Followers

కంటోన్మెంట్ జోన్లలో ఎవరు ప్రవేశించిన కఠిన చర్యలు తప్పవు


కంటోన్మెంట్ జోన్లలో ఎవరు ప్రవేశించిన కఠిన చర్యలు తప్పవు. జిల్లా ఎస్పీ  అట్టాడ  బాపూజీ


     స్టాఫ్ రిపోర్టర్   విశాఖపట్నం(పెన్ పవర్)


కంటోన్మెంట్ జోన్లలో కి  ఎవరు ప్రవేశించిన  కఠిన చర్యలు తీసుకోవాలని  విశాఖ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్   అట్టాడ బాపూజీ   అన్నారు. శనివారం సాయంత్రం  కరోనా పాజిటివ్  కేసులు నమోదైన  బైలపూడి  దిబ్బిడి  గ్రామాలను ఆయన సందర్శించారు. కంటోన్మెంట్ జోన్లుగా  ఆ గ్రామాలను  గుర్తించడంతో  రెండు గ్రామాల్లో  రహదారుల దిగ్బంధం చేశారు. క్షుణ్నంగా పరిశీలించిన ఆయన  రెండు గ్రామాల్లో ప్రజలు బయటకు రాకుండా చూడాలని  ఇతర గ్రామాల నుంచి ఎవరు కంటోన్మెంట్ జోన్ లో అడుగు పెట్టకూడదని ఆయన హెచ్చరించారు. నిషేధాజ్ఞలు ఎవరు ఉల్లంఘించిన   కఠినమైన చర్యలు తీసుకోవాలని  అధికారులను ఆదేశించారు.  బైల పూడి లో రెండు కేజీలు  దిబిరి లో ఒక కేసు నమోదు కావడంతో  ఆ గ్రామాలను   బారికేడ్లు  కంచెలు  వేసి దిగ్బంధం చేశామన్నారు. ఈ పరిధిలో మైకుల ద్వారా  కరోనా వైరస్ పై అవగాహన కల్పించాలని  పోలీసులకు సూచించారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైన  బైల పూడి  దిబిడి  గ్రామాల్లో  వెంటనే చర్యలు చేపట్టిన  చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్  కారణం ఈశ్వరరావు సేవలను  ఎస్పీ కొనియాడారు. జిల్లాలో కరోనా లాక్ డౌన్   నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని  ఎస్పీ తెలిపారు. నిషేధాజ్ఞలు ఉల్లంఘించిన 85 మంది పై కేసు నమోదు చేశామని. ట్రాఫిక్ నిబంధనలు పాటించని 1193 మందిపై కేసులు పెట్టామని 17 వాహనాలు  సీజ్ చేసి తొంభై తొమ్మిది మందిని అరెస్టు చేశామన్నారు. శుక్రవారం సాయంత్రం ఆరు గంటల నుంచి  శనివారం సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వ్యాప్తంగా 1247 కేసులు  రిజిస్టర్ అయ్యాయని  మూడు లక్షల 88 వేల 825 రూపాయలు  అపరాధ రుసుము విధించామని   తెలిపారు.లాక్ డౌన్  నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటివారినైనా   ఉపేక్షించేది లేదని  ఎస్పీ హెచ్చరించారు. అత్యవసర ప్రయాణాలు చేయాలనుకుంటే  పోలీసు శాఖ ద్వారా  ప్రత్యేక పాస్  పొందాలని కోరారు. వాసుల కోసం  చేసుకోవాలని  ఎస్పీ బాపూజీ సూచించారు.


మద్యం దుకాణాల్లో స్టాక్ బేలన్స్ పెట్టాలి

మద్యం దుకాణాల్లో స్టాక్ బేలన్స్ పెట్టాలి


 

అనకాపల్లి, పెన్ పవర్ 

 

ప్రభుత్వ చౌక దుకాణాలలో ప్రతి దినం స్టాక్ బేలన్స్ తో పాటు ధరల పట్టిక పెట్టినట్లు గానే  మద్యం దుకాణాలలో పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని ఎస్సీ సెల్ వైకాపా నాయకులు మామిడి నూకరాజు పేర్కొన్నారు. పేదవాడికి అందుబాటులో ఉన్న అతి తక్కువ  క్వాటర్ ధర 180 / రూపాయిలు మాత్రమే. ప్రభుత్వం నిర్దేశించిన ధరకంటే షాప్ లో ఉండే సిబ్బంది  పక్కదారి మలించి రాత్రి వేళల్లో 250 రూపాయలకు అమ్ముకుంటున్నారనారు.  బినామిలతో అమ్మకాలు సాగిస్తున్నారని తెలిపారు. ఈ యొక్క తక్కువ ధరలు కలిగినవి ఉన్న లేవని ఎక్కువ ధరలు ఉన్నవి అమ్మకాలు చేస్తున్నారు కనుక ప్రభుత్వం వెంటనే స్పందించి వైన్ షాపుల వద్ద స్టాక్ బేలన్స్ తో పాటు ధరల పట్టిక పెట్టాలని కోరారు. 

మార్కుల విభజన వివరాలు వెబ్ సైట్ లో పొందుపర్చడమైనది

మార్కుల విభజన వివరాలు వెబ్ సైట్ లో పొందుపర్చడమైనది


జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి


       విజయనగరం, పెన్ పవర్


 


జూలై 2020లో జరగనున్న పదవ తరగతి పరీక్షలకు సంబంధించి సబ్జెక్టు వారీ మార్కుల విభజన వివరములు www.bseap.org వెబ్ సైట్ పొందుపర్చడమైనదని జిల్లా విద్యాశాఖాధికారి జి. నాగమణి తెలిపారు.  అన్నియాజమాన్యాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని విద్యార్దులకు తెలియజేయాలని తెలిపారు.


వలస కూలీలకు ఆహారం కల్పించాలి



-- మాజీమంత్రి దాడి వీరభద్రరావు


అనకాపల్లి, పెన్ పవర్


ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస పోతున్న కార్మికుల అవస్థలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది అని మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై అష్టకష్టాలు పడుతూ వెళ్తున్న కూలీలకు ఆహారాన్ని అందించే చర్యలు మంత్రులు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ సౌకర్యం కల్పించడంతో పాటు వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ ఆహార శిబిరాలు ఏర్పాటుచేసి కూలీలకు ఆకలి బాధలు తీర్చాలని అన్నారు. రోజుల తరబడి ఆహారం తినకుండా ఆకలి బాధతో నడిచి వెళ్తున్న వారి బాధలు వర్ణనాతీతం అన్నారు. అంతకు ముందు ఆర్డీవో సీతారామారావును కలిసి మాట్లాడారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఒరిస్సాకు చెందిన ఇటుక బట్టి కూలీలు వేలల్లో ఉన్నారని వారిని గుర్తించి వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీశెట్టి కృష్ణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో సహాయం





అనకాపల్లి , పెన్ పవర్


 లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సామాన్య, పేద వారిని ఆదుకోవడంలో ప్రతి ఒకరు చొరవ చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాద్ బాబు పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం పేదలకు అరటి పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ప్రజలను ఆదుకునేందుకు సహకరించాలని కోరారు. కే. శ్రీనివాసరావు, ఎన్. అప్పారావు, సుబ్రహ్మణ్యం, నారాయణరావు, చరణ్, భవాని తదితరులు పాల్గొన్నారు.


మోడీ ప్యాకేజీ ఓ బూటకం


మోడీ ప్యాకేజీ ఓ బూటకం


అనకాపల్లి , పెన్ పవర్


ప్రధాని మెాడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక పేకేజీ వట్టి బుాటకమని అనకాపల్లి అసెంబ్లీ నియెాజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఐ.ఆర్.గంగాధర్ విమర్శించారు.శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకి కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం 82వ వార్డు లో నిర్వహించారు. ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతుా దేశంలోకి కరోన మహమ్మారి ప్రవేశించి సుమారు రెండు నెలల అవుతుందన్నారు. ఈ కాలంలో ముాడు దఫాలు లాక్ డౌన్ ప్రకటించారని, దేశప్రజలు ఐక్యంగా ఏకతాటిపై నిలబడి కరోన మహమ్మారిని దేశం నుండి తరిమివేయాలని చెప్పి నమ్మించారని అన్నారు.దేశ ప్రజలు మెాడి పిలుపుకి కట్టుబడి నేటి వరకు ఉన్నారని అన్నారు. వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించలేదని అన్నారు. దేశంలో పేదరికం , నిరుద్యోగం పెరుగుపోయిందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కుాలీల,దినసరి కుాలీల  కష్టాలను ఏ మాత్రం లెక్క చేయటంలేదని విమర్శించారు.అంకెల గారఢీతో ప్రజలను నమ్మించాలని బిజెపి ప్రభుత్వం చుాస్తుందని అన్నారు.అబద్దాలు చెప్పి ఎంతో కాలం ప్రజలను మెాసం చేయలేరని అన్నారు.దేశంలో ఉన్న పేదల కుటుంబాలకు పది వేల రుాపాయలు చొప్పున చెల్లించాలని,విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని ,పేదల ఇంటి అద్దెలను కేంద్ర ప్రభుత్వమే చెల్లించావని గంగాధర్ డిమాండ్ చేసారు.పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 390 కుటుంబాలకు 3900 కోడిగుడ్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో తుట్టా రమణ,దాసరి సంతోష్,రామకృష్ణ,శేషు,రుాపేష్,మైఖేల్,కనక తదితరులు పాల్గొన్నారు.


ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకలు


ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకలు


అనకాపల్లి , పెన్ పవర్


పట్టణంలో చేపల బజార్ జంక్షన్లో  వేంచేసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.  స్వామి వారికి  ప్రత్యేక పూజలు చేశారు. వెదురుపర్తి సుందరయ్య (బాబి) ఆద్వర్యం లో వేడుకలు ఘనముగా జరిగాయి. పొన్నాడ విస్సు, మాతుర్తి గంగారాం, అంజి బాబు, పొన్నాడ పెదబాబు, వానపల్లి కోటి, పెదపాటి శ్రీను, కృష్ణ ,రవి, సతీష్, నాగు తదితరులు పాల్గొన్నారు. 


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...