Followers
గిరిజన మహిళా ఉద్యోగిని వేదిస్తున్న డాక్టర్.
కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు
కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు
టంగుటూరు, పెన్ పవర్
... మండల కేంద్రమైన టంగుటూరు బుచ్చి రాజుపాలెం లో మంచినీటి కొరత ఏర్పడటంతో అక్కడ కాలనీవాసులు సొసైటీ చైర్మన్ రావూరి అయ్యవారి అయ్యా ను ఆ కాలనీవాసులు నీటి సమస్య పై కోరగా బుధవారం సందర్శించారు. అనంతరం ఆ కాలనీ వాసులతో చర్చించి త్వరలో పైపులైను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకొని ఈ కాలానికి మంచినీటి సమస్య తీర్చే విధంగా అధికారులతో మాట్లాడి దాహార్తి తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుట్ట వెంకట్రావు రంగస్వామి స్టేట్ రవీంద్ర అనిల్ పంచాయతీ కార్యదర్శి జగదీష్ మహిళలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.
తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో నిత్యావసరాలు పంపిణీ
ఏపీయూడబ్ల్యూజే అనుబంధ పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు
ఏపీయూడబ్ల్యూజే అనుబంధ పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు.
ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా లోకేష్ ఏకగ్రీవంగా ఎన్నిక.
పరవాడ, పెన్ పవర్
ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం బుధవారం ఉదయం మరిడిమాంబ ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు రవి (వార్త), ఆధ్వర్యంలో జరిగింది. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా సిహెచ్ లోకేష్ ను (సూర్య) గౌరవ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పల్లి శ్రీనివాసురావు(విశాలాంధ్ర), కార్యదర్శిగా పూసరపు విశ్వనాధం(విజన్), సహాయ కార్యదర్శిగా కుండ్రపు సోము నాయుడు (ఆంధ్ర పత్రిక), కోశాధికారిగా సి.హెచ్ అనిల్ కుమార్ ( పెన్ పవర్), కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ శ్యామ్ ప్రసాద్ (యంగిస్తాన్), కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ గోపి (పబ్లిక్), కే జగదీష్ ( వార్త), కరణం అప్పారావు (చైతన్యవారధి) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా పైలా సన్యాసిరావు (మనం) కొనసాగుతారు. అనంతరం నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన సిహెచ్ లోకేష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యుల ప్రయోజనాలు కాపాడుతానని, ప్రెస్ క్లబ్ లో ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.
నాటు సారాయి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదం
వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
అమరావతి, బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ’వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఎక్కడా వివక్షకు తావులేదు : ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగింది. బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్ ఇన్కమ్బర్డ్ ఖాతాలో వేస్తున్నాం.
ఆందోళన వద్దు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి : ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం. అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి. వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడండి. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేయాలని భావిస్తున్నాను' అంటూ సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.
ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.
ఎస్ ఐపై చర్య తీసుకోవాలని బైఠాయించిన ఆందోళనకారులు.
ఏ కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.
విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వి ఆర్ పి పై ఎస్ ఐ చేయి చేసుకున్నాడని పలువురు స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దౌర్జన్యంగా కొట్టిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే. జిల్లాలోని కే కోటపాడు మండలం ఏ కోడూరు పోలీస్ స్టేషన్ వద్ద మంగళవారం తలెత్తిన సంఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎన్ఆర్ఈజీఎస్ లో వి ఆర్ పి గా పనిచేస్తున్న పాటూరి సింహాచలం నాయుడు స్థలం విషయంలో వేరే వ్యక్తి దౌర్జన్యం చేశాడని ఏ కోడూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలో ఎస్ ఐ నిలదీసి ఫిర్యాదు చేస్తావా అంటూ దుర్భాషలాడి తనను చితకబాదాడు అని ఆరోపించారు. ఈ పరిస్థితి చూసి నా భార్య వరలక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెను కూడా దౌర్జన్యంగా నెట్టేశారని తమపై దుర్భాషలాడారని వారు పేర్కొన్నారు. బంధువులు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. టీడీపీ నాయకులకు అనుకూలంగా పనిచేస్తున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆందోళనకారులు అన్నారు. చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరణం ఈశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకునిచ ఆందోళనకారులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...