Followers

గిరిజన మహిళా ఉద్యోగిని వేదిస్తున్న డాక్టర్.


 





గిరిజన మహిళా ఉద్యోగిని వేదిస్తున్న డాక్టర్.

 

 గిరిజన ఉద్యోగ సంఘం ఆరోపణ.

 

 కోటపాడు డాక్టర్ పై జిల్లా కలెక్టర్ కు పిర్యాదు.

 

   విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్)

 

జిల్లాలో ని  కె.కోటపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గిరిజన మహిళా ఉద్యోగి జి ధనలక్ష్మిని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సరిత  వేధింపులకు  గురిచేస్తున్నారని ఆల్ ఇండియా షెడ్యూల్ ట్రైబల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.సత్యనారాయణ ఆరోపించారు . బుదవారం ఆయన మాట్లాడుతూ గిరిజన ఉద్యోగుల పై వివక్షత చూపించి వేధింపులకు గురి చేయడం దారుణమన్నారు . గిరిజన మహిళా ఉద్యోగి జి ధనలక్ష్మి చేతులపై ఎలర్జీ కారణంగా ఆమెకు ఉన్నతాధికారులు ఇచ్చిన ఓ పి ఇంజక్షన్ రూమ్ జనరల్ డ్యూటీ ఆర్డర్ తెచ్చుకోవడం పై మెడికల్ ఆఫీసర్ కక్ష కట్టి వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు . నిబంధనలకు విరుద్ధంగా తమ కులస్తులు ఎఫ్ ఎం ఓ లకు ఇంజక్షన్ రూమ్ లో డ్యూటీ వేయడం కోసమే గిరిజన మహిళా ఉద్యోగిని వేధిస్తున్నారని అన్నారు . ఇటువంటి వేధింపులకు పాల్పడుతున్న మెడికల్ ఆఫీసర్ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.అన్న జనరల్ సెక్రెటరీ కె. శోభన్ కుమార్ , జాయింట్ సెక్రెటరీ డి .సత్యనారాయణ , వర్కింగ్ ఉమెన్స్ సెక్రటరీ డాక్టర్ గీత తదితరులు పాల్గొన్నారు .


 

 



 

కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు


 


కొత్తబుచ్చి రాజుపాలెం కాలనీ వాసులకు కు పైపులైను ఏర్పాటు


టంగుటూరు, పెన్ పవర్


... మండల కేంద్రమైన టంగుటూరు బుచ్చి రాజుపాలెం లో మంచినీటి కొరత ఏర్పడటంతో అక్కడ కాలనీవాసులు సొసైటీ చైర్మన్ రావూరి అయ్యవారి అయ్యా ను ఆ కాలనీవాసులు నీటి సమస్య పై కోరగా బుధవారం సందర్శించారు. అనంతరం ఆ కాలనీ వాసులతో చర్చించి త్వరలో పైపులైను ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకొని ఈ కాలానికి మంచినీటి సమస్య తీర్చే విధంగా అధికారులతో మాట్లాడి దాహార్తి తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పుట్ట వెంకట్రావు రంగస్వామి స్టేట్ రవీంద్ర అనిల్ పంచాయతీ కార్యదర్శి జగదీష్ మహిళలు మరియు కాలనీవాసులు పాల్గొన్నారు.


తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో నిత్యావసరాలు పంపిణీ






తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో నిత్యావసరాలు పంపిణీ

 

తాళ్ళపూడి,పెన్ పవర్:

 

తాళ్ళపూడిలో 5వ వార్డు కంటోన్మెంట్ జోన్లో దాతలు ప్రతీ రోజు సాయం చేస్తున్నారు. ఈ విషయం వాట్సాప్ స్టేటస్ ద్వారా తెలుసుకొని బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న  స్వర్గీయ రామిశెట్టి మధనగోపాలస్వామి గారి అబ్బాయి రామిశెట్టి అరవాలరాజు 100గ్రాముల టీ పొడి, కేజి పంచదార, అలాగే సిద్దంశెట్టి బాలాజీ వంకాయలు, బంగాళాదుంపలు, నిమ్మకాయలు, అల్లం, అరలీటర్ పెరుగు మాజీ సర్పంచ్ నామన పరమేశ్వరరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎల్లా కుమారస్వామి పాలు, మారిశెట్టి సూర్యచంద్రం గ్రుడ్లు, సిద్దంశెట్టి కృష్ణ, బండారు నాగేశ్వరరావు బిస్కెట్లు, కామిశెట్టి దుర్గారావు పెరుగు, మాంటిస్సోరి స్కూల్ అధిపతి పాలు, మాట్ల బ్రదర్స్ పాలు, కరిబండి విద్యాసంస్థలు ఆటా పిండి, ఎర్రనూక పంపిణీ చేశారు. ఈ దాతలకు కంటోన్మెంట్ జోన్లో ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.


 

 


 



 

ఏపీయూడబ్ల్యూజే అనుబంధ పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు


 


ఏపీయూడబ్ల్యూజే అనుబంధ పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటు.



 ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా లోకేష్ ఏకగ్రీవంగా ఎన్నిక.



పరవాడ, పెన్ పవర్


 


ఏపీయూడబ్ల్యూజే అనుబంధ సంస్థ అయిన పరవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సమావేశం బుధవారం ఉదయం మరిడిమాంబ ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు రవి (వార్త), ఆధ్వర్యంలో జరిగింది. ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా సిహెచ్ లోకేష్  ను (సూర్య) గౌరవ సభ్యులు  ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా పల్లి శ్రీనివాసురావు(విశాలాంధ్ర), కార్యదర్శిగా పూసరపు విశ్వనాధం(విజన్), సహాయ కార్యదర్శిగా కుండ్రపు సోము నాయుడు (ఆంధ్ర పత్రిక), కోశాధికారిగా సి.హెచ్ అనిల్ కుమార్ ( పెన్ పవర్), కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ శ్యామ్ ప్రసాద్ (యంగిస్తాన్), కార్యవర్గ సభ్యులుగా సిహెచ్ గోపి (పబ్లిక్), కే జగదీష్ ( వార్త), కరణం అప్పారావు (చైతన్యవారధి) తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా పైలా సన్యాసిరావు (మనం) కొనసాగుతారు. అనంతరం నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన సిహెచ్ లోకేష్ మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ సభ్యుల ప్రయోజనాలు కాపాడుతానని, ప్రెస్ క్లబ్ లో ఉన్న జర్నలిస్టుల సంక్షేమం కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు.


నాటు సారాయి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదం


నాటు సారాయి పై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఉక్కుపాదం.సి.ఐ. జి.వెంకట లక్ష్మి.

 

కాకినాడ స్టాఫ్ రిపోర్టర్, పెన్ పవర్

 

మంగళవారం తెల్లవారుజామున స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో  డిప్యూటీ కమిషనర్ మరియు అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఆదేశాల మేరకు  కాకినాడ రూరల్ మండలం  వకలపూడి గ్రామంలో పరిధిలో గల షిప్పింగ్ అర్బర్ వద్ద ఒక ఫైబర్ బోట్ లో నాటు సారాయి ని విక్రయిస్తున్న పలేపు వీరబాబు వయసు 24 సం. అను వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 150 లీటర్ల నాటు సారాయి ని,ఒక ఫైబర్ బోట్ ను స్వాధీనం చేసుకున్నట్లు సి.ఐ జి. వెంకట లక్ష్మీ (సెబ్) తెలిపారు. సందర్బంగా ఆమె సదరు ఘటనపై విచారణ చేయగా  సదరు వ్యక్తి కి యానాం లో గిరియం పేటకు చెందిన పెసంగి రాముడు,అతని కుమారుడు పెసంగి సుందరరావు తనకు తరచుగా నాటు సారాయి ని సప్లయి చేస్తారని నేను దానిని విడి,విడి గా చేపల వేట చేసుకునే వారికి అమ్ముతాడని చెప్పారు. సి.ఐ.మాట్లాడుతూ ఇలాంటి కల్తీ,అక్రమ సారాయి ని సేవించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలతో పాటు నిత్యం సముద్రం పై వేటకు వెళ్లే వారు అనేక ప్రమాదాలలో చిక్కుకుంటారని, తద్వారా మీకు కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం చేసిన వారవుతారని,ఎంతో కష్టమైన వేట సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎవరు కూడ అక్రమ మద్యం,సారాయి ని సేవించడం మంచిది కాదని, జాలర్ల కు హితవు పలికారు...అక్రమ మద్యం,నాటు సారాయి ని రవాణా,అమ్మకం,పై నిరంతరం నిఘా ఉంచుతామని,అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో సి.ఐ జి. వెంకట లక్ష్మి తో పాటు యస్.ఐ. కె. తమ్మరావు, సిబ్బంది టి.వెంకటేశ్వరవు, కృష్ణమోహన్,దొర తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌


 


వైఎస్సార్‌ కాపు నేస్తం ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌


 



అమరావతి, బ్యూరో ఛీప్ (పెన్ పవర్)


: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ’వైఎస్సార్‌ కాపు నేస్తం’  పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేవుడి దయ, మీ చల్లని దీవెనలతో ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేయగలిగాను. ఈ 13 నెలలో కాలంలో 3.98 కోట్ల మందికి దాదాపు రూ.43 వేల కోట్లకు పైగా ఆర్థిక సహాయం చేయడం జరిగింది.  ఎక్కడా వివక్షకు తావులేదు : ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగింది. బియ్యం కార్డు ఉంటే చాలు 45 నుంచి 60 ఏళ్ల వయసున్న కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన వారికి ఇప్పుడు రూ.15 వేల చొప్పున సహాయం. ఆ విధంగా 5 ఏళ్లలో మొత్తం రూ.75 వేలు చెల్లింపు. పాత అప్పుల కింద బ్యాంకులు జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేస్తున్నాం.
ఆందోళన వద్దు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి : ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం.  అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి.  వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం. గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి. గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది? చూడండి. ఏటా రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పిన గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా సగటున రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే రూ.4,770 కోట్లు కాపు కులస్తులకు ఇచ్చింది. దేవుడి దయతో, మీ అందరి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి చేయాలని భావిస్తున్నాను' అంటూ సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.


 ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.


 ఫిర్యాదు చేయడానికి వెళ్ళిన వి ఆర్ పి పై చేయి చేసుకున్న ఎస్ ఐ.



ఎస్ ఐపై  చర్య తీసుకోవాలని  బైఠాయించిన ఆందోళనకారులు.



ఏ కోడూరు పోలీస్ స్టేషన్  వద్ద ఉద్రిక్తత.


విశాఖపట్నం_బ్యూరో ఛీప్ (పెన్ పవర్) 


 


పోలీస్  స్టేషన్లో  ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వి ఆర్ పి పై  ఎస్ ఐ     చేయి చేసుకున్నాడని   పలువురు  స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దౌర్జన్యంగా కొట్టిన ఎస్సై పై చర్యలు తీసుకోవాలని  నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే. జిల్లాలోని  కే కోటపాడు మండలం  ఏ కోడూరు  పోలీస్  స్టేషన్  వద్ద మంగళవారం తలెత్తిన సంఘటన ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఎన్ఆర్ఈజీఎస్ లో  వి ఆర్ పి గా పనిచేస్తున్న  పాటూరి సింహాచలం నాయుడు స్థలం విషయంలో వేరే వ్యక్తి దౌర్జన్యం చేశాడని ఏ కోడూరు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్ళాడు. ఫిర్యాదు చేసి వస్తున్న సమయంలో ఎస్ ఐ నిలదీసి ఫిర్యాదు చేస్తావా అంటూ దుర్భాషలాడి తనను చితకబాదాడు  అని  ఆరోపించారు. ఈ పరిస్థితి చూసి  నా భార్య వరలక్ష్మి అడ్డుకునే ప్రయత్నం చేయగా  ఆమెను కూడా దౌర్జన్యంగా నెట్టేశారని  తమపై  దుర్భాషలాడారని  వారు పేర్కొన్నారు. బంధువులు స్థానికులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి  నిరసన తెలియజేశారు. టీడీపీ నాయకులకు  అనుకూలంగా పనిచేస్తున్న ఎస్ఐపై  చర్యలు తీసుకోవాలని  ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఆందోళనకారులు అన్నారు. చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కరణం ఈశ్వరరావు  సంఘటనా స్థలానికి చేరుకునిచ ఆందోళనకారులకు  నచ్చజెప్పడంతో  ఆందోళన విరమించారు.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...