Followers

ఇళ్లస్థలాలు పంపిణీకి ఏర్పాట్లు.


ఇళ్లస్థలాలు పంపిణీకి ఏర్పాట్లు.- .......తహశీల్దార్ కె.పోసిబాబు

    

 గోకవరం, పెన్ పవర్

 

 

 గోకవరం మండలం లో సుమారు 40వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తహశీల్దార్ కె.పోసి బాబు తెలిపారు. గురువారం స్థానిక ది గోకవరం ప్రెస్ క్లబ్ నందు పాత్రికేయులతో ఇష్టాగోష్టి లో తహశీల్దార్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా గోకవరం మండలం లో ఉన్న ప్రభుత్వ భూములను మే నెలాఖరుకు ప్యురిఫికేషన్ ఆఫ్ లాండ్ రికార్డ్స్ పనిని పూర్తి చేస్తామని అన్నారు. మండలంలో సుమారు 13 వేల మంది పట్టాడారులు ఉన్నారని, వారందరి ఖాతాలు ఆధార్ కు అనుసంధానం చేస్తున్నామని అన్నారు. విదేశాల్లో ఉన్న వారి పట్టాదారు ల ఖాతాలను కూడా త్వరలో ఆధార్ తో అనుసంధానం చేయుటకు చర్యలు తీసుకుంటున్నాం. మండలంలో ఉన్న మీసేవ కేంద్రాల్లో సర్వీసులను నిత్యం తమ సిబ్బంది  పర్యవేక్షిస్తున్నారు  అని తెలిపారు. లాక్ డౌన్ నేపథ్యంలో మండలంలో ఉన్న ప్రతీ రేషన్ కార్డు దారునికి ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పంపిణీ కార్యక్రమం 100 శాతం  అందిస్తున్నామన్నారు.  మండలంలో 23 లే అవుట్ లు లో పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నాయని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ళ స్థలాల పంపిణీ కార్యక్రమం కొరకు అర్హులను గుర్తింపు జరుగుతుందన్నారు. మండలంలో 3023 మంది ఇళ్ళ స్థలాలు కు అర్హులను గుర్తించామని అన్నారు. మే 25 వరుకు ఇళ్ళ స్థలాల కు  దరఖాస్తు కు అవకాశం ఉందని తహశీల్దార్  అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జాయింట్ రిజిస్ట్రార్ హోదాలో అర్హులైన వారందరికీ రిజిస్ట్రేషన్ చేసి, ఇళ్ళ స్థలాల పంపిణీ చేయనున్నామని తెలిపారు. మే నెలాఖరు లోగా లబ్దిదారులు జాబితా మరొకసారి ప్రకటిస్తామన్నారు. తొలి జాబితాలో అర్హులుగా ఉన్నవారు వివరాలను రెండోసారి క్షుణ్ణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకే పరిశీలించాక కొందరిని అనర్హులుగా ప్రకటించామని తహశీల్దార్ అన్నారు. అలాగే మండలంలో ఉన్న  రెవెన్యూ సంబంధిత సమస్యల్ని  తమ దృష్టికి తీసుకు రావాలని పాత్రికేయులకు సూచించారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ది గోకవరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రౌతు పండు, ఉపాధ్యక్షులు  కరాసు శివ రామకృష్ణ, కార్యదర్శి కర్రి శివ తదితరులు పాల్గొన్నారు.

నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన దొంతు మంగేశ్వరరావు


600.కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన దొంతు మంగేశ్వరరావు

ఎటపాక,


 


-ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని వ్యాప్తి చెందకుండా అరికట్టేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో ప్రజలకు ఏర్పడిన విపత్కర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని విలీన మండలాల బిజెపి అధ్యక్షులు దొంతు మంగేశ్వరరావు ఆధ్వర్యంలో 600 కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఇంటింటికి వెళ్లి గురువారం పంపిణీ చేశారు,వివరాలోకివెళ్తే ..ఎటపాకమండల పరిధిలోని గౌరీదేవిపేట పంచాయతీ పేద ప్రజలకు 8 రకాల నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు,అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కరోన వైరస్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కనీస జాగ్రత్తలు పాటించాలని సూచించారు,ఈకార్యక్రమంలో వసంతాల.రమేష్,సుకురామ్, వెంకట్,రమేష్,నాయకులు,బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.


అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మండలంలో పేదలకు భోజనం ప్యాకెట్ లు పంపిణి.


అమ్మ చారిటబుల్ ట్రస్ట్ మండలంలో పేదలకు భోజనం ప్యాకెట్ లు పంపిణి.

 

ఏలేశ్వరం, 

 

అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏలేశ్వరం మండలం లో పేదలకు భోజనం ప్యాకెట్ల పంపిణి గురువారం జరిగింది. రాష్ట్రంలో లాక్డౌన్ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటివరకు అనగా 54 రోజుల నుండి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సుదూర ప్రాంతాలకు వెళ్లే బాటసారులకు నేషనల్ హైవే-16 పై కాలి నడకన వెళ్లే కూలీలకు ప్రతిరోజు ఆహార పొట్లాలు, మంచినీళ్లు వితరణ గావించి వారి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈరోజు మండల పరిధిలోని లింగంపర్తి, భద్ర వరం, పేరవరం, ఏలేశ్వరం లో ఉన్న యాచకులకు, నిరుపేదలకు సుమారు 150 మందికి భోజనం ప్యాకెట్లను పంపిణీ చేశారు. అలాగే ఏలేశ్వరం క్వారీ పేట కు చెందిన దివ్యాంగులకు  15 కేజీల బియ్యం, కూరగాయలు వితరణ చేశారు . ఈ కార్యక్రమంలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మాసరి మృత్యుంజయ శర్మ, నూకల సుబ్రమణ్యం, బండి నరసింహ మూర్తి, చాగంటి నరసింహారావు, ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

గోదావరి ఆక్వా ఫుడ్ పార్కును తరలించాలి


 


సమావేశంలో పాల్గొన్న పోరాట కమిటీ నాయకులు


 


గోదావరి ఆక్వా ఫుడ్ పార్కును తరలించాలి


- అక్కడ ఆక్వా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలి


- అక్రమ కేసులను ఎత్తివేయాలి


- ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటి


 


పెనవర్, భీమవరం,


అనేక గ్రామాలను కాలుష్య కాసారాలుగా మార్చే గోదావరి ఆక్వా ఫుడ్ పార్కును అక్కడి నుండి తరలించాలని, ఆ స్థానంలో ఆక్వా యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని గోదావరి ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ వ్యతిరేక పోరాట కమిటి డిమాండ్ చేసింది. మండలంలోని తుందుర్రులో గురువారం పోరాట కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. తుందుర్రులో తమ నివాస గృహాలను చేర్చి నిర్మించిన పార్కును తక్షణమే తరలించాలని, గ్రామస్థులపై అన్యాయంగా పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సమావేశం ప్రభుత్వాన్ని కోరింది. విశాఖ ఎజ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజి ఘటన ఎంత దారుణంగా మారిందో అందరం చూసామని గుర్తు చేసింది. కాగా ఫుడ్ పార్కును నివాస గృహాలకు చేర్చి నిర్మించారని, ఈ విషయం ఇటీవల పర్యటించిన గ్రీన్ ట్రిబ్యునల్ కమిటీయే స్వయంగా గుర్తిందని కమిటీ కన్వీనర్ ఆంటి వాసు తెలిపారు. ఫ్యాక్టరీ మొదట్లో తెచ్చిన అనుమతులను పాటించకుండా, పర్యావరణానికి హాని కలిగించేవిధంగా నిర్వహిస్తున్నారన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఫ్యాక్టరీకి రూ.30 లక్షల జరిమానా కూడా విధించిందన్నారు. భవిష్యత్తులో విశాఖ గ్యాస్ లీకేజి వంటి సంఘటన ఇక్కడ జరిగితే పరిస్థితి చాలా భయంకరంగా ఉంటుందన్నారు. ప్రాణ నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. విశాఖ ఘటన జరిగినప్పటి నుండి పార్కు సమీపంలోని మూడు గ్రామాల ప్రజలు చాలా ఆందోళనలో ఉన్నారన్నారు. ఇక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందోననే భయంతో బతుకుతున్నామని, ఈ ఫ్యాక్టరీ యాజమాన్యం గత ప్రభుత్వ సహకారంతో ప్రజలపై తప్పుడు కేసులు పెట్టించి, జైళ్ళలో నిర్బందించి పార్కు నిర్మాణాన్ని పూర్తి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అప్పుడు ఈ ప్రాంతంలో పర్యటించారన్నారు. పార్కు నిర్మాణంలో యాజమాన్యం మొండిగా వెళితే తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పార్కును బంగాళాఖాతంలో కలిపేస్తానని తీవ్రంగా హెచ్చరించారని గుర్తు చేశారు. భవిష్యత్తులో మరో ఎల పాలిమర్స్ వంటి సంఘటన జరగకముందే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఫ్యాక్టరీని తరలించి, దీని స్థానంలో ఆక్వా యూనివర్శిటీని ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పోరాట కమిటి నాయకులు ముచ్చెర్ల త్రిమూర్తులు, యర్రంశెట్టి అబ్బులు, కొయ్య సంపత్, కోరం రమేష్, ఈద బాబూరావు తదితరులు పాల్గొన్నారు.


బాబోయ్... కరెంటు బిల్లు

 


 


 


 


 


బాబోయ్... కరెంటు బిల్లు


వేలల్లో బిల్లులు


- అయోమయంలో వినియోగదారులు


- ఆందోళనలు చేస్తున్న టిడిపి, వామపక్షాలు


 


పెనవర్, భీమవరం:


 


మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంలా తయారైంది లా డౌన్ కాలం. లాక్ డౌన్ కాలంలో విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులు చూస్తుంటే వినియోగదారుల గుండె తరుక్కుపోతుంది. ఎప్పుడూ వందల్లో వచ్చే బిల్లులు నేడు వేలల్లో వస్తుంటే ఏమి చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. లాక్ డౌన్ కాలం... అందులోనూ వేసవికాలం.. మండే ఎండలు... దీంతో విద్యుత్ వినియోగం పెరిగింది. అయితే బిల్లులు మాత్రం పది రెట్లు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వేసవికాలాల్లోనే ఎప్పుడూ ఈ విధంగా బిల్లులు రాలేదని, ఇప్పుడు ఎందుకు ఇంత దారుణంగా బాదేస్తున్నారని వినియోగదారులు శాపనార్థాలు పెడుతున్నారు. అసలే లా డౌన్ నేపధ్యంలో తినడానికి తిండి లేక ఎంతో మంది సతమతమవుతున్నారు. ఆర్థికంగా ఎంతో నష్టాన్ని చవిచూసారు. ఇటువంటి సమయంలో కరెంటు బిల్లులను మాఫీ చేయాల్సింది పోయి, వేలలో బిల్లులకు కట్టమని ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి తమకు వచ్చింది చాలా తక్కువని, ప్రభుత్వానికి ఈ విధంగా వేలలో విద్యుత్ బిల్లులను కట్టడమే ఎక్కువని చెబుతున్నారు. ఎప్పుడూ రూ.100 నుంచి రూ.300 వరకు వచ్చే బిల్లు ఈ సారి రూ.7 వేలు దాటిందని, ఇదేమి చోద్యమని ఒక వినియోగదారుడు ప్రశ్నిస్తున్నాడు. విద్యుత్ వినియోగం పెరిగితే రెండింతలు అంటే రూ.600 వరకు బిల్లు వచ్చినా పరవాలేదని, ఇంత దారుణంగా బిల్లులు వస్తే ఎలా కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాడకం మాట ఎలా ఉన్నా 80 శాతం మందికి అదనపు బిల్లులు వచ్చేశాయి. గుడెసెల్లో ఉన్న వారికి కూడా ఎక్కువగా బిల్లులు బాదేశారు. కరోనా కారణంగా మార్చి నెల రీడింగ్ తీయలేదు. రెండు నెలలు కలిపి రీడింగ్ తీశారు. దీంతో శ్లాబ్ పెరిగి విద్యుత్ బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. దీంతో బిల్లులు చెల్లించాలా వద్దా అనే మీమాంసలో పడిపోయారు. వినియోగం పెరిగింది లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉండిపోవడంతో విద్యుత్ వినియోగం బాగా పెరిగిందని, ఏ నెలకు ఆ నెల కాబ్ ప్రకారమే బిల్లుల రూపకల్పన జరిగిందని ఏపీఈపీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు. మార్చి నెల, ఏప్రియల్ నెలలు సంబంధించి వేర్వేరుగా క్లాట్లు వేసామని, ఇందులో ఎటువంటి లోపాలు జరగలేదని చెబుతున్నారు. విద్యుత్ బిల్లులపై సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912 ని గాని, సంబంధిత విద్యుతరెవెన్యూ కార్యాలయంలోగాని సంప్రదించాలని కోరతున్నారు. విద్యుత్ బిల్లులు చెల్లించేందుకు సమయాన్ని పెంచామని, ఈ నెలాఖరు వరకు బిల్లులు చెల్లించవచ్చన్నారు. అయితే అపరాధరుసుము చెల్లించే విషయంలో ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని భీమవరం డిఈ తెలిపారు. వారి వారి కేటగిరీలకు సంబంధించి క్లాబ్ ప్రకారమే బిల్లులు జనరేట్ అవుతున్నాయన్నారు. 500 యూనిట్ల వాడకం పెరిగితే కేవలం 90 పైసలు మాత్రమే పెరుగుతుందన్నారు. అపోహలు నమ్మవద్దని చెబుతున్నారు. ఏదైనా సందేహం ఉంటే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేయవచ్చన్నారు. ఆందోళనలు విద్యుత్ బిల్లులు పది రెట్లు వరకు రావడంపై తెలుగుదేశం, సిపిఎం పార్టీలు తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. లా డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే బిల్లులను మాఫీ చేయాల్సింది పోయి, దారుణంగా బిల్లులు వేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. పూరి గుడెసెల్లో ఉన్నవారికి కూడా దారుణంగా బిల్లులు వేస్తారా, ఇది చాలా దారుణమంటున్నారు. వెంటనే బిల్లులను సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు నెలలకు ఒక్కసారిగా రీడింగ్ తీయడం వల్ల బిల్లు పెరిగిపోతుందని, ఈ విధానాన్ని సరిచేసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఉపాధి హామీ పనుల సమీక్ష


ఉపాధి హామీ పనుల సమీక్ష

 

పెన్ పవర్ఆత్రేయపురం

 

మండలం లో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందితో  స్థానిక మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీఓ నాతి బుజ్జి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా పనులు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నందున ఉపాధి హామీ పనిలోనికి రావడానికి ముందుకొస్తున్న వారికి అవసరమైన జాబ్ కార్డులు ఇచ్చి, వారికి పనులు కల్పించాలన్నారు. ప్రస్తుతం ఉపాధి హామీ పనులకు వేతనదారులు అధికంగా వస్తున్నందున పని ప్రదేశంలో కరోనా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పని చేసేలా అవగాహన కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. నవరత్నాలు_పేదలందరికీ ఇళ్లు పధకానికి సేకరించిన స్థలాల అభివృద్ధి పనులు వేగంగా చేయాలని తాహశిల్దార్ ఎం.రామకృష్ణ సిబ్బందిని ఆదేశించారు. గ్రామాల వారీ పనులను ఏపీవో ఎం రామకృష్ణంరాజు సమీక్షించారు. ఈ సమావేశంలో ఇంజనీరింగ్ కన్సల్టెంట్ నాగేశ్వరరావు, సాంకేతిక సహాయకులు రవి, అజయ్, క్షేత్ర సహాయకులు మరియు కంప్యూటర్ ఆపరేటర్ లు పాల్గొన్నారు

 


పోలవరం పంచాయతీ ఆవరణలో కోవిడ్ 19 కౌన్సిలింగ్ క్యాంప్


 






పోలవరం పంచాయతీ ఆవరణలో కోవిడ్ 19 కౌన్సిలింగ్ క్యాంప్

 

 

పోలవరం: పెన్ పవర్

 

పోలవరం మండలం స్థానిక పంచాయతీ కార్యాలయం ఆవరణలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి. శిరీష ఆధ్వర్యంలో  గురువారం కోండ్రు కోట  పి హెచ్ సి వైద్య సిబ్బంది   కోవిడ్19    కౌన్సిలింగ్ క్యాంప్ నిర్వహించారు . ఈ క్యాంప్ లో  30 మంది ని పరీక్షించడం జరిగిందని వారికి  ఏ విధమైన కరోనా లక్షణాలు లేవని డాక్టర్ శిరీష తెలిపారు. అనంతరం కరోనా వ్యాధిపై అవగాహన కల్పించి వ్యాధి సోకకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించినట్లు డాక్టర్  తెలిపారు. ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని  చేతులు శుభ్రంగా కడుక్కోవడం, మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ శిరీష సూచించారు. ఈ క్యాంపులో  సూపర్వైజర్ కుమార్, కె   మంగతాయారు. ఏఎన్ఎం జ్యోతి . ఆసావర్కర్ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 

 


 



 

Featured Post

కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు

  అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...