Followers

గూటాలలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు


 


గూటాలలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు

పోలవరం, పెన్ పవర్

పోలవరం మండలం గూటాల పంచాయతీ పరిధిలో వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని మెయిన్ సెంటర్, బస్ షెల్టర్ , రైతు భరోసా కేంద్రం నందు  గల దివంగత మహానేత   వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సొసైటీ అధ్యక్షులు సుంకర అంజి బాబు, యువజన నాయకుడు సుంకర కొండబాబు, ఎస్సీ సెల్ మండల ప్రెసిడెంట్ డేగపాటి హరి రామ కృష్ణ, డాక్టర్ శ్రీనివాసు  లు  పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అమలు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అని సొసైటీీ అధ్యక్షులు సుంకర అంజిబాబు అన్నారు . తండ్రిి బాటలోనే నడుస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి  వైఎస్ ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారని అన్నారు.


ఈ కార్యక్రమంలో గూటాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు 

రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోండి.


 


 రైతు భరోసా కేంద్రాల సేవలను వినియోగించుకోండి.

 

 రైతు భరోసా కేంద్రాలు సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు రైతులను  కోరారు

 

 

పెన్ పవర్, ఉంగుటూరు

 

 

ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం కురెళ్ళగూడెం లోని రైతు భరోసా కేంద్రం వద్ద బుధవారం నిర్వహించిన రైతు దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు కోరారు. రైతు దినోత్సవం పురస్కరించుకొని  గ్రామస్థాయిలో ఎకరాకు 60 ధాన్యం బస్తాల దిగుబడి సాధించిన రైతును ,ఎకరాకు 6 టన్నుల ఆక్వా దిగుబడి సాధించిన ఆక్వా రైతును, కౌలు రైతులను పశుపోషణ ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించిన  ఆక్వా రైతులను కలెక్టర్ గారు , శాసనసభ్యులు వారు సన్మానించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల వాసు బాబు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖరరెడ్డి రైతు బాంధవుడిగా తన అందించిన సేవలు ద్వారా గుర్తింపు పొందారన్నారు.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అంతకు మించిన స్థాయిలో రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం  ద్వారా గుర్తింపు పొందటం అభినందనీయమన్నారు.  రైతులకు వడ్డీ రాయితీ గా కేటాయించిన మొత్తాలను ముఖ్యమంత్రి రైతుల ఖాతాలోకి నేరుగా జమ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, ఉంగుటూరు శాసనసభ్యులుపుప్పాలవాసుబాబు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉంగుటూరు వైయస్సార్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. 

పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసిన మైగాపుల దుర్గాప్రసాద్


పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేసిన మైగాపుల దుర్గాప్రసాద్



పోలవరం పెన్ పవర్


పోలవరం మండలం కొత్త పట్టిసీమ గ్రామంలో వైయస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని  మైగాపుల దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో  వైసిపి పోలవరం మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ చేతులమీదుగా  పేద ప్రజలకు దుప్పట్లు పంపిణీ చేశారు. సామాజిక దూరం పాటిస్తూ వారి ఇంటి వద్దకు తీసుకువెళ్లి అందజేశారు. కొత్త పట్టిసీమలో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నాటి నుండి కొత్త పట్టిసీమ కంటోన్మెంట్ జోన్ పరిధిలోని ప్రజలకు    కూరగాయలు,  కిరాణా , రోగనిరోధక శక్తిని పెంచే సామాగ్రి లను కొద్ది రోజుల క్రితం పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా దుప్పట్లు  పంపిణీ చేస్తూ కొత్త పట్టిసీమ ప్రజలకు సేవలందిస్తూ వారికి అండగా ఉంటున్న మైగాపుల దుర్గా ప్రసాద్ కు స్థానిక ప్రజలు, నాయకులు అభినందనలు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్రమంలో వైసిపి పోలవరం మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ, మైగాపుల దుర్గాప్రసాద్, గంగు అనిల్ కుమార్, ఆకుల సత్యనారాయణ, వైసిపి నాయకులు పాల్గొన్నారు. 


ఘనంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 71 వ జయంతి వేడుకలు.


 



 




తాడేపల్లిగూడెంలో ఘనంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 71 వ జయంతి వేడుకలు.

 

 

పెన్ పవర్. తాడేపల్లిగూడెం 

 

 

తాడేపల్లిగూడెం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంపోలీసు ఐలాండ్,బస్టాండ్, మసీదు సెంటర్లలో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ.అయన మాట్లాడుతూ ది లెజెండ్ అనే పదానికి అర్థం వై.ఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. వై.ఎస్ రాజశేఖర రెడ్డి  హయాంలో నేను ఎమ్మెల్యే గా పనిచేయడం, తిరిగి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి  దగ్గర ఎమ్మెల్యే గా సేవాలందించడం నా అదృష్టంగా భావిస్తున్నానుఅని అన్నారు. వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రీ భాస్కరరావు, పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జీ నాగు, జి సాంబయ్య, గొర్రెల శ్రీనివాస్ , పత్స మట్ల సావిత్రి, తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




సెక్రటరీలకు, నాయకులకు సన్మానం


సెక్రటరీలకు, నాయకులకు సన్మానం.


వాలంటీర్లకు బహుమతులు ప్రధానం.


పోలవరం పెన్ పవర్


పోలవరం మండలం స్థానిక రెండవ సచివాలయంలో సోబ్బాన మోహన్ ఆధ్వర్యంలో పోలవరం మండలం వైసిపి కార్యకర్తలు  వైసీపీ నాయకులకు, సచివాలయ సెక్రటరీలకు  శాలువాలు కప్పి సన్మానం చేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి, స్వీటు, హాటు పంచిపెట్టారు. అనంతరం పార్టీకి, ప్రజలకు ఉత్తమ సేవలందించిన వైసిపి  నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర వెంకటరెడ్డి , వైసిపి మండల అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ, ఏలూరు పార్లమెంట్ కార్యదర్శి దాకే మంగమ్మ, జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ పాతి మున్నీసా, పోలవరం మహిళ టౌన్ ప్రెసిడెంట్ దాసరి రాణి, అల్లు జగన్మోహన్, 1, 2, 3 సచివాలయ సెక్రటరీలు వై కొండల్ రావు, వై ప్రసాద్, శ్రీనివాస రావు లకు శాలువాలు కప్పి సన్మానించారు. వాలంటీర్ వ్యవస్థ మొదలైన నాటి నుంచి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను చేరువ చెయ్యడంలో విధులు సక్రమంగా నిర్వహిస్తున్న మూడు సచివాలయాల లో  వాలంటీర్లకు రాజశేఖర్ రెడ్డి చిత్రపటం ఉన్న ఫెడ్ లను, పెన్నులను బహుకరించారు. కరోనా విపత్కర సమయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలోనూ  ఎంతగానో శ్రమిస్తున్న వాలంటీర్ లను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. 


తాళ్ళపూడి గ్రామ దేవత  శ్రీమోదుగులమ్మ కు అభిషేకాలు



తాళ్ళపూడి గ్రామ దేవత  శ్రీమోదుగులమ్మ కు అభిషేకాలు

 

తాళ్లపూడి,  పెన్ పవర్: 

 

తాళ్లపూడి గ్రామం లో గత నాలుగు నెలల నుండి కరోనా మహమ్మారి బారిన పడి అనేక ఇబ్బందులు  ఎదుర్కొంటున్న  గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మూల విరాట్కు 11రకాల  అబిషేకాలను అర్చక బృందంతో  నిర్వహించామని శివాలయం అర్చకులు జంధ్యాల అశ్వని కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు జరిగిన  ఈ అభిషేకాలకు అధిక సంఖ్య  లో ప్రజలు పాల్గొన్నారు. తాళ్లపూడి లో గోదావరి గట్టున ఉన్న  గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ మోదుగులమ్మ అమ్మవారి మూల విరాట్ కు పాలు, పెరుగు, నెయ్యి,తేనె,పంచదార, పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, విభూది, సుగంధ ద్రవ్యాలు, మరియు పండ్ల రసాలతో  అభిషేకాలు చేసి గ్రామాన్ని, గ్రామ ప్రజలను చల్లగా చూడాలని, ఎటువంటి రుగ్మతలు, దరిచేరకుండా రక్షించాలని, ఈ అభిషేకాలు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, గ్రామస్థులకు ధన్యవాదాలు తెలువుతున్నానని అశ్వని

కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో  గ్రామ మాజీ సర్పంచ్ నామన పరమేశ్వరరావు,  రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షలు సింహాద్రి జనార్దన్, సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ సిద్ధంశెట్టి బాలాజీ, జడ్డు శ్రీనివాసరావు

గణపతి యువజన సంఘం సభ్యులు, దేవరెడ్డి సత్యనారాయణ(డి.వి), సింగం శివప్రసాద్, గోలి వీరవేంకట సత్యనారాయణ (అన్నవరం), మరియు  అధిక సంఖ్య లో గ్రామస్థులు  పాల్గొన్నారు.


కుకునూరు రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవం


 



కుకునూరు రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవం

 

తాళ్ళపూడి,  పెన్ పవర్: 

 

వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రతీ రైతు భరోసా కేంద్రంలో బుధవారం రైతు దినోత్సవం జరిపారు.   తాళ్ళపూడి మండలం లోని కుకునూరు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేచి నివాళులు అర్పించారు. అదేవిధంగా  అక్కడ రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలు జరిపామని తాళ్ళపూడి 2 సెక్రెటరీ యస్.శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించిన పథకాలు గురుంచి, పొలంబడి గురుంచి, రైతు భరోసా వినియోగo, లబ్ధి తదితర విషయాలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎ.ఎ.లు ఆనంద్, రేవతి, వి.ఆర్.ఒ. లీలావతి, రైతులు, గ్రామపెద్దలు, నాయకులు పాల్గొన్నారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...