Followers

వలస కూలీలకు ఆహారం కల్పించాలి



-- మాజీమంత్రి దాడి వీరభద్రరావు


అనకాపల్లి, పెన్ పవర్


ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస పోతున్న కార్మికుల అవస్థలను చూస్తుంటే కడుపు తరుక్కు పోతుంది అని మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై అష్టకష్టాలు పడుతూ వెళ్తున్న కూలీలకు ఆహారాన్ని అందించే చర్యలు మంత్రులు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ సౌకర్యం కల్పించడంతో పాటు వారి స్వస్థలాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారిపై నియోజకవర్గాల వారీగా ఎక్కడికక్కడ ఆహార శిబిరాలు ఏర్పాటుచేసి కూలీలకు ఆకలి బాధలు తీర్చాలని అన్నారు. రోజుల తరబడి ఆహారం తినకుండా ఆకలి బాధతో నడిచి వెళ్తున్న వారి బాధలు వర్ణనాతీతం అన్నారు. అంతకు ముందు ఆర్డీవో సీతారామారావును కలిసి మాట్లాడారు. అనకాపల్లి పరిసర ప్రాంతాల్లో ఒరిస్సాకు చెందిన ఇటుక బట్టి కూలీలు వేలల్లో ఉన్నారని వారిని గుర్తించి వారి స్వస్థలాలకు పంపించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బీశెట్టి కృష్ణ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


ఆమ్ ఆద్మీ ఆధ్వర్యంలో సహాయం





అనకాపల్లి , పెన్ పవర్


 లాక్ డౌన్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సామాన్య, పేద వారిని ఆదుకోవడంలో ప్రతి ఒకరు చొరవ చూపాలని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాద్ బాబు పేర్కొన్నారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం పేదలకు అరటి పళ్ళు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కూడా ప్రజలను ఆదుకునేందుకు సహకరించాలని కోరారు. కే. శ్రీనివాసరావు, ఎన్. అప్పారావు, సుబ్రహ్మణ్యం, నారాయణరావు, చరణ్, భవాని తదితరులు పాల్గొన్నారు.


మోడీ ప్యాకేజీ ఓ బూటకం


మోడీ ప్యాకేజీ ఓ బూటకం


అనకాపల్లి , పెన్ పవర్


ప్రధాని మెాడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆర్థిక పేకేజీ వట్టి బుాటకమని అనకాపల్లి అసెంబ్లీ నియెాజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జి ఐ.ఆర్.గంగాధర్ విమర్శించారు.శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకి కోడిగుడ్లు పంపిణీ కార్యక్రమం 82వ వార్డు లో నిర్వహించారు. ఈ సందర్బంగా గంగాధర్ మాట్లాడుతుా దేశంలోకి కరోన మహమ్మారి ప్రవేశించి సుమారు రెండు నెలల అవుతుందన్నారు. ఈ కాలంలో ముాడు దఫాలు లాక్ డౌన్ ప్రకటించారని, దేశప్రజలు ఐక్యంగా ఏకతాటిపై నిలబడి కరోన మహమ్మారిని దేశం నుండి తరిమివేయాలని చెప్పి నమ్మించారని అన్నారు.దేశ ప్రజలు మెాడి పిలుపుకి కట్టుబడి నేటి వరకు ఉన్నారని అన్నారు. వైద్యులకు సరైన సదుపాయాలు కల్పించలేదని అన్నారు. దేశంలో పేదరికం , నిరుద్యోగం పెరుగుపోయిందని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వలస కుాలీల,దినసరి కుాలీల  కష్టాలను ఏ మాత్రం లెక్క చేయటంలేదని విమర్శించారు.అంకెల గారఢీతో ప్రజలను నమ్మించాలని బిజెపి ప్రభుత్వం చుాస్తుందని అన్నారు.అబద్దాలు చెప్పి ఎంతో కాలం ప్రజలను మెాసం చేయలేరని అన్నారు.దేశంలో ఉన్న పేదల కుటుంబాలకు పది వేల రుాపాయలు చొప్పున చెల్లించాలని,విద్యుత్ బకాయిలను మాఫీ చేయాలని ,పేదల ఇంటి అద్దెలను కేంద్ర ప్రభుత్వమే చెల్లించావని గంగాధర్ డిమాండ్ చేసారు.పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో 390 కుటుంబాలకు 3900 కోడిగుడ్లు పంపిణీ చేసారు.ఈ కార్యక్రమంలో తుట్టా రమణ,దాసరి సంతోష్,రామకృష్ణ,శేషు,రుాపేష్,మైఖేల్,కనక తదితరులు పాల్గొన్నారు.


ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకలు


ఘనంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకలు


అనకాపల్లి , పెన్ పవర్


పట్టణంలో చేపల బజార్ జంక్షన్లో  వేంచేసిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు.  స్వామి వారికి  ప్రత్యేక పూజలు చేశారు. వెదురుపర్తి సుందరయ్య (బాబి) ఆద్వర్యం లో వేడుకలు ఘనముగా జరిగాయి. పొన్నాడ విస్సు, మాతుర్తి గంగారాం, అంజి బాబు, పొన్నాడ పెదబాబు, వానపల్లి కోటి, పెదపాటి శ్రీను, కృష్ణ ,రవి, సతీష్, నాగు తదితరులు పాల్గొన్నారు. 


పాలిమర్స్ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలి

 


పాలిమర్స్ పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించాలి



స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం (పెన్ పవర్)


 


విశాఖ నగరంలోని వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ వెదజల్లిన విషవాయువు వల్ల స్థానిక ప్రజలు 12 మంది మృతి చెందగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని వెంకటాపురం పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు దీర్ఘకాలికంగా అందించాలని ప్రత్యేక వైద్యశాలలు ఏర్పాటు చేయాలని కోరుతూ శనివారం భారతీయ జనతా పార్టీ సైనికులు కోన మంగయ్య నాయుడు విజయ శంకర ఫణీంద్ర మాధవి చార్లెస్ కంభంపాటి సత్యనారాయణ పూరి జాల సుబ్రహ్మణ్యం తదితరులు జివిఎంసి కమిషనర్ డాక్టర్ కె సృజనకు వినతి పత్రం అందజేశారు దీనిపై కమిషనర్ స్పందిస్తూ పరిశీలించి బాధితులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని బిజెపి నాయకులు తెలిపారు


ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే  ఐదు శాతం మినహాయింపు



స్టాఫ్ రిపోర్టర్  విశాఖపట్నం(పెన్ పవర్) 



నగరంలో  ఏడాది  ఆస్తి పన్ను  ఒకేసారి  చెల్లిస్తే  ఐదు శాతం  మినహాయింపు  ఇస్తామని  జివిఎంసి కమిషనర్  సృజన  అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్  నేపద్యంలో  ఆస్తిపన్ను దారులకు   వెసులుబాటు కల్పించాలని  నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ  జీవీఎంసీ  పరిధిలో 2020_ 21  ఆర్థిక సంవత్సరానికి గాను  ఆస్తిపన్ను దారులకు  ఏడాది మొత్తం  పన్ను  ఒకేసారి చెల్లించిన వారికి  ఐదు శాతం  తగ్గింపు  కల్పిస్తామని  ఆమె అన్నారు. నగరంలో  పారిశుధ్యం  త్రాగునీరు పై   ప్రత్యేక చేపడుతున్నామని  ఆమె తెలిపారు. పాలిమర్స్ విషవాయువు   ప్రభావిత ప్రాంతాల్లో  సర్వే నిర్వహిస్తున్నామని  సర్వే పూర్తి అయిన తర్వాత  ప్రభుత్వం ప్రకటించిన  పరిహారం  బాధితులకు అందజేస్తామని  సృజన ఒక ప్రకటనలో తెలియజేశారు.


మన్యంలో  మారని  డోలీల మోత.


మన్యంలో  మారని  డోలీల మోత.



రోడ్లు మృగ్యం.. ఆదివాసీలకు ప్రాణసంకటం.



  ప్రభుత్వాలు మారుతున్న ఇక్కడ మారని దురాచారం.


 


           స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్) 


మన్యంలో  డోలీలు మోత  ఆచారం లా మారిపోయింది.  ఎక్కడ ఎవరికి  అనారోగ్యం  చేసిన  ప్రాణాపాయ స్థితిలో   ఉన్నా   వైద్యం కోసం తరలించాలి అంటే  డోలిలో మోయాల్సిందే.కొండల కోనల మధ్య  మైళ్ల దూరం మోసుకొని ని  ఆస్పత్రులకు  చేరవేస్తున్నారు. సకాలంలో  వైద్యం అందితే  ప్రాణాలు  నిలిచినట్టే  లేకుంటే  గాలిలో కలిసి పోవడమే.  స్వాతంత్రం  వచ్చి  73  వసంతాలు  కావస్తున్నా  శివారు గిరి పల్లెల్లో  డోలీల దురాచారం  ఇంకా మారలేదు. రోడ్లు లేకపోవడంతో  ఆ గ్రామాల్లో ప్రజలకు  జ్వరం జబ్బు   వచ్చిన  గర్భిణీ  పురిటి నొప్పులు తలెత్తిన  ఉచిత వైద్యం అందుకోవాలంటే  రోగిని  డోలి లో  ఆసుపత్రికి తీసుకు రావాలి.  వైద్యులు అందుబాటులో ఉంటే  సకాలంలో వైద్యం ఉంటుంది  లేకుంటే లేదు. ప్రభుత్వాలు మారుతున్నా యి   గిరిజన సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని  ఎన్నికల్లో  ప్రకటనలు చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల కేటాయించిన నిధులు  ఫలితాలు ఇవ్వడం లేదు. ప్రతి మండలంలో వందల సంఖ్యలో శివారు గ్రామాల ప్రజలు  రోడ్డు మార్గం లేక  కొండలు పొదలు  నడుచుకుంటూ  కాలం వెళ్లదీస్తున్నారు. ఆ గ్రామాల వైపు  చూస్తే   హృదయ  విదారక  సంఘటనలు  కంట పడతాయి. హుకుం పేట  మండలం  తీగ వలస పంచాయితీ పనస బంధ గ్రామంలో శుక్రవారం రాత్రి చీదరి  చిలకమ్మ  ఆదివాసి మహిళ  గర్భిణీ నొప్పులు మొదలై  ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. వైద్య సిబ్బంది కూడా  అందుబాటులో లేకపోవడంతో  పాలుపోని గ్రామస్తులు ప్రసవ వేదన అనుభవిస్తున్న చిలకమ్మ ను డో లీపై  కొండలపై నుంచి నాలుగు కిలోమీటర్లు మూసుకొని రోడ్డు వద్దకు చేర్చారు  అక్కడ నుంచి హుకుం పేట  ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఆటోలో తరలించారు. జి.మాడుగుల మండలం లువ్వాసింగ్ పంచాయతీ  వంచేబు బిడ్డ పుట్  గన్నె గుంట 11 గిరిజన గ్రామాలు రోడ్డు సౌకర్యం లేక  కొండల పైనుంచి నడుచుకొని రావాల్సిందే. ఆనారోగ్యానికి గురైతే డోలీలపై  మోసుకు రావాల్సిందే. ఏళ్ల తరబడి అక్కడి గిరిజనుల్లో  రోడ్లు నిర్మించాలని  నాయకులను అధికారులను కోరుతున్నారు అయినా ఆ గ్రామాలకు మోక్షం కలగలేదు. ప్రతి ఏడాది పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు  ఇతర నిధులు ప్రభుత్వం కేటాయిస్తుంది  శివారు గ్రామాలకు అంచెలంచెలుగా  రోడ్ల నిర్మాణం చేపడితే డోలీ  మోత దురాచారం  సమసి పోతుందని  ప్రజా సంఘాలు  మోర పడుతున్నాయి. నింగికి రాకెట్లను పంపుతున్న కాలంలో కూడా  గిరిజనులుగా పుట్టిన పాపానికి  ఇంకా  డోలీల నే  ఉపయోగిస్తున్నారు అంటే  అభివృద్ధి  స్పష్టమవుతోంది.


Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...