Followers
కుకునూరు రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవం
వైయస్సార్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు .
వైయస్సార్ జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు .
వైసిపి పోలవరం మండల అధ్యక్షుడు బుగ్గా మురళీకృష్ణ..
పోలవరం, పెన్ పవర్
వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని పోలవరం మండలం స్థానిక పంచాయతీ ఆవరణలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర వెంకట రెడ్డి, మండల అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ లు స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బుగ్గా మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి మరెన్నో పథకాలు పేద ప్రజలకు చేరువయ్యేలా పరిపాలన కొనసాగించారని అందుకే ఆయనను అపర భగీరథుడు, రైతు బాంధవుడు, ప్రజల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని అన్నారు. ఆయన దూరమైన ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరూ ఆయన్ని మరిచిపోలేదని గుర్తు చేశారు. ప్రజా పాలనలో, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంలోను, వాటిని అమలు చేయడంలోనూ తండ్రికి మించిన తనయుడుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సుంకర వెంకట రెడ్డి, బుగ్గా మురళీకృష్ణ, షేక్ పాతి మున్నీసా, దాకే మంగాయమ్మ, గంగు అనిల్ కుమార్, పాదం రాజబాబు, డి రమేష్, సోబ్బాన మోహన్, ఘంటా శ్రీను, గోక చిట్టి రాజు, కె రాజు, శివ ప్రసాద్, రాణి, దుర్గ, అప్పారావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విగ్రహ ఆవిష్కరణలో మంత్రి వనిత
పేదల నివాసానికి అనుకూలంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: గొల్లపల్లి
పేదల నివాసానికి అనుకూలంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: గొల్లపల్లి
రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం. ఎమ్మెల్యే పర్వత
ముదిరిన' వెలి 'వివాదం
ముదిరిన' వెలి 'వివాదం
- అధికారుల సమక్షంలోనే ఒక వర్గంపై మరొక వర్గం దాడి..
- ఒక మహిళ, ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు,
- గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు
దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి
ముంబైలో "బాబా సాహెబ్ అంబేద్కర్" నివాస రాజ గృహంపై దుండగుల దాడి కి నిరసనగా దర్నా
పూర్ణా మార్కెట్, పెన్ పవర్.
ముంబైలో "బాబా సాహెబ్ అంబేద్కర్ "నివాస రాజ గృహంపై దుండగుల దాడి, గృహం మొత్తం ధ్వంసం కి నిరసనగా విశాఖలో ఎల్ ఐ.సీ బిల్డింగ్ దగ్గర వున్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీ.జె.పి విశాఖ ఎస్సీ మూర్ఛ అద్యక్షులు చొక్కాకులు రాంబాబు మాట్లాడుతూ ఈ దాడిని కండించారు, ఈ దాడి రాజ గృహంపై దాడి కాదని, దేశ వ్యాప్త దళితుల ఆత్మ గౌరవం పై దాడి అని, దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జగదీష్ కుమార్, ఏస్.రవి కుమార్, డీ. శ్రీనివాస్ రావు తదతరులు పాల్గొన్నారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...