Followers

పేదవాడికి సాయం చేయడ మే కనీస ధర్మం


పేదవాడికి సాయం చేయడ మే కనీస ధర్మం


 


 


సఖినేటిపల్లి, పెన్ పవర్..


 


ఎక్కడ పేదవాడు ఉన్న అతడికి మన వంతు సహాయ పడటం మనిషిగా కనీస ధర్మమని రామేశ్వరం మాజీ సర్పంచ్, విలేజ్ వెల్ఫేర్ ఫస్ట్ ఫౌండర్ చైర్మన సరెళ్ళ. విజయప్రసాద్ అన్నారు. సఖినేటిపల్లి మండలం రామేశ్వరం లో గత ఎనిమిది సంవత్సరాలుగా గ్రామాల్లో ఉన్న నిరుపేదలైన వారికి బియ్యం, నగదు పంపిణీ సందర్భంగా ఆదివారం జరిగిన  కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈనెల 85 మంది నిరుపేదలకు బియ్యంతో పాటు వంద రూపాయల నగదు పంపిణీ చేశారు. గాడ్స్ వే ఆర్గనైజేషన్ ఆర్థిక సహాయం అందించిది. ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు తెన్నేటి. బర్నబాస్, జాలెం.శ్రీను, కాండ్రేగుల. కృష్ణ, కట్టా. ఉమామహేశ్వరరావు, అల్లూరి. మధు రాజు, లచ్చి రాజు, వెంకటేష్, తోపాటు పలువురు పాల్గొన్నారు.


మార్కాపురంలోకరోనా తొలి మరణం


మార్కాపురంలోకరోనా తొలి మరణం



 పెరిగిన   కరోనా పాజిటివ్ కేసులు


మార్కాపురం,



 అప్రమత్తమైన  పోలీస్ శుక్రవారం రాత్రిచనిపోయిన  సఖిల్ విష్ణు అను అతను  మహారాష్ట్రకు చెందిన వారు  గత 45 సంవత్సరాల నుంచి మార్కాపురం  పట్టణంలో బంగారం పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు సదరు సఖీల్ విష్ణు గత ఐదు రోజులుగా జ్వరంతో బాధపడుతుండగా మార్కాపురం పట్టణం లోని కృష్ణా రెడ్డి హాస్పిటల్ నందు చికిత్స చేయించుకో గా జ్వరం తగ్గింది మళ్లీ గత రెండు రోజుల నుండి ఆయాసం దగ్గుతో బాధపడుతుండగా ఒంగోలులోని సంఘమిత్ర హాస్పిటల్ తీసుకెళ్లగా వాళ్ళు రిమ్స్ కి వెళ్ళమని సూచించడంతో రిమ్స్ లో అడ్మిట్ చేసినారు రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందినాడు చికిత్స సమయంలో కరోనా టెస్ట్ చేసి ఉన్నారు. శవాన్ని ఇంటికి తీసుకెళ్ళమని సూచించడంతో అంబులెన్స్లో తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో మృతునికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని మార్కాపురం పట్టణంలో ని కి రానియవద్దని ఒంగోలు రిమ్స్ నుండి డాక్టర్లు పోలీస్ ఆఫీసర్లకు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి డాక్టర్లకు చెప్పడంతో వారిని ఊరు బయట ఉన్న బోడపాడు రోడ్లో ఆపి వేసినారు ఆ తర్వాత సదరు విష్ణు యొక్క దహన సంస్కరణ గుండ్లకమ్మ వాగు పక్కన ఉండే స్థలంలో జెసిబి ద్వారా 04.00 గంటలకి గుంత తీసి పూడ్చి వేయడం జరిగింది   పట్టణంలో   శుక్ర శనివారాల్లో   30 కేసులు రావడం  ఒకరు మరణించడంతో  కలకలం రేగింది.    దీంతో     పట్టణంలో  లాక్ డౌన్ నిబంధనల    న   పటిష్టంగా  అమలు పరిచేందుకు  పోలీసులు   సమాయత్తం అయ్యారు.  పట్టణం చుట్టూ    రాకపోకలు ఆంక్షలు విధించి పట్టణంలో కూడా ప్రజలు తిరగకుండా పటిష్టమైన  చేపట్టారు.   కరోనాతో  వ్యక్తి   మృతి  చెందిన విషయం  తీసుకున్న పోలీసులు    ఉదయం ఏడు గంటలకే    దుకాణాలు  మూసివేయించారు.  రహదారుల వెంట   వివిధ  ప్రాంతాలలో    పోలీసులు  పికెటింగ్లు   ఏర్పాటు చేసి  కరుణా నియంత్రణపై  ప్రత్యేక దృష్టి సారించారు.


సదరు మృతుని యొక్క కుటుంబం షేక్ మహబూబ్ బాషా కరోనా పాజిటివ్ పర్సన్ యొక్క జూలరీ షాప్ పైన ఇంటిలో రెంటుకు ఉంటారు.వారికి ఇద్దరు కుమారులు  బంగారం పని చేస్తూ ఉంటారు.వర్క్ షాప్ కూడా ఆంధ్ర జూలరీ షాప్ కి ఎదురుగా ఉంటుంది ...విరు ఆంధ్ర జూలరీషాప్ కు సంబంధించిన బంగారం పనులు కూడా చేస్తూ ఉంటారు .అందువలన మృతుని యొక్క కుమారులకు కరోనా సోకి వారి ద్వారా తండ్రికి వచ్చి ఉండొచ్చని అనుకుంటున్నారు మృతుని కుమారులకు కరోనా పాజిటివ్ టెస్ట్ చేయలేదు. వారు ప్రస్తుతం ఒంగోలు రిమ్స్ నందు కరోనా టెస్ట్ కోసం ఉన్నారు. వారి ఇంటిలో వారు 9 మంది ఉంటారు. వీరికి ట్రావెల్ హిస్టరీ కూడా లేదు 


రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్...


రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్...


(టంగుటూరు, జరుగుమల్లి) .... జరుగుమల్లి మండలం లోని నందనవనం గ్రామం నుండి  శనివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అక్రమంగా ఇసుకను రవాణా చేస్తున్న కందుకూరు మండలానికి చెందిన రామనాథపురం గ్రామానికి ఇసుక తరలిస్తున్న శ్రీహరి మరియు హరిబాబు లను అరెస్టు చేసి 8 టన్నుల ఇసుకను జరుగుమల్లి పోలీస్ స్టేషన్ కి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.


వెన్నురులో  రెడ్ జోన్ అంక్షలు


ప్రకాశం కొండపి మండలం. వెన్నురులో  రెడ్ జోన్ అంక్షలు....ఎస్ఐ ప్రసాద్......


 


ప్రకాశం జిల్లా కొండేపి మండలం వెన్నురు పంచాయతీ లో కరోనా కేసు నమోదు అయినా నేపధ్యంలో రెడ్ జోన్ అంక్షలను ఉన్నతాధికారులు అదేశాలు మేరకు అమలు చేస్తున్నట్లు కొండేపి ఎస్ఐ ప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన కుటుంబ సభ్యులు తో పాటు పక్కన ఉన్న వాళ్లకి. గ్రామస్తులుకు కరోనా పరీక్షలు నిర్వహిస్తాం అన్నారు. కరోనా బాధితుడు ఎప్పుడు విజయవాడ నుంచి వచ్చాడు. ఎవరిని కలిశారు. ఎక్కడ తిరిగాడు వివరాలు సేకరిస్తున్నాం.గ్రామంలో.పంచాయతీ.వైధ్య అధికారులు సహకరంతో బ్లీచింగ్. పిచికారీ చేశాం అన్నారు. ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు అందేలా చర్యలు తీసుకుంటాము అన్నారు.


అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తాo


అర్హులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తాo


కొత్త రేషన్ కార్డు దారులకు కూడా....m r o 


కామేశ్వరరావు..(టంగుటూరు జరుగుమల్లి) జూన్ 27... జరుగుమల్లి మండలం లోని20 పంచాయితీల పరిధిలోని అర్హులైన ప్రతిఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వటం జరుగుతుందని ఆయన తెలిపారు. రెండో విడత క్రింద 231 మంది ఇళ్ల స్థలాల కొరకు అర్జీలు మాకు అందాయని దానిలో భాగంగా పది గ్రామాల్లో భూ సేకరణ ప్రారంభించామని త్వరితగతిన పూర్తిచేసి  అర్హులందరికీ స్థలాలు కేటాయిస్తామని ఆయన తెలిపారు. అదేవిధంగా ఈ మండలంలో దాదాపుగా కొత్త రేషన్ కార్డు కొరకు 181 మంది అర్జీలు పెట్టుకోవటం జరిగిందని వారికి పది రోజులలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది అని అలాగే ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే రేషన్ కార్డు కు అర్జీ పెట్టుకోవాలి అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనాథ్ ఎమ్మార్వో కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.


అక్రమ సంబంధం తో కన్న కొడుకుని చంపేందుకు యత్నం 


 


అక్రమ సంబంధం తో కన్న కొడుకుని చంపేందుకు యత్నం 


ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో అత్యంత దారుణ సంఘటన చోటు చేసుకుంది తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో తన ముక్కు పచ్చలారని మూడు సంవత్సరాల కుమారుడిని  ప్రియుడు అల్లవల్లి తో కలిసి హతమార్చింది కు ప్రయత్నించిన తల్లి లక్ష్మీ బాయి   నోరు మూసి ఊపిరాడకుండా చంపే యత్నం పసిబాలుడు కేకలు వేయడంతో ఈ సంఘటన స్థలానికి వచ్చిన స్థానికులు తప్పిన ప్రాణాపాయం  బాలుడికి స్వల్ప గాయాలు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి బాలుడు తల్లిని ఆమె ప్రియుని అదుపులోకి తీసుకున్న పోలీసులు గత కొద్ది కాలం క్రితం భర్త నుండి విడిపోయిన ఒంటరిగా ఉంటున్న బాలుడి తల్లి...


వాలంటీర్ పై దాడి


వాలంటీర్ పై దాడి.                


పెన్ పవర్, వలేటివారిపాలెం


 


మండల పరిధిలోని సింగమనేని పల్లి గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామ వాలంటీర్ శివరాం పై ఇరువురు దాడిచేసి  గాయపడినట్లు శివరాం తెలిపారు. శుక్రవారం సాయంత్రం గ్రామానికి చెందిన యలమంద, రమేష్ లు రేషన్ కార్డు విషయమై,  అలాగే రేషన్ బియ్యం  విషయంలో వాదోపవాదాలు జరిగాయి. శివరాం పై భౌతిక దాడికి దిగినట్లు బాధితుడు శివరాం తెలిపారు. దీంతో గాయాలపాలైన శివరాం కందుకూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు శివరాం తెలిపారు. కందుకూరు ఏరియా వైద్యశాలకు చికిత్సకోసం వెళ్లగా అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ కు సూచించగా అంబులెన్స్లో శివరాం వెళ్లారు.  కడుపు నొప్పి ఎక్కువగా ఉండటంతో పరీక్షలు చేసిన వైద్యులు మూడు రోజులు ఇక్కడే ఉండాలని ఇచ్చినట్లు శివరాం తెలిపారు. తనపై దాడికి దిగిన వారిని కఠినంగా శిక్షించాలని శివరాం కోరారు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...