Followers

గోకవరం లో లాక్ డౌన్ ఏర్పాటు చేయాలి


 



గోకవరం లో లాక్ డౌన్ ఏర్పాటు చేయాలని వినతి.

.... అధికారులకు వినతిపత్రం అందజేస్తున్న టిడిపి నాయకులు.

 

గోకవరం పెన్ పవర్.

 

కరోనా కేసు నమోదు కావడంతో గోకవరం లో ని లాక్ డౌన్ ఏర్పాటు చేయాలంటూ స్థానిక టిడిపి నాయకులు సోమవారం అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు లాక్ డౌన్ ను ఏర్పాటు చేసి మరో వ్యక్తిని కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని వారు వివిధ శాఖల అధికారులకు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాలూరి బోసు బాబు, పోసిన ప్రసాద్, గునిపే భరత్, నరేంద్ర  తదితర నాయకులు పాల్గొన్నారు.


కామరాజుపేట లో కరోనా కలకలం.




కామరాజుపేట లో కరోనా కలకలం.

 

గోకవరం పెన్ పవర్.

 

మండలంలోని కామరాజుపేట గ్రామంలో కరోనా సోకిన వ్యక్తి సంచరిస్తున్నాడనే సమాచారం కలకలం రేపింది. ఏలూరుకు చెందిన ఒక వ్యక్తి సుమారు వారం రోజుల క్రితం తన అత్తగారి స్వగ్రామమైన కామరాజుపేట రావడం జరిగింది. అయితే కామరాజుపేట రావడానికి ముందు ఆ వ్యక్తి కరోనా పరీక్షలు చేయించుకుని ఇక్కడికి వచ్చినట్లు సమాచారం. పరీక్షల్లో కరోనా పాజిటివ్ గా ఆదివారం రాత్రి నిర్ధారణ కావడంతో గుట్టుచప్పుడు కాకుండా సోమవారం తెల్లవారుజామున ఆ వ్యక్తి కామరాజుపేట నుంచి పరారి కావడం జరిగిందని గ్రామస్తులు చెప్పుకొస్తున్నారు.గ్రామంలో ఆ వ్యక్తి ఉన్న ఇంట్లో సుమారు పది మంది కుటుంబ సభ్యులు వరకు కలిసి ఉంటారని సమాచారం ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆందోళన నెలకొంది.స్థానిక అధికారులు సంబంధిత ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులు ఏ ఒక్కరు మీ ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసినట్లు తెలియవచ్చింది.



మాదిగ అమరవీరులకు మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళి


 


మాదిగ అమరవీరులకు మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఘన నివాళి


అశ్వాపురం, పెన్ పవర్


మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో సొమవరం  అశ్వాపురం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ సాధనకై గత ఇరవై-ఐదు సంవత్సరాలుగా అలుపెరగని ఉద్యమాలు చేసి అమరులైన మాదిగలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు..ఈ సందర్భంగా మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల.నాగేశ్వరరావు పాల్గోని మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధనలో భాగంగా అమరులైన మాదిగల త్యాగాలను మర్చిపోలేము అని..వారి త్యాగాలను వృధా కానివ్వమని..ఎస్సీ వర్గీకరణ సాధనకోసం-వారి ఆశయ సాధనకు కోసం..విద్యావేత్త.. మాదిగల మలిదశ ఉద్యమ రథసారథి-ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయుకుడు-తెలంగాణ రాష్ట్ర మొట్ట మొదటి ఎస్సీ కార్పోరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి.రవి నాయకత్వంలో..వర్గీకరణ సాదించేందుకు మాదిగలు సిద్ధంగా ఉంటామని తెలిపారు..కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాదిగలను..ఎన్నికల్లో హామీ ఇవ్వడం అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోకుండా మాదిగలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు...అనంతరం ప్రముఖ సంఘ సంస్కర్త..ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు-సమ సమాజ స్థాపన కృషీవలుడు.. భారత తొలి ఉప ప్రధాని.డా బాబు జగ్జీవన్ రాం వర్ధంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు..ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు.మందా.హుస్సేన్-మండల సీనియర్ నాయకులు.ఇరుగు.నాగరాజు-మేకల.అంజిబాబు-రావులపల్లి.నర్సింహారావు-ఇసంపల్లి-పున్నారావు-ఆర్టీసీ ఉద్యోగులు సంఘం భాద్యులు.ఇల్లటూరి.మహేష్-కోడారి.వేణు-ఇసంపల్లి.సురేష్-మంగళగిరి.రామకృష్ణ-తాళ్లూరి.శ్రీను-గుర్రం.రాములు.దమ్మయ్య-తదితరులు పాల్గొన్నారు


బి జే పీ  ఆధ్వర్యంలో ఘనంగా గురుపౌర్ణమి 


బి జే పీ  ఆధ్వర్యంలో ఘనంగా గురుపౌర్ణమి 


 


పూర్ణా మార్కెట్ ,పెన్ పవర్.

 

భారతీయ జనతా పార్టీ విశాఖ అధ్యక్షులు మేడపాటి రవీందర్ రెడ్డి సూచన మేరకు గురుపౌర్ణమి పర్వదినాన గురువుని సత్కరించు కార్యక్రమం దక్షిణ నియోజకవర్గ కన్వీనర్ రామ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బిజెపి దక్షిణ నియోజకవర్గం కన్వీనర్ అయినటువంటి  కొప్పల.రామ్ కుమార్ ఆధ్వర్యంలో జ్ఞానపురానికి చెందిన బీజేపీ నాయకులు, ఉపాధ్యాయులు అయినటువంటి వంక సంజీవ రావు  అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తి నుండి విరమణ పొందిన బేతా. రాణి వారిని ఈరోజు సత్కరించటం జరిగింది ఈ కార్యక్రమం అనంతరం రాణి  ప్రధాని  నరేంద్ర మోడీ గారి సుపరిపాలన విధానాన్ని చూసి తాను ఎంతో ఆకర్షితురాలిని అయ్యానని అందువలన భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఉజ్వల భవిష్యత్తు కొరకు విశాఖ నగరంలో కృషిచేస్తానని పార్టీ అధ్యక్షులు మేడపాటి రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రకాష్ రెడ్డి , మోహన్ రావు , యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శి విశ్వతేజ , దళిత మోర్చా నాయకులు చక్రవర్తి , రాంబాబు , స్థానిక బిజెపి నాయకులు సతీష్  తదితరులు పాల్గొన్నారు.

విశాఖ లో డ్రగ్స్‌ గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్సు


విశాఖ లో డ్రగ్స్‌ గుట్టు రట్టు చేసిన టాస్క్ ఫోర్సు

 

విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

డీజీపీ సవాంగ్ విశాఖ పర్యనటలో ఉండగా డ్రగ్స్ కలకలం... డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేసిన టాస్క్ఫోర్స్ పోలీసులు...

డ్రగ్స్ అమ్ముతూ టాస్క్ ఫోర్స్ పోలుసులకు పట్టుబడ్డ నలుగురు నిందితులు మానుకొండ సత్యనరాయణ, మజ్జి అజయ్ కుమార్, కంది రవికుమార్, కేతి మనోజ్ స్వరూప్ అరెస్ట్ విచారించి మరిన్ని వివరాలు రాబడుతున్న పోలీసులు నిందితుల నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం 61 ఎల్ ఎస్ డీ స్టిక్కర్లు, 2.5 గ్రా. ఎమ్ డి ఎమ్ ఏ, 60 గ్రా. గంజాయి పట్టివేత,  రూ. 9,500 నగదు, నాలుగు మొబైల్స్ స్వాధీనం.   గతంలో రెవ్ పార్టీ లొ వాడిన మత్తు పదార్ధాలు మరో సారి ప్రత్యక్షం  భారీ మోతాదులో సరుకు విక్రయం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు... గతంలో రుషికొండ రేవ్ పార్టీ లో డ్రగ్స్ సరఫరా చేసిన మనికొండ సత్యనారాయణ

గురు పౌర్ణమి వేడుకల్లో రత్నాకర్


గురు పౌర్ణమి వేడుకల్లో రత్నాకర్


 

అనకాపల్లి 

 

గురుపౌర్ణమి  వ్యాస పౌర్ణమి సందర్భంగా  అనకాపల్లి కొత్తూరు గ్రామం ఎన్జీవోస్ కాలనీ లో వెలసిన శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ వారిని  వైఎస్ఆర్ సిపి పార్టీ పార్లమెంటరీ పరిశీలకులు, డైట్ కాలేజీ  సంస్థల అధినేత గౌరవనీయులు  దాడి రత్నాకర్  స్వామివారిని దర్శించుకునారు. ఆయన కృపా కటాక్షాలను పొందారు. శాంతి హోమం లో కూడా పాల్గొనారు. ఆలయ కమిటీ వారు రత్నాకర్ ను  సత్కరించి స్వామి వారి చిత్రపటాన్ని ఆయన ఆశీర్వాదాన్ని ప్రతిరూపంగా ఇవ్వడం జరిగింది. అధ్యక్షులు ఆళ్ల అప్పల నాయుడు, సెక్రెటరీ ప్రసాద్, దొడ్డి రమణ, బీసెట్టి జగన్ , బి సెట్ సత్యవతి , పెంటకోట సాగరు ప్రధాన అర్చకులు దివాకర్ పంతులు ,రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


వేదాలు గురించి అందరూ తెలుసుకోవాలి


వేదాలు గురించి అందరూ తెలుసుకోవాలి

 

అనకాపల్లి , పెన్ పవర్

 

ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, ఇతిహాస పురాణాలు తెలుసుకోవాలంటే వ్యాస మహర్షి బోధించిన వేదాలను తెలుసుకోవాలని హరే కృష్ణ మందిర అధ్యక్షులు దుర్గభ కృష్ణ  ప్రేమ దాస్ ప్రభూజీ అన్నారు. స్థానిక బిజెపి సీనియర్ కార్యాలయంలో కిషాన్ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి దుర్గభ కృష్ణ ప్రేమ్ దాస్ ప్రభుజి మాట్లాడుతూ వేదభూమి ,కర్మభూమి, జ్ఞానభూమిగా భారత్ విరాజిల్లుతుంది అన్నారు. గురువులకే గురువు అయినా వ్యాస మహర్షి జయంతిని గురుపౌర్ణమి గా జరుపుకోవడం అదృష్టం అన్నారు. తల్లిదండ్రులు, గురువులు, పరి పాలకులను భక్తిభావంతో కొలిచే దేశం భారతదేశం అన్నారు. ప్రేమ దాస్ ప్రభుజీ  చేతుల మీదుగా సీనియర్ పార్టీ కార్యకర్తలు  పి రాము ,లెక్కల నాయుడు, సన్యాసి దొర, సాంబమూర్తి రాజు, బలరాం పాత్రుడు లను శాలువాతో చిరు సత్కారం చేశారు. గురుపూజోత్సవం అనంతరం కృష్ణదాస్  గురువును  శ్రీ కృష్ణుడి చిత్రపటం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో  కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి బి సాయిరాం, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గంగుపాం నాగేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షులు పి. నాగేశ్వరరావు, వుడా రమేష్, నర్సింగ్ యాదవ్, అవతారం తదితరులు పాల్గొన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...