సీతానగరం లో మూడుకు చేరిన కరోనా పాజిటివ్ లు
పెన్ పవర్ , సీతానగరం
మండలం నందు పాజిటివ్ కేసులు మూడుకు చేరాయని వైద్యాధికారి డాక్టర్ హారిక పత్రికా విలేకరులకు తెలిపారు. డాక్టర్ హారిక మాట్లాడుతూ కరోనా వైరస్ మండల పరిధిలో ఇనుగంటివారి పేట గ్రామంలో కలకలం రేపింది అన్నారు. ఈ గ్రామానికి చెందిన వారు ఈనెల ఫస్ట్ తారీఖున డి హెచ్ నందు వైద్య పరీక్షలు చేయించుకోగా 4వ తారీకు సాయంత్రం నిర్ధారణ అయిందని వీరిలో 42 సంవత్సరాలు కలిగిన ఒక వ్యక్తి తన బామ్మర్ది విజయవాడలో కరోనా పాజిటివ్ తో మరణించగా అక్కడికి వెళ్లడం వలన కరోనా వైరస్ సోకిందని,25 సంవత్సరాలు కలిగిన మరొక వ్యక్తి కితన స్నేహితునికి కరోనా ఉండటంతో ఈ వ్యక్తికి సంక్రమించిందని డాక్టర్ హారిక తెలిపారు. ఇనుగంటివారి పేటకు చెందిన ఈ వ్యక్తులు ఇద్దరిని బొమ్మూరు కోవిడ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్నామన్నారు. గతంలో ఆర్టీసీ గ్యారేజ్ నందు మెకానిక్ గా పనిచేస్తున్న ఒక వ్యక్తికి వైరస్ సోకకగా వైద్య సేవలు పొందుతున్నారనీ, అదే గ్రామానికి చెందిన మరొక వ్యక్తి తాడేపల్లి గ్రామంలోనే ఉండేవారని అతనికి కరోనా సంక్రమించగా భీమవరం నందు పరీక్షలు చేయించుకోవడం తో ఈ వ్యక్తిని మండలంలో కి రాకుండానే బొమ్మూరు కోవిడ్ కేర్ నందు చేర్చి వైద్య సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్ హారిక తెలిపారు. ఇప్పటివరకూ మండలంలో కరోనా కేసులు మూడుకు చేరుకున్నాయని పాజిటివ్ కలిగిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు అనే వివరాలు తెలియాల్సి ఉందనీ కనుక మండల ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని నిర్లక్ష్య వైఖరి విడనాడి కరోనా మహమ్మారి సోకకుండా అప్రమత్తంగా ఉండాలని మండల ప్రజలకు వైద్యాధికారిణి తెలియజేశారు.