Followers

అంగన్వాడి టీచర్లకు పలకా అభినందనలు








అంగన్వాడి టీచర్లకు పలకా అభినందనలు

 

అనకాపల్లి , పెన్ పవర్

 

కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న జీవీఎంసీ 84 వార్డుకు చెందిన 30 మంది ఆర్ పి లు , అంగన్వాడి టీచర్లల ను  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి పలకా రవి అభినందించారు. గురువారం పలకా ఎడ్యుకేషనల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారికి సహాయం చేశారు. బియ్యంతో పాటు ఐదు రకాల పప్పు దినుసులను  పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పార్టీ నాయకులు కోరుకొండ రాఘవ,  మాధురి నాయుడు, అప్పికొండ రవిశంకర్, సూరిశెట్టి వికాస్, శఠగోపం కుమార్, పలక రవి మిత్ర మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

 




 



 

ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణి





  విశాఖపట్నం. పెన్ పవర్.

 

విశాఖపట్నం మదురవాడ 6 వార్డ్ లో ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక పేద ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కన్నబాబు, ఎమ్యెల్లే అమరనాథ్, విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజ్ శ్రీనివాసరావు, నగర వైసీపీ అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్,ఆరోవ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థి డాక్టర్ ముత్తంశెట్టి ప్రియాంకా,  పలువురు పొల్గొని .నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. అనంతరం వాలింటీర్ల నియామక పత్రాలు , రంజాన్ తోఫా, సున్నా వడ్డీ పధకం చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో జోనల్ అధికారులు, పార్టీ నాయకులు , పలువురు పాల్గొన్నారు.

 

 



 

నిరుపేదలకు బాసటగా భాస్కర్











నిరుపేదలకు బాసటగా భాస్కర్

 

అనకాపల్లి, పెన్ పవర్

 

కష్టకాలంలో పేదలకు అండగా నిలిచి వారికి ఎంతోకొంత  మనోధైర్యం ఇవ్వాలని సమాజ సేవకుడు, 80వ వార్డ్ వైస్సార్సీపీ ఇంచార్జ్  కొణతాల భాస్కరరావు పేర్కొన్నారు.  సతీమణి వైస్సార్సీపీ 80వ వార్డ్ కార్పొరేటర్ అభ్యర్థిని నీలిమతో కలిసి గురువారం పేదలకు సహాయం చేశారు. ఎస్ రాయవరం మండలం వైస్సార్సీపీ అధ్యక్షులు  శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అనకాపల్లి, గవరపాలెంలో గల కర్రి పెద్దయ్య గారి వీధి, బుద్ధ రామదాసు గారి వీధులలో నివసించే వృద్ధులకు,నిరాధారులకు బియ్యం, పప్పు దినుసులు,  కాయకూరలను వీరి ఇంటికి పిలిచి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ  కరోనా కష్టసమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని తామే స్వయంగా గుర్తించి తమ వంతు సేవ చెయ్యటం కోసం మేము ఎప్పుడు సిద్దమేనని అది బాధ్యతగా భావిస్తున్నామన్నారు. శ్రీనివాసరావు  మాట్లాడుతూ ఇలాంటి విపత్తు సమయంలో నిరుపేదలకు అండగా ఉంటుు భాస్కర్ నీలిమ దంపతులు అందరికి ఆదర్శంగా నిలిచారన్నారు.  సామజిక సేవ చెయ్యటం మాత్రమే కాకుండా ప్రజలకు ప్రభుత్వ పధకాలు చేరేలా కూడా చూస్తున్న వారు అబినందనీయులని అన్నారు.ఈ కార్యక్రమంలో కె.ఎమ్.నాయుడు,కాండ్రేగుల శ్రీరామ్,కోరిబిల్లి పరి,కోరిబిల్లి ఆరుద్ర,కర్రి అప్పాజీ, విల్లూరి సంతోష్,కొణతాల చందు, అరవింద్ మరియు  వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

 







 


 



 



 




 



మైనార్టీ మహిళలకు ఆర్ధిక సహయం అందించిన దామా సుబ్బారావు


మైనార్టీ మహిళలకు ఆర్ధిక సహయం అందించిన దామా సుబ్బారావు


ఫకీర్ తఖ్యాకి చెందిన ముస్లీం మైనార్టీ మహిళలకు పవిత్రమైన రంజాన్ పండగ సందర్భంగా బియ్యం, కూరగాయలతో పాటు ఆర్ధికంగా సహయం చేసారు 86వ వార్డు వైసీపీ అభ్యర్ధీ దామా సుబ్బారావు , కార్యక్రమంలో రాజ్ కుమార్ ఆచార్య, బాబు, చెగొండి శ్రీను, నిర్మలమ్మ, మాటూరి శ్రీనివాస్ , నజీర్ , బార్ సాయి, భూపతిరాజు శ్రీనివాస్ రాజు, గుండాసు రాజు, అల్లాఉద్ధీన్ , మండవ మోహన్ , చిట్టి దేముడు, జీవన్ , హరీష్ వర్మ, అనీష్ తదితరులు పాల్గున్నారు


అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసరాలు, బట్టలు, చీరలు,దుప్పట్లు పంపిణీ:


అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసరాలు, బట్టలు, చీరలు,దుప్పట్లు పంపిణీ:


 

జగ్గంపేట, పెన్ పవర్

 

బాధితులను అన్నీ రకాలుగా ఆదుకుంటామని హామీ

 

 జగ్గంపేట మండలం, నరేంద్ర పట్నం గ్రామంలో రెండు పెద్ద తాటాకుల ఇల్లు నిప్పు అంటుకుని కాలిపోవడంతో  మూడు కుటుంబాలకు చెందిన చిత్తార పు యేసయ్య ,చిత్తాలపు నాగరాజు, చిత్తారపు నాగయ్య , కుటుంబాలవారు నిరాశ్రయులయ్యారు,  వారిని బుర్రి చక్రబాబు అద్వర్యంలో  రాష్ట్ర వై ఎస్ ఆర్ సేవాదళ్ ప్రధాన కార్యదర్శి, అమలాపురం పార్లమెంటు జిల్లా బూత్ కమిటీల ఇంచార్జ్  ఒమ్మి రఘురామ్  జగ్గంపేట మండల నాయకులు  అత్తులూరి నాగబాబు గారు, బండారు రాజా గారు  బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి నిత్యావసరాలు, బట్టలు, చీరలు, పంచులు దుప్పట్లు తుమాల్లు, బియ్యం  పంపిణీ చేశారు. బాదితులు సర్వస్వం కోల్పోయామని తమ గోడు వెలబుచ్చారు,దానికి రఘురామ్, నాగబాబు స్పందించి బాధితులకు మేము అందించిన సహాయం తాత్కాలిక ఉపసమనమని, వారిని ప్రభుత్వ పరంగా ముగ్గురు కుటుంబాలకు రావలసినవి ఆర్థిక సహాయం ఒకటి రెండు రోజులలోనే బ్యాంకు ఖాతాలలో జమ చేయిస్తామని, మూడు కుటుంబాలకు  పక్కా గృహాలు  శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు ద్వారా నిర్మించే బాధ్యత మేము తీసుకుంటామని ఏ విధంగాను అదైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. పరామర్శలో బుర్రి రవి, నరేంద్రపట్నం గ్రామ నాయకులు,జగ్గంపేట ఎంపీటీసీ అభ్యర్థి చేకూరి మృత్యుంజయరాజు తదితరులు పాల్గొన్నారు.


ఎమ్మెల్యే అమర్నాథ్ చొరవ --  వ్యాపారాలకు అనుమతి








ఎమ్మెల్యే అమర్నాథ్ చొరవ

--  వ్యాపారాలకు అనుమతి

-- ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే జరిమానా

 

అనకాపల్లి , పెన్ పవర్

 

అనకాపల్లి పట్టణ  పరిధిలో ప్రధాన రహదారులకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలును నిర్వహించుకోవచ్చని జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీరామ్ మూర్తి తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ సడలింపు లో  భాగంగా కొన్ని వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నామన్నారు. ఎమ్మెల్యే అమర్నాథ్ చొరవ చూపడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రధాన రహదారుల్లో కూడా వ్యాపారాలు నిర్వహించుకునే వెసులుబాటును కల్పిస్తున్నట్లు వెల్లడించారు. వ్యాపార యాజమాన్యం తప్పక ప్రభుత్వ నిబంధనలు పాటించాలని భౌతిక దూరం తదితర జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గురువారం వైకాపా పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు వార్డ్ ఇన్చార్జులు పలకా రవి, జాజుల రమేష్, కొణతాల భాస్కర్ , పీలా రాంబాబు తదితరులు పాల్గొని వ్యాపారులకు సూచనలు చేశారు. కంటెంట్మెంట్ జోన్ , బఫర్ జోన్ లలో లాక్ డౌన్ నిబంధనలు సడలింపు లతో కొనసాగుతున్నాయన్నారు. అనకాపల్లిలో ఎలాంటి కరోనా కేసులు లేకపోవడంతో ప్రధాన రహదారిలో కూడా వ్యాపారాలు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. వస్త్ర వ్యాపారాలు, బడా షాపింగ్ కాంప్లెక్స్ నువ్వు అనుమతి లేదన్నారు. సెలూన్ దుకాణాలకు వెళ్తే  ప్రజలు తప్పకుండా ఎవరు బ్లేడ్ వారే తీసుకువెళ్లాలని సూచించారు. దుకాణాలను సాయంత్రం 5 గంటలకల్లా మూసేయాలన్నారు. ప్రభుత్వం నిత్యావసర సరుకులకు సంబంధించే ప్రస్తుతానికి ఇచ్చినట్లు తెలిపారు. కొనుగోలుదారులు తప్పక భౌతిక దూరం పాటించేలా యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలన్నారు. దుకాణాల్లో సిబ్బంది తదితరులు వ్యక్తిగత శుభ్రత పాటించడం తో పాటు మాస్కులు వంటివి ధరించాలనారు. శానిటేజేషన్ వంటివి తప్పక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సందర్భంలో వ్యాపార ప్రతినిధులు మాట్లాడుతూ తమకిచ్చిన సమయ వేళల్లో మార్పులు చేయాలని విన్నవించారు. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేకపోవడంతో వ్యాపారాలకు అనుమతిచ్చిన తమకు లాభం లేదని వాపోయారు. 
 

 



 




 



 

    తోపుడు బళ్ళు వ్యాపారస్తులు క్యూ పద్ధతి పాటించాలి


      తోపుడు బళ్ళు వ్యాపారస్తులు క్యూ పద్ధతి పాటించాలి

 

జగ్గంపేట, పెన్ పవర్

 

జగ్గంపేట మెయిన్ రోడ్డు పై వ్యాపారాలు నిర్వహించే వారందరూ క్యూ పద్ధతిని పాటించాలని జగ్గంపేట ఎస్ ఐ టి రామకృష్ణ తెలిపారు. తోపుడుబండ్ల ను కాంప్లెక్స్ ఆవరణంలో పెట్టుకుని, బండికి, బండికి మధ్య ఐదు మీటర్ల దూరం ఉండేవిధంగా  వ్యాపారాలు నిర్వహించుకోవాలని, ముఖ్యంగా భౌతిక దూరం పాటించే విధంగా వారి వ్యాపార దానికి ఎదురుగా రౌండ్ మార్కులను కచ్చితంగా వేయాలని సూచిస్తూ ఎస్సై రామకృష్ణ స్వయంగా శుద్ధ పట్టుకుని మార్జిన్ లైన్లను రోడ్డుపై గీసి అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ లాక్  డౌన్ నిబంధనలు పాటించాలి అన్నారు.

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...