Followers

ఘనంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 71 వ జయంతి వేడుకలు.


 



 




తాడేపల్లిగూడెంలో ఘనంగా దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి 71 వ జయంతి వేడుకలు.

 

 

పెన్ పవర్. తాడేపల్లిగూడెం 

 

 

తాడేపల్లిగూడెం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెంపోలీసు ఐలాండ్,బస్టాండ్, మసీదు సెంటర్లలో గల వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ.అయన మాట్లాడుతూ ది లెజెండ్ అనే పదానికి అర్థం వై.ఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. వై.ఎస్ రాజశేఖర రెడ్డి  హయాంలో నేను ఎమ్మెల్యే గా పనిచేయడం, తిరిగి వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి  దగ్గర ఎమ్మెల్యే గా సేవాలందించడం నా అదృష్టంగా భావిస్తున్నానుఅని అన్నారు. వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేశారు. ఈ కార్యక్రమంలో కర్రీ భాస్కరరావు, పట్టణ వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు జీ నాగు, జి సాంబయ్య, గొర్రెల శ్రీనివాస్ , పత్స మట్ల సావిత్రి, తాడేపల్లిగూడెం పట్టణం, రూరల్ వైఎస్ఆర్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.




సెక్రటరీలకు, నాయకులకు సన్మానం


సెక్రటరీలకు, నాయకులకు సన్మానం.


వాలంటీర్లకు బహుమతులు ప్రధానం.


పోలవరం పెన్ పవర్


పోలవరం మండలం స్థానిక రెండవ సచివాలయంలో సోబ్బాన మోహన్ ఆధ్వర్యంలో పోలవరం మండలం వైసిపి కార్యకర్తలు  వైసీపీ నాయకులకు, సచివాలయ సెక్రటరీలకు  శాలువాలు కప్పి సన్మానం చేశారు. డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి, స్వీటు, హాటు పంచిపెట్టారు. అనంతరం పార్టీకి, ప్రజలకు ఉత్తమ సేవలందించిన వైసిపి  నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర వెంకటరెడ్డి , వైసిపి మండల అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ, ఏలూరు పార్లమెంట్ కార్యదర్శి దాకే మంగమ్మ, జిల్లా జనరల్ సెక్రటరీ షేక్ పాతి మున్నీసా, పోలవరం మహిళ టౌన్ ప్రెసిడెంట్ దాసరి రాణి, అల్లు జగన్మోహన్, 1, 2, 3 సచివాలయ సెక్రటరీలు వై కొండల్ రావు, వై ప్రసాద్, శ్రీనివాస రావు లకు శాలువాలు కప్పి సన్మానించారు. వాలంటీర్ వ్యవస్థ మొదలైన నాటి నుంచి ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను చేరువ చెయ్యడంలో విధులు సక్రమంగా నిర్వహిస్తున్న మూడు సచివాలయాల లో  వాలంటీర్లకు రాజశేఖర్ రెడ్డి చిత్రపటం ఉన్న ఫెడ్ లను, పెన్నులను బహుకరించారు. కరోనా విపత్కర సమయంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలోనూ  ఎంతగానో శ్రమిస్తున్న వాలంటీర్ లను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల వైసిపి నాయకులు, వాలంటీర్లు పాల్గొన్నారు. 


తాళ్ళపూడి గ్రామ దేవత  శ్రీమోదుగులమ్మ కు అభిషేకాలు



తాళ్ళపూడి గ్రామ దేవత  శ్రీమోదుగులమ్మ కు అభిషేకాలు

 

తాళ్లపూడి,  పెన్ పవర్: 

 

తాళ్లపూడి గ్రామం లో గత నాలుగు నెలల నుండి కరోనా మహమ్మారి బారిన పడి అనేక ఇబ్బందులు  ఎదుర్కొంటున్న  గ్రామ ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మూల విరాట్కు 11రకాల  అబిషేకాలను అర్చక బృందంతో  నిర్వహించామని శివాలయం అర్చకులు జంధ్యాల అశ్వని కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు జరిగిన  ఈ అభిషేకాలకు అధిక సంఖ్య  లో ప్రజలు పాల్గొన్నారు. తాళ్లపూడి లో గోదావరి గట్టున ఉన్న  గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ మోదుగులమ్మ అమ్మవారి మూల విరాట్ కు పాలు, పెరుగు, నెయ్యి,తేనె,పంచదార, పసుపు, కుంకుమ, గంధం, పన్నీరు, విభూది, సుగంధ ద్రవ్యాలు, మరియు పండ్ల రసాలతో  అభిషేకాలు చేసి గ్రామాన్ని, గ్రామ ప్రజలను చల్లగా చూడాలని, ఎటువంటి రుగ్మతలు, దరిచేరకుండా రక్షించాలని, ఈ అభిషేకాలు నిర్వహించామని, ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలకు, గ్రామస్థులకు ధన్యవాదాలు తెలువుతున్నానని అశ్వని

కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో  గ్రామ మాజీ సర్పంచ్ నామన పరమేశ్వరరావు,  రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షలు సింహాద్రి జనార్దన్, సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ సిద్ధంశెట్టి బాలాజీ, జడ్డు శ్రీనివాసరావు

గణపతి యువజన సంఘం సభ్యులు, దేవరెడ్డి సత్యనారాయణ(డి.వి), సింగం శివప్రసాద్, గోలి వీరవేంకట సత్యనారాయణ (అన్నవరం), మరియు  అధిక సంఖ్య లో గ్రామస్థులు  పాల్గొన్నారు.


కుకునూరు రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవం


 



కుకునూరు రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవం

 

తాళ్ళపూడి,  పెన్ పవర్: 

 

వై.యస్.రాజశేఖర్ రెడ్డి జయంతి రోజున రైతు దినోత్సవంగా జరుపుతున్నారు. ప్రతీ రైతు భరోసా కేంద్రంలో బుధవారం రైతు దినోత్సవం జరిపారు.   తాళ్ళపూడి మండలం లోని కుకునూరు గ్రామంలో ఉన్న రైతు భరోసా కేంద్రంలో ముందుగా దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేచి నివాళులు అర్పించారు. అదేవిధంగా  అక్కడ రైతు భరోసా కేంద్రంలో రైతు దినోత్సవ వేడుకలు జరిపామని తాళ్ళపూడి 2 సెక్రెటరీ యస్.శ్రీను తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులకు సంబంధించిన పథకాలు గురుంచి, పొలంబడి గురుంచి, రైతు భరోసా వినియోగo, లబ్ధి తదితర విషయాలపై అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో వి.ఎ.ఎ.లు ఆనంద్, రేవతి, వి.ఆర్.ఒ. లీలావతి, రైతులు, గ్రామపెద్దలు, నాయకులు పాల్గొన్నారు.


వైయస్సార్  జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు .


 


వైయస్సార్  జయంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు .


వైసిపి పోలవరం మండల అధ్యక్షుడు బుగ్గా మురళీకృష్ణ..


పోలవరం,  పెన్ పవర్


వైయస్సార్ జయంతిని పురస్కరించుకుని పోలవరం మండలం   స్థానిక పంచాయతీ ఆవరణలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర వెంకట రెడ్డి, మండల అధ్యక్షులు బుగ్గా మురళీకృష్ణ  లు  స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు, నాయకులకు పంచిపెట్టారు. అనంతరం పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బుగ్గా మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్, రైతు రుణమాఫీ వంటి మరెన్నో పథకాలు పేద ప్రజలకు చేరువయ్యేలా పరిపాలన కొనసాగించారని అందుకే ఆయనను అపర భగీరథుడు, రైతు బాంధవుడు, ప్రజల ఆశాజ్యోతి గా ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారని అన్నారు. ఆయన దూరమైన ఈ 12 సంవత్సరాల కాలంలో ఏ ఒక్కరూ ఆయన్ని మరిచిపోలేదని గుర్తు చేశారు. ప్రజా పాలనలో, సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడంలోను, వాటిని అమలు చేయడంలోనూ తండ్రికి మించిన తనయుడుగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల మన్ననలు పొందుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు సుంకర వెంకట రెడ్డి, బుగ్గా మురళీకృష్ణ, షేక్ పాతి మున్నీసా, దాకే మంగాయమ్మ, గంగు అనిల్ కుమార్,  పాదం రాజబాబు, డి రమేష్, సోబ్బాన మోహన్, ఘంటా శ్రీను, గోక చిట్టి రాజు, కె రాజు, శివ ప్రసాద్, రాణి, దుర్గ, అప్పారావు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 


విగ్రహ ఆవిష్కరణలో మంత్రి వనిత


విగ్రహ ఆవిష్కరణలో మంత్రి వనిత

 

తాళ్లపూడి,  పెన్ పవర్:

 

 దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పరిపాలన స్వర్ణయుగమని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖా మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. బుదవారం తాళ్లపూడి మండలం అన్నదేవరపేట లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి 71 వ పుట్టినరోజు సందర్భంగా  పోసిన  శ్రీకృష్ణ దేవరాయలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. తరువాత కేక్ కట్ చేశారు. మహానేత రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో  ప్రతి కుటుంబం లబ్ది పొందిందని, ఆరోగ్య ప్రదాత, అపర భగీరధుడుగా పేరొందిన రాజశేఖర్ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచారని , ఆయన బాటలోనే ఆయన తనయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని,  రాష్ట్ర లో 30 లక్జల మందికి సొంతింటి కల నెరవేర్చే పెద్ద కార్యక్రమం అతి త్వరలో జరుగుతోందని  మత్రి తెలిపారు.  అధికారులకు, నాయకులకు, కార్యకర్తలకు, పార్టీ అభిమానులకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజు సందర్భం గా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం లో  గోపాలపురం మాజీ శాసనసభ్యుడు జొన్నకూటి బాబాజి రావు , కొవ్వూరు సి.ఐ. సురేష్, తాళ్లపూడి ఎస్.ఐ. జి. సతీష్, తహసీల్దార్ ఎం.నరసిహమూర్తి, ఎం.డి.ఒ. ఎం.రాజశేఖర్, ప్రభుత్వ అధికారులు వైసిపి మండల అధ్యక్షులు  కుంటముక్కల కేశవ నారాయణ, కొమ్మిరెడ్డి పరశు రామారావు, కొమ్మిరెడ్డి వేంకటేశ్వర రావు, ఎస్.సి.సెల్ అధ్యక్షులు యాళ్ల బాబూరావు, తోట రామకృష్ణ  , బండ్రెడ్డి వేంకటేశ్వరరావు , యువజన నాయకులు  ఒంబోలు పోసిబాబు,  మరియు కార్యకర్తలు, వై.ఎస్. అభిమానులు పాల్గొన్నారు.

పేదల నివాసానికి అనుకూలంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: గొల్లపల్లి




పేదల నివాసానికి అనుకూలంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి: గొల్లపల్లి





రాజోలు, :పెన్ పవర్

 

 

రాజోలు మండల రెవెన్యూ తహసీల్దార్ కి మాజీ మంత్రివర్యులు గొల్లపల్లి సూర్యారావు  పేదలకు నివాసానికి అనుకూలంగా ఉండేలా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు .ఈ సందర్బంగా గొల్లపల్లి మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అని నిర్ణయించింది, కానీ ఈ కార్యక్రమం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.గతంలో ఇచ్చిన ఇండ్ల పట్టాలు రద్దు చేసి కొత్తవారికి ఇవ్వటం చాలా దారుణం అని, ప్రజా వాసాలకు దూరంగా నివాసానికి అనువుగా లేని చోట్ల మరియుస్మశానాలకు దగ్గరలోను,గోదావరి వరద ముంపునకు గురి అయ్యే ప్రాంతాలలో ను ఇండ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ప్రజలకు ఉపయోగం ఉండదని గొల్లపల్లి అన్నారు, ప్రజలకు ఇచ్చే స్థలాలు కప్పుదల  చేసే మట్టి ని  కొన్ని చోట్ల స్మశానంలలో ఎముకల తో కూడిన మట్టిని, పంట కాలవలోను, డ్రైనేజీలలోను గుడ్డముక్కలు, చెత్త చెదారం తో కూడిన వండ్రి మట్టితోను,  పూడ్చడం జరిగింది, మానవజీవితంలో సొంత ఇల్లు అనేది ఒక కల అంటువంటి స్థలం ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యం గా వ్యవహరించడం చాలా దారుణం అని గొల్లపల్లి అన్నారు, ఇండ్ల స్థలాల కొనుగోలులో కూడ రాజకీయ దళారుల ప్రమేయం తో తక్కువ రేటు భూములను చాలా ఎక్కువ రేటుకు కొంటూ వివిధ పన్నుల రూపాలలో ప్రభుత్వానికి కట్టిన ప్రజల సొమ్మును దోచుకు తినే పనిలో ఉన్నరారని ఆయన అన్నారు. ఇటువంటి కార్యక్రమం అవినీతి లో కూరుకుపోవడం బాధగా ఉందని గొల్లపల్లి ఆవేదన వ్యక్తపరిచారు.నేను తెలియజేసిన అన్నీ విషయాల మీద విచారణ చెయ్యాలని, పేదలకు నివాసానికి  అనువైన ఇండ్ల స్థలాలు ఇవ్వాలని ,  మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాను అని గొల్లపల్లి అన్నారు. ఈ కార్యక్రమం మండల టీడీపీ సెక్రటరీ చాగంటి స్వామి, మట్టపర్తి లక్ష్మి, బేతినీడి శ్రీనివాస్, కోళ్ల వెంకన్న, కట్టా సూరిబాబు, నార్కేడమిల్లి కనకం,రావి మురళికృష్ణ, పామర్తి రమణ, అడబాల విజయ్ , చెల్లింగి శ్రీనివాస్,కడలి వెంకటేశ్వరావు, పెట్టాను సూరిబాబు, చెల్లుబోయిన శ్రీనివాస్, కసుకుర్తి త్రినాధస్వామి,  రాయుడు రామశంకర్, బోళ్ల వెంకటరమణ, కడలి వెంకటరమణ , దాడి కృష్ణ, నార్కేడమిల్లి విష్ణు, కుసుమ ప్రసాద్, కత్తి రాజు, కడలి నాగేశ్వరావు,  సూరిబాబు తదితరులు పాల్గొన్నారు...




Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...