Followers

నాటు సారాయి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదం


నాటు సారాయి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదం.సి.ఐ. జి.వెంకట లక్ష్మి.

 

కాకినాడ స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్

 

మంగళవారం తెల్లవారుజామున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  డిప్యూటీ కమిషనర్ మరియు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు  కాకినాడ రూరల్ మండలం  వకలపూడి గ్రామంలో పరిధిలో గల షిప్పింగ్ అర్బర్ వద్ద ఒక ఫైబర్ బోట్ లో నాటు సారాయి ని విక్రయిస్తున్న పలేపు వీరబాబు వయసు 24 సం. అను వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 150 లీటర్ల నాటు సారాయి ని,ఒక ఫైబర్ బోట్ ను స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ జి. వెంకట లక్ష్మీ (సెబ్) తెలిపారు. సందర్బంగా ఆమె సదరు ఘటనపై విచారణ చేయగా  సదరు వ్యక్తి కి యానాం లో గిరియం పేటకు చెందిన పెసంగి రాముడు,అతని కుమారుడు పెసంగి సుందరరావు తనకు తరచుగా నాటు సారాయి ని సప్లయి చేస్తారని నేను దానిని విడి,విడి గా చేపల వేట చేసుకునే వారికి అమ్ముతాడని చెప్పారు. సి.ఐ.మాట్లాడుతూ ఇలాంటి కల్తీ,అక్రమ సారాయి ని సేవించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నిత్యం సముద్రం పై వేటకు వెళ్లే వారు అనేక ప్రమాదాలలో చిక్కుకుంటారని, తద్వారా మీకు కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేసిన వారవుతారని,ఎంతో కష్టమైన వేట సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎవరు కూడ అక్రమ మద్యం,సారాయి ని సేవించడం మంచిది కాదని, జాలర్ల కు హితవు పలికారు...అక్రమ మద్యం,నాటు సారాయి ని రవాణా,అమ్మకం,పై నిరంతరం నిఘా ఉంచుతామని,అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో సి.ఐ జి. వెంకట లక్ష్మి తో పాటు యస్.ఐ. కె. తమ్మరావు, సిబ్బంది టి.వెంకటేశ్వరవు, కృష్ణమోహన్,దొర తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌


 


వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌


 



అమరావతి, బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ’వైఎస్సార్‌ కాపు నేస్తం’  పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది.  ఎక్కడా వివక్షకు తావులేదు : ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగింది. బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేస్తున్నాం.
ఆందోళన వద్దు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి : ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం.  అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి.  వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడండి. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేయాలని భావిస్తున్నాను' అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


 ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.


 ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.



ఎస్ ఐపై  చర్య తీసుకోవాలని  బైఠాయించిన ఆందోళనకారులు.



ఏ కోడూరు పోలీస్ స్టేషన్  వద్ద ఉద్రిక్తత.


విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్) 


 


పోలీస్  స్టేషన్లో  ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వి ఆర్ పి పై  ఎస్ ఐ     చేయి చేసుకున్నాడని   పలువురు  స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దౌర్జన్యంగా కొట్టిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని  నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే. జిల్లాలోని  కే కోటపాడు మండలం  ఏ కోడూరు  పోలీస్  స్టేషన్  వద్ద మంగళవారం తలెత్తిన సంఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎన్ఆర్ఈజీఎస్ లో  వి ఆర్ పి గా పనిచేస్తున్న  పాటూరి సింహాచలం నాయుడు స్థలం విషయంలో వేరే వ్యక్తి దౌర్జన్యం చేశాడని ఏ కోడూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలో ఎస్ ఐ నిలదీసి ఫిర్యాదు చేస్తావా అంటూ దుర్భాషలాడి తనను చితకబాదాడు  అని  ఆరోపించారు. ఈ పరిస్థితి చూసి  నా భార్య వరలక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేయగా  ఆమెను కూడా దౌర్జన్యంగా నెట్టేశారని  తమపై  దుర్భాషలాడారని  వారు పేర్కొన్నారు. బంధువులు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి  నిరసన తెలియజేశారు. టీడీపీ నాయకులకు  అనుకూలంగా పనిచేస్తున్న ఎస్ఐపై  చర్యలు తీసుకోవాలని  ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆందోళనకారులు అన్నారు. చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరణం ఈశ్వరరావు  సంఘటనా స్థలానికి చేరుకునిచ ఆందోళనకారులకు  నచ్చజెప్పడంతో  ఆందోళన విరమించారు.


జులై 3 న సహాయ నిరాకరణ&శాసన ఉల్లంఘన

జులై 3 న సహాయ నిరాకరణ&శాసన ఉల్లంఘన


   గోడ పత్రికను విడుదల చేసిన సిఐటియు గనిశెట్టి

 

             పరవాడ పెన్ పవర్

 

పరవాడ మండలం:కేంద్ర ప్రభుత్వం కార్మికుల,ఉద్యోగుల హక్కుల యెక్క సేసనాలను ఉల్లంఘన చేస్తున్న కారణంగా జులై 3 వ తారీకున అన్ని ఉద్యోగ సంఘాల తో కలిసి సిఐటియు వారి ఆధ్వర్యంలో శహయ నిరాకరణ కార్యక్రమంలో పాల్గొనాలి గోడ పత్రికను సిఐటియు జిల్లా కార్యదర్శి గనిశెట్టి సత్యనారాయణ విడుదల చేసారు.అనంతరం గనిశెట్టి మాట్లాడుతూ జులై 3 నిర్వహిస్తున్న సహాయ నిరాకరణ శాసన ఉల్లంఘన కార్యక్రమంలో ఉద్యోగులు,కార్మికులు పెద్ద ఎత్తున అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అని పిలుపునిచ్చారు.కరోనా స్వీయ నిర్బంధం వలన ఎందరో కార్మికులు ఉపాధి కోల్పోయారు అని వారిని వెంటనే ఆదుకోవాలి అని అన్నారు.పరిశ్రమల్లో,సవస్థల్లో ని కార్మికులను తొలగించి రాదు అని అన్నారు.కార్మికులకు లాక్ డవున్ కాలంలో పూర్తి వేతనాలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు.కరోనా వైరస్ సోకకుండా భవన నిర్మాణ కార్మికులకు,వాలంటీర్లకు,ఉద్యోగులకు రక్షణ కల్పించాలి అని వారికి బకాయి ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలి అని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తూ,ప్రభుత్వ సవస్థలను ప్రవేటికరణ చేయాలి అని బీజేపీ ప్రభుత్వo చేస్తున్న చర్యలను ఉద్యోగులు వ్యతిరేకించండి అని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం హామీ మేరకు స్థానికులకు 75% ఉద్యోగాలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గేదల అప్పారావు,కె అప్పారావు,బి లచ్చిబాబు,జి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

ప్రజల ముంగిటకే పరిపాలన


ప్రజల ముంగిటకే పరిపాలన


-- జగన్ లక్ష్యమన ఎమ్మెల్యే అమర్

 

అనకాపల్లి, పెన్ పవర్

 

ప్రజల ముంగిటకే పరిపాలన తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి  సంకల్పమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.  ఎన్ని అడ్డంకులు ఉన్న పేదల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ ముందుకు సాగుతున్నారనారు. ఇదే లక్ష్యంతో సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలో సచివాలయం 3, 4 లో నూతనంగా మంజూరు అయిన పెన్షన్లను  శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్  చేతుల మీదగా మంగళవారం లబ్దిదారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో రాష్ట్ర అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది అన్నారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. సుమారు 500 కోట్లతో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆసుపత్రిని కూడా మోడల్ ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అనకాపల్లి కేంద్రంగా త్వరలో కొత్త జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్ కుమార్, పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామ రాజు, జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి, కొణతాల  మురళీకృష్ణ ,యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవం ప్రారంభం

 


 

 

 

శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవం ప్రారంభం

 

అనకాపల్లి, పెన్ పవర్

 

 శ్రీ జగన్నాథ స్వామి ఉత్సవం మంగళవారం లాంంచనగా ప్రారంభమైంది.  దేవాదాయ సహాయ కమిషనర్ చేతుల మీద భక్తులు లేకుండా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరిశాంతి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితుల వల్ల ఈ ఏడాది జగన్నాథ స్వామి ఉత్సవం మామూలుుగా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ తొమ్మిది రోజులు జగన్నాథ స్వామి గుడిలో ఉన్న కల్యాణ మండపాన్ని స్వామివారి ఇంద్ర జమున హాలు కింద మార్చి పూజలు జరిపిస్తామని ఈ సందర్భంగా తెలియచేశారు.  చైర్మన్ దాడి ఈశ్వరరావు మాట్లాడుతూ జగన్నాథుని కృప వల్ల ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని వచ్చే సంవత్సరం పండగ ఉత్సవం భారీ ఎత్తున చేసే విధంగా శక్తి సామర్ధ్యాలు ఆయుర్ ఆరోగ్యాలు మనకు ఆ జగన్నాథ స్వామి కల్పించాలని కోరారుు.   ఈ ఉత్సవంలో ఆలయ చైర్మన్ దాడి ఈశ్వరరావు ,  ఇ.ఓ గ్రంథి రమాబాయ్, ధర్మకర్తలు కాండ్రేగుల  సాంబశివరావు ,సీతారామ్ శ్రీను, డొంక నారాయణ తదితరులు పాల్గొన్నారు.


ప్రజారోగ్య విభాగపు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి

ప్రజారోగ్య విభాగపు పనితీరు మరింత మెరుగుపర్చుకోవాలి జి.వి.ఎం.సి. అధనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు


 


విశాఖపట్నం, 


 


ప్రజారోగా విభాగంలోని క్షేత్రస్థాయి అధికారులు ముఖ్యంగా, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్ స్పెక్టర్లు, మేస్త్రీలు వారి పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలని జి.వి.ఎం.సి. అదనపు కమీషనర్ డా. వి. సన్యాసి రావు కోరారు. జి.వి.ఎం.సి. కమీషనర్ ఆదేశాల మేరకు, ఆయన ప్రధాన కార్యాలయపు సమావేశ మందిరంలో సి.ఎం.ఓ.హెచ్.తో కలసి సమావేశం నిర్వహించారు. ప్రజారోగ్య శాఖకు సంబందించి వివిధ అంశములపై కూలంకుశంగా చర్చించారు. ట్రేడ్ లైసెన్స్ ఆదాయాన్ని మరింత పెంచాలని, క్రొత్తగా ఏర్పడుచున్న చిల్లర, టోకు వ్యాపారాలను గుర్తించి, వెంటనే ట్రేడ్ లైసెన్స్ ఫీజు మధించాలన్నారు. వ్యాపారాలలో మార్పులు చేస్తే (under assessed) వాటిని సరి దిద్ది లైసెన్స్ ఫీజు పెంచాలన్నారు. ఇప్పటి వరకు బకాయి పడ్డ వ్యాపారస్తుల వద్ద నుండి బకాయిలు రాబట్టాలన్నారు. జి.వి.ఎం.సి. యు.సి.డి. విభాగంలోగల సుమారు 13000 వీధి విక్రయ దారుల జాబితాలను, జి.ఎస్.టి. చెల్లిస్తున్న వ్యాపార సంస్థల వివరాలను జోనల్ వారీగా సేకరించి ట్రేడ్ లైసెన్స్ ఫీజు మధించాలన్నారు. ప్రజారోగ్య విభాగంద్వారా ప్రజలకు అందించే సేవలుగాని, ప్రజా ఫిర్యాదులు గాని, వార్డు సచివాలయాలు ద్వారా స్వీకరించాలన్నారు. ఏ అధికారి కూడా వ్యక్తిగతంగా స్వీకరించ కూడదన్నారు. వాటిని పెండింగులో ఉంచకుండా త్వరిత గతిని పరిష్కరించాలన్నారు. విద్యుత్ శాఖ వారు కొట్టి పడేస్తున్న మొక్కల కొమ్మలను, ఆ శాఖ అధికార్లతో సమన్వయము చేసుకొని ఎత్తిపారవేయాలన్నారు. కాలువల్లో పూడికలను ఇంజినీరింగ్ శాఖ వారు తీయిస్తే, ఆ కాంట్రాక్టరు ద్వారా, శానిటరీ విభాగంవారు తీయిస్తే సిబ్బంది ద్వారా అదే రోజు ఎత్తి పారవేయాలన్నారు. బిల్డింగ్ మెటీరియల్ రోడ్ల ప్రక్కన కనబడితే, ప్రణాళిక విభాగానికి తెలియపర్చాలన్నారు. వర్షా కాలంలో వచ్చే, సీజన్ వ్యాధులు, స్వైన్ ఫ్ల్యూ, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటివి ప్రబల కుండా, తగు జాగ్రత్తలు పాటించాలని, వార్డుల్లో చెత్తను ప్రతీ రోజు ఎత్తివేసి, కాలువలు శుభ్రం చేస్తే, వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడవచ్చన్నారు. ప్రతీ ఇంటి దగ్గర చెత్తను వేరుచేసి, పారిశుద్య సిబ్బంది స్వీకరిస్తే, రోడ్లపై చెత్త కనపడదు. గావున , క్రమ తప్పకుండా, ఈ విధానాన్ని అందరూ ఆచరించాలన్నారు. ప్రజలకు కూడా అవగాహన కల్పించాలన్నారు. వార్డు ప్రత్యేకాధికారులతో కలసి, వీధుల్లో పర్యటించి ప్రజలకు అంటూ వ్యాధులపై, కరోనా మహమ్మారిపై అవగాహన కల్పించాలన్నరు


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...