Followers
ఎంపి విజయ సాయి రెడ్డి సహకారంతో మత్స్యకారులకు బియ్యం పంపిణీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సహాయం
కరోనా ప్రభావంతో ఆర్థికంగా ఇబ్బందిపడుతున్న పేద ప్రజలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంంలో ఆదివారం కూరగాయలు అందజేశారు. పార్టీ కన్వీనర్ కొణతాల హరినాద్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. సమాజ సేవకులు కాండ్రేగుల శ్రీ రామ్ సౌజన్యంతో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమ్ ఆద్మీ నాయకులు తెెెెలిపారు. అన్నపూర్ణ బ్యాంక్ వీధిలో లో 150 మందికి ఆనపకాయలు పంపిణీ కార్యక్రమం చేేారు. ఈ కార్యక్రమంలో చరణ్ , భవాని తదితరులు పాల్గొన్నారు.
సొమ్ములు కేంద్రానివి,సోకులు రాష్ట్రానివి
సొమ్ములు కేంద్రానివి,సోకులు రాష్ట్రానివి
సఖినేటిపల్లి, పెన్ పవర్:
13 జిల్లాల తో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ,జరుగుతున్న అభివృద్ధి పనులలో ఎక్కువ శాతం, కేంద్ర నిధుల తో అమలు జరుగుతు న్నా, అవన్నీ తామే చేస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ , రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడం క్షమించరాని దని, భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా శాఖ ఉపాధ్యక్షులు మాలే. శ్రీనివాస నగేష్ ఆరోపించారు ఆదివారం సఖినేటిపల్లి మండలం అంతర్వేది పాలెం లో జన జాగరణ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత చేసిన సంస్కరణలు, ప్రారంభించిన పథకాలు, సామాన్య ప్రజలకు అందించే సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులు రాష్ట్రాలకు కేటాయించి, విడుదల చేస్తున్న, ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వాలు వీటి గురించి, ఎక్కడా ప్రస్తావించకపోవడం ద్రోహం కాదా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కేంద్ర పథకాల పేరు మార్చి, ప్రతిదానికి రాజశేఖర్ రెడ్డి పేరు చేర్చి, సొంత పథకాలు గా రాష్ట్రంలో అమలు చేస్తు, విస్తృత ప్రచారం చేయడం ఎంతవరకు ధర్మం అని నిలదీశారు. రాష్ట్రానికి కేంద్రం కోట్లాది రూపాయల నిధులను వివిధ పథకాలకు విడుదల చేస్తున్న, వాటి గురించి ఇప్పటి వరకు ,ఎక్కడా ప్రస్తావించకపోవడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనకు నిదర్శనమన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పథకాలకు ప్రధాని ఫోటో ఎక్కడ ఉండకుండా శ్రద్ధ తీసుకొనే ముఖ్యమంత్రి, తనది, తన తండ్రి ఫోటోలు మాత్రమే వాటికి కూడా ఉంచి ప్రచారం చేయదాన్నీ ఎలా అర్థం చేసుకోవాలని ఆయన ప్రశ్నించారు. ఇదే పద్ధతిని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఆచరించి, తగిన మూల్యం చెల్లించుకుంది అని, జగన్ మోహన్ రెడ్డి కూడా గతి తప్పదని అని ఆయన జోస్యం చెప్పారు. ప్రధానమంత్రి గణేష్ కళ్యాణ యజన పథకం ద్వారా ఈ ఏడాది నవంబర్ నెల వరకు ప్రతి ఒక్కరికి బియ్యము, పప్పు దినుసులు కేంద్ర ప్రభుత్వం అందజేస్తోందని చెప్పారు. కోట్లాది రూపాయలను ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం కేంద్రములో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న సామాన్య ప్రజలకు వాటి వివరాలు తెలియక పోవడం తమ పార్టీ పురోభివృద్ధికి కొడుకు లేదని ఆయన అన్నారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 108 ,104 వాహనాలను ప్రతి మండలానికి కేటాయించడం జరిగిందని, వాటి కొనుగోలులో 40 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వానీవే నని శ్రీనివాస్ నగేష్ చెప్పారు. ఈ విషయాన్ని దాచి పెట్టి ఈ వాహనాల తన సొంత నిధులతో ఉన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవాలని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ చేసిన అనేక పథకాల వివరాలను కరపత్రాల రూపంలో ఇంటింటికి పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు చెంపాటి. శివరామకృష్ణంరాజు, దంతులూరి. సీతారామరాజు, ఆకుల. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సీతానగరం లో మూడుకు చేరిన కరోనా పాజిటివ్ లు
సీతానగరం లో మూడుకు చేరిన కరోనా పాజిటివ్ లు
పెన్ పవర్ , సీతానగరం
మండలం నందు పాజిటివ్ కేసులు మూడుకు చేరాయని వైద్యాధికారి డాక్టర్ హారిక పత్రికా విలేకరులకు తెలిపారు. డాక్టర్ హారిక మాట్లాడుతూ కరోనా వైరస్ మండల పరిధిలో ఇనుగంటివారి పేట గ్రామంలో కలకలం రేపింది అన్నారు. ఈ గ్రామానికి చెందిన వారు ఈనెల ఫస్ట్ తారీఖున డి హెచ్ నందు వైద్య పరీక్షలు చేయించుకోగా 4వ తారీకు సాయంత్రం నిర్ధారణ అయిందని వీరిలో 42 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి తన బామ్మర్ది విజయవాడలో కరోనా పాజిటివ్ తో మరణించగా అక్కడికి వెళ్లడం వలన కరోనా వైరస్ సోకిందని,25 సంవత్సరాలు కలిగిన మరొక వ్యక్తి కితన స్నేహితునికి కరోనా ఉండటంతో ఈ వ్యక్తికి సంక్రమించిందని డాక్టర్ హారిక తెలిపారు. ఇనుగంటివారి పేటకు చెందిన ఈ వ్యక్తులు ఇద్దరిని బొమ్మూరు కోవిడ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్నామన్నారు. గతంలో ఆర్టీసీ గ్యారేజ్ నందు మెకానిక్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి వైరస్ సోకకగా వైద్య సేవలు పొందుతున్నారనీ, అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తి తాడేపల్లి గ్రామంలోనే ఉండేవారని అతనికి కరోనా సంక్రమించగా భీమవరం నందు పరీక్షలు చేయించుకోవడం తో ఈ వ్యక్తిని మండలంలో కి రాకుండానే బొమ్మూరు కోవిడ్ కేర్ నందు చేర్చి వైద్య సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్ హారిక తెలిపారు. ఇప్పటివరకూ మండలంలో కరోనా కేసులు మూడుకు చేరుకున్నాయని పాజిటివ్ కలిగిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు అనే వివరాలు తెలియాల్సి ఉందనీ కనుక మండల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని నిర్లక్ష్య వైఖరి విడనాడి కరోనా మహమ్మారి సోకకుండా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు వైద్యాధికారిణి తెలియజేశారు.
కొండయ్య మృతి పట్ల బిజెపి రాష్ట్రం కార్యవర్గ సభ్యులు వీరన్న చౌదరి సంతాపం
పెన్ పవర్, సీతానగరం
మాకు న్యాయం చేయండి
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...