Followers

రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం. ఎమ్మెల్యే పర్వత



రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యం. ఎమ్మెల్యే పర్వత

 

 ఏలేశ్వరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి  ప్రతి నిరుపేదకు విద్య ,వైద్యం, సొంతిల్లు అందాలని కన్న కలలు జగన్ ద్వారా సాధ్యమవుతుందని ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. మండల పరిధి పెద్దనాపల్లి గ్రామంలో రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నూతనంగా నిర్మించిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం సచివాలయం నిర్మాణ పనులతో ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువాడు ఉన్నంత వరకూ రాజశేఖర్ రెడ్డిని మరువలేము అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు గొల్లపల్లి బుజ్జి, బది రెడ్డి గోవింద్, గొల్లపల్లి కాశీ విశ్వనాథ్, బుద్ధ ఈశ్వరరావు, ఎంపీడీవో డిఎన్ రత్నకుమారి తదితరులు ఉన్నారు.


ముదిరిన' వెలి 'వివాదం



ముదిరిన' వెలి 'వివాదం


 


- అధికారుల సమక్షంలోనే ఒక వర్గంపై మరొక వర్గం దాడి..


- ఒక మహిళ, ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు, 


- గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు


 

రావులపాలెం మండలం లక్ష్మీపోలవరంలో గత కొన్నేళ్లుగా సాగుతున్న వెలి వివాదం ముదిరి దాడులకు దారి తీసింది.

తమను వెలి వేసి సంఘ కార్యక్రమాలలో పాల్గొనకుండా అడ్డుకుంటున్న కుల పెద్దలపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ సోమవారం లక్ష్మీపోలవరం గ్రామానికి చెందిన కొంతమంది దళితులు అమలాపురంలో ఆర్.డి.ఓ భవానీ శంకర్ కు వినతి పత్రం సమర్పించారు. గత నాలుగు సంవత్సరాలుగా తమ సొసైటీకి చెందిన సుమారు 15 ఎకరాల భూమి, కొబ్బరి చెట్లు,చెరువు , లీజుకు  పాటలు పెట్టగా వచ్చిన ఆదాయాన్ని మాకు చెందకుండా అడ్డుకుంటున్నారని,

పాడేందుకు వెళ్లిన తమను మీరు సంఘంలో లేరు, మీకు పాడేందుకు అవకాశం ఇచ్చేది లేదు అంటూ తిరస్కరిస్తున్నారని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. తమను వెలి నుండి తక్షణం ఉపసమనం కలిగేలా చర్యలు తీసుకోవాలని,లీజుకు పాట పాడేందుకు అవకాశం కల్పించాలని,సొసైటీ కి వచ్చే ఆదాయం మాకు కూడా చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో మంగళవారం తహశీల్దార్ ఎం.డీ.యూసుఫ్ జిలానీ, సిఐ  వి కృష్ణ,ఎస్సై పి.బుజ్జిబాబులు గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఇరు వర్గాల సభ్యులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సంఘ పెద్దలు బాధిత ముప్పై మూడు కుటుంబాలను కుటుంబానికి రూ.4వేలు చొప్పున తప్పుగా చెల్లిస్తే సంఘంలో చేర్చుకుంటామని తేల్చి చెప్పారు. అయితే తామెందుకు డబ్బు కట్టాలని, ఒక్క రూపాయి కూడా కట్టేది లేదని తేల్చిచెప్పారు దీంతో శుక్రవారం రావులపాలెం తహశీల్దార్ కార్యాలయంలో మరో సమావేశం ఏర్పాటు చేసి చర్చిస్తామని ఇరు వర్గాల వారు రావాలని సూచించారు. దీంతో ఇరు వర్గాలు అక్కడినుంచి వెళ్తున్న సమయంలో బాధిత కుటుంబాలకు చెందిన పెనుమాల రిషిప్రియ పై సంఘంలోని కొందరు  రెండు పర్యాయాలు దాడి చేయడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. దాడిని అడ్డుకునేందుకు వచ్చిన సఖిలే అనిల్ కుమార్, సఖిలే సునీల్ కుమార్, బాదం ప్రభు రోషన్లపై సంఘస్తులు దాడిచేయడంతో గాయాలపాలయ్యారు.వీరితో పాడు సంఘ సభ్యులు నక్కా వెంకటరత్నం, నక్కా చంద్రశేఖర్ లు గాయపడ్డారు. ఇరువర్గాల వారని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి, రావులపాలెం ప్రైవేటు హాస్పిటల్ లకు తరలించారు.ఇరు వర్గాల వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 24 మందిపై కేసులు నమోదు చేసినట్టు ఎస్సై పి బుజ్జిబాబు తెలిపారు.గ్రామంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్య గా పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశారు.


దాడికి పాల్పడిన వారిని శిక్షించాలి


 


ముంబైలో "బాబా సాహెబ్ అంబేద్కర్" నివాస రాజ గృహంపై దుండగుల దాడి కి   నిరసనగా దర్నా


 పూర్ణా మార్కెట్, పెన్ పవర్.



ముంబైలో  "బాబా సాహెబ్ అంబేద్కర్ "నివాస రాజ   గృహంపై దుండగుల దాడి, గృహం మొత్తం ధ్వంసం కి  నిరసనగా    విశాఖలో ఎల్ ఐ.సీ బిల్డింగ్ దగ్గర వున్న  బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర బీ.జె.పి విశాఖ ఎస్సీ  మూర్ఛ అద్యక్షులు చొక్కాకులు రాంబాబు మాట్లాడుతూ  ఈ దాడిని కండించారు, ఈ దాడి రాజ గృహంపై దాడి కాదని, దేశ వ్యాప్త దళితుల ఆత్మ గౌరవం పై దాడి అని, దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జగదీష్ కుమార్, ఏస్.రవి కుమార్, డీ. శ్రీనివాస్ రావు తదతరులు పాల్గొన్నారు.


రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్టు, శ్రీ గాయత్రి వెల్ఫేర్ ల ఆధ్వర్యములో స్వచ్ఛభారత్.


పూర్ణా మార్కెట్, పెన్ పవర్.


రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్టు, శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్  అకాడమీ  కలిసి నిర్వహించిన స్వచ్ఛభారత్  కార్యక్రమము ప్రకృతి చికిత్సాలయం రోడ్డు నందు జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న  రూపాకుల రవికుమార్  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం కన్వీనర్ ముందుగా మురికి కాలువల లోని  పేరుకొని ఉన్న చెత్తను బయటికి తీశారు ప్రతి ఇంటి ముందు శుభ్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  వానకాలంలో  దోమ కాటు వలన వచ్చు జ్వరము అనగా మలేరియా, డెంగ్యూ, వైరల్, స్వినే ఫ్లు,  మొదలగు రకాలైన వ్యాధులు సోకకుండా  స్వచ్ఛభారత్ చేయుట వలన మంచి ఫలితాలు   వస్తాయని అన్నారు . ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన  స్వచ్ఛభారత్ ,జనదన్, ముద్రా రుణాలు మొదలగు పథకాలు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయ అన్నారు.ప్రతివారు  స్వచ్ఛభారత్నీ  ఆచరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డా.శిష్ట్లా  శ్రీలక్ష్మి, గౌతం,గేదల శ్రీహరి, వై.లక్ష్మి, జీ.రాము. పాల్గొన్నారు


రేఖపల్లిలో వై.యస్.ఆర్. 71వ జయంతి వేడుకలు



రేఖపల్లిలో వై.యస్.ఆర్. 71వ జయంతి వేడుకలు

 

 

వి.ఆర్.పురం. పెన్ పవర్

 

వి.ఆర్.పురం. మండలం రేఖపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్.వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కన్వీనర్ పొడియం గోపాల్ మాట్లాడుతూ వై.యస్.రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా వుండి పనిచేయాలని ఆయన అన్నారు. మండల యూత్ కన్వీనర్ చిక్కాల బాలు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అర్ధమయ్యే విధంగా తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యస్.సి. సెల్ కార్యదర్శి మాచర్ల గంగులు, బి.సి.సెల్ కార్యదర్శి ముత్యాల శ్రీను, సంయుక్త కార్యదర్శి మురళి, అరకు పార్లమెంట్ కార్యదర్శి బొడ్డు సత్యనారాయణ, మాదిరెడ్డి సత్తిబాబు, మామిడి రమణ, మామిడి రాజు, కడుపు రమేష్, ముత్యాల గౌతమ్, వెంగళరావు, కాంతారావు, రేవు బాలరాజు, అందల రమణారావు, కాపారపు ఉమ తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి




ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి

 

గోకవరం పెన్ పవర్.

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వైయస్ జగన్ ప్రభుత్వం  కృషి చేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అన్నారు. మండలంలోనే గోకవరం గ్రామంలో బుధవారం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం లో హెచ్పిసిఎల్ ఆయిల్ ప్లాంట్ టెర్మినల్ సౌజన్యంతో 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన డిజిటల్ ఎక్స్ రే మిషన్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన 104 మొబైల్ వైద్య సౌకర్యాలు వాహనాన్ని  ఎమ్మెల్యే చంటిబాబు ప్రారంభించారు. అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 జయంతి సందర్భంగా గోకవరం పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే చంటి బాబు ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని తంటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ హెచ్ ఆర్ వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే చంటి బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి సూరారెడ్డి,వరసాల. ప్రసాద్, జానప రెడ్డి సుబ్బారావు, దాసరి రమేష్, చింతల్ అనిల్ కుమార్, నరాల శెట్టి నరసయ్య, సుంకర వెంకటరమణ, సమ్మేటి. నాని, బద్ది రెడ్డి రెడ్డయ్య, సుంకర వీరబాబు, కొల్లాటి రామకృష్ణ, గోల్లా ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.


నగరంలో కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల రాకెట్.


 


నగరంలో కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల రాకెట్.
   భారీ  డ్రగ్స్ తో నలుగురు వ్యక్తులు అరెస్ట్.
గోవా బెంగళూరు నుంచి విశాఖ చేరుతున్న  డ్రగ్స్.


      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
విశాఖ నగరంలో మాదక ద్రవ్యాలు కలకలం రేపుతోంది, టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేశారు. భారీ ఎత్తు డ్రగ్స్ తో నలుగురిని అరెస్టు చేశారు. నగరంలో కరోనా మహమ్మారి విలయ  తాండవం ఆడుతుంటే మరోవైపు డ్రగ్స్ మాఫియా వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు. గోవా బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విశాఖపట్నంలో సరఫరా చేస్తూ నిందితులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే సీతమ్మ పేట నాయుడు వీధికి చెందిన మనుకొండ సత్యనారాయణ(26) సాలిగ్రామ పురం నరసింహ నగర్ కి చెందిన  మజ్జి అజయ్ కుమార్(24) బాలయ్య శాస్త్రి లేఔట్ చెందిన  కంది రవికుమార్(22) కంచరపాలెం సుభాష్ నగర్ కి చెందిన కేతి మనోజ్ స్వరూప్ లను టాస్క్ఫోర్స్ పోలీసులు ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 61 ఎల్ ఎస్ డి స్టిక్కర్లు  2.5 గ్రాముల ఎం డి ఎం ఏ  గంజాయి 60 గ్రాములు 9500 రూపాయల నగదు స్వాధీనపరచుకున్నారు.  429/ 2020.  21 బి 27 ఏ 20 బి 2 ఏ మాదకద్రవ్యాల  (1985)చట్టం కింద కేసులు నమోదు చేశారు. మను కొండ సత్యనారాయణకు గంజాయి డ్రగ్స్ అలవాటు ఉంది. ఏజెన్సీ నుంచి శీలవతి గంజాయి ది తక్కువ ధరకు కొనుగోలు చేసి మజ్జి అజయ్ కుమార్ గోవా బెంగుళూరు తరలించి విక్రయిస్తుంటారు. ఈ నెల 24న అజయ్ కుమార్  బెంగళూరు వెళ్లి సత్యనారాయణతో కలిశాడు.  ఎల్ ఎస్ డి బ్లాట్స్ 70 ఎం డి ఎం ఏ మూడు గ్రాములుతొ అజయ్ కుమార్ 27న విశాఖ చేరుకున్నారు 30 న సత్తిబాబు బెంగళూరు నుంచి విశాఖ వచ్చాడు. కంది రవికుమార్  సూచించిన కేతి  మనోజ్ స్వరూప్ కి ఎం డి ఎం ఏ 3 గ్రాములు ఐదు వేల రూపాయలకు ఇస్తుండగా కైలాస్ పురం ఫోర్ట్ హై స్కూల్ వద్ద పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నగరంలో డి ఐ జి  గౌతమ్ సేవక్ ఈ పర్యటనలో ఉన్న సమయంలో డ్రగ్ రాకెట్ పట్టుబడటం విశేషం. పోలీసు బాస్ లు  నగర పర్యటన  ఉండగా భారీ ఎత్తున డ్రగ్స్ పాటుపడడం  పోలీసులకు సవాల్  విసిరినట్లు అయింది. ఈ డ్రగ్ రాకెట్ పై విచారణ సాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...