Followers

రేఖపల్లిలో వై.యస్.ఆర్. 71వ జయంతి వేడుకలు



రేఖపల్లిలో వై.యస్.ఆర్. 71వ జయంతి వేడుకలు

 

 

వి.ఆర్.పురం. పెన్ పవర్

 

వి.ఆర్.పురం. మండలం రేఖపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్.వై.యస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి 71వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కన్వీనర్ పొడియం గోపాల్ మాట్లాడుతూ వై.యస్.రాజశేఖర రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా వుండి పనిచేయాలని ఆయన అన్నారు. మండల యూత్ కన్వీనర్ చిక్కాల బాలు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు అర్ధమయ్యే విధంగా తెలియజేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యస్.సి. సెల్ కార్యదర్శి మాచర్ల గంగులు, బి.సి.సెల్ కార్యదర్శి ముత్యాల శ్రీను, సంయుక్త కార్యదర్శి మురళి, అరకు పార్లమెంట్ కార్యదర్శి బొడ్డు సత్యనారాయణ, మాదిరెడ్డి సత్తిబాబు, మామిడి రమణ, మామిడి రాజు, కడుపు రమేష్, ముత్యాల గౌతమ్, వెంగళరావు, కాంతారావు, రేవు బాలరాజు, అందల రమణారావు, కాపారపు ఉమ తదితరులు పాల్గొన్నారు.


ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి




ప్రభుత్వ ఆస్పత్రిలో సౌకర్యాల కల్పనకు కృషి

 

గోకవరం పెన్ పవర్.

 

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వైయస్ జగన్ ప్రభుత్వం  కృషి చేస్తుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు అన్నారు. మండలంలోనే గోకవరం గ్రామంలో బుధవారం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం లో హెచ్పిసిఎల్ ఆయిల్ ప్లాంట్ టెర్మినల్ సౌజన్యంతో 10 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటుచేసిన డిజిటల్ ఎక్స్ రే మిషన్ మరియు ప్రభుత్వ ఆసుపత్రిలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన 104 మొబైల్ వైద్య సౌకర్యాలు వాహనాన్ని  ఎమ్మెల్యే చంటిబాబు ప్రారంభించారు. అనంతరం దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 71 జయంతి సందర్భంగా గోకవరం పాత బస్టాండ్ లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని ఎమ్మెల్యే చంటి బాబు ఆవిష్కరించారు. అనంతరం మండలంలోని తంటికొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ హెచ్ ఆర్ వాటర్ ట్యాంక్ ను ఎమ్మెల్యే చంటి బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు కర్రి సూరారెడ్డి,వరసాల. ప్రసాద్, జానప రెడ్డి సుబ్బారావు, దాసరి రమేష్, చింతల్ అనిల్ కుమార్, నరాల శెట్టి నరసయ్య, సుంకర వెంకటరమణ, సమ్మేటి. నాని, బద్ది రెడ్డి రెడ్డయ్య, సుంకర వీరబాబు, కొల్లాటి రామకృష్ణ, గోల్లా ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు.


నగరంలో కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల రాకెట్.


 


నగరంలో కలకలం రేపుతున్న మాదకద్రవ్యాల రాకెట్.
   భారీ  డ్రగ్స్ తో నలుగురు వ్యక్తులు అరెస్ట్.
గోవా బెంగళూరు నుంచి విశాఖ చేరుతున్న  డ్రగ్స్.


      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
విశాఖ నగరంలో మాదక ద్రవ్యాలు కలకలం రేపుతోంది, టాస్క్ఫోర్స్ పోలీసులు ఆదివారం డ్రగ్స్ మాఫియా గుట్టు రట్టు చేశారు. భారీ ఎత్తు డ్రగ్స్ తో నలుగురిని అరెస్టు చేశారు. నగరంలో కరోనా మహమ్మారి విలయ  తాండవం ఆడుతుంటే మరోవైపు డ్రగ్స్ మాఫియా వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడ్డారు. గోవా బెంగళూరు నుంచి మాదకద్రవ్యాలను తెచ్చి విశాఖపట్నంలో సరఫరా చేస్తూ నిందితులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే సీతమ్మ పేట నాయుడు వీధికి చెందిన మనుకొండ సత్యనారాయణ(26) సాలిగ్రామ పురం నరసింహ నగర్ కి చెందిన  మజ్జి అజయ్ కుమార్(24) బాలయ్య శాస్త్రి లేఔట్ చెందిన  కంది రవికుమార్(22) కంచరపాలెం సుభాష్ నగర్ కి చెందిన కేతి మనోజ్ స్వరూప్ లను టాస్క్ఫోర్స్ పోలీసులు ఫోర్త్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 61 ఎల్ ఎస్ డి స్టిక్కర్లు  2.5 గ్రాముల ఎం డి ఎం ఏ  గంజాయి 60 గ్రాములు 9500 రూపాయల నగదు స్వాధీనపరచుకున్నారు.  429/ 2020.  21 బి 27 ఏ 20 బి 2 ఏ మాదకద్రవ్యాల  (1985)చట్టం కింద కేసులు నమోదు చేశారు. మను కొండ సత్యనారాయణకు గంజాయి డ్రగ్స్ అలవాటు ఉంది. ఏజెన్సీ నుంచి శీలవతి గంజాయి ది తక్కువ ధరకు కొనుగోలు చేసి మజ్జి అజయ్ కుమార్ గోవా బెంగుళూరు తరలించి విక్రయిస్తుంటారు. ఈ నెల 24న అజయ్ కుమార్  బెంగళూరు వెళ్లి సత్యనారాయణతో కలిశాడు.  ఎల్ ఎస్ డి బ్లాట్స్ 70 ఎం డి ఎం ఏ మూడు గ్రాములుతొ అజయ్ కుమార్ 27న విశాఖ చేరుకున్నారు 30 న సత్తిబాబు బెంగళూరు నుంచి విశాఖ వచ్చాడు. కంది రవికుమార్  సూచించిన కేతి  మనోజ్ స్వరూప్ కి ఎం డి ఎం ఏ 3 గ్రాములు ఐదు వేల రూపాయలకు ఇస్తుండగా కైలాస్ పురం ఫోర్ట్ హై స్కూల్ వద్ద పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నగరంలో డి ఐ జి  గౌతమ్ సేవక్ ఈ పర్యటనలో ఉన్న సమయంలో డ్రగ్ రాకెట్ పట్టుబడటం విశేషం. పోలీసు బాస్ లు  నగర పర్యటన  ఉండగా భారీ ఎత్తున డ్రగ్స్ పాటుపడడం  పోలీసులకు సవాల్  విసిరినట్లు అయింది. ఈ డ్రగ్ రాకెట్ పై విచారణ సాగుతోందని పోలీసు వర్గాలు తెలిపాయి.


ఒడిశా అడవుల్లో మావోలు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు


ఒడిశా అడవుల్లో మావోలు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు


నలుగురు మావోలు మృతి. పలువురికి తీవ్ర గాయాలు.ఏవోబీ  పరిధిలో అప్రమత్తమైన పోలీసులు
ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో గాలిస్తున్న పోలీస్ బలగాలు


        విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
ఒడిశా అడవుల్లో ఆదివారం మావోయిస్టుల పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా భారీ సంఖ్యలో   మావోయిస్టులు తీవ్ర గాయాల పాలైన ట్లు   సమాచారం పోలీస్ వర్గాల ద్వారా వస్తుంది. కొందమాల్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులకు దారితీసింది. ఈ ప్రమాదంలో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. గాయాలపాలైన మావోయిస్టులు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో చేరుతారన్న సమాచారంతో ఏవోబీ పరిధిలో  పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర ఒరిస్సా పోలీసులు  గాయాలపాలైన మావోయిస్టుల ఆచూకీ  కోసం  జల్లెడ పడుతున్నట్లు స మాచారం. కరోనా మహమ్మారి  నియంత్రణలో భాగంగా పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇదే  అదునుగా మావోయిస్టులు యాక్షన్ టీంలు రిక్కీ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావానికి చెక్ పెట్టాలని  పోలీసు బలగాలు  ఆంధ్ర  ఒడిశా సరిహద్దుల్లో గాలింపు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కాకుండా  కల్వర్టులు  ప్రధాన కూడళ్లు  వారపు సంతలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా సాగిస్తున్నారు. క్షతగాత్రులైన మావోయిస్టులు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు.  మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.


బాలికపై అత్యచారం


బాలికపై అత్యచారం


పోలీసుల అదుపులో ముగ్గురు వ్యక్తులు


తల్లిదండ్రులు లేని బాలికపై కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు

 

బాలిక గర్భం దాల్చడంతో వెలుగులోకి వచ్చిన వైనం

 

     విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

విశాఖ జిల్లాలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తల్లిదండ్రులు లేని ఓ బాలికను మాయమాటలు చెప్పి ముగ్గురు వ్యక్తులు కొంతకాలంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల ఆ బాలిక అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలు నిర్వహించిన ఆమె గర్భం దాల్చినట్లు గుర్తించారు. ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో ఈ దారుణం చోటుచేసుకుంది గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు చనిపోవడంతో నాన్నమ్మ తాతయ్య ల వద్ద ఉంటుంది. తొమ్మిదొ తరగతితో చదువు ఆపేసి ఆ బాలిక ఇంటి వద్దనే ఉంటుంది  నానమ్మ తాతయ్య వ్యవసాయ పనులకు వెళ్లిన సమయంలో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆ బాలికను నానమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లగా ఐదు నెలల గర్భవతి గా చెప్పారు. ఈమేరకు నిందితులు ఓ కార్పెంటర్.. భవన నిర్మాణ కార్మికుడు... దినసరి కూలీగా గుర్తించారు. బాలికను అనకాపల్లిలోని ప్రభుత్వ వైద్యశాలకు పంపించి వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఘనంగా బాబూ జగజ్జివన్ రావు వర్ధంతి


 





ఘనంగా బాబూ జగజ్జివన్ రావు వర్ధంతి

 

అనకాపల్లి

 

 

భీమునిగుమ్మం  అరుంధతి సేవా సంఘం ఆధ్వర్యంలో 34వ బాబుజగజీవన్ రావు వర్ధంతి వేడుకలు  ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పార్లమెంట్ పరిశీలకులు దాడి రత్నాకర్  పూలమాలలు వేసి నివాళులర్పించారు. రత్నాకర్ గారు మాట్లాడుతూ బాబుజగ్జీవన్ రావు  గొప్ప సంఘ సంస్కర్త, స్వతంత్ర సమరయోధులు , గొప్ప పార్లమెంట్రియన్గా జాతికి దేశానికి ఎంతో సేవ చేసారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్సార్ పట్టణాధ్యక్షులు జానకి జానికిరమరాజు , అరుంధతి సేవా సంఘం నాయకులు కట్టుమూరి మంగరాజు , మహాలక్ష్మినాయుడు ,జైభీమ్ సేన సేవా సంఘం జిల్లా అధ్యక్షులు రేబాక మధుబాబు,  నాయుడు , చెవ్వేటి చంటి, 80 వ వార్డు ఇన్చార్జ్ కొణతాల భాస్కరరావు 81 వ వార్డు రాంబాబు గారు, దళిత సంఘాల నాయకులు, వైస్సార్ పార్టీ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం పేదలకు కాయగూరలు పంపిణీ చేశారు.


 

 




 


గోకవరం లో లాక్ డౌన్ ఏర్పాటు చేయాలి


 



గోకవరం లో లాక్ డౌన్ ఏర్పాటు చేయాలని వినతి.

.... అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న టిడిపి నాయకులు.

 

గోకవరం పెన్ పవర్.

 

కరోనా కేసు నమోదు కావడంతో గోకవరం లో ని లాక్ డౌన్ ఏర్పాటు చేయాలంటూ స్థానిక టిడిపి నాయకులు సోమవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్ డౌన్ ను ఏర్పాటు చేసి మరో వ్యక్తిని కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని వారు వివిధ శాఖల అధికారులకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాలూరి బోసు బాబు, పోసిన ప్రసాద్, గునిపే భరత్, నరేంద్ర  తదితర నాయకులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...