఠాన్మరణం.



ఏలేశ్వరం జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ అజీం జానీ హఠాన్మరణం

 

ఏలేశ్వరం

 

స్థానిక జామియా మస్జిద్ అంజుమాన్ కమిటీ ప్రెసిడెంట్ షేక్ అజీమ్ జానీ(70) బుధవారం ఉదయం గుండెపోటుతో హఠాన్మరణానికి గురయ్యారు. స్థానిక దిబ్బల పాలెంలో నివాసముంటున్న ఆయనకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృదుస్వభావి అజీం జానీ హఠాన్మరణం పట్ల గ్రామ పెద్దలు, ముస్లిం పెద్దలు, యువకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పట్టణంలో పలువురు నాయకులు, ముస్లింలు తరలివచ్చి ఆయన పార్థివ దేహాన్ని సందర్శించారు. అలాగే వారి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని వెలుబుచ్చారు.


వైయస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రైతు దినోత్సవ వేడుక


 


పెన్ పవర్, ఆత్రేయపురం


  కొత్తపేట సబ్ డివిజన్ ఆత్రేయపురం లో అన్ని గ్రామాల్లో  రైతు భరోసా కేంద్రాల్లో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా జన్మదినాన్ని పురస్కరించుకొని రైతు దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ అనుసంధానమైన శాఖల ఆధ్వర్యంలో రైతు భరోసా కేంద్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటాన్నికి పూలమాలలు వేసి రైతు భరోసా కేంద్రం సాంగ్ను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో లో  బి. మద్దల ఎంపీడీవో నాతి బుజ్జి అంకంపాలెం గ్రామం లో వై ఎస్ ఆర్ సి పి ముఖ్య అతిథులు రైతు దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు వీటితో పాటుగా ద్వారా అనుబంధ సంస్థ అయిన పొలం పిలుస్తుంది పసువు విజ్ఞాన బడి కార్యక్రమాల గురించి వివరించడం జరిగింది ఈ క్రమంలో కనుమూరు శ్రీనివాసరాజు పొట్ల సూర్యనారాయణ రాజు తూము సుబ్రహ్మణ్యం చెరుకూరి రామకృష్ణ రాజు బాబురావు కరుటూరి సత్యనారాయణ కరుటూరి బ్రహ్మాజీ రాజారత్నం పుల్లయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు


గూటాలలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు


 


గూటాలలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు

పోలవరం, పెన్ పవర్

పోలవరం మండలం గూటాల పంచాయతీ పరిధిలో వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని మెయిన్ సెంటర్, బస్ షెల్టర్ , రైతు భరోసా కేంద్రం నందు  గల దివంగత మహానేత   వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సొసైటీ అధ్యక్షులు సుంకర అంజి బాబు, యువజన నాయకుడు సుంకర కొండబాబు, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ డేగపాటి హరి రామ కృష్ణ, డాక్టర్ శ్రీనివాసు  లు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అని సొసైటీీ అధ్యక్షులు సుంకర అంజిబాబు అన్నారు . తండ్రిి బాటలోనే నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి  వైఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు.


ఈ కార్యక్రమంలో గూటాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు 

రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోండి.


 


 రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోండి.

 

 రైతు భరోసా కేంద్రాలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు రైతులను  కోరారు

 

 

పెన్ పవర్, ఉంగుటూరు

 

 

ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం కురెళ్ళగూడెం లోని రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు కోరారు. రైతు దినోత్సవం పురస్కరించుకొని  గ్రామస్థాయిలో ఎకరాకు 60 ధాన్యం బస్తాల దిగుబడి సాధించిన రైతును ,ఎకరాకు 6 టన్నుల ఆక్వా దిగుబడి సాధించిన ఆక్వా రైతును, కౌలు రైతులను పశుపోషణ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన  ఆక్వా రైతులను కలెక్టర్ గారు , శాసనసభ్యులు వారు సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసు బాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా తన అందించిన సేవలు ద్వారా గుర్తింపు పొందారన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అంతకు మించిన స్థాయిలో రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం  ద్వారా గుర్తింపు పొందటం అభినందనీయమన్నారు.  రైతులకు వడ్డీ రాయితీ గా కేటాయించిన మొత్తాలను ముఖ్యమంత్రి రైతుల ఖాతాలోకి నేరుగా జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ఉంగుటూరు శాసనసభ్యులుపుప్పాలవాసుబాబు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉంగుటూరు వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసిన మైగాపుల దుర్గాప్రసాద్


పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసిన మైగాపుల దుర్గాప్రసాద్



పోలవరం పెన్ పవర్


పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని  మైగాపుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో  వైసిపి పోలవరం మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ చేతులమీదుగా  పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ వారి ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశారు. కొత్త పట్టిసీమలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నాటి నుండి కొత్త పట్టిసీమ కంటోన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలకు    కూరగాయలు,  కిరాణా , రోగనిరోధక శక్తిని పెంచే సామాగ్రి లను కొద్ది రోజుల క్రితం పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దుప్పట్లు  పంపిణీ చేస్తూ కొత్త పట్టిసీమ ప్రజలకు సేవలందిస్తూ వారికి అండగా ఉంటున్న మైగాపుల దుర్గా ప్రసాద్ కు స్థానిక ప్రజలు, నాయకులు అభినందనలు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వైసిపి పోలవరం మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, మైగాపుల దుర్గాప్రసాద్, గంగు అనిల్ కుమార్, ఆకుల సత్యనారాయణ, వైసిపి నాయకులు పాల్గొన్నారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...