పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ నందు పశ్చిమగోదావరి జిల్లా ఇంఛార్జి మంత్రి పేర్ని నాని గచదలవాడ శ్రీరంగనాథరాజు మరియు తానేటి వనిత జిల్లా సమావేశ మందిరం నందు జిల్లా సమీక్ష నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో జిల్లా ఇంఛార్జి మంత్రి గౌరవ పేర్ని నాని మాట్లాడుతూ జిల్లా అధికారి కరోనా వైరస్ వ్యాప్తి జరగకుండా ప్రతి ఒక్కరూ శక్తి ఉద్యోగ నిర్వహణ చేసినట్లు ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ ఐపిఎస్ అహర్నిశలు పోలీస్ సిబ్బందిని ఉత్తేజం చేస్తూ రెడ్ జోన్ ప్రాంతాల లో ప్రైమరీ కాంటాక్ట్స్ సెకండరీ కాంటాక్ట్స్ పెరగకుండా ఎంతో కష్ట పడినట్లు, అంతర జిల్లా మరియు అంతర్రాష్ట్ర చెక్పోస్టులను ఏర్పాటు చేసి ఇతర ప్రాంతాల నుండి ప్రజలను పశ్చిమగోదావరి జిల్లాలోకి రాకుండగా నిరోధించడము వలన సిఫార్సులకు తావులేదని ఉండగా నిష్పక్షపాతంగా వ్యవహరించ డం వలన జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించినట్లు, ఇప్పటి వరకు జిల్లాలో ఒక్క మరణం కూడా సంభవించకుండా పోలీసు వారికి ఎస్పీ ఎప్పటి కప్పుడు తగిన సూచనలు సలహాలు ఆదేశాలిస్తూ ఉద్యోగ నిర్వహణ చేసినందుకు మంత్రులు నాని,శ్రీ రంగనాథ రాజు మరియు వనిత గార్లు అందరూ కూడా ఈ సమావేశం లో ఎస్పీ గారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రేవు ముత్యాలరాజు ఐఏఎస్, జిల్లాలో ఉన్న జాయింట్ కలెక్టర్లు మరియు అధికారులు అందరూ కూడా ఈ సమావేశమునకు హాజరు అయినారు
Followers
కార్మిక చట్టాల మార్పుపై నిరసన
నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు
కార్మిక చట్టాల మార్పుపై నిరసన
పెనవర్, భీమవరం:
కరోనా, లా డౌన్లలో ఉద్యోగులు, కార్మికులు అవస్థలు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యలను పరిష్కరించాల్సింది పోయి కార్మిక చట్టాల్లో మార్పులు చేయడం, పనిగంటలను పెంచడం వంటి విధానాలతో సందిట్లో సడేమియా అంటూ ప్రజలపై విరుచుకు పడుతున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్ రాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఐటియు దేశవ్యాప్త పిలుపులో భాగంగా గురువారం స్థానిక మావుళ్ళమ్మ గుడి రోడ్డులో భౌతిక దూరాన్ని పాటిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్డౌన్ కాలానికి వేతనాలు ఇవ్వడానికి, కనీస వేతనాల అమలుకు, మనస్సులేని పాలకులు దొడ్డి దారిన కార్మిక చట్టాల్లో మార్పులు చేస్తున్నారని అన్నారు. లా డౌన్లో ప్రజలకు ప్రత్యక్షంగా సేవలందిస్తున్న ఆశ, అంగన్‌వాడి, గ్రామ వాలంటీర్, మున్సిపల్ కార్మికులకు అదనంగా చేసేందేమిటో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు బి.వాసుదేవరావు మాట్లాడుతూ ప్రాణాంతక కరోనాతో పోరాడుతూనే ఉద్యోగ కార్మికులు తమ సేవలను అందిస్తున్నారని, వారికి మెడికల్ టెస్టు కాని, మాలు, గెజిట్లు గాని, ఇతర ప్రభుత్వం ప్రకటించిన బీమా సదుపాయం వంటి సౌకర్యాలను కల్పించడంలో పాలకులు విఫలమయ్యారన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం.ఆంజనేయులు, కరణం సూరిబాబు, డేగల నాగు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, శిరీష్ కుమార్, వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు.
వారపు సంత అనధికార వసూళ్లు పై పోలీసులకు ఫిర్యాదు.
పంచగ్రామాల ఫలసాయాలు కూరగాయలపై నిషేధం.
పంచగ్రామాల ఫలసాయాలు కూరగాయలపై నిషేధం.
కేంద్రానికి సూచించిన నీరి నిపుణుల బృందం.
స్టాఫ్ రిపోర్టర్ విశాఖపట్నం(పెన్ పవర్)
ఎల్జి పాలిమర్స్ విషవాయువు ప్రభావం కారణంగా పంచ గ్రామాల్లో పండిన ఫల సాయాలు కూరగాయలను నిషేధించారు. మూడు కిలోమీటర్ల పరిధిలో రసాయన విషవాయువు ప్రభావం వాటిపై ఉంటుందని ఆ కారణంగా వాటిని తీసుకోవద్దని నిపుణుల బృందం సూచించింది. ఎల్జి పాలిమర్స్ రసాయన విషవాయువు లీకైన కారణంగా 12 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు ఆరు వందల వరకు ఆసుపత్రిలో చేరారు. ఈ సంఘటనపై కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్( సి ఎస్ ఐ ఆర్) మరియు జాతీయ పర్యావరణ సాంకేతిక పరిశోధన పరిశోధన సంస్థ ( ఎన్.ఈ.ఈ.ఆర్.ఐ) ల నిపుణుల బృందం క్షేత్ర స్థాయి లో పరిశీలించి రసాయన విషవాయువు స్టెరైన్ రేణువులను రోడ్లు ఇళ్లల్లో గుర్తించడం జరిగిందని బృందం పేర్కొంది. ఒక ఇంటిలో 1.7 పీపీఎం స్టార్ ఇన్ రేణువులు అధికంగా పడి ఉన్నాయని తెలిపారు. విషవాయువు ప్రభావం వల్ల స్థానిక ప్రజలు ఏడాది పొడుగునా వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉందన్నారు. వాయువు తాకిన చెట్లను మొక్కలను జీవీఎంసీ ఆధ్వర్యంలో తొలగించాలని బృందం సూచించింది. మూడు కిలోమీటర్లు పంచ గ్రామాల్లో రసాయన విషవాయువు ప్రభావం ఇప్పట్లో ఆగిపోయే అవకాశం లేదని బృందం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కేంద్ర ప్రభుత్వం నీ నివేదికతో పంచ గ్రామాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
భీమవరంలో మళ్ళీ ఆంక్షలు కఠినతరం
భీమవరంలో మళ్ళీ ఆంక్షలు కఠినతరం
- ఇబ్బందులు పడ్డ ప్రజలు
- ఆసుపత్రికి వెళ్ళాలంటే 10 కిమీ తిరిగి వెళ్ళాల్సిందే
- పోలీసుల తీరుపై విమర్శలు
పెనవర్, భీమవరం:
గత కొన్ని రోజులుగా లాన్ ఆంక్షలపై చూసీ చూడనట్లుగా వ్యవహరించిన పోలీసులు నేడు మళ్ళీ ఆంక్షలను కఠినతరం చేశారు. దీంతో ఎప్పటిలాగానే ఆసుపత్రులకు, ఇతర పనుల నిమిత్తం భయటకు వచ్చిన ప్రజలకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో పోలీసుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లా డౌన్ విధించినప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజల మన్ననలు పొందిన పోలీసులు నేడు విమర్శలు ఎదుర్కొంటున్నారు. నిబంధనలకు కఠినతరం చేయడంతో ఆసుపత్రులకు వైద్యం నిమిత్తం వెళ్ళేవారు చాలా ఇబ్బందులు పడ్డారు. బుధవారం ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్లలో ఒకే మార్గం ద్వారా ప్రజలు రాకపోకలు సాగించే సమయంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో రెండువైపులా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో గురువారం పోలీసులు నిబంధనలకు కఠినతరం చేశారు. భీమవరం వన్ టౌన్ ప్రాంతం నుంచి టూటౌను వెళ్ళాలంటే ప్రకాశంచౌక్ - అంబేద్కర్ సెంటర్ల మధ్య ఉన్న యనమదుర్రు డ్రెయిన్ వంతెనపై నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే లాక్ డౌన్ నేపధ్యంలో ఒక వంతెన నుంచే ప్రజలను వదులుతున్నారు. వటౌన్ నుంచి ఆసుషత్రులకు వెళ్ళాలంటే టూటౌన్ కు వెళ్ళాల్సిందే. ప్రస్తుత పోలీస్ ఆంక్షల నేపధ్యంలో వంతెసనై రాకపోకలకు అభ్యంతరాలు తెలిపారు. కొన్ని విభాగాలకు చెందిన వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారితో పాటు పలు వాహనాలను అనుమతిస్తున్నారు. గురువారం ఆసుపత్రులకు వెళ్లే వారిని అటుగా అనుమతించకపోవడం వల్ల వారు 10 కిలోమీటర్లు చుట్టు తిరిగి వెళ్ళాల్సిన దుస్థితి ఏర్పడింది. వన్ నుంచి టూటౌనకు సర్పయ్య అగ్రహారం, బైపాన్‌రోడ్డు, ఉండి రోడ్డు రైల్వేగేటు మీదుగా టూటౌన్ చేరుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. భీమవరం వటౌన్ ఎస్పై వెంకటేశ్వరరావు అతిగా ప్రవర్తించారని, దీంతో ఆసుషత్రులకు వెళ్ళే చిన్నారులను 10 కిలోమీటర్లు ఎండలో తిప్పి తీసుకెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే భీమవరం ప్రస్తుతం ంగా ఉందని, అందువల్లే ఈ ఆంక్షలు అని అధికారుల చెబుతున్నారు. చాలా చోట్ల నడలింపులు చేస్తున్నారని, దుకాణాలను కూడా తెరుస్తున్నారని, అయితే భీమవరంలో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తణుకు వంటి ప్రాంతాల్లో దుకాణాలను తెరుచుకునే అనుమతి ఇచ్చారని, జాగ్రత్తలు పాటించి వ్యాపారాలను నడుపుకునే అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. భీమవరంలో కరోనా పాజిటివ్ వచ్చిన కొంతమంది ఏలూరులో క్వారంటైన్లో ఉన్నారని, వారికి నెగిటివ్ వచ్చి ఇక్కడకు తిరిగి వచ్చే వరకు రెజోన్ ని ఆరెంజ్ గా ప్రకటించే అవకాశాలు లేవని చెబుతున్నారు. అయితే క్వారంటైన్లో ఉన్న వారికి 14 రోజులు పూర్తయ్యిందని, వారికి పరీక్షలు నిర్వహించి వెంటనే పంపించే ఏర్పాటు చేయాలని భీమవరం ప్రజలు కోరుతున్నారు. నాల్గొవ దశ లా డౌన్లో సడలింపులు ఇచ్చే సమయంలో పోలీసులు ఈ విధంగా కఠినంగా వ్యవహరించడం దారుణమని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రజలు ఆర్ధికంగా ఎంతో నష్టపోయారని, ఎంతో ఓపికతో ఉన్నారని, ఈ సమయంలో వారిని ఇంకా ఇబ్బందులకు గురిచేయడం దారుణమని చెబుతున్నారు. భీమవరంలో ఉన్న రెండు రెడ్ జోన్లలో ప్రజలు పడుతున్న పాట్లు అంతా ఇంతా కాదు. ఎన్ని రోజులు ఇంకా రెజోన్లోనే మగ్గాలని, కోలుకున్న వారిని త్వరగా రప్పించి, తమకు విముక్తి కలిగించాలని కోరుతున్నారు. భీమవరంలో గురువారం కఠినతరం కఠినతరం చేయడంతో ద్వారా గురువారం అంబేద్కర్
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి: ఎమ్మెల్యే గొల్ల బాబురావు
వలస కార్మికులను స్వస్థలాలకు పంపిస్తాం
Featured Post
కాయ్ రాజా కాయ్ ..బెట్టింగ్ జోరు
అంతా ఆన్లైన్లోనే లావాదేవిలు శివారు ప్రాంతాల్లో పెద్దఎత్తున దందాలు పట్టించుకోని పలు విభాగాల పోలీసులు పోలీసులకు చిక్కకుండా జాగ్రత్తలు యువకుల...
-
చైర్మన్ గా ఓంకారం లక్ష్మీప్రసన్న వైస్ చైర్మన్ గా పంది వెంకటసుబ్బయ్య పాఠశాల చైర్మన్ ల ఎన్నికలు ఏకగ్రీవం సీతారామపురం, పెన్ పవర్ : మండలంల...
-
విశాఖ- విజయనగరం రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం బ్యురో రిపొర్టు విజయనగరం, పెన్ పవర్ విజయనగరం రూరల్ సుంకరిపేట వద్ద విశాఖ- విజయనగరం రహదారిపై ...
-
ఎస్ రాయవరంలో వికలాంగు సైకిళ్ల పంపిణీకి గ్రహణం. నాయకుల మధ్య వర్గపోరు పంపిణీకి నోచుకోని వీల్ చైర్స్. ఆరుబయట తుప్పుపట్టి పోతున్న వికలాంగుల సైక...