Followers

ప్రతి కుటుంబానికి పదివేల నష్టపరిహారం ఇవ్వాలి


ప్రతి కుటుంబానికి పదివేల నష్టపరిహారం ఇవ్వాలి.

 

ఏలేశ్వరం, 

 

రాష్ట్రంలో, దేశంలో కరోన మహమ్మారి విలయతాండవంతో లాక్‌డౌన్‌ వలన   తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో తెల్లకార్డు ఉన్న ప్రతి ఒక్కరికి రూ 10 వేల రూపాయలు ఇవ్వాలని ఏఐసీసీటియు కార్మికులు డిమాండ్ చేశారు. స్థానిక వినోద్ మిశ్రా నగర్లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా నాయకుడు కొసిరెడ్డి గణేష్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర వైఫల్యాల వల్లే కరోనాలో భారతదేశం ప్రపంచంలో నాలుగో స్థానంకు చేరుకుందన్నారు. కర్మాగారాల్లో పని చేస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విదేశాల నుండి వచ్చిన వారిని ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించి పరీక్షలు నిర్వహించకుండా విచ్చలవిడిగా వదిలేయడం వలన నేడు దేశంలో ఈ పరిస్థితులు దాపురించాయి అన్నారు. రాష్ట్రంలో కార్మికులు, పేద రైతులు, రైతు కూలీలు ఆకలితో అలమటిస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం దనబాబు, గుమ్మడి పాదాలఅమ్మ, పిల్ల కాంతం, కందుల వరలక్ష్మి తదితరులు ఉన్నారు.
 

 


అక్రమ వ్యాపారాలపై దృష్టి సారించండి






అక్రమ వ్యాపారాలపై దృష్టి సారించండి

చింతపల్లి  జూన్ 24  పెన్ పవర్

గ్రామాలలో అక్రమ వ్యాపారాలు, రవాణాపై నియంత్రించాలసిన బాధ్యత గ్రామ వాలంటీర్లు, సచివాలయ మహిళా పోలీసులతో  పాటు ప్రతి ఒక్కరిపై ఉందని స్థానిక ఎక్సైజ్ సి.ఐ సింహాద్రి అన్నారు. బుధవారం మండలంలోని లోతు గెడ్డ పంచాయతీ కేంద్రంలో స్థానిక ఎంపిడిఓ శ్రీమతి కె ఉషశ్రీ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో అక్రమ గంజాయి రవాణా, నాటు సారా తయారీ, విక్రయాలు, గొలుసు మద్యం వ్యాపారాల నియంత్రణపై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని నియంత్రించాలన్నారు.నాటు సారా సేవించడం వలన బంగారం లాంటి కుటుంబాలు రోడ్డున పడతాయన్నారు. గంజాయి విక్రయం, రవాణా వంటి వాటి వల్ల భవిష్యత్ నాశనం అవుతుం     దన్నారు .ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గిరిజనుల  ఆహారపు అలవాట్ల పై అవగాహన పెంపొందించాలన్నారు. కాచి, వడపోసిన మంచినీటిని సేవించాలని, వేడివేడి ఆహార పదార్థాల తీసుకునేలా గిరిజనులకు అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు. ఇళ్ల వద్ద పశువులను ఉంచరాదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా చూడాలన్నారు. గ్రామాలలో అభివృద్ధి, సమస్యలపై దృష్టి సారించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యదర్శులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




 

 


 



 



చల్లని వాతావరణం- -కరోనాకు అనుకూలం


చల్లని వాతావరణం- -కరోనాకు అనుకూలం

చింతపల్లి ,  పెన్ పవర్

అధిక ఉష్ణోగ్రత ఉంటే కరోనా వైరస్ వ్యాధి వృద్ధి చెందదని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుత వాతావరణం అందుకు భిన్నంగా ఉంది. విశాఖ ఏజెన్సీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. అందుకు వాతావరణం అనుకూలిస్తుంది. మంగళవారం విపరీతమైన ఉష్ణోగ్రతలతో అల్లాడిన మన్యం వాసులకు బుధవారం ఉదయం నుంచి వాతావరణం చల్లబడడంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే మధ్యాహ్నం 1గంట నుంచి విపరీతమైన కుండపోత వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. దీంతో మన్యం వాసులు కరోనా వ్యాప్తి చెందుతుందని  భీతిల్లుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం తో శరీరంలో వేడిని కలిగించే ఉన్ని దుస్తులను ఆశ్రయిస్తున్నారు. రహదారులన్నీ జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మారుమూల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊట గెడ్డలన్నీ వర్షపు నీటితో కలుషితమయ్యాయి.


కొత్త రేషన్ కార్డు లు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి.

కొత్త రేషన్ కార్డు లు పంపిణీ రెండు రోజుల్లో పూర్తి.

          జె.సి. ఎం. వేణుగోపాలరెడ్డి.

 

      విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రకియ  రెండు రోజులలో పూర్తిచేయనున్నట్లు జిల్లా జాయింటు కలెక్టరు  ఎం. వేణుగోపాలరెడ్డి తెలిపారు.  వారం పౌర సరఫరాల శాఖ, కమీషనరు కోన శశిధర్  జాయింటు కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు. రైస్ కార్డులు పంపిణీ, బయోమెట్రిక్ ఎక్నలెడ్జెమెంటు, సచివాలయాలలో 5 సేవలు, ఇంటింటికి  నిత్యావసర సరుకులు పంపిణీపై నిర్వహించిన సమీక్షలో జాయింటు కలెక్టరు మాట్లాడుతూ జిల్లాకు 11,74,568 కార్డులు వచ్చాయని, ఇంకను 1,94,243 కార్డులు పంపిణీ చేయవలసి ఉందని, 2రోజులలో పంపిణీ పూర్తిచేస్తామని తెలిపారు.  సచివాలయాలద్వారా అందిస్తున్న 5 సేవలకు సంబంధించి ఇప్పటి వరకు 17,567 ధరఖాస్తులురాగా సుమారు 10వేల ధరఖాస్తులను పరిష్కరించడమైనదని తెలిపారు. ఇంటింటికి సరుకులు పంపిణీచేయుటకు ట్రాక్టరు వెళ్లలేని వీధుల,ఇళ్లు జిల్లాలో 20 శాతం వరకు ఉన్నాయని, పూర్తి నివేదిక అందజేస్త్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సరఫరాల అదికార్లు శివప్రసాద్, నిర్మలాబాయి, సహాయ సరఫరాల అదికార్లు పాల్గొన్నారు. 

గిరిజన మహిళా ఉద్యోగిని వేదిస్తున్న డాక్టర్.


 





గిరిజన మహిళా ఉద్యోగిని వేదిస్తున్న డాక్టర్.

 

 గిరిజన ఉద్యోగ సంఘం ఆరోపణ.

 

 కోటపాడు డాక్టర్ పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు.

 

   విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

జిల్లాలో ని  కె.కోటపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గిరిజన మహిళా ఉద్యోగి జి ధనలక్ష్మిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత  వేధింపులకు  గురిచేస్తున్నారని ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.సత్యనారాయణ ఆరోపించారు . బుదవారం ఆయన మాట్లాడుతూ గిరిజన ఉద్యోగుల పై వివక్షత చూపించి వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు . గిరిజన మహిళా ఉద్యోగి జి ధనలక్ష్మి చేతులపై ఎలర్జీ కారణంగా ఆమెకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఓ పి ఇంజక్షన్ రూమ్ జనరల్ డ్యూటీ ఆర్డర్ తెచ్చుకోవడం పై మెడికల్ ఆఫీసర్ కక్ష కట్టి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు . నిబంధనలకు విరుద్ధంగా తమ కులస్తులు ఎఫ్ ఎం ఓ లకు ఇంజక్షన్ రూమ్ లో డ్యూటీ వేయడం కోసమే గిరిజన మహిళా ఉద్యోగిని వేధిస్తున్నారని అన్నారు . ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్న మెడికల్ ఆఫీసర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.అన్న జనరల్ సెక్రెటరీ కె. శోభన్ కుమార్ , జాయింట్ సెక్రెటరీ డి .సత్యనారాయణ , వర్కింగ్ ఉమెన్స్ సెక్రటరీ డాక్టర్ గీత తదితరులు పాల్గొన్నారు .


 

 



 

కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు


 


కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు


టంగుటూరు, పెన్ పవర్


... మండల కేంద్రమైన టంగుటూరు బుచ్చి రాజుపాలెం లో మంచినీటి కొరత ఏర్పడటంతో అక్కడ కాలనీవాసులు సొసైటీ చైర్మన్ రావూరి అయ్యవారి అయ్యా ను ఆ కాలనీవాసులు నీటి సమస్య పై కోరగా బుధవారం సందర్శించారు. అనంతరం ఆ కాలనీ వాసులతో చర్చించి త్వరలో పైపులైను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకొని ఈ కాలానికి మంచినీటి సమస్య తీర్చే విధంగా అధికారులతో మాట్లాడి దాహార్తి తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుట్ట వెంకట్రావు రంగస్వామి స్టేట్ రవీంద్ర అనిల్ పంచాయతీ కార్యదర్శి జగదీష్ మహిళలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.


తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో నిత్యావసరాలు పంపిణీ






తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో నిత్యావసరాలు పంపిణీ

 

తాళ్ళపూడి,పెన్ పవర్:

 

తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో దాతలు ప్రతీ రోజు సాయం చేస్తున్నారు. ఈ విషయం వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకొని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న  స్వర్గీయ రామిశెట్టి మధనగోపాలస్వామి గారి అబ్బాయి రామిశెట్టి అరవాలరాజు 100గ్రాముల టీ పొడి, కేజి పంచదార, అలాగే సిద్దంశెట్టి బాలాజీ వంకాయలు, బంగాళాదుంపలు, నిమ్మకాయలు, అల్లం, అరలీటర్ పెరుగు మాజీ సర్పంచ్ నామన పరమేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎల్లా కుమారస్వామి పాలు, మారిశెట్టి సూర్యచంద్రం గ్రుడ్లు, సిద్దంశెట్టి కృష్ణ, బండారు నాగేశ్వరరావు బిస్కెట్లు, కామిశెట్టి దుర్గారావు పెరుగు, మాంటిస్సోరి స్కూల్ అధిపతి పాలు, మాట్ల బ్రదర్స్ పాలు, కరిబండి విద్యాసంస్థలు ఆటా పిండి, ఎర్రనూక పంపిణీ చేశారు. ఈ దాతలకు కంటోన్మెంట్ జోన్లో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


 

 


 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...