ఒడిశా అడవుల్లో మావోలు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు
నలుగురు మావోలు మృతి. పలువురికి తీవ్ర గాయాలు.ఏవోబీ పరిధిలో అప్రమత్తమైన పోలీసులు
ఆంధ్రా ఒరిస్సా సరిహద్దుల్లో గాలిస్తున్న పోలీస్ బలగాలు
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
ఒడిశా అడవుల్లో ఆదివారం మావోయిస్టుల పోలీసుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందగా భారీ సంఖ్యలో మావోయిస్టులు తీవ్ర గాయాల పాలైన ట్లు సమాచారం పోలీస్ వర్గాల ద్వారా వస్తుంది. కొందమాల్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులకు దారితీసింది. ఈ ప్రమాదంలో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగిలింది. గాయాలపాలైన మావోయిస్టులు ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో చేరుతారన్న సమాచారంతో ఏవోబీ పరిధిలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆంధ్ర ఒరిస్సా పోలీసులు గాయాలపాలైన మావోయిస్టుల ఆచూకీ కోసం జల్లెడ పడుతున్నట్లు స మాచారం. కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇదే అదునుగా మావోయిస్టులు యాక్షన్ టీంలు రిక్కీ నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల ప్రభావానికి చెక్ పెట్టాలని పోలీసు బలగాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో గాలింపు చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో కాకుండా కల్వర్టులు ప్రధాన కూడళ్లు వారపు సంతలో పోలీసులు తనిఖీలు ముమ్మరంగా సాగిస్తున్నారు. క్షతగాత్రులైన మావోయిస్టులు కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలిందని పోలీస్ వర్గాలు భావిస్తున్నాయి.