పూర్ణా మార్కెట్, పెన్ పవర్.
రూపాకుల విశాలాక్షి చారిటబుల్ ట్రస్టు, శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ కలిసి నిర్వహించిన స్వచ్ఛభారత్ కార్యక్రమము ప్రకృతి చికిత్సాలయం రోడ్డు నందు జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రూపాకుల రవికుమార్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం కన్వీనర్ ముందుగా మురికి కాలువల లోని పేరుకొని ఉన్న చెత్తను బయటికి తీశారు ప్రతి ఇంటి ముందు శుభ్రం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానకాలంలో దోమ కాటు వలన వచ్చు జ్వరము అనగా మలేరియా, డెంగ్యూ, వైరల్, స్వినే ఫ్లు, మొదలగు రకాలైన వ్యాధులు సోకకుండా స్వచ్ఛభారత్ చేయుట వలన మంచి ఫలితాలు వస్తాయని అన్నారు . ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ ,జనదన్, ముద్రా రుణాలు మొదలగు పథకాలు ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయ అన్నారు.ప్రతివారు స్వచ్ఛభారత్నీ ఆచరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డా.శిష్ట్లా శ్రీలక్ష్మి, గౌతం,గేదల శ్రీహరి, వై.లక్ష్మి, జీ.రాము. పాల్గొన్నారు